జార్జి ఆర్వెల్

జార్జి ఆర్వెల్

సాంఘిక అన్యాయాలను వెంటనే ప్రశ్నించే ధైర్యం, తెగువ ఉన్న రచయితా జార్జి ఆర్వెల్ పై ‘’ఎవరిల్ గార్డినర్ ‘’రాసిన పుస్తకం చదివాను .సొసైటీ ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నాడు ఆర్వెల్ .వాస్తవికత కు ప్రాధాన్యం ఇచ్చి ఊహాత్మతను  దూరం చేశాడు .’’I believe before I am ‘’అన్న సిద్ధాంతం ఉన్నవాడు .అలాగే స్తూల ప్రపంచం ఉన్నది. దాని సూత్రాలు ,సిద్ధాంతాలు మారవు .రాళ్ళు గట్టిగా ఉంటాయి నీరు తడిగా ఉంటుంది ,ఆధారం లేని వస్తువులు భూమి కేంద్రం పై పడిపోతాయి అన్నవి ఎంతటి సత్యాలో అలాగే ప్రపంచ సూత్రాలుకూడా అంటాడు .

ప్రిచేట్ అనే గొప్ప విమర్శకుడు ఆర్వెల్ ను నీతి, నిజాయితీలు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తీ అని ,అందుకే సమకాలీనులలో స్పెషల్ గా కని పిస్తాడని చెప్పాడు .ఆస్కార్ వైల్డ్ అనే మహా రచయిత ‘’At fifty every  one has the face he deserves ‘’.ఈ మాట నిజం చేయటానికేమో అన్నట్లు యాభై ఏళ్ళు రాకుండానే 46ఏళ్ళ వయసులో 21-1-1950న చనిపోయాడు ఆర్వెల్ .

ఆర్వెల్ రాసిన ‘’యానిమల్ ఫాం ‘’అనే నాటకం ప్రపంచ ప్రసిద్ధి చెందింది .ఆ నాటి రాజకీయాలపై సంధించిన వ్యంగ్యాస్త్రం అది.ఆ కాలం నాటి రాజకీయ పరిస్తితులకు ,రష్యాలో జరుగుతున్న విధానాలకు దర్పణం .ఇందులో జంతువులే పాత్రలు .దీన్ని చదువుతుంటే పాను గంటి వారి సాక్షి వ్యాసాలూ జ్ఞాపకం వస్తాయి .ఆర్వెల్ అసలు పేరు ‘’ఎరిక్ ఆర్ధర్ బ్లైర్.’’కాని కలం పేరు ‘’జార్జి ఆర్వెల్ ‘’గానే ప్రసిద్ధుడు .ఇండియాలో ని బెంగాల్ రాష్ట్రం లో 25-6-1903 న జన్మించాడు .’’క్రిటికల్ ఎస్సేస్ ‘’ను 1984లో రాశాడు .అతని మరో మంచి రచన ‘’బర్మీస్ డేస్’’, దీనితో పాటు ‘’ఇన్సైడ్ ది వేల్ ‘’కూడా ప్రసిద్ధి చెందింది .గణ నీయమైన సంఖ్య లో కధలు రాశాడు .చాలా సార్లు క్షయ వ్యాధి తో బాధ పడ్డాడు .చివరికి ఆ వ్యాధితోనే మరణించిన దురదృష్ట వంతుడు .

‘’టోటలిటేరియనిజం ‘’ పై విరుచుకు పడ్డాడు ఆర్వెల్ .ఇంగ్లీష్ సంస్కృతికి రచనల్లో జీవం పోశాడు .సాహిత్య విమర్శ ,కవిత్వం వ్యాసాలూ ఇబ్బడి ముబ్బడిగా రాశాడు .స్పానిష్ సివిల్ యుద్ధంఅనుభవాల  పై ‘’హోమేజ్ టు కటలోనియా’’రాశాడు . భాషా సాహిత్యం పైనా ,సంస్కృతీ పైనా అనేక వ్యాసాలూ రాసి గుర్తింపు పొందాడు .1945నుండి ఉన్న యాభై మంది ప్రముఖ రచయితలలో’’ రెండవ ‘’వాడుగా ‘’టైమ్స్ ‘’పత్రిక ప్రకటించింది .రాజకీయ సంస్కృతిని రచనలలో ప్రతి బింబింప జేశాడు .టోటలిటేరియనిజం లేక ఆధారిటేరియనిజం కు మారు పేరుగా అతని పేర’’ఆర్వేలియన్  ‘’అనే పదం డిక్షనరీలో కోల్డ్ వార్ ,నియో లాజిజం పదాల తో బాటు చోటు చేసుకొన్నది .

ఎన్నో మేగజైన్ లలో కాలమ్స్ రాశాడు .జర్నలిస్ట్ గా లబ్ధ ప్రతిస్తుడు .ఆధునికులు ఆయన నవలలను నాటకాలను అత్యంత ఆపేక్ష తో చదువుతున్నారు .రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు రాసిన ‘’కమింగ్ అప్ ఫర్ ఎయిర్ ‘’ను ‘’the most English of his novels’’అంటారు .పూర్వపు ఆంగ్ల రచయితలూ తనకు ఆదర్శం అయినప్పటికీ తనను బాగా ప్రభావితం చేసిన వాడు ‘’సోమర్సెట్ మాం ‘’మాత్రమె నని చెప్పాడు ఆర్వెల్ .కధను సూటిగా’’సుత్తి లేకుండా’’ మనసుకు హత్తుకోనేట్లు రాసిన మహా రచయితా మాం అంటాడు .ఆయనే రచయితలలో తన ఆరాధ దైవం అన్నాడు నిర్మోహ మాటం గా  .అలాగే జాక్ లండన్ అనే రచయితా అన్నా ఇస్టమే నన్నాడు .అమెరికా జర్నలిస్ట్ అయిన ఆతను లండన్ లోని బీద ప్రజల జీవితాలను అధ్యయనం చేసిన తీరుకు హాట్స్ ఆఫ్ అన్నాడు .జాక్ రచనలు ‘’పాలిటిక్స్ వెర్సెస్ లిటరేచర్ ,’’యాన్ ఎక్సామినేషణ్ ఆఫ్ గలివర్స్ ట్రావెల్స్ ‘’తనను కట్టి పడే శాయన్నాడు .అలాగే ఎమర్సన్ ,గ్రాహం గ్రీన్ హీర్మాన్ మెల్ విల్లి ,మార్క్ ట్వేయిన్ ,జోసెఫ్ కాన్రాడ్ లు కూడా తనకు ఆదర్శం అంటాడు రుడ్యార్డ్ కిప్ప్లింగ్ ను యెంత మెచ్చుకోన్నాడో అంత గానూ  విమర్శనించాడు .కిప్ప్లింగ్ ను ‘’good bad poet’’అన్నాడు ధైర్యం గా .చెస్టర్ టన్ గొప్ప కవీ రచయితెకాని రోమన్ కేధలిక్ ప్రాప గాండిస్ట్’’అనేశాడు .

ఆర్వెల్ జీవితాంతం పుస్తక సమీక్ష లు చేస్తూనే ఉన్నాడు .వీటిని లెక్కించటం కష్టం .పి.జి వుడ్ హౌస్ జర్మనీ నుంచి మాట్లాడినదాన్ని అక్కడి అధికారులు స్వార్ధం కోసం ప్రాపగాండా కోసం వాడుకొని ఆయనొక’’ దేశ ద్రోహి ‘’అనే ముద్ర పడేట్లు చేశారని న్యాయానికి వుడ్ హౌస్ మాటల్లో అదేమీ కనిపించదని చెప్పాడు ఆర్వెల్ . When one reads any strongly individual piece of writing, one has the impression of seeing a face somewhere behind the page. It is not necessarily the actual face of the writer. I feel this very strongly with Swift, with Defoe, with FieldingStendhalThackerayFlaubert, though in several cases I do not know what these people looked like and do not want to know. What one sees is the face that the writer ought to have. Well, in the case of Dickens I see a face that is not quite the face of Dickens’s photographs, though it resembles it. It is the face of a man of about forty, with a small beard and a high colour. He is laughing, with a touch of anger in his laughter, but no triumph, no malignity. It is the face of a man who is always fighting against something, but who fights in the open and is not frightened, the face of a man who is generously angry—in other words, of a nineteenth-century liberal, a free intelligence, a type hated with equal hatred by all the smelly little orthodoxies which are now contending for our souls

ఆర్వెల్ ‘’ఇంటలెక్త్యువల్ ఆనెస్టి’’ఉన్న రచయిత.ఇంగ్లీష్ స్కూల్ కర్రిక్యులం లో ఆర్వెల్ రచనలకు చోటు కల్పించారు .సెకండరి ఎడ్యుకేషన్ ఫైనల్ పరీక్షకు ‘’యానిమల్ ఫాం ‘’తప్పక వాళ్ళు చదవాలి సిందే .డిగ్రీ ముందు పరీక్షలకు ‘’నైన్టీన్ ఎయిటీ ఫోర్ ‘’చదవాలి .ఆర్వెల్ రాసిన యానిమల్ ఫోరం నాటకం ఇరవై మిలియన్ కాపీలు అమ్ముడు పోయి రికార్డ్ సృష్టించింది .  in his essay Why I Write: ‘Every line of serious work that I’ve written since 1936 has been written directly or indirectly against Totalitarianism … dot, dot, dot, dot.’ “For Democratic Socialism” is vaporised, just like Winston Smith did it at the Ministry of Truth, and that’s very much what happened at the beginning of the McCarthy era and just continued, Orwell being selectively quoted.[105]

చాలాకాలం దరిద్రం తో ,అవమానం తో ,జీవన పోరాటం లో అలసి పోయి ఆర్వెల్ వీటినన్నిటిని తన రచనలలో నిక్షిప్తం చేశాడు .

Image result for george orwell   Animal Farm (1945)   Nineteen Eighty-Four (1949)  

The signature of George Orwell, reading "Eric Blair / ('George Orwell')

      6-10-2002-బుధవారం నాటి నాఅమెరికా (హూస్టన్ )డైరీ  నుండి –

          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27-8-14-ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.