ఆకాశ వాణి విజయ వాద కేంద్రం -సంచాలకులు శ్రీమతి కృష్ణ కుమారి గారికి నమస్తే —
అమ్మా – -ఈ రోజు ఉదయం రేడియో లో ఆంద్ర రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి ,తెలుగు వారి గుండెల్లో నిండి ఉన్నఆంద్ర కేసరి (ఆంద్ర కే ”సరి ) స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భం గా ప్రసారం చేసిన కార్యక్రమం చాలా ఉన్నతం గా ఉంది .ప్రకాశం గారితో అత్యంత సన్నిహితం గా ,ఆయనొక దేవుడిగా ఆరాధించి పూజారి అని పించుకొన్న మచ్చ లేని తెలుగు మాణిక్యం శ్రీ తెన్నేటి విశ్వ నాదం గారి గుండె చప్పుడు విని పులకకించి పోయాను . స్వార్ధం ఎరుగని నాయకుడు అంటే ప్రకాశం గారే .బదుగుల చీకటి జీవితాలపై” ఆసరా ”అనే ప్రకాశాన్ని ప్రసరింప జేసి గ్రామ స్వరాజ్యమే దేశానికి వెన్నెముక గ గుర్తిం ఛి మహాత్ముని ప్రశంసలు అందుకోన్నవాడు. ఆంధ్ర రాష్ట్రం లో ఆయన చేబట్టిన ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తం గా చేబట్టమని ప్రధాని నెహ్రూకు చెప్పమని అంటే ”ఇలాంటి వాటిని ప్రకాశం గారి లాంటి గుండె ధైర్యం ఉన్న వారే చేయగలరు నెహ్రూ కు ఆ సత్తా లేదు ”అని నిర్మొహమాటం గా ”ఆ బోసినవ్వులాయన ”చెప్పాడంటే ప్రకాశం గారి వ్యక్తిత్వం యెంత మహోన్నతమో అర్ధమవుతోంది ..ఈ నాటి వారందరికీ స్పూర్తి దాయకం గా ఉంది పూర్వపు రికార్డే అయినా సమయానికి తగినట్లు ఉపయోగించి ఆంద్ర కేసరి ని ఉదాత్తం గా గుర్తు చేసినందుకు ధన్యవాదాలు .దుర్గా ప్రసాద్