”వాంటింగ్ ఫర్ గాడట్ ”సామ్యుల్ బెకెట్ నాటకం

వాన్టింగ్  ఫర్ గాడట్

ఫ్రెంచ్ రచయిత సామ్యుల్ బెకెట్ రాసిన నాటకమే పై శీర్షిక .దీనిని ‘’one of the most noble and moving plays of our generations ‘’అని కీర్తించారు .it is a threnody of hope deceived and deferred but never extinguished .a A play suffused with tenderness for the whole human perplexity  with phrases that come like a sharp staff of beauty and pain ‘’ అని లండన్ టైమ్స్ పత్రిక పొగిడింది .ఆ నాటకం కాలానికి ఉన్న ఊహను పట్టుకొన్నది .’’it is a seminal work of modern fiction and became a part of theatre history ‘’.బెకెట్ దీన్ని ఇంగ్లీష్ లోకి తానె స్వయం గా అనువాదం చేశాడు .గాడాట్ నాటకం(1953)లో  ‘’టాక్ ఆఫ్ పారిస్ ‘’అయింది .క్లాసిక్ నాటకం గా గుర్తింపు పొందింది . అయిన్స్టీనలిజం‘’కు ఈ నాటకం అద్దం పట్టింది .

కధలోకి వస్తే ఇందులోని రెండు పాత్రలు వ్లాడిమిర్ ,ఈస్త్రగాన్ లు’’ గాడాట్’’అనే వాడి రాక కోసం అంతులేని నిరీక్షణ లో ఉంటారు .వాడు రాక పోవటానికి కారణాలు ఎవరికి తోచినట్లు వాళ్ళు ఊహించుకొంటారు .1953లో రాయబడిన ఈ నాటకం ఇరవై వ శతాబ్దపు ఆంగ్ల నాటకాలలో ప్రముఖ స్తానాన్ని పొందింది .రెండు అంకాల ట్రాజిక్ కామెడి ఇది .బెకెట్ దీన్ని ఫ్రెంచ్ భాషలో 1948-49కాలం లోనే రాశాడు .పారిస్ లోని బాబిలాన్ దియేటర్ లో మొదటి సారిగా 5-1-1953న ప్రదర్శింప బడింది .రోజేర్ బలిన్ దర్శకత్వం వహించటమే కాకుండా పోజ్జో అనే పాత్ర కూడా వేశాడు .

గాడట్ ఎవరు అని దర్శకుడు రచయితా బెకెట్ ను అడిగితె ‘’ఫ్రెంచ్ మాండలికం లో బూటు’’అని చెప్పాడట .అంటే ఈ నాటకం లో పాదాలే ముఖ్య పాత్రను పోషిస్తాయి అని చెప్పకనే చెప్పినట్లు .గాడట్ అంటే దేవుడు (గాడ్)అని కొందరు భావించి దైవం కోసం నిరీక్షణ ఏమో అనుకొన్నారు అది పొరపాటు అని దేవుడే అని చెప్పాలనుకొంటే గాడ్ అనే పేరు పెట్టె వాడినని గాడట్అని పెట్టేవాడిని కాను అన్నాడు .తాను  ముందు ఫ్రెంచ్ భాషలో దీన్ని రాశానని ఆ భాషలో దేవుడికి ‘’డియు’’(Dieu) అని అంటారని చెప్పాడు .కాని బెకెట్ అంతరాంతరాల్లో ఎక్కడో దైవ భావన ఉండి ఉంటుందని చాలా మంది విమర్శకులు అభిప్రాయ పడ్డారు .ఒక అలౌకిక చేతన లో (ట్రాన్స్)లో ఉండి ఈ నాటకం రాశాడని అందరి భావనా .సాధారణం గా బెకెట్ నాటకాలలో సైకిల్ ఒక పాత్రగా ఉండటం అందరికి తెలిసిందే .ఇందులో బైసికిల్ లేదు .కాని ఒక సారి ఆయన్ను అడిగితె గాడాట్ అంటే ‘’వెటరన్ రేస్ సైక్లిస్ట్ ‘’అని చెప్పాడు .ఆతను గ్రామాలలో సైకిల్ మీద పరుగు పందాల కోసం తిరిగే ‘’రోజేర్ గాడ్యూ’’అనే  వ్యక్తీ అని చెప్పాడు .1943-61కాలం లో ఆయన ఒక ‘’ప్రొఫెషనల్ సైక్లిస్ట్’’అనీ అన్నాడు .కాని నాటకం లో సైకిల్ రేస్ గురించి ఏమీ లేదు .కాని ఆ నిరీక్షణ దైవ నిరీక్షణ కాదని ఆ సిక్లిస్ట్ కోసం బెకెట్ చేస్తున్న నిరీక్షణ అని కొందరు అర్ధం లాగారు .

ఈ నాటకం పై రాజకీయ, మత ,వేదాంత ధోరణులలో ఎవరి వివరణలు వారు చెప్పారు .దీనికి  అనేక ఇజం లను ఆలోచనలను,ఉద్యమాలను  అంటించారు .ఇందులో సైకో అనాలిసిస్ ,క్లాసికల్ ,యుద్దం  ,కర్మ కాండ ,వీటన్నిటి నుంచి భయం ఉన్నాయి .ఇందులోని పాత్రలు కామెడీగా నూ ,విషాదం గా ప్రవర్తిస్తాయి .’’నా రచన అనుభవ పూర్వకమైనదికాదు.నా అనుభవానికి రికార్డ్ కూడా కాదు ‘’అని నాటకానికి ముందే చెప్పాడు .ఇందులో ‘’ఎండ్లేస్ మిస్  అండర్ స్టాండింగ్ ‘’ఉంది అంటే అనంతం గా తప్పుడు గా అర్ధం చేసుకోవటం ఉందన్నమాట .పీటర్ వుడ్ త్రోప్ అడిగిన ప్రశ్నకు బెకెట్ ‘’అదంతా  సింబియోసిస్ –సింబి యోసిస్ మాత్రమె ‘’అన్నాడట .అంటే ‘’పరస్పర సహకార జీవనం ‘’అని అర్ధం .ప్రజలంతా హాయిగా ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో వ్యవహరిస్తే సమస్యలు ఉండవని యుద్ధభయం దూరం అవుతుందని శాంతి తో జనం జీవించవచ్చునని బెకెట్ భావన .

ఈ నాటకాన్ని షి ల్లర్ దియేటర్ లో బెకెట్ తానె దర్శకత్వం చేబట్టి 1975లో ప్రదర్శించాడు .ప్రదర్శన ‘’నాచురలిస్తిక్ ‘’గా లేదు అని అసిస్టంట్ డైరెక్టర్ అంటే బెకెట్ సమాధానం గా -It is a game, everything is a game. When all four of them are lying on the ground, that cannot be handled naturalistically. That has got to be done artificially, balletically. Otherwise everything becomes an imitation, an imitation of reality […]. It should become clear and transparent, not dry. It is a game in order to survive.”

అని  అన్నాడట

రెండవ ప్రపంచ యుద్ధం లో ప్రచ్చన్న యుద్ధానికి ‘’ఎలిగరి ‘’అని జేర్మన్ల ను  ఫ్రెంచ్ వారు  నిరోధించటం అని రాజకీయ అర్ధం చెప్పారు .బ్రిటన్ దేశం పై ఐర్లాండ్ దేశీయుల ‘’మెటఫర్ ‘’అంటే రూపకాలంకారం అనుకొన్నారు కొందరు .అధికార గణం సామాన్య ప్రజను అమాయకుల్ని చేసి ఒత్తిడి తీసుకు రావటానికి నిదర్శనం అన్నారు మరికొందరు .సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంత వివరణ అని ఇంకొందరంటే ,జన్గియన్ ఫిలాసఫార్లు ఇందులోని పాత్రలు ‘’ఈగో ,షాడో ‘’లకు ప్రతి రూపాలన్నారు .అస్తిత్వ వాదులు మానవ అస్తిత్వానికి ఇది పరీక్ష అన్నారు .అదేమీ  కాదు ఆల్బర్ట్ కామస్ చెప్పిన ’’అబ్సర్డ్ ‘’సిద్ధాంతానికి ప్రాతి పదిక అన్నారు  .నీతి వాదులు ‘’Godot  is compassion and fails to arrive every day ‘’.In this interpretation, there is the irony that only by changing their hearts to be compassionate can the characters fixed to the tree move on and cease to have to wait for Godot.

క్రైస్తవులు క్రిస్టియన్’’ క్రాస్’’ గాను ,ట్రీ ఆఫ్ లైఫ్ గాను ఊహించారు .గాడ్ అన్నా గాడట్ అన్నా ఒకరే అని తేల్చారు . “Christianity is a mythology with which I am perfectly familiar so I naturally use it.”[70] As Cronin (one of his biographers) points out, his biblical references “may be ironic or even sarcastic“..

ఫిలాసఫర్   రూసో చూపిన మార్గం అన్నారు ఆయన భక్తులు .బెకెట్ సాధారణం గా మహిళా నటులను అంగీకరించేవాడుకాడు .దానికి కారణం గా ‘’women do not have prostrates అని చెప్పేవాడు . ‘’

సామ్యుల్ బెకెట్ 13-4-1906లో ఐర్లాండ్ లోని ఫాక్స్ రాక్ లో పుట్టి 22-12-1989లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఎనభై మూడవ ఏట మరణించాడు .మోడర్నిస్ట్ లలో చివరి వాడుగా గుర్తింపు పొందాడు .మొదటి పోస్ట్ మోడర్నిస్ట్ గా కూడా భావిస్తారు .అతనిది ‘’దియేటర్ ఆఫ్ దిఅబ్సర్డ్ ‘’అని భావిస్తారు .సాహిత్య ప్రక్రియలన్నిటి లో సుప్రసిద్ధుడు .1969లో సాహిత్యం లో నోబెల్ బహుమతిని ‘’ for his writing, which—in new forms for the novel and drama—in the destitution of modern man acquires its elevation”.[కోసం పొందాడు 3]. He was elected Saoi of Aosdána in 1984.

సుమారు ఇరవై నాటకాలు ,ఎనిమిది నవలలు ,పదహారు వచన రచనలు ,ఏడు కవితా సంపుటులు ‘’సాహిత్య బకెట్ ‘’ నిండేట్లు వెలువరించిన గొప్ప రచయిత సామ్యుల్ బెకెట్

Samuel Beckett, Pic, 1.jpg   Waiting for Godot (1952)

.

6-10-2002బుధవారం  నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-8-14-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.