ఈజిప్ట్ స్త్రీ వాద రచయిత్రి బహుముఖ ప్రజ్ఞా శాలిని – డాక్టర్ నావల్ ఎల్ సాదావి
ఈజిప్ట్ దేశం లో స్త్రీ వాద రచయిత్రిగా ,సాంఘిక సేవాకార్య క్రమ నిర్వాహకురాలిగా ,మానసిక శాస్త్ర వైద్యురాలి గా ఇస్లాం లో మహిళ లపై అనేక గ్రంధాలు రాసిన బహుముఖ పరజ్ఞా శాలి గా పేరొందిన నావల్ ఎల్ సాదావి గురించి మనం తెలుసుకో బోతున్నాం.
1931అక్టోబర్ 27న కఫార్ తహ్లా అనే కుగ్రామం లో సాదావి జన్మించింది .తండ్రి ప్రభుత్వ విద్యాశాఖలో ఆఫీసర్ .1919లో ఈజిప్ట్ విప్లవ కాలం లో ఈజిప్ట్ ,సూడాన్ లను బ్రిటిష్ ప్రభుత్వం వశ పరచుకోవటం పై తీవ్ర నిరసన తెలిపిన దేశ భక్తుడు .దీని ఫలితం గా ఆయనకు ప్రభుత్వం ప్రమోషన్ ఇవ్వలేదు .పదేళ్ళు ఆయన ప్రవాస జీవితం గడపాల్సి వచ్చింది .ఆధునిక భావాలున్న వాడు కనుక కూతురికి విద్య నేర్పించి ,ఆమె మనసులోని భావాలను బయటికి చెప్పమని ఆరబిక్ భాష నేర్వమని ప్రోత్స హించే వాడు .ఆమె చిన్నతనం లోనే తలిదండ్రులను కోల్పోయిన దురదృష్ట వంతురాలు .పెద్ద కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత ఆమె పై పడింది .
ధైర్యం గా ముందుకు అడుగులు వేస్తూ కైరో యూని వర్సిటి లో చేరి చదివి మెడికల్ డిగ్రీ సంపాదించింది .తన పేషెంట్స్ లలో ఒకరిని ఆ నాటి హింసా దౌర్జన్యం నుండి కాపాడే ప్రయత్నం చేస్తే కైరో కు వెళ్ళిపొమ్మని అదేశాలోచ్చాయి .పబ్లిక్ హెల్త్ కు డైరెక్టర్ అయి ,షరీఫ్ హతాతా ను మూడవ పెళ్లి చేసుకొన్నది .భర్త కూడా ప్రభుత్వ డాక్టర్ ,రచయిత, ,పదమూడేళ్ళు రాజకీయ ఖైదీ గా ఉన్న వాడు కూడా .1972లో ‘’ఆల్ మర వ ఆల్ జీన్స్ ‘’-(స్స్త్రీలు –సెక్స్)అనే పుస్తకాన్ని రాసి ప్రచురించింది .ఈ పుస్తకం’’ సెకండ్ వేవ్ ఫెమినిజం ‘’కు పాఠ్య గ్రంధం అయింది .ఈ పుస్తక రచన ఆమె ఉద్యోగానికి ఎసరు పెట్టింది .హెల్త్ జర్నల్ కు చీఫ్ ఎడిటర్ పదవీ ఊడ గొట్టారు .దీనితో బాటు మెడికల్ ఆసోసియేషన్ లో అసిస్టంట్ జెనరల్ సెక్రెటరిపదవికీ మంగళం పాడారు . 1973నుంచి మూడేళ్ళు ఎయిన్ షామ్స్ యూని వర్సిటి కి చెందిన ఫాకల్టి ఆఫ్ మెడిసిన్ లో స్త్రీలు –నరాల వ్యాధులు ‘’పై రిసెర్చ్ చేసింది .మధ్య ప్రాచ్యం ,ఆఫ్రికాలలో మహిళా కార్య క్రమాలకు యునైటెడ్ నేషన్స్ కు సలహా దారు గా పని చేసింది .
ఈజిప్ట్ ప్రభుత్వం ఆమెను ఎప్పుడూ అనుమానం గా క్రూరం గా నే చూస్తున్నప్పటికీ ఆమెధైర్యం గా ‘’కన్ ఫ్రాంటేషన్’’అనే మహిళా పత్రికను నిర్వహించింది .ప్రెసిడెంట్ అన్వర్ సాదత్ ఆమెనుకనాతిర్ వుమెన్ ప్రిజన్ లో ఖైదు లో పెట్టించాడు .సాదత్ హత్యానంతరం ఒక నెలలోనే ఆమెను విడుదల చేశారు ఈ ఉదంతం పై ఆమె ‘’నేను కలం పట్టిరాయటం ప్రారంభించిన దగ్గరనుండి అనుక్షణం ప్రమాదం అంచులోనే ఉన్నాను’’ అని చెప్పేది .దీనిపై ‘’జైలు అనుభవాలు ‘’పుస్తకం రాసింది .ఈ అనుభవాలతో ‘’ఏ వుమెన్ ఆఫ్ పాయింట్ జీరో ‘’పుస్తకమూ రాసింది .ఇస్లామిక్ మత ఛాందసులు ,రాజకీయ నాయకులు పెట్టిన ఒత్తిడి తట్టుకోలేక ఈజిప్ట్ నుండి పారిపోవాల్సి వచ్చింది .అమెరికాలోని డ్యూక్ యూని వర్సిటి ,వాషింగ్ టన్ యూనివర్సిటీలు ఆసియా ఆఫ్రికా భాషా డిపార్ట్ మెంట్ లో పని చేయమని ఆహ్వానిస్తే వెళ్లి చేరింది .అక్కడి నుండి ఆమె జైత్ర యాత్ర ప్రారంభమైంది .ఎన్నో కాలేజీలు యూని వర్సిటీలలో పని చేసే అవకాశం వచ్చింది .ప్రసిద్ధమైన హార్వర్డ్ ,కొలంబియా ,,ఏల్ జార్జి టౌన్ ,ఫ్లారిడా ,కైరో యూని వర్సిటీ కాలి ఫోర్నియా లోని బర్కిలీ యూని వర్సిటిలలో లలో బోధించి గొప్ప గుర్తింపు పొందింది .1996లో మళ్ళీ ఈజిప్ట్ చేరుకొంది .అందుకే ఆమె మాతృభాష అరెబిక్ తో బాటు ఇంగ్లీష్ లోను అమోఘం గా మాట్లాడే సామర్ధ్యం కలిగింది .2005లో ఈజిప్ట్ అధ్యక్ష పదవికి పోటీ కూడా చేసింది .దాదాపు నలభైకి పైగా పుస్తకాలను వివిధ విషయాలపై రాసింది .అందులో చరిత్ర సంస్కృతీ బాల సాహిత్యం నవల ,నాటకం ,ఫెమినిస్ట్ రచనలు ,కదా సంపుటులు ,స్మృతులు వగైరాలున్నాయి .
ఆమె ప్రతిభను గుర్తించి కౌన్సిల్ ఆఫ్ యూరప్ వారు ‘’నార్త్ –సౌత్ ప్రైజ్ ‘’ను ఇచ్చి సత్కరించారు .బెల్జియం లోని బ్రసెల్ లో ఉన్న వ్రిజే యూని వర్సిటేట్ ,డిబ్రే డీ బెల్జీక్ ,మెక్సికో లోని నేషనల్ అటానమస్ యూని వర్సిటీలు ‘’గౌరవ దాక్ట రేట్ ‘’ నిచ్చి గౌరవించి సత్కరించాయి ష్టిగ్ డాగర్మన్ ప్రైజ్ ఆమె ను వరించింది . ఈజిప్ట్ స్కూళ్ళలో మత బోధను నిషేధించాలని ఉద్యమం చేసింది .2011తాహిర్ స్క్వేర్ దంతం పై అందరితో కలిసి వ్యతిరేకించింది .చిన్నప్పటి నుంచే రాయటం ప్రారంభించిన సాదావి చిన్నకదల సంపుటిని మొదటగా వెలువరించింది .’’ఐ లేరండ్ లవ్ ‘’అనే నవల రాసింది .’’మేమైర్స్ ఆఫ్ ఏ వుమన్ డాక్టర్ ‘’అనే ఆత్మ కద రాసుకోంది.ఎన్నో యాంతాలజీ గ్రంధాలు రాసి ప్రచురించింది .ఆమె రచనలు దాదాపు ఇరవై భాషల్లోకి అనువాదం పొందాయి .1972లో ‘’వుమెన్ అండ్ సెక్స్ ‘’అనే నాన్ ఫిక్షన్ ,’’ది హిడెన్ ఫేస్ ఆఫ్ ఈవ్ ,’’గాడ్ డైస్ బై ది నైల్ ‘’,’’సర్క్లింగ్ సాంగ్ ‘’,దిఫెయిల్ ఆఫ్ ది ఇమాం ,’’సెర్చింగ్’’ మొదలైన ప్రభావ శీల రచనలు చేసి ఈజిప్ట్ ప్రభుత్వం గుండెల్లో నిద్ర లేకుండా చేసింది .మక్కా లో హజ్ యాత్రికులు ‘’నల్ల రాయి ‘’ని ముద్దు పెట్టుకోవటం ఇస్లాం కు పూర్వం ఉన్న పాగన్ భావమూలమే నని నిర్భయం గా చెప్పింది నావల్ ఎల్ .సాదావి .ముస్లిం లలో చిన్నతనం లో మగ పిల్లలకు ‘’సుల్తీ ‘’చేసినట్లే ,ఆడపిల్లలకు ‘’genital mutilation ‘’ చేయటాన్ని వ్యతిరేకించింది .పన్నెండేళ్ళ బీదర్ శాకీర్ అనే అమ్మాయికి ఈ ఆపరేషన్ జరగటం చూసి భరించలేక ‘’ “Bedour, did you have to die for some light to shine in the dark minds? Did you have to pay with your dear life a price … for doctors and clerics to learn that the right religion doesn’t cut children’s organs.’’అని బాధ పడింది. డాక్టర్ గా మానవత్వం ఉన్న మహిళా గా దీన్ని ,మగపిల్లలకు చేసే సుల్తీని కూడా వ్యతిరేకించింది ప్రచారం చేసింది .ఇలా చేయటానికి ఎన్ని గుడేలు ఉండాలో అన్నీ ఆమెకున్నాయి .అందుకే ఆమె గురించి తెలుసు కొంటున్నాం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-7-14-ఉయ్యూరు