హిందూస్తాన్
డయానా తన పుస్తకం లో హిందూస్తాన్ పదావిష్కరణ గురించి రాసింది .టర్కులు ,ఆఫ్గన్లు ఇండియా ను ‘’అల్ హింద్’’అని మొదటపిలిచారని తరువాత హిందూస్తాన్ గా మారిందని చెప్పింది .పదకొండవ శతాబ్దం లో ఇస్లాం మతం ఇండియా లో ప్రవేశించింది .దీనివలన భౌగోళిక పరిస్తితి మరింత సం క్లిష్టమైంది .మధ్య దేశం గా భావింప బడే చోట ఉన్న కనోజ్ ఎపిసెంటర్ అయింది .అంటే భూకంప కేంద్రమయింది .ప్రతీహార రాజుల రాజధాని ,హిందూ సంస్కృతికి కేంద్రమూ అయింది .1018-19కాలం లో ఇండియా లోనే అతి సంపన్న నగరం అని పించుకోన్నది .దీన్ని గజని మహమ్మద్ కొల్ల గొట్టాడు .అతనే మధ్య ఆసియాలో బలీయమైన ఘజనావిడ్ సామ్రాజ్యానికి సామ్రాట్ అయ్యాడు .అతని మూలాలు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాయి .హిమాలయ కనుమల గుండా ఉత్తర భారత్ లోకి చొచ్చుకోచ్చాడు .
ఆండ్రే వింక్ అనే చరిత్రకారుని రచనలను బట్టి హిందూ దేశపు పవిత్ర భౌగోళిక స్తితి గతులన్నీ ముస్లిం చరిత్రకారులు ఆకళింపు చేసుకొన్నారు .పదకొండవ శతాబ్ది మొదటి కాలం లోనే పవిత్ర క్షేత్రాల గుట్టు మట్టులన్ని వారు కరతలా మలకం చేసుకొన్నారు .మధుర ,ఉజ్జయిని కాశి ,సోమనాద్ ల ప్రాధాన్యత ,ప్రాముఖ్యతలను ,అక్కడ ఉన్న అశేష ధన రాశులను గుర్తించి దోచుకొనే ప్లాన్ వేశారు .కనోజ్ అనే కన్యా కుబ్జం ఏడు కోటలతో ,పది వేల దేవాలయాలతో వర్ధిల్లింది .గంగా నది ఒడ్డున ఉన్న ఈ నగరం సర్వ సంపన్నమైనది .రాజులు బ్రాహ్మణులు ఇక్కడికి వచ్చి ముక్తి మార్గాన్ని అనుసరించేవారు .సాంప్రదాయ సారం గా వచ్చే పూజా పునస్కారాలను చేసేవారు ..చరిత్ర లో రాసిన దాని ప్రకారం ముస్లిం సైన్యానికి కనోజ్ ను దోచుకోవటానికి ఒక్క రోజు కూడా పట్ట లేదు .విగ్రహాలను ధ్వంసం చేశారు .దేవతలను అవమానించారు . భయ పడి పారిపోయిన వారిని వెంట తరిమి భీభత్సం సృష్టించారు .వేలాది మందిని నరికి పారేశారు క్రూరం గా ..సొమ్ము దోచుకొని గజని మళ్ళీ తన దేశం వెళ్లి పోయాడే కాని ఇక్కడ స్తిరం గా ఉండలేదు .లక్ష్మీ ధర పండితుని కధనం ప్రకారం పన్నెండవ శతాబ్ది లో కనోజ్ ను ‘’గహాడ వాలా ‘’రాజులు పాలించారు .అప్పటికి కొంత స్తిరత్వం వచ్చింది .ఆ శతాబ్ది చివర్లో కుతుబుద్దేన్ ఐబక్ జయించి కనోజ్ ను ఆక్ర మించటం తో ఢిల్లీ సుల్తానుల పరిపాలన ప్రారంభ మైంది .
పదకొండు నుండి పదమూడవ శతాబ్ది వరకు రెండు వందల ఏళ్ళు దేవాలయాలు విగ్రహాలు అవిచ్చిన్నం గా ధ్వంసం అవుతూనే ఉన్నాయి .అందినంత ,మోసినంత సంపద దోచుకొని పోతూనే ఉన్నారు .విగ్రహాలను ధ్వంసం చేస్తే మత భావాలు నశిస్తాయని ,ప్రతిమలు స్థానం తప్పి కాళ్ళ కింద వేసి తొక్కితే ప్రభావం కోల్పోతాయని భ్రమించారు వెర్రి నాయాళ్ళు .రాజుల ధన సంపద దేవాలయాలలోనే నిక్షిప్తం అయ్యాయని వాటిని కూల గోడితే రాజు బలేహీనుడై తమకు లొంగి పోతాడని కూడా ముస్లిం దండ యాత్రికుల ఉద్దేశ్యం అని రిచార్డ్ ఈటన్ రాశాడు .ఇది రాజకీయ ఆట .స్థానిక రాజు భౌగోళిక పరిస్తితి ననుసరించి దేవాలయాలను నిర్మించి పూజిస్తూ కాపాడుకొంటున్నాడు .దాన్ని విగ్రహారధాన నిషేధం తో భయ పెట్టారు .కాని వాళ్ళే చివరికి నాశనమైపోయారు .దేనికీ భయపడని హిందువులు మళ్ళీ కొత్త దేవాలయాలు కట్టుకున్నారు .పునర్వైభావాన్ని తెచ్చారు .ఇండియాకున్న పవిత్ర భౌగోళిక స్తితిని ముస్లిం దండ యాత్రికులు చేడ గోట్టారన్నది మాత్రం నిజం అంటాడు ఆండ్రే వింక్ ..
ఈ దండ యాత్రా ఫలితమే ఒక కొత్త విశ్వ మత స్తాపనకు దారి తీసింది .హిందూ యాత్రికుల మీద పన్ను వేసినా యాత్రలు పెరిగాయే కాని తగ్గలేదు అదీ విశ్వాసం .సూఫీ మతం రావటం తో కొత్త యాత్రాస్తలాలేర్పడ్డాయి .ఇండియా లో మొదటి సూఫీ అనుచరులు క్రిస్టీ కి చెందినా వారు .క్రిస్టీ మత ప్రవక్తలు పుట్టిన చోటు మరణించిన చోటూ కూడా పవిత్ర యాత్రా స్థలాలైనాయి .పద మూడు నుండి పది హేడవ శతాబ్ది వరకు సూఫీ స్మారకాలు చాలా ప్రధాన పాత్ర పోషించాయి .వీటిని దర్శించటానికి ముస్లిం లతో బాటు హిందువులు కూడా ఎక్కువ సంఖ్య లో వచ్చేవారు .ఇండో ముస్లిం పాలకులు ఇండియన్లుగా ఇస్లామిక్ గా ఉండటం అనే కొత్త దశ ఏర్పడింది .
ఢిల్లీ లోని 1325కు చెందిన నిజాముద్దీన్ ఔలియ సమాధి దక్షిణ ఆసియాలోనే అతి ప్రధాన చిస్టే కేంద్రం అయింది .అప్పటి నుంచి ఇప్పటిదాకా హిందూ ముస్లిం భక్తులకు దివ్య క్షేత్రం గా నే ఉంది .1235కు చెందిన ఢిల్లీ లోని కుతు బుదీన్ బఖ్తియార్ వద్ద మొగల్ చక్ర వర్తి బాబర్ ప్రార్ధనలు చేసే వాడు .గాంధి మహాత్ముడు దీనిని ఏకత్వ చిహ్నం గా భావించేవారు .హత్యకు ముందు ఆయన ఇక్కడికి వచ్చి వేల్లాడుకూడా .అదే కాలానికి చెందిన అజ్మీర్ లోని మౌఉద్దేన్ క్రిస్టి దర్గా కూడా అందరిని ఆకర్షిస్తోంది .ఈ దర్గాను అక్బర్ చక్ర వర్తి పద్నాలుగు సార్లు దర్శించాడు చాలా. సార్లు నడిచి వెళ్ళాడు కూడా .మౌఉద్దేన్ చని పోయిన రోజున జరిగే ఉర్స్ ఉత్సవానికి తీర్ధ యాత్రగా ప్రజలు రావటం విశేషం .ఈ మధ్య జరిగిన ఉర్స్ ఉత్సవానికి మూడు లక్షల మంది హిందూ ముస్లిం యాత్రికులు వచ్చినట్లు సమాచారం .ఈ సూఫీ ప్రవక్తల వలన ముస్లిం చాందస వాదం బల హీన పడింది క్రమ క్రమం గా .ఢిల్లీ సుల్తాన్లు వీరి దాసులవటం తో గణనీయ మైన మార్పే వచ్చింది .
భక్తియార్ కాకి ‘’సామ వేదాన్ని చదివే వాడు .దీన్ని చూసి ఉలేమా క్రోధోన్మత్తుడయ్యాడు .కాని ‘’ కాకి ‘’గారు పాడుతుంటే రహస్యం గా వినేవాడట .నిజాముద్దీన్ ఔలియా గారు రాజులతో అధికారులతో సంబంధం పెట్టుకొనే వాడు కాదు .రాజు ముఖ ద్వారం నుండి లోపలి ప్రవేశిస్తుంటే వెనక ద్వారం నుండి బయటికి వెళ్లి పోయే వాడట .దర్గా యెడల సుల్తానుల రాజు ల అభిమానం భక్తీ ఏ మాత్రం తగ్గలేదట .లక్నో –ఫైజా బాద్ మార్గమధ్యం లో ఉన్న సయ్యద్ సాలార్ మాసుద్ ఘాజి కి చెందిన దర్గా అక్బర్ కాలం నుండి ఈ నాటివరకు లక్షలాది సందర్శకులకు నిలయం గా ఉంది .ఘాజి మియాన్ అనే దైవ భక్తీ గల సైనికుడి మృతికి చిహ్నమే ఈ దర్గా .ఇక్కడ వసంత మేలా ,జ్యేష్ట మేలా నిర్వహిస్తారు .నిజాముద్ద్దీన్ ఔలియ శిష్యుడు నసీరుద్దేన్ చిరాగ్ దర్గా ఢిల్లీ కే కాదు యావత్ దేశానికి కాంతి నిస్తోంది .అక్కడి సరస్సు చుట్టూ గుడారాలు వేసుకొని భక్తులు ఉండి దర్శిస్తారు .నిజా ముద్దిన్ గారు ‘’ప్రతి దేశం విశ్వాసానికి ,దైవానికి సరైన దారి చూపిస్తుంది ‘’అని ఒక ద్విపదలో మొదటి పంక్తి చెబితే శిష్యుడు కవి అయిన అమీర్ ఖుశ్రు ‘’నేను నా ఆలయాన్ని ఆయన దారి లోనే కోడీకల టోపీ తో ఏర్పరచుకోన్నాను ‘’అని రెండో పంక్తి పూర్తీ చేశాడట .ఇక్కడ ఆయన అంటే నిజాముద్దీన్ గారే నని కవి హృదయం .ఈక్రిస్టేలు ఎవరూ మక్కా యాత్ర చేయలేదు .వీరి ‘’కిలా’’ మాత్రం మక్కా వైపున ఉంటుంది అంతే .
హిందూ స్తాన్ అంటే ‘’వతన్ ‘’అంటే స్వదేశం .హిందూ ముస్లిం లందరిది .ఆల్ హింద్ పేరిట అక్బర్ రాజ్య పాలన చేశాడు .ఆయన కొద్ది ముక్క అయిన ఉత్తరభారత రాజు కాదు యావత్ భారతానికి చక్రవర్తిని అనే భావం తో పరిపాలన సాగించాడు .కాందహార్ నుండి దక్షిణ సముద్రం వరకు ,కామ్భాయిత్ నుండి బంగాళా ఖాతం వరకు రాజ్యాన్నిఏలాడు . గాంధారమే కాంద హార్. ఆఫ్గని స్తాన్ లో ఉంది దీన్నే ఆగ్నేయ ఇండియా అనేవారు .కంభాయిట్ అరేబియా సముద్రం లోని కాంబే జలసంధి. ఇదీ హిందూస్తానమంటే.ఇందులోని ఢిల్లీ ,లాహోర్ సూరత్ నగరాలన్నీ ,మధ్యలోని నదీ నదాలన్నీ ,భూమి అంతా హిందూస్తాన్ .పవిత్ర గంగా జలం అంటే విపరీతమైన భక్తీ ఉన్న పిచ్చి తుగ్లక్ అన బడే మహమ్మద్ బీన్ తుగ్లక్ తన రాజ దానిని ఢిల్లీ నుండి వెయ్యి కిలో మీటర్ల దూరం లో ఉన్నగంగా నదికి దగ్గరలో ఉన్న దౌలతా బాద్ కు మార్చాడు .ఇది పిచ్చి పనికాదు .పవిత్ర గంగాజలంపై భక్తీ .ఇన్ని మంచి విషయాలు రాసి మనకు అందించిన రచయిత్రి డయానా ఎల్ ఎక్ ను అభి నందిస్తున్నా .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-8-14-ఉయ్యూరు
మీరు రాసినదాంట్లో ఒక పెద్ద తప్పు ఉంది.ఢిల్లీకి గంగానది 1000మైళ్ళ దూరంలో లేదు.ఇంకా బాగా దగ్గరే.దౌలతాబాద్ గంగ దగ్గర లేదు.దక్కన్ పీఠభూమిలో ఔరంగాబాద్ దగ్గర ఉంది.దీనికి ఇంకో పేరు దేవగిరి.
మీరు సూచింది యదార్ధం .నా వాక్య విన్యాసం లో దొర్లిన దోషం .దౌలతా బాద్ కు
రాజధాని మార్చేటప్పుడు గంగా జలాన్ని వెంట తీసుకెళ్ళాడు అని ఉండాలి –
గుర్తించి తెలియ జేసినందుకు ధన్య వాదాలు -దుర్గా ప్రసాద్
2014-08-01 23:43 GMT+05:30 సరసభారతి ఉయ్యూరు :
>