ఆధునిక అరబిక్ సాహిత్యానికి ప్రేరణ -సోహేర్ అల్ కలమావి
ఆధునిక అరబిక్ సాహిత్యానికి ప్రేరణ -సోహేర్ అల్ కలమావి
1911జులై ఇరవైన జన్మించిన సోహేర్ అల్ కలమావి ప్రసిద్ధ రచయిత సాంఘిక సేవా దురందురాలు .ఆధునిక అరబిక్ సాహిత్యానికి ప్రేరణ గా నిలిచిన రచయిత్రి .ఈజిప్ట్ సంస్కృతిక రంగాన్ని విద్యా వేత్తగా ,స్త్రీవాద రచయితగా తీర్చి దిద్దిన విదుషీ మణి.కైరో యూని వర్సిటిలో 1929 లో చేరి చదివిన మొట్టమొదటి మహిళగా గుర్తింపు పొందింది .అరెబిక్ భాష చదివే ఫాకల్టి ఆఫ్ ఆర్ట్స్ లో పద్నాలుగు మంది విద్యార్ధులలో ఆమె ఒక్కతే మహిళ.1941లో అరెబిక్ సాహిత్యం లో పి.హెచ్. డి .సాధించింది .ఆమె ‘’ఆల్ఫ్ లైలా వలేలా ‘’అంటే వెయ్యి న్నోక్క రాత్రులు(అరేబియన్ నైట్స్) గ్రంధం పై థిసీస్ రాసి సమర్పించింది .ఈజిప్ట్ లోని మహిళలు ఒంటరి వారు కారని వారి సమస్యలకు వారితో బాటు పురుషులూ బాధ్యుఅని ఆమె అభిప్రాయం .
జర్నలిజం లోపని చేయటానికి మొదటి లైసెన్స్ ఆఫ్ ఆర్ట్స్ ను పొందిన మహిళ సోహేర్ .కౌకాబ్ అల్ షర్క్ ,ది ఓరిఎంట్ స్టార్,ది మెసేజ్ ,ది వాలీ మొదలైన పత్రికలో పని చేసింది .ఈజిప్ట్ లో మొట్టమొదటి సారిగా 1934లో ప్రారంభింప బడిన రేడియో కార్యక్రమాల నిర్వాహకురాలుగా ఉంది .1936 ఫాకల్టి ఆఫ్ ఆర్ట్స్ లెక్చర్ ఇచ్చిన మొదటి స్త్రీ గ గుర్తింపు పొందింది .’’లిటరేచర్ ఆఫ్ డిసిడేన్ట్స్ లో ఏం ఏ .పట్టా పొందింది .1937లో ఫ్రాన్స్ కు పి.హెచ్ డి చేయటానికి వెళ్ళిన తొలి మహిళ కలమావి .జానపద సాహిత్యం లో పి హెచ్ డి .పొందిన ప్రధమ మహిళకూడా .అరెబిక్ లాంగ్వేజ్ డిపార్ట్ మెంట్ లో చైర్మన్ గా ప్రవేశించి పదేళ్ళు పని చేసి అంచెలంచెల మీద ఎదుగుతూ అసిస్టంట్ ప్రొఫెసర్ అయింది .1959’’యూని వర్సిటి వుమెన్ గ్రాడ్యుయేట్ యూనియన్ కు ముఖ్య అధికారి అయింది .1959లొ జానపద సాహిత్యం లో ప్రొఫెసర్ గా పదోన్నతి పొందింది .విజ్ఞాన సర్వస్వం నిర్మాణం లో చీఫ్ డిప్యూటీ గా నియమించ బడింది .ఆడిస్ అబాబా లో 1960లో జరిగిన అంతర్జాతీయ మహిళా సదస్సుకు అధ్యక్షురాలిగా ఎన్నుకో బడింది .జానపద కళాసదస్సుకు ప్రధాన పాత్ర దారి గా ఉన్నది . సినిమా నాటక కళలకు ఈజిప్షియన్ జెనరల్ అధారిటీ కి ఉన్నతాధికారిగా పదవీ బాధ్యతలు చే బట్టింది .బాలల సాంస్కృతిక సంఘానికి ,ఆర్ట్స్ మేగజైన్ కు ప్రధాన అధికారి గా సమర్ధ వంతం గా బాధ్యతలను నిర్వహించింది ఆమె సమర్ధతను గుర్తించి ప్రభుత్వమే ఇన్ని విధాల ఆమె సేవలను సద్విని యోగం చేసుకొన్నది .
ఆమె దాదాపు ఎనభై పుస్తకాలు రచించింది .’’ది టాక్స్ ఆఫ్ మై గ్రాండ్ మదర్ ,వెయ్యిన్నొక్క రాత్రులు ,డిసిడేన్ట్స్ లిటరేచర్ ,దివరల్డ్ ఇన్ ఏ బుక్ ,డెవిల్స్ ప్లె అండ్ డాన్స్ మొదలైన వెన్నో ఆమె రచనా పటిమకు నిదర్శనాలు .షేక్స్ పియర్ రాసిన ‘’టేమింగ్ ది షూస్ ‘’ ,చైనా భాష లోని వండర్స్ బుక్ మొదలైన వి అరెబిక్ భాషలోకి అనువదించింది .సమకాలీన ఆరబ్ సంగీతం డ్రామా సినిమా లపై ఏంతో లోతైన పరిశోధన చేసి అపూర్వమైన వ్యాసాలూ రాసింది బడ్జెట్ లో అయిదు శాతం బాల సాహిత్యాభి వృద్ధికి బాలల సృజనకు కేటాయించేట్లు చేసింది .విజ్ఞాన శాస్త్ర సర్వస్వ నిర్మాణానికి తన వంతు సహకారాన్నందించింది .ఇలా అన్ని రంగాలలో తనదైన శైలిలో అంకిత భావం తో కృషి చేసిన మహిళ సోహేర్ .
ఆమె వివిధ రంగాలలో చేసిన సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు ,రివార్డులు అందుకొన్నది .అరెబిక్ లాంగ్వేజ్ అవార్డ్ ను ‘’అరేబియన్ నైట్స్ ‘’పై రాసిన దానికి పొందింది .స్టేట్ మెరిట్ అవార్డ్ ,నాజర్ అవార్డ్ ,మెడల్ ఆఫ్ ది రిపబ్లిక్ ,అందుకొన్నది.కైరో లోని అమెరికన్ యూని వర్సిటి ‘’గౌరవ డాక్టరేట్ ‘’నిచ్చి సత్కరించింది .మహిళా దినోత్సవం నాడు కైరో ప్రభుత్వం అభినందన సన్మానం చేసింది .ఇన్ని విశిష్టతలు కలిగిన సోహేర్ ఆల్ కలమావి 1997మే నాలుగవ తేదీన 86ఏళ్ళ వయసులో చనిపోయింది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-7-14-ఉయ్యూరు