సంగీతం శబ్దమా? భావోద్వేగమా?

సంగీతం శబ్దమా? భావోద్వేగమా?

శబ్దాన్ని అర్థం చేసుకోవడం…మానవ వ్యవస్థను శబ్దంతో ప్రభావితం చేయడం అనే అంశాల గురించి నా ప్రయాణాల్లో వ్యక్తిగతంగా అభ్యసించాను. భారతీయ శాసీ్త్రయ సంగీతంలో ప్రాథమికంగా రెండు శాఖలు ఉన్నాయి. అవి దక్షిణ భారతదేశపు కర్ణాటక సంగీతం, ఉత్తర భారతదేశపు హిందుస్తానీ సంగీతం. హిందుస్తానీ సంగీతం ప్రాథమికంగా శబ్దం ఆధారంగా ఉంటుంది. కర్ణాటక సంగీతం భావోద్వేగాల ఆధారంగా ఉంటుంది. కర్ణాటక సంగీతంలో వారికి శబ్దాల గురించి అవగాహన లేదని కాదు. వారికీ ఉంది. కాని వీరి సంగీతంలో భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. మునుపటి రోజుల్లో అలా ఉండి ఉండక పోవచ్చు. కానీ గత 400 సంవత్సరాల్లో దక్షిణ భారతదేశంలో జరిగిన భక్తి ఉద్యమం కారణంగా కర్ణాటక సంగీతంలో భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న కర్ణాటక సంగీతం చాలా వరకు త్యాగరాజు లేదా పురందర దాసు వంటి భక్తులు రాశారు కాబట్టి, భావోద్వేగం ఈ సంగీతంలో రంగరించబడింది.
హిందుస్తానీ సంగీతం భావోద్వేగం కాకుండా కేవలం శబ్దాన్ని అవసరమైన విధంగా ఉపయోగిస్తుంది. హిందుస్తానీ సంగీతంలో వివిధ పద్ధతులలో సంగీతాన్ని ఉపయోగించే వివిధ విభాగాలు ఉన్నాయి. శబ్దంలోని లోతుని హిందుస్తానీ సంగీతంలో చూసినంత నిశితంగా ప్రపంచంలో ఇంకెక్కడా చూడలేదు. మీరు నేర్చుకోవటానికి, కచేరీలు చేయటానికీ కాకపోయినా, హిందుస్తానీ సంగీతాన్ని మీరు నిజంగా ప్రశంసించగలగాలి అంటే, మీరు కనీసం ఒకటి లేదా రెండు సంవత్సరాల పాటు శిక్షణ పొందవలసి ఉంటారు. ఇది కేవలం ఈ సంగీత విధానంలోని అందాలను అర్ధం చేసుకోవటానికి మాత్రమే. వారు శబ్దాలను ఎంత గొప్పగా ఉపయోగిస్తారంటే, మీరు కనుక నిజంగా వికసించదలచుకుంటే అవి మీకు అద్భుతమైన ఫలితాలనిస్తాయి.
శబ్దమంటే అర్థం ఏమిటి? మనం యోగాలో నాద బ్రహ్మ అంటాం. దాని అర్దం ‘శబ్దమే దైవం’ అని. ఎందుకంటే, ఉనికికి ఆధారం ప్రకంపనలో ఉంది. అదే శబ్దం. దీనిని ప్రతి మానవుడు అనుభవించగలడు. మీరు మీలో ఒక ప్రత్యేకమైన స్థితిలోకి వెళ్లగలిగితే, మీ మొత్తం ఉనికే ఒక శబ్దమవుతుంది. భారతీయ శాసీ్త్రయ సంగీతం ఆ అనుభవం, అవగాహనల నుంచి వచ్చింది. మీరు కనుక శాసీ్త్రయ సంగీతంలో లోతుగా ఉన్న వారిని గమనిస్తే, వారు సహజంగా ధ్యానంలోనే ఉన్నట్లనిపిస్తారు. వారు సాధువుల లాగా అయిపోతారు. అందుకనే సంగీతాన్ని వినోదంగా చూడరు. అది ఆధ్యాత్మిక సాధనలో ఒక పరికరం. ఒక వ్యక్తికి గ్రహణశక్తి, అనుభూతులలోని ఉన్నత పార్శ్వాలను రుచి చూపించడానికీ, అలాగే అంతర్గత వికాసానికీ ఈ రాగాలను ఉపయోగించారు. ప్రారంభంలో మీరు చేయ గలగిన సరళమైన పని ఈ మధ్య విడుదలైన శాసీ్త్రయ సంగీతాన్ని వినడం, శిక్షణ లేని వారు కూడా ఈ సంగీతాన్ని ఆనందించ గలిగే విధంగా  స్వల్పంగా సరళీకృతం చేశారు. ఉదాహరణకు ది మ్యూజిక్‌ టుడే సీరీస్‌లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి సమయాలకు అనుగుణంగా కొన్ని ప్రత్యేక రాగ సంగ్రహాలు ఉన్నాయి. అలాగే మీరు కొంతమంది అద్భుత సంగీతకారుల, ప్రముఖ కళాకారుల సంగీతాన్ని కూడా కొనుక్కోవచ్చు. వీరిలో చాలామంది మా యోగా సెంటర్‌కు వచ్చారు. ఇక్కడ ఈశా యోగా సెంటర్‌లో సంవత్సరానికి రెండుసార్లు కచేరీలు జరుగుతాయి.
. సద్గురు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.