ఆంటోని డీ సెయింట్ ఎక్సూపరి

ఆంటోని డీ సెయింట్ ఎక్సూపరి

జాయ్డి. డి ఏం .రాబిన్సన్ అనే రచయితా ‘’అంటోని డీ సెయింట్ ఎక్సూపరి అనే పైలట్ ‘’జీవితం పై రాసిన పుస్తకం చదివాను .ఎక్సూపరి ఒక విమాన పైలట్ .చాలా ధైర్య సాహసాలతో అనేక విన్యాసాలు చేశాడు ఎడారుల్లో విమానం కూలి పొతే అయిదు రోజులు నీళ్ళు ,ఆహారం లేకుండా గడిపాడు .సాధారణం గా ఎవరైనా ఏమీ తిన కుండా ఎడారిలో పద్దెనిమిది గంటలు మాత్రమె జీవించగలరు అని సైన్సు చెబుతోంది .కాని ఇతను  మృత్యుం జయుడిలా అయిదు రోజులు పోరాడి జీవించాడు .ప్రతి సారీ మృత్యు ముఖం లో పది బయటికోచ్చేవాడు .పందాలు కాసి విమానం నడపాలని చేసిన ప్రయత్నా ఫలితం ఇది .చివరికి గొప్ప ఆధ్యాత్మ భావన కలిగింది అతనికి .

దీంతో అనేక కధలు నవలలు రాశాడు .అన్నిట్లోనూ వేదాంతం ఒలక బోశాడు .ఇతను ఫ్రెంచ్ లోని పారిస్ లో29-6- 1900లోఫ్రాన్స్ దేశం లో  పుట్టాడు .కవితలు రాశాడు .యాత్రా సాహిత్యాన్ని హెర్బర్ట్ మేల్విల్లి లాగా సృష్టించి కీర్తిపొందాడు .’’నిశ్శబ్దమే దైవం ‘’అని నమ్మాడు .’’doubt is the ransom of God ‘’అంటాడు .దేవుణ్ణి నమ్ముతావా అని అడిగితె ‘’I can only recognize Him by his  resonance in me .He descends into the house as ‘’the duty of lighting candles’’అని నమ్మకం గా చెప్పాడు ‘’.కర్తవ్యమ్ లో మరణించాడు’’( died in action).అన్నారు అతన్ని రాసినది అంటా సింబాలిక్ గానే రాశాడు .అతని గురించి రచయిత ‘’He fulfilled his lonely crusade .Died like the old peasant .Loved his fellow men .his chivalric spirit stands there to guide man to fervent life .The essential of candle is not the wax which leaves traces ,but the flame .His radiant spirit shines still .’’అని చక్కని మాటలు రాశాడు .

ఫ్రాన్స్ దేశపు అత్యున్నత సాహితీ బహుమతులు అందుకొన్న రచయితా ఎక్సూపరి .నేషనల్ బుక్ అవార్డ్ పొందాడు .విమాన యానం పై ‘’విండ్ సాంద్ ,అండ్ స్టార్స్ ను ‘’నైట్ ఫ్లైట్ ‘’అనే నవలికలూ రాశాడు .రెండవ ప్రపంచ యుద్ధం ముందు అతనొక కమ్మర్షియల్ పైలట్ .యూరప్ ఆఫ్రికా అమెరి కా లను చుట్టి వచ్చాడు .యుద్ధం ప్రారంభం అయ్యాక ఫ్రెంచ్ విమాన దళం లో చేరాడు .ఆ దేశం తరఫున అమెరికా వెళ్లి నాజీ జర్మని ని ఎదుర్కోవటానికి ముందుకు రమ్మని దౌత్యం నడిపాడు .ఉత్తర అమెరికా లో సుమారు ఏడాది కాలం ఉండి గొప్ప రచనలు చేశాడు . ఉత్తర ఆఫ్రికాలో ఫ్రీ ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ ‘’లో చేరాడు .అనారోగ్యం గా ఉన్నా ఏజ్ బార్ అయినా ఈ సర్విస్ లో చేరాడు .1944జులై లో మధ్యధర ప్రాంతం లోవిమానం లో  విహరిస్తూ దారి తప్పి పోయాడు .ఎడారిలోనే చనిపోయి ఉంటాడని భావించారు .

‘’లిటిల్ ప్రిన్స్ ‘’అనే అతని రచన 250 భాషల్లోకి అనువదింప బడి రికార్డ్ సృష్టించింది .అతని మృత్యువుతో జాతీయ హీరో అయ్యాడు .అతని ఎన్నో రచనలు అంతర్జాతీయ కీర్తి పొందాయి .అంతర్జాతీయ మానవ సంస్థ కు చెందిన వ్యక్తిగా గౌరవింప బడ్డాడు .అతని పేర అనేక సంస్థలు వెలసి మానవాభ్యుదయానికి సేవలందిస్తున్నాయి .

‘’దిఏవిఏటర్ ‘’ సదరన్ మెయిల్ ,నైట్ ఫ్లైట్ ,ఫ్లైట్ టు అర్రాస్ ,ది లిటిల్ ప్రిన్స్ ,సెన్స్ ఆఫ్ లైఫ్ ,విండ్ సాండ్ అండ్ స్టార్స్ లను ఇంగ్లీష్ లో రాశాడు .లిస్టు ఆఫ్ డి లిటిల్ ప్రిన్స్ ఆడాప్తేషన్స్ అనేవి పాప్యులర్ కల్చర్ పై రాసినవి .అతని జీవితాన్ని సినిమా గా తీశారు .అతని మరణానంతరం పన్నెండు పుస్తకాలు ప్రచురితం అయ్యాయి .అతని మరణం మిస్టరి గానే మిగిలి పోయింది.విమానం కూలి పోయిందని ,ఎడారిలో ఏదీ దొరక్క చనిపోయాడని చాలామంది నమ్ముతున్నారు కాదు జర్మని వాళ్ళు విమానం పై కాల్పులు జరిపి చంపారనే కధనం కూడా ఉంది .ఏమైనా డ్యూటీలో ఉండి వీర మరణం పొందిన ఫ్రెంచ్ వైమానికుడు ఎక్సూ పరి  .సాల్యూట్ ఫర్ హిస్ బ్రేవరి  అండ్ మార్టిర్డం

.11exupery-inline1-500.jpg

వినాయక చవితి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-8-14-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.