మనం మరచిన బీహార్ స్వాతంత్రోద్యమ నాయకులు -1

మనం మరచిన బీహార్ స్వాతంత్రోద్యమ నాయకులు -1

భారత స్వాతంత్ర్య సమరం లో బీహార్ కు ప్రత్యెక త ఉంది .డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ,జయప్రకాష్ నారాయణ వంటి ఎందరో త్యాగ మూర్తులు పుట్టిన గడ్డ అది .వీరితో బాటు సంతాలులు ,ఆదివాసీలు తమ అస్తిత్వ ,పోరాటం లో ,క్రైస్తవ వ్యాప్తిని ఎదుర్కొనటం లో ,,స్వాతంత్ర్య సాధనలో కృషి చేసి ధన్యులయారు .వారి ని మనం మార్చే పోయాం .అలాంటి వారిని జ్ఞప్తికి తేవటానికి చేసిన ప్రయత్నమే ఇది .

సంతాల్ నాయకుడు –  బాబా తిల్కా మంజి

బ్రిటిష్ వారిపై 1789లో బ్రిటిష్ వారిపై మొట్టమొదటి సరిగా దాడిచేసిన స్వాతంత్ర్య సమార యోధుడు సంథాల్ కులానికి చెందిన బాబా తిల్కా మంజీ .మంగళ పాండే తిరుగు బాటు చేయటానికి వందేళ్ళ ముందే బాబా తిరుగు బాటు బావుటా ఎగరేశాడు .సంతాల్ తెగ వారినందరినీ ఐక్యపరచి ‘’ముక్తి దళ్ ‘’గా ఏర్పరచి బ్రిటిష్ వారు కొల్ల గోడుతున్న సంపదను వారి దౌర్జన్యాలను ఎదిరించాడు .1784 మొదటి సారిగా’’ సంథాల్ హల్’’ అనే పేర ఈ తిరుగు బాటు ప్రారంభ మైనట్లు చరిత్ర చెబుతోంది .1770లో ఆ ప్రాంతం లో పెద్ద కరువు వచ్చి వేలాది మంది ఆకలితో మరణించారు .చిన్న విలియం పిట్ ఆజ్ఞలపై కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు జమీందారుల తో సర్దు బాటుకు పదేళ్ళ గడువు ఇచ్చారు .1880లో జమీన్దారికి సంథాల్ తెగకు మధ్య సంభాషణలు పెద్దగా జరగనే లేదు .

Inline image 1  

విసుగెత్తి పోయిన సంథాల్ గ్రామస్తులు బాబా తిల్కా మంజీ నాయకత్వం లో బ్రిటిష్ కమీషనర్ (లెఫ్టి నెంట్ )పై నా ,రాజ మహల్ పైనా ‘’గుయెల్’’’అనే ఒకే గుండు పేల్చగల తుపాకులతో(సింగిల్ షాట్ గన్  ) దాడి చేసి కాల్చి చంపేశారు  .బ్రిటిష్ సైనికులు వీరున్న ‘’తిలాపూర్ అరణ్యం ‘’ను దిగ్బంధం చేశారు  .అక్కడి నుండే చాలా వారాలు బ్రిటిష్ సైన్యం పై పోరాడాడు మంజీ .చివరికి బ్రిటిష్ సైన్యం 1784లో మంజీ ని పట్టుకొన్నది .అతన్ని గుర్రపు తోకకు కట్టి అక్కడి నుంచి కలెక్టర్ నివాసానికి భాగల్పూర్ దాకా ఈడ్చుకు వెళ్ళారు .అప్పటికి చితికి ,రక్తం ఓడుతున్న అతని శిధిల  శరీరాన్ని మర్రి చెట్టుకు వేలాడదీసి ఉరి తీశారు  .

భారత దేశ స్వాతంత్ర్య సిద్ధి తర్వాతబాబా ను ఉరి తీసిన ప్రదేశం లో ఒక శిలా విగ్రహాన్ని నిర్మించి గౌరవించారు .భాగల్పూర్ ఎస్ పి నివాసానికి  బాబా పేరుపెట్టారు.భాగల్పూర్ యూని వర్సిటి కి ‘’బాబా తిల్కా మంజీ భాగల్ పూర్ యూని వర్సిటి ‘’గా నామ కరణం చేశారు  .

ఆది వాసీ దేవుడు  బిశ్రా ముండా

1875-లో పుట్టి 1900లో ఇరవై అయిదేళ్ళాకేవీర మరణం పొందిన  ఆదివాసీ నాయకుడు,స్వాతంత్ర్య సమర యోధుడు ,హీరో – బిశ్రా ముండా.ఈ నాటి బీహార్ –జార్ఖండ్ ప్రాంతాలలో ‘’మిలినేరియన్ ఉద్యమం ‘’సాగించిన వీరుడు .ఇదే తర్వాత గొప్ప స్వాతంత్ర్య సమరం గా రూపు దాల్చింది .భారత పార్ల మెంట్ సెంట్రల్ హాల్ లో అతని చిత్రపటాన్ని ఉంచి గౌరవిస్తున్నారు .ఆ యువ హీరో సాధించిన విజయాలు అద్భుతం గా ఉంటాయి .

Birsa Munda, photograph in Roy (1912-72).JPG  

15-11-1875 న బీహార్ లోని రాంచి జిల్లాలో బిశ్రా ముండా గురువారం నాడు జన్మించాడు .ముండాతెగ ఆచారం ప్రకారం గురువారం పుట్టిన వారు ఏంటో పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు  .తండ్రి సుగన ముండ .తలిదండ్రులు పిల్లల్ని తీసుకొని జీవిక కోసం బీర్బంకి దగ్గర కురుమ్డా చేరారు .ఇతని బాల్యం తలిదండ్రుల వద్దే ‘’చల్కాద్ ‘’లో గడిచింది .తోటిపిల్లలతోఇసుక లో, మట్టిలో ఆడి బాగా బల సంపన్నడయ్యాడని జానపద గీతాలు తెలియ జేస్తున్నాయి .బోహాండా అడవుల్లో గొర్రెలు మేపాడు .వయసు వచ్చాక ఫ్లూట్ వాయించటం బాగా వచ్చింది .గుమ్మడి కాయ బుర్రకు ఒక తీగె కట్టి(తుయిలా) అనే వాద్యం తయారు చేసి దానిపైనా బాగా వాయించేవాడు .అఖారా అనే నాట్యం చేసే ప్రదేశం లో హాయిగా గడిపే వాడు .అతనితో బాటున్న స్నేహితులు అతని నోటి నుండి విచిత్రమైన మాటలు వచ్చేవని చెప్పుకొనే వారు .

బీదతనం తో కుంగిపోతున్న తండ్రి బిశ్రా ను అయుభాటు లో ఉన్న మేన మామ ఇంటికి తీసికెళ్ళాడు .అన్న ముండా సాంప్రదాయం తో పెళ్లి చేసుకొని తండ్రిని చేరాడు .బిశ్రా మేనమామ ఇంట్లో  రెండేళ్ళు న్నాడు .సలగా లో జైపాల్ నాగ పెట్టిన బడిలో చేరి చదివాడు .తల్లి చిన్న చెల్లెలు’’జొని ‘’ తో చనువుగా తిరిగాడు ..ఆమెకు అతనంటే ఇష్టం .పెళ్లి అయి ఆమె అత్తారింటికి వెళ్ళిపోయింది .క్రిస్టియన్ మత ప్రచారకుడు వీరి గూడానికి వచ్చి ముండా సాంప్రదాయం వదిలి క్రైస్తవులుగా మారమని బోధిస్తుంటే బిశ్రా ఎదురు తిరిగాడు .చదువులో చురుకుగా ఉన్న బిశ్రాను గురువు జర్మన్ మిషన్ స్కూల్ లో చేరమన్నాడు. క్రిస్టియన్ అయితేనే అందులో ప్రవేశం ఉంటుంది .క్రిస్టియన్ గా మారి చేరి చదివాడు .కొద్దికాలం చదివి వదిలేసి వైష్ణవ భక్తుడు ‘’ఆనంద్ పాండే ‘’ను చేరి హిందూ ధర్మాన్ని బాగా అభ్యసించాడు .ఆయన ప్రేరణ తో రామాయణ ,మహా భారతాది గ్రంధాలన్నీ చదివాడు .

చైబాసాలో 1886 నుండి నాలుగేళ్ళు ఉన్నాడు .క్రైస్తవ మత ప్రచారాలు అతన్ని జాగ్రుతుడ్ని చేశాయి తన మతమేదో విస్పష్టం గా అర్ధమైంది .భావాలు బలీయం అయి క్రైస్తవానికి, మిషనరీకి వ్యతిరేకం గా మారిపోయాడు .జర్మన్ మిషనరినుండి కుటుంబం వేరైపోయి సర్దార్ల తోకలిసి వ్యతిరేకం గా పని చేశాడు .బలపడుతున్న సర్దార్ ఉద్యమం  లో చేరి ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలను ఎదిరించాడు .రక్షిత  అరణ్యాలలో   ప్రభుత్వం కల్పించిన  హక్కులను హరిస్తే వూరుకోనేది లేదని ముండా ఉద్యమం చేశాడు .సింగ్భం ,పాలమౌ ,మానభం అరణ్య ప్రాంతాలలో  వారి  హక్కులను తేల్చటానికి చర్యలు చేబట్టమని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చాడు .ప్రభుత్వం అడవుల్ని బ్లాకులుగా విడగొట్టి సేద్యపు భూమి ని ,పనికి రాని నేలను గుర్తించి సరిహద్దులు నిర్ణయించింది .యువ కిశోరం ముండా పాడు పడిన బావులను మరమ్మతు చేశాడు .గార్బెరాలో ఉన్న దొమ్బారి చెరువును బాగు చేశాడు .

దగ్గరే ఉన్న సింగభం లోని సంకర గ్రామంలో ఉన్న ఒకమ్మాయి తనకు ఇల్లాలుగా ఉండే అర్హతలున్నాయని గుర్తించి ఆమె తలిదండ్రులకు ధనం ,వజ్రాలు ఇచ్చి ఒప్పించాడు .కాని అతను జైలు కెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆమె క్రుతఘ్నురాలై ఉండటం గమనించి ఆమెను వదిలి పెట్టి వెళ్ళిపోయాడు .ఇద్దరు అమ్మాయిలూ పెళ్లి చేసుకోమని సిద్ధపడ్డారు .కొద్దికాలం తర్వాత బిశ్రా కుఎక పత్నీవ్రతం గురించి ఆలోచన వచ్చింది .చుట్టుప్రక్కల జరుగుతున్న విషయాలన్నీ బాగా పరిశీలించేవాడు .రైతులకు అన్యాయం జరుగుతోందని ,అడవిపుత్రులను తీవ్రం గా క్షోభ పెడుతున్నారని గ్రహించాడు .కొత్త మతాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచించాడు .క్రిష్టియానిటి నుండి మారిన సర్దార్లు అందరూ అతని వైపే ఉన్నారు .చర్చి విధించే టాక్స్ అంటే కంపరం రేగిందిజనాలలో .ఒకే దేవుడు అనే భావన వ్యాప్తి చేశాడు వారిలో .అది వారికి బాగా నచ్చింది .బిశ్రా ఒక దేవ దూత అయ్యాడు వారికి .అతని సిద్ధాంతం లో డబ్బు ఖర్చులేదు .ముండాలు ,ఒరాన్లు ,ఖరియన్లు బిశ్రా అంటే దేవుడుగా భావించి అతన్ని చూడటానికి తండోప తండాలుగా వచ్చారు .తమపాపాలను పోగొట్టేవాడనే నమ్మకం కలిగింది .అందరూ బిస్రలైట్లు గా మారిపోయారు .’’ధర్తి ఆబా’’ అనే పేరు అందరి పెదవుల మీదా పలుకుతోంది .హిందువులు ముస్లిం లు కూడా విపరీతం గా వచ్చి ఈ కొత్తమతం లో చేరిపోయారు .హిందూ విధానాలను వ్యాపింప జేస్తూ మతం మారి క్రైస్తవులైన వారిని మళ్ళీ పాత పద్ధతిలోకి రమ్మని ప్రచారం చేశాడు .మన్య వీరుడై దేవదూతగా భాసించి సాక్షాత్తు వారికి దేవుడే అయ్యాడు బిశ్రా ముండా .గోపూజ  చేయమని ఆవును చంప వద్దని కూడా ప్రచారం చేశాడు .

బ్రిటిష్ కాలనీ వ్యవస్థ రైతులకు మేలు చేయకుండా జమీందారీ వ్యవస్థకు కొమ్ము కాసింది .ఆది వాసీలు తమ వద్ద ఉన్న పాత పని ముట్ల తో వ్యవసాయం చేస్తూ ,అధిక దిగుబడిని సాధించలేక పోయారు .అప్పుడు ప్రభుత్వం చోటా నాగ పూర్ లోని భూములను మన్య జనులకు కాక ఇతరులకిచ్చి వ్యవసాయం చేసుకోమన్నది .మన్య రైతుల్ని తరిమేసి భూములాక్రమించి వారందరూ దాష్టీకం చేశారు .దీనితో ‘’తికాదార్స్ ‘’అనే ఒక కొత్త వర్గం పుట్టింది .1856లో ఆరు వందమ మంది జాగీర్దార్లు ఉండే వారు .వారికి ఒకటి నుంచి  నూట యాభై  గ్రామాలపై ఆధిపత్యం ఉండేది .దీనితో అప్పటిదాకా ముండా,ఒరాన్ నాయకుల అధికారం  తగ్గిపోయింది .కొన్ని గ్రామాలలో ఈ ఆదివాసీలకు  భూమిపై హక్కులు లేకుండా నిలువ నీడ కూడా లేని పరిస్తితి ఏర్పడి వ్యవసాయ కూలీలుగా ఉండాల్సిన దుస్తితి వచ్చింది .

ఈ దారుణ పరిస్తితులకు కలత చెందిన బిశ్రా తదితర ముండా నాయకులు ఎదిరించి పోరాడారు .తమ అటవీ భూములపై తమకే హక్కు ఉండాలని పోరాటం సాగించారు .మధ్య వర్తులను బ్రిటిష్ వారిని తొలగించాలని డిమాండ్ చేసి ఉద్యమించారు .బ్రిటిష్ ప్రభుత్వం మాయోపాయాలు పన్ని బిశ్రా ముండా ను 3-2-1900న చక్రదార్ పూర్ లోని జామ్కోపాయ్ అడవిలో బ్రిటిష్ వారిపై పోరాటం చేస్తూ  సహచర గెరిల్లా సైన్యం తో  కలిసి పడుకొని ఉండగా పట్టుకొని  జైల్లో పెట్టి హింసించింది .అతనితో బాటు 460మంది గెరిల్లా సైనికులను అరెస్ట్ చేసింది .కొంతమందికి యావజ్జీవకారాగారం ,ఇరవై ముగ్గురికి పద్నాలుగేళ్ళు జైలు విధించారు . బిశ్రా  యెడల పాశవికం గా ప్రవర్తించింది .బిశ్రా 9-6-1900 న రాంచీ జైలు లో దారుణ మరణానికి గురైనాడు .కలరా సోకి చనిపోయాడని జైలు అధికారులు చెప్పారు .ఆ లక్షణాలేవీ లేవని తర్వాత తెలిసింది .పాతిక ఏళ్ళు మాత్రమె జీవించిన బిశ్రా ముండా ఆదివాసీలకు ప్రత్యక్ష దైవం అయి బ్రిటిష్ పాలకుల గుండెల్లో సింహమై గడ గడ లాడించాడు .అతని మరణం తో ఉద్యమం నీరుకారిపోయింది .కాని రెండు విషయాలు స్పస్టమైనాయి .ఆదివాసీల భూములు ఇష్టం వచ్చినట్లు ‘’దికూస్ ‘’లు లాక్కొనే వీలు లేదని  ,బ్రిటిష్ కాలనీ వాసుల అన్యాయాన్ని దౌర్జన్యాన్ని ఆదివాసీలు చూస్తూ ఊరుకోరని తిరగబడి బుద్ధి చెబుతారని వారిలో పోరాట పటిమ ఉందని తెలిసింది .ముండాతన తోటి వారికి ఇచ్చిన పిలుపు ‘’బ్రిటిష్ రాణి ప్రభుత్వం ఇక్కడ అంతమొందాలి .మన రాజ్యాన్ని మనం స్థాపించుకోవాలి ‘’అనేది ఒక మంత్రమై పని చేసి బీహార్ ,మధ్య ప్రదేశ్ ,ఒరిస్సా ,పశ్చిమ బెంగాల్ లలో ప్రతిధ్వనించి ఆదివాసీల ఐక్యతకు ,హక్కుల పరిరక్షణకు దారి చూపింది .

బిశ్రా జన్మించిన నవంబర్ పదిహేనును  కర్నాటక లోని కొడగు ,మైసూర్ జిల్లాలలో జయంతి వేడుకలను ఘనం గా నిర్వహిస్తున్నారు .జార్ఖండ్ రాజధాని రాంచిలో కోకార్ లో ఉన్న బిశ్రా సమాధిని సందర్శించి నివాళులర్పిస్తారు . రాంచి లోని విమానాశ్రయానికి బిశ్రా ముండా విమానాశ్రయం అని పేరుపెట్టి గౌరవించారు .సింద్రీలో బిశ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ,కాన్పూర్ లో బిశ్రా ముండావనవాసీ చాత్ర వాస్ ను ,బిశ్రా ముండా క్రీడా మైదానం ,బిశ్రా ముండా సెంట్రల్ జైలు ,బిశ్రా సేవా దళ్ ,పురూలియాలో బిశ్రా ముండావ్యవసాయ విశ్వ విద్యాలయాన్ని ఏర్పరచారు .బిశ్రా పై ఒక నవల రాసి దాన్ని సినిమాగా తీశారు .విప్లవం పేరుతొ అశోక్ శరణ్ 2004లో తీసిన హిందీ సినిమాలో అయిదు వందల మంది బిస్రలైట్లు నటించారు .రామన్ మాగ్ సేసే అవార్డ్ విన్నర్ మహా శ్వేతా దేవి బిశ్రా జీవితం ,ఆయన బ్రిటిష్ వారిపై చేసిన గెరిల్లా పోరాటాల నేపధ్యం గా ‘’అరణ్యే అధికార ‘’అనే బెంగాలి నవల రాసి సాహిత్య అకాడెమీ బహుమతిని పొందింది .యువకులకోసం ఆ నవలను తర్వాత సంక్షిప్తం గా రాసి ప్రేరణ కలిగించింది .

ఈ విధం గా ఇద్దరు బీహారీ ఆదివాసీ స్వాతంత్ర్య సమార యోధులను గురించి తెలియ జేసే మహద్భాగ్యం నాకు కలిగిందని సంతోషిస్తున్నాను .

మరికొంతమంది గురించి తరువాత తెలియ జేస్తా .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-8-14-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

1 Response to మనం మరచిన బీహార్ స్వాతంత్రోద్యమ నాయకులు -1

  1. Jai Gottimukkala అంటున్నారు:

    చాల మంచి విషయాలు చెప్పారు. ఆ మహనీయులకు దేశం ఎంతో రుణ పడింది.

    అయితే ఇంత మంచి వ్యాసంలో కొన్ని తప్పులు దొర్లాయి. ముఖ్యంగా బిర్సా ముండా పేరు సరి చేయ ప్రార్థన.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.