ది స్ట్రేంజర్

ది స్ట్రేంజర్

ఆల్బర్ట్ కామస్ రాసిన ‘’ది స్ట్రేం జర్’’నవల చదివాను .కామస్ ఫ్రెంచ్ అధీనం లోని అల్జీరియాలో 1913లో పుట్టాడు .అల్జీరియా యూని వర్సిటి లో చదివాడ ఆ యూని వర్సిటి ఫుట్ బాల టీం కి గోల్ కీపర్ గా ఉండి 1930లో టి బి.తో బాధ పడే దాకా ఆడాడు ..అక్కడి ముస్లిం ల దయనీయ స్తితులపై రాసినందుకు ప్రభుత్వాగ్రహానికి గురైనాడు .1935-38మధ్య మల్రాం ,డాస్తోవిస్కీ నాటకాలను దియేటర్ లో ఆడించాడు .రెండవ ప్రపంచ యుద్ధం లో ఫ్రెంచ్ రెసిస్టన్స్ మీద ‘’కాంబట్’’ అనే స్వంత పత్రికలో అనేక వ్యాసాలు రాశాడు .నాటక రంగ పై మహా అభినివేశం ఉన్న వాడు .ఆటను రచించిన ‘’ది స్ట్రేంజర్’’,’’దిప్లేగ్’’,ది ఫాల్’’’’,ఎమిలీ’’నవలలు విశేష ప్రాచుర్యాన్ని పొందాయి .1957లో సాహిత్యం లో నోబెల్ బహుమతి పొందాడు .1960జనవరి నాలుగున అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం లో కామస్నలభై ఏడవ ఏట  ప్రాణాలు కోల్పోయాడు .

కామస్ రచనలన్నీ విశ్వ వ్యాప్తమైనవే .’’అబ్సర్డిటి ‘’ని మహాద్భుతం గా పోషించిన రచయిత కామస్ .ఎందరికో ప్రేరణ ,స్పూర్తి .సాదా సీదా మనిషే .అల్జీరియా సముద్రపు బీచ్ పై  ‘’gets drawn into a senseless murder ‘’అని అభిప్రాయం వ్యక్తం చేశాడు .అంటే అసంభావ్యత (అబ్సర్డ్)ను మానవుడు నగ్నం గా ఎదుర్కొనే అంశం పై పరిశోధన .

మొదటి వాక్యమే తమాషా గా ఉంటుంది .’’Maman died today –or yesterday may be –I do not know –I got a telegram from the home –‘’mother deceased -funeral tomorrow –faithfully yours ‘’.That does not mean any thing .May be it was yesterday ‘’అని మొదలు పెట్టి రాస్తాడు .హత్య చేసినందుకు ఒక కుర్రాడిని జైలు లో పెడతారు .జైల్లో నిన్న మొన్న రేపు లకు అర్ధం తెలియదు. రోజులన్నీ ఒకే రీతిగా గడిచిపోతాయి కదా అదీ వాడి అంతర్యం .ఇక కోర్టులో నూ రోజూ అదే వాదన.దానికీ అంతూ దరీ లేదు .మార్పూ ఉండదు .ఏదీ తేలదు .తేల్చరు విసుగెత్తి పోతోంది ఆ జైలు కుర్రాడికి .

జైల్లో ఉన్న ఈ కుర్రాడిని చూసి ఒక ప్రీచర్ ‘’human justice was nothing and divine justice was every thing ‘’అంటాడు .ఆయన తో వాదించి ఈ కుర్రాడు ఉద్రేక పడతాడు .తనకోసం ఆ మత ప్రచారకుడు దేవుడిని ప్రార్దిస్తానంటాడు .దానికి ‘’do not waste your prayers for me ‘’అని కరాఖండీ గా చెప్పేస్తాడు కుర్రాడు .కానీ కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి .తన బాధ గురించి అనుకొంటాడు ‘’so close to death –Maman   just have felt free then and ready to live it all again .No body ,no body had the right to cry over her .  As if that blind rage had wasted me clean rid of me of hope for the first time .it was one and the same un ending day unfolding in my cell’’అనుకొంటాడు .నిన్నకు నేటికి రేపటికీ తేడా లేని తన జైలు జీవితాన్ని తలచుకొంటూ .సంఘర్షణ ,జీవిత చిత్రణ లో కామస్ కు మంచి పేరుంది .తనపై విచారించి శిక్ష వేసే హక్కు వాళ్లకు లేదనుకొన్నాడు ఆ అర్భక జైలు పక్షి . . .ఇతరులను విచారించి తీర్పు చెప్పటానికి ఎవరికీ అధికారం లేదనుకొన్నాడు .మానవాళి పై ప్రపంచానికి సానుభూతి సహవేదనా లేదనుకొన్నాడు .ఏదో రకం గా అధికారులతో లాలూచీ పడమనే ఈ సభ్య ప్రపంచాన్ని చూసి అసహ్యిన్చుకొన్నాడు ఆ కుర్రాడు.వాడి పేరే‘’మీర్సాల్ట్ ‘’ దిస్ట్రేంజర్ ‘’నవల పై కామస్ తన మనోభిప్రాయాన్ని ఇలా తెలియ జేశాడు –

In January 1955, Camus said, “I summarized The Stranger a long time ago, with a remark I admit was highly paradoxical: ‘In our society any man who does not weep at his mother’s funeral runs the risk of being sentenced to death.’ I only meant that the hero of my book is condemned because he does not play the game.”[3]

                  తల్లిచనిపోయినపుడు అంత్య క్రియలకు హాజరుకాని వాడు మరణ శిక్షకు గురై నట్లే లెక్క అని కామస్ భావించాడు .నిజ జీవితం లో కూడా కామస్ కు తన తల్లి అంటే మహా ప్రేమ ఆరాధనా ఉండేది .అదే ఇందులో చూపించాడు .అతని రచనలన్నీ అతని జీవిత భాగాలే .ఈనవలను ‘’ఫిలసాఫికల్ నవల ‘’గా గుర్తిస్తారు .

కామస్ ను అస్తిత్వ వాద రచయిత అంటారు కాని దాన్ని ఆయన ఒప్పుకోలేదు . “No, I am not an existentialist. Sartre and I are always surprised to see our names linked…”అని ఒక ఇంటర్వ్యు లో చెప్పాడు

అబ్సర్దిజం పై మిత్రుడికి నాలుగు ఉత్తరాలు రాస్తూ తన భావాలను తెలియ జేశాడు .ఇందులో ద్వంద్వాలన చావు ,పుట్టుక దుఖం సుఖం చీకటి వెలుగు తన రచనలలో ప్రతిబింబింప జేశాడు .మనిషికి చావు తప్పదు మనం మర్త్యులమే అని తెలిసినా మన జీవితాలకు ఎక్కువ విలువ నిచ్చుకొంటూ ఉంటాం .ప్రపంచం మనపై నిర్లిప్తత ప్రదర్శిస్తున్నా మన ధోరణి మారదు .ద్వంద్వాలలో బతుకుతూనే ఉంటాం. కాని పారడాక్స్ అంటే విరుద్ధత లేకుండా జీవవిన్చలేము .మన జీవితానికి ఒక పరమార్ధం ఉంది .దాని విలువను మనం అర్ధం చేసుకోవాలి .జీవితానికి అర్ధమేలేదని,విలువే లేదని అనుకొంటే మనం మనల్ని చంపుకొంటామా?అని ప్రశ్నించాడు .  Camus suggests that ‘creation of meaning’, would entail a logical leap or a kind of philosophical suicide in order to find psychological comfort

జీవితాంతం ‘’టోటలిటేరియనిజం ‘’మీద పోట్లాడుతూనే ఉన్నాడుకామస్  .సాత్రే తో మంచి సంబంధాలున్నా ఈ విషయం పై విభేదించాడు .మూక జన విప్లవాన్ని కామస్ సమర్ధించ లేదు .సోవియట్ యూనియన్ లో జరిగిన మానఃవ దానవ కాండను ద్వేషించాడు .హంగేరియన్ విప్లవ కారుల మీద ‘’రెడ్ షర్ట్ ‘’సైన్యం చేసిన దౌర్జన్యాన్ని నిరసించాడు కామస్ .TheStranger BookCover3.jpg  Image result for albert camusThe Stranger (1942)

అయిదు నవలలు ,ఆరు కదా సంపుటాలు ,ఏడు నాన్ ఫిక్షన్ రచనలు ,ఆరు నాటకాలు ,ఆరు వ్యాస సంపుటులు ,ఇతర రచనలు ఆరు రాసి ప్రచురించాడు ఆల్బర్ట్ కామస్ .కామస్ కు నోబెల్ ప్రైజ్ ఇవ్వటానికి కారణాలను ఆ కమిటీ కొద్ది మాటల్లో బాగా చెప్పింది , Camus was awarded the 1957 Nobel Prize for Literature “for his important literary production, which with clear-sighted earnestness illuminates the problems of the human conscience in our times”.[5]

3-10-2002 నాటి నా అమెరికా హూస్టన్ )డైరీ నుండి 


             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –22-8-14-ఉయ్యూరు

.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.