డెబ్భై ఏళ్ళ క్రిందట చిన్నతరగతులకు తనకు చదువు నేర్పిన గురువు గారు స్వర్గీయ కోట సూర్య నారాయణ (ఉయ్యూరు)మాస్టారి స్మారకం గా అమెరికా లో ఉంటున్నవారి ప్రియతమ శిష్యుడు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు సభక్తికం గా 10,000రూపాయల నగదు పురస్కారం ను సరసభారతి ద్వారా నా చేతుల మీదుగా ఉయ్యూరు శాంతి నికేతన్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న ఛి లంకె లావణ్యకు 21-8-14 గురువారం మధ్యాహ్నం ఆ స్కూల్ లో మూడుగంటలకు ప్రదానం చేయ బడుతుంది .
గురు భక్తికిది గొప్ప నిదర్శనం ..సుమారు పది హీను రోజుల్లో సెప్టెంబర్ అయిదు ”గురు పూజోత్సవం ”కు ఇది ఒక ప్రేరణ గొపాల కృష్ణ గారి మాత్రు దేశాభిమానానికి ,స్వంత గ్రామం పై ఉన్న మక్కువకు, నిరుపేద విద్యార్ధిని విద్యాభి వృద్ధిపై వారికి ఉన్నమమకారానికి ఇదొక తార్కాణం మాత్రమె .వారికీ ,వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్య భోగ హాగ్యాలను సదా ప్రసాదించాలని ,నా తరఫున ,సరస భారతి తరఫున కొరుకొంటున్నాను . దుర్గా ప్రసాద్ .
SANTHI NIKETHAN ENGLISH MEDIUM SCHOOL, VUYYUR
సరస భారతి ఆధ్వర్యం లో శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారిచే
శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా) సభక్తికం గా అందించే
కీ. శే .శ్రీ కోట సూర్య నారాయణ మేస్టారు గారి స్మారక నగదు పురస్కార ప్రదానం
గ్రహీత – లంకె లావణ్య
21-08-2014