సోమర్సెట్ మాం

సోమర్సెట్ మాం

ఫారెస్ట్ డి .బట్ అనే రచయిత సోమర్సెట్ మాం అనే ప్రఖ్యాత ఆంగ్ల రచయితపై రాసిన పుస్తకం చదివాను .నూట నలభై అయిదు పేజీలున్న ఈ పుస్తకం నన్ను బాగా చదివించి అయన గురించిన విషయాలను తెలుసుకోనేట్లు చేసింది .ఆతను రాసిన ఒక కధను టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ పుస్తకం లో ఉంది .దాన్ని బోధించానుకనుక మరింత ఆకర్షణ ఏర్పడింది .ఆయన ‘’ఆఫ్ హ్యూమన్ బాండేజ్ ‘’అనే నవల రాశాడని నేను చెప్పేదాకా ఆ లెసన్ బోధించిన  టీచర్లకు ఎవరికీ తెలియదు .నేను చెప్పగానే ఆశ్చర్య పోయేవారు .కనపడిన ప్రతి టీచర్ కూ చెప్పేవాడిని .పాఠంచెప్పటమే కాని రచయిత గురించి లోతుగా మరిన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆలోచన ఉండేదికాదు చాలా మంది టీచర్లకు .

1874లో పారిస్ లోని బ్రిటిష్ ఎంబసీ లో జనవరి ఇరవై అయిదు న పుట్టాడు .తల్లి క్షయ వ్యాధితో ,తండ్రి కేన్సర్ వ్యాధితో చనిపోయి ,ఇద్దరినీ కోల్పోయిన  అభాగ్యుడు అయ్యాడు .పదవ ఏట పిల్లలు లేని  పెద తండ్రి  దగ్గరకు చేరాడు  .1907లో మెడిసిన్ చదివి డాక్టర్ డిగ్రీ పొందాడు కాని ప్రాక్టీస్ చేయలేదు .చిన్నప్పటి నుంచి ‘’నత్తి ‘’ఉండేది .చిన్నప్పుడు ఇతన్ని పెంచిన నర్సును ఇతని దగ్గర ఉండ నిచ్చేవాడుకాడు పెత్తండ్రి ..అందుకే ఒంటరి బతుకు గడపాల్సి వచ్చేది .’’ఆడపురుగు ‘’ కనపడక పోయేసరికి ‘’మగ పురుషులతో ‘’నే హోమో సెక్స్ చేసేవాడు .అదే జీవితాంతం అలవాటై దానికే అంకితమయ్యాడు .

పదమూడవ ఏట ‘’లిజా ఆఫ్ లామ్బెత్ ‘’నవల రాశాడు .చారిత్రాత్మక నవల ‘’మేకింగ్ ఏ సెయింట్ ‘’.రాసి ప్రసిద్ధుడయ్యాడు .’’లేడీ ఫ్రెడరిక్ ‘’నాటకం రాస్తే బాగా ఆడింది .1915లో ‘’ఆఫ్ హ్యూమన్ బాండేజ్’’అనే నవల తన జీవిత చరిత్రగా రాశాడు .విపరీతమైన విజయాన్నిచ్చింది .తరువాత ఏడాది ‘’మూన్ అండ్ సిక్స్ పెన్స్ ‘’నవలరచించాడు 1917లో టి బి .సోకింది .’’సిరీ ‘’అనే అమ్మాయిని పెళ్ళాడాడు .పెళ్లి ముచ్చట్లు తీరకుండానే విడాకులు .’’ది సంమింగ్ అప్ ‘’ డి రేజర్ ఎడ్జ్ ‘’నవలలు రాశాడు .దాదాపు ఆయన నవలలు కధలూ అన్నీ సినిమాలుగా తీశారు. అంతటి గిరాకీ ఉండేది .91ఏళ్ళు జీవించి 16-12-1965న ఫ్రాన్స్ లోని నైస్ వద్ద చనిపోయాడు .

ఎన్నో లఘు కదానికలు రాసి పేరు తెచ్చుకొన్నాడు .He is a man of the world not of living ‘’అని కీర్తిస్తారాయనను .ఇరవై వ శతాబ్దం లో బాగా ప్రాచుర్యంపొండాడు .ఆశతాబ్ది లో అధిక సంఖ్యాక పాఠకులను పొందిన అతి కొద్ది మందిలో ఈయనే గొప్ప. ‘’the grand old man of literature ‘’అని బిరుదు పొందాడు .ఎలిజ బెత్ మహా రాణి సోమర్ సెట్ మాం ప్రక్కన కూర్చోటానికి సిగ్గు పడిందట .అమెరికాలో ‘’మాం స్టడి సెంటర్ ‘’ఏర్పడింది .తన రచనలను అమెరికా కాంగ్రెస్ కు ధార పోసిన ఉదారుడైన రచయిత మాం .జీవిత చరమాంకం లో మతి చలించింది .తన ఆస్తిలో కొంత భాగాన్ని తన ‘’Male prostitute’’కు రాసిచ్చిన ఘనుడు .మాం కూతురు కోర్టుకు వెళ్ళింది .ఆమె గెలిచింది .’’purely for my pleasure ‘’అని తన ‘’ఆర్ట్ ‘’ను ఎలా సేకరించి భద్ర పరచుకోన్నదీ రాసుకొన్నాడు .

‘’I had  achieved what I wanted ‘’అని నిరూపించుకొన్న రచయిత మాం .రచనలన్నిటిని ‘’ఫస్ట్ పెర్సన్ నేరేటివ్ ‘’లో రాయటం మాం ప్రత్యేకత .గొప్ప ‘’కామెడీ ‘’నీ పండించాడు రచనల్లో .హ్యూమన్ బాండేజ్ ‘’గురించి –Of human bondage ‘’is superbly written ,ingenious in construction and framing with well drawn characters and expert use of the colloquial style .It is a human novel ,a satirical romance ‘’అంటారు .

సోమర్సెట్ రోజూ టైం ప్రకారం రాసేవాడు  . చనిపోయే దాకా రాశాడు . ఇలా కాలాన్ని పాటిస్తూ రచనలు చేసిన వారు బహు అరుదు .’’he gave artistic form to the experiences and emotions of life .He believed that a novelist should not teach or preach  but entertain .’’Art should always seen a pleasant accident .’’అని అభిప్రాయ పడేవాడు .తన వ్యక్తిత్వం లో మానసిక లోతులను స్పృశించిన రచయితా .దానితో అత్యున్నత శిఖరాలకు చేరాడు .ఆధునిక ఆంగ్ల సాహిత్యం లో ఆయన మేరు నగ ధీరుడు అని పించాడు .మాం జీవితకాం లోనే 65ఏళ్ళ పాటు పాతకులు చదివారు .ఇలా ఏ రచయితకూ దక్కని అదృష్టం మాం కు దక్కింది .

కమర్షియల్ విజయం సాధించి హాయిన విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాడు ,కాని విమర్శకులను ‘’లిరికల్ క్వాలిటీ ‘’లేనందున ఆకర్షించేలేక పోయాడు .అతనిది ‘’లిమిటెడ్ వోకాబ్యులరి ‘’అన్నారు .అమెరికన్ జర్నలిస్ట్ ,రేడియో ప్రొడ్యూసర్ అలేక్సాందర్  వూల్కాట్ మాం కు భాషపై కొన్ని మెళకువలు నేర్పుతానని రాస్తే  “The female implies, and from that the male infers.” Maugham responded: “I am not yet too old to learn.”[అని సమాధానం రాశాడు .యుద్ధ కాలం లో యుద్ధ విషయాలను ‘’ట్రావేలోగ్ ‘’గా రాశాడు .బ్రిటన్ లో సుదూర తూర్పు ప్రాంత జనాల గురించి ‘’కాలనిస్టూల ‘’పట్టించుకోక పోవటాన్ని గురించి రాశాడు .తన పేరు మీద ముప్ఫై ఏళ్ళ లోపు రచయితలలో  ఫిక్షన్ లో బెస్ట్ అయిన వారికి అవార్డులిచ్చాడు .ఆ రచన ఆ కిందటి ఎదాడిది అయి ఉండాలన్న నియమం పెట్టాడు .

   Inline image 1  Inline image 2Of Human Bondage (1915)

6-10-2002బుధవారం నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి 

            మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26-8-14-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.