కృతజ్ఞతలు
”పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ”గ్రంధాన్ని రాయటానికి నన్ను ప్రోత్సహించి ,రాస్తున్నవి బాగున్నాయని అభినదిస్తూ ,పుస్తక ముద్రణ ఖర్చు ను పూర్తిగా భరించి సరసభారతీ సాహితీ కార్యక్రమాలకు ప్రేరణ, ,స్పూర్తి నిస్తున్న ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి ,,ఈ పుస్తకాన్ని అంకితం పొందటానికి పెద్ద మనసు తో అంగీకరించిన కవి ,రచయిత ,వితరణ శీలి,,సరసభారతి ప్రోత్సాహకులు డాక్టర్ శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఏం డి . గారికి,, అంకిత మహోత్సవానికి శ్రీ శర్మ గారి తరఫున హాజరైన శ్రీ ఆర్ .యెల్ యెన్ .ప్రసాద్ (శ్రీ రావి శాస్త్రి గారి కుమారులు ) గారికి , క్షణం తీరిక లేని వైద్య వృత్తిలో ఉంటూ ,అనేక గ్రంధాలనురాసిన ఆంధ్రాంగ్ల సంస్కృత సాహితీ సంపన్నులు మేము కోరిన వెంటనే మన్నించి ఈ గ్రంధానికి ముందు మాట గా ”కీర్తి చంద్రికలు ”పేరిట సమీక్ష రాసిన ప్రముఖ వైద్యులు శ్రీ లంకా శివరామ ప్రసాద్ గారికి , ,ఈ గ్రంధాన్ని తమ అమృత హస్తాలతో ఆవిష్కరిస్తున్న తెలుగు భాషా సంస్కృతీ ఆరాధకులు ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఉప సభా పతి గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారికి ,,ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిధులుగా విచ్చేస్తున్న శాసన మండలి మాజీ సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ గారికి ,కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తి కొండ సుబ్బా రావు గారికి ,ముఖ్య కార్య దర్శి డా జి .వి. పూర్ణ చంద్ గారికి ,రమ్య భారతి మాస పత్రిక సంపాదకులు శ్రీ చల పాక ప్రకాష్ గారికి, ఈ కార్య క్రమాన్ని తమ కళాశాలలో విద్యార్ధుల సమక్షం లో నిర్వహించటానికి అనుమతించిన ఎ జి అండ్ ఎస్ జి .సిద్ధార్ధ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కొడాలి సత్య నారాయణ గారికి వారి అధ్యాపక అధ్యాపకేతర బృందానికి , కళా శాల యాజమాన్యానికి ,,విద్యార్ధినీ విద్యార్ధులకు కృతజ్ఞతలు ..
ఈ గ్రంధాన్ని ఇంత ముచ్చటగా ముద్రించటానికి మా బాధ్యతను తానే స్వీకరించి అహరహం కృషి చేసి న శ్రీ చలపాక ప్రకాష్ గారికి వారి బృందానికి కృతజ్ఞతలు ..
”పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ” గ్రంధ రచనకు తోడ్పడిన గ్రంధాలు
1-Louis Untermeyer రాసిన Lives Of the Poets
2-Encyclopedia of Literature -Edited by Joseph T..Shiplay
3-ఇంగ్లీష్ వీకీ పీడియ
4-Encyclopedia Britannica
మొదలైనవి
అంతర్జాలం లో రాసినపుస్తక శీర్షిక తోరాసిన యాభై అయిదు భాగాలను చదివి ప్రోత్సహించిన సాహిత్యాభిమానులకు క్కృతజ్నతలు
. మేయర్ గ్రంధాన్ని ఆధారం గానే ఈ పుస్తకాన్ని రాసినా అందులో లేని ఎన్నో విషయాలను ,ఆయా కవుల ప్రత్యేకతలను మిగిలిన వాటి నుండి గ్రహించి తగిన శీర్షిక ను పెట్టి వారి ప్రత్యేకతను తెలియ జేశాను . ఆకవుల మరణానంతరం వారి పై జరిగిన పరిశోధనలను ,వివిధ దేశాలు వారిని గుర్తుంచుకోవటానికి నిర్వహించిన కార్యక్రమాలను కూడా పొందు పరచాను ..సాహిత్యాభిమానం తోనే కాక సరదాగా కూడా చదువుకోవటానికి వీలుగా ,ఆకర్షణీయం గా ఉండటానికి ”ముచ్చట్లు ”అన్నాను .
సరసభారతి గౌరవాధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారికి ,కార్య దర్శి శ్రీమతి మాది రాజు శివ లక్ష్మికి ,కోశాధికారి జి.వి రమణ కు మిగిలిన కార్య వర్గ సభ్యులు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను .
గబ్బిట దుర్గా ప్రసాద్
అధ్యక్షులు -సరసభారతి
సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు