వడ్డెనల ఇడ్డేనలు

వడ్డెనల ఇడ్డేనలు

1-కొత్త అసెంబ్లీ లోనూ పాత హత్యల త్రవ్వుకోటాలేనా ?

 బురద జిమ్ము కొటాలేనా ? బఫూన్ లలా ప్రవర్తించ టాలేనా?

రాష్ట్రం దాని అభివృద్ధి మరచి ఇంకా గోతులు తవ్వుకోటాలేనా?

2-ఇంగిత జ్ఞానం తో ప్రవర్తించి

 రాష్ట్ర రధాన్ని ముందుకు సాగ నివ్వండి.

3-వై .ఎస్ ,కాలం నుంచి రగిలిన పగ అర్పేయండి

 ‘’కొడుకు ‘’ పాపం తండ్రిలేని  బిడ్డడు

  లక్ష కోట్ల అవినీతికి అధిపతి అని పదే పదే ఎద్దేవా చేయకండి

 అసలే అధికారం రాక మెంటల్ గా ఫీలవుతుంటే

 ఇంకా ఈ తుంటరి ప్రేలాపనలతో ‘’అవుట్ రేజ్ ‘’కానీకండి ప్లీజ్ .

4-మోడీ గారి షా భాగ్యనగర రంగ రంగ ప్రవేశం

  హారతులూ ,పూల జల్లులూ ,పొగడ్తల మెహర్బానీ లు

 ఏం చేసినా ఇక్కడిముస్లిం రాజ్యం లో  పాగా దక్కుతుందా ?అని దేహానికి సందేహం .

5-కేంద్ర బడ్జెట్ లో మనకు  ఏమీ’’ చేప’’లేదు

 మోడీది శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలు

 మన బడ్జెట్ మాత్రం ‘’వినోదం ‘’సినిమా లో

‘’ఉత్తుత్తి బ్యాంక్ ‘’లాగా ఉంది .

6-షేక్ హాండ్ ఇచ్చిన నవాబ్ ఇంతలోనే ఇచ్చాడు ‘’హాండ్ ‘’

 కౌగిలింత లోనే తుపాకి గురిపెట్టి కాల్చాడు సరిహద్దులో .

7-ప్రణాళిక సంఘం రద్దు,కోలీజియం రద్దు

 రద్దుకు ఇక మోడీకి లేదా హద్దు ?

8-హాయిగా సినిమా చేస్తాడట వర్ర్రీలన్నీ వదిలి ‘’చిరు’’

  చేసిన తప్పులకు లెంప లేసుకొని నటన చేస్తాడట  ‘’షురు ‘’ .

9-ఖద్దరు వైభోగం పోయి ‘’పచ్చ ‘శాల్తీలు’’ రంగ ప్రవేశం

  తినే వాళ్ళు మారారు కాని తినటం మారలేదని ఆక్రోశం .

10-అస్తినాస్తి విచికిత్స పాపం గవర్నర్ గిరి

   రెండు కాపురాలను దిద్డలేక సింహాన్ ‘’వరీ.’’

         మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-8-14-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.