హ్యూమన్ వైబ్రేషన్స్
కాన్రాడ్ రిచెర్ అనే అమెరికా రచయిత. ‘’ది సీ ఆఫ్ ది గ్రాస్ ,ది ట్రీస్ ,ది టౌన్ నవలలు రాసి మంచి పేరు తెచ్చుకొన్నాడు .తన తండ్రిపై ‘’ఏ సింపుల్ ఆనరబుల్ మాన్ ‘’అనే పుస్తకం రాశాడు .అతని రచనలన్నీ వేదాంత ధోరణిలో శాస్త్రీయ దృక్పధం తో ఉంటాయి .జీవితాంతం ఒకే భార్య తో కాపురం చేసిన ఏకైక అరుదైన వ్యక్తీ రిచెర్ .అందరి మన్ననలు అందుకొన్నాడు .ఆయన జీవితం ను రచనలను ఎడ్విన్ జి.గాస్టన్ గొప్పగా చిత్రించాడు .లోతైన విశ్లేషణ తో ,మేధావి గా గుర్తింపు పొందిన కాన్రాడ్ రిచెర్ ను మహా బాగా ఆవిష్కరించాడు .లైబ్రరీలో ఈ పుస్తకం కనపడగానే తెచ్చి దీక్ష గా చదివేశాను .అతని పుస్తకం ‘’హ్యూమన్ వైబ్రేషన్స్ ‘’ను గురించి ముందు తెలుసుకొందాం .
వ్యక్తీ ఒక మానవ స్టోరేజ్ బ్యాటరిఅంటాడు కాన్రాడ్ .మనిషి భౌతిక మానసిక చర్యలను నిర్ణ యించేవి కణాలు ,కణ శక్తి అన్నాడు .కణ తరంగాల చలనాల ను నియంత్రించేది’’దొరికినది’’మాత్రమె .కణ శక్తి అనేది శక్తి యొక్క వ్యతిరేక స్వేచ్చాపూర్ణమైన వాటి వలననే కలుగుతుంది అన్నాడు .కణం అంటే అదొక జీవ శాస్త్ర పదం మాత్రమె కాదు .అది అతి సూక్ష్మ లైఫ్ యూనిట్ .అలాంటివి వ్యక్తిలో అనేకం ఉండి శక్తిని వినియోగించుకొంటాయి .అయితే ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ?నాదీ శక్తి బౌద్ధిక శక్తి ,జీవ శక్తి పెప్ శక్తి మొదలైన వాటివలన కలుగుతుంది .
జీవిలో శక్తి శుద్ధి చేయ బడుతుంది .కాని అది దాని పనులకు సరిపోదు . ప్రపంచం అంతా సుఖం గా ఉండాలని అనుకొంటుంది .దుఖాన్ని మాపుకోవాలని ఆరాట పడుతుంది .పూర్తీ శక్తి ప్రవాహం అనేది వాహిక ద్వారానే చలిస్తుంది .స్తితి శక్తి నుండి తరంగాలు ఉవ్వెత్తున ఎగసినపుడు ఆనందం ఎర్పడుతుంది .పరిణామం అనే దిఎదోతోకయో మోప్పయో మరేదో పెరగటం కాదు .బౌద్ధిక అభివృద్ధి చెందటమే .దీనికి లోపల ఉన్న అన్ని రకాల తరంగ చలనాల ఐక్యతే దోహద పడి మార్పును తెస్తాయి .పరిణామ క్రియ ఉన్నతం అయిన కొద్దీ బుద్ధిలో యుద్దాలనేకం జరుగుతాయి .మనసులో మార్పులోస్తాయి .దీని వల్లనే ఇతరుల యెడ సానుభూతి ని వారిని పట్టించుకోవటం వారి సమగ్రత పై ఆకాంక్ష ఏర్పడుతాయి .వారు చేసే మంచిని హర్షించటం ,వారిలో లేని వాటిపై దృష్టిపెట్టి వారిని ముందుకు తీసుకెళ్ళాలనే తలంపు వస్తాయి .వాళ్ళలో ఏవేవి లేవో పాపం వాళ్లకు తెలియదు .ఆలోటును పూడ్చే ప్రయత్నాలు జరుగుతాయి .
బయో ఫిజిక్స్ కు ప్రిన్సిపిల్స్ రాస్తూ కొన్ని సింబల్స్ వాడాడు .A గుర్తుకణ శక్తి వోల్టేజ్ గా ,B కణం లో వలయం లో నిరోధకతగా ,A/B కణ ప్రవాహ విద్యుత్ గా C తరంగ శక్తి పిచ్ యొక్క ఖర్చు రేటు గా పేర్కొన్నాడు .సెల్ వోల్టేజ్ అంటే దాని బయోకేమికల్ మోటివ్ ఫోర్స్ అన్నాడు. అది శక్తి పీడనం గా భావించాడు .శక్తి ప్రవాహం అయిన కరెంట్ అంటే సేల్స్ లోని లైపాయిడ్ మేమ్బ్రెంస్ ఉత్పత్తి అయ్యే శక్తి అని దానినే A/Bగా గుర్తించాడు .అంటే సెల్ వోల్టేజ్ ని నిరోధకత తో భాగిస్తే వచ్చేదే .కరెంట్ ఖర్చు నిష్పత్తి నే ఫ్రీక్వెంసి వైబ్రేషన్ అన్నాడు .
రిచెర్ రాసిన మరో పుస్తకం ‘’ది మౌంటేన్ ఆన్ ది డెసర్ట్ ‘’సజీవులు స్వతస్సిధం గా అనైక్యత నుండి ఐక్యతకు ప్రయాణించాలానే కోరిక తో ఉంటారని చెప్పాడు అంటే ‘’ఇన్ హార్మనిన నుంచి హార్మని’’కి చేరాలని ఉబలాట పడతారని భావం .వీటినన్నిటిని పరిశీలన ,వివరణ ,నిఘా అంటే చెక్ లను బట్టి తెలుసుకోవాలన్నాడు .Electric anaologies are closer to the psycho energy process ,but they involve terms and conceptions the rest of our friends here would not understand ‘’అని చెప్పాడు .కొన్ని భావాలు ఆయన మాటల్లోచెబితేనే సులువుగా అర్ధం అవుతుంది –
‘’Energy hunger becomes the basic primal motive for humans who consciously or un consciously hunger for energy night and day.They must seek to supply these deficiencies by releasing energy from themselves .Many of the energy release processes are instinctive handed down in the egg .Some are learned The inherited ones ordinarily are geared to the five senses of which sight is the superior .’’
భౌతిక పరిశ్రమ అన్నిటికంటే ముఖ్యమైన తెరపి .అదే మనకు అనూచానం గా తరతరాలుగా వస్తున్న విధానం కూడా ‘’energy does not beget activity but rather results from it .it may stem for self discipline ,the self administering hardship .
ఏడవటం, చెమట కార్చటం ,నవ్వటం ,ప్రార్ధన చేయటం మొదలైనవి ఇతర రిలీజ్ పద్ధతులు ..విధానం ఏదైనా కానివ్వండి ఫలితం మాత్రం శక్తి బదిలీ యే.ఒక కణ సమూహం రెండవ దాన్ని జాగ్రుత పరుస్తుంది .ఈ విధం గా లాక్కోబడ్డ శక్తిని స్తిర పరుస్తుంది .విశ్రాంతి లేక రిలాక్సేషన్ కు కూడా శక్తి అవసరమే .దీనికీ శక్తిని మనం సమకూర్చుకోవాల్సిందే నంటాడు .ఈ మొత్తానికి సారాంశం ఆయన మాటల్లోనే
‘’Humans function mentally and physically in response to cellular vibrations fed by psychical and physical energy .If energy is plentiful ,the human mechanism performs harmoniously .The highest manifestations of such harmony are love and understanding .on the other hand ,if energy levels are low ,the human machine is out of sorts .Conflict with other people and nature is a sure a sign of such deficiency .To satisfy their energy hunger humans must engage in intense activity which causes the stronger cells in the body as it were ,to over flow and re energize the weaker cells .It resembles an automatic storage battery .అని ఫారడే సిద్ధాంతం ఆధారం గా చెప్పాడు .ఇంకా కొన్ని మంచిమాటలు ఆయన ధోరణిలోనే –
‘’ the world little knows how many of the thoughts and theories which have passed through the mind of a scientific investigator have been crushed in silence and secrecy by his own severe criticism ad adverse examination ,that in the most successful instances not a tenth of the suggestions the hopes ,the wishes the preliminary conclusions have been reached ‘’.
కాన్కార్డ్ రిచెర్ గొప్ప స్టైలిస్ట్ రచయిత.అతని సౌత్ వేస్త్రెన్ ఫిక్షన్ అంతా జాతీయత ,డిప్రెషన్ లకేవిని యోగించాడు .’’ది ట్రీ ‘’లోభౌగోళికం గా ,సాంస్కృతిక పరం గా ఉన్న రెండు విభిన్న ప్రాంతాల చరిత్ర ఉంది .సైకాలజికి సంప్రదాయానికి అయన రచనలు నెలవుగా ఉంటాయి .మొత్తం మీద పదహారు నవలలు ,కదా సంపుటాలు వ్యాసాలూ చాల రాశాడు . అమెరికా అటోగ్రాఫిక్ రచయితలలో అతి ముఖ్యుడు కాన్రాడ్ ..హిస్టారికల్ ఫిక్షన్ కు జీవం పోసిన రచయిత.
సౌత్ వేస్త్ర్రెన్ సీ ఆఫ్ గ్రాస్ ను ,ఈస్త్రెన్ సీ ఆఫ్ ట్రీస్ ను రచనల్లో ప్రతిబింబింప జేశాడు .పెంసిల్వేనియాకు చెందిన డచ్ మాండలికానికి జీవం పోసి రాశాడు .అందులో ఆయన నిష్ణాతుడు అని పించుకొన్నాడు సంక్లిష్ట మానవ విజయాలను ఉన్నత శిఖరాలపై నిలబెట్టాడు .ప్రతి విషయాన్ని కళాత్మకం గా రాశాడు .అన్నిటిలో మంచితనం అండర్ కరెంట్ గా ప్రవహిస్తూ ఉండటం కాన్రాడ్ ప్రత్యేకత .గొప్ప విశేషం ఏమిటంటే అతను ఏనాడూ తన ప్రశాంత గృహాన్ని వదిలి బయటికి అడుగు పెట్టిన వాడు కాక పోవటం .
అమెరికా గత చరిత్రలోని జాన పద గాధలను ,కధలను క్రోడీకరించి ,సజీవ చిత్రాల్లా చిత్రించాడు .అతనికున్న కదా కదన శిల్పం అపూర్వం ,అమోఘం ,అపారం .ఇన్ని విజయాలను స్వయం కృషి తో సాధించిన వాడు కాన్రాడ్ .తనకు ముందున్న తరాల జీవితాలను ,సత్యాసత్యాలను మన కళ్ళముందు నిలబెట్టిన ఘనుడు .ఒక రకం గా మన అడవి బాపి రాజు గారి లాంటి రచయిత కాన్రాడ్ రిచెర్ అనేక అవార్డులు రివార్డులు అందుకొన్నాడు13-10-1890లో జన్మించి 30-10-1968 న డెబ్భై ఎనిమిదవ ఏట మరణించాడు
.
31-10-2002నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుంచి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-8-14-ఉయ్యూరు