విదేశాలలో వినాయకుడు

విదేశాలలో వినాయకుడు

పశ్చిమ ఆఫ్రికా లో ముస్లిం పాలన ఉన్న ఐవరీ కోస్ట్ దేశం  2013 వినాయక చవితి సందర్భం గా 25గ్రాముల బరు ఉన్న శ్రీ గణేశుని బొమ్మ ఉన్న  1,001వెండి నాణాలను ముద్రించింది .బంగారు రంగున్న వినాయకుని వాహనం అయిన మూషికం ఆకారం ఉన్న చిన్న బాక్స్ లో ఉంచి విడుదల చేశారు .అక్కడి ముఖ్య పట్నం లో నాణాల సేకరణలో అభిరుచి ఉన్న డి.సత్య బుద్దు అనే ఆయన 8,001రూపాయలు చెల్లించి ఆ నాణాన్ని స్వంతం చేసుకొన్నాడు .ఈ నాణెం పబ్లిక్ లో చలామణీ చేసే నాణెం కాదు .భద్ర పరచుకోవటానికి మాత్రమె .ఆ సిటీ గైన కాలజిస్ట్    శ్రీమతి కే.రామ లక్ష్మి గనేశుని రెండు నాణాలు కొని ఒకదాన్ని సత్య బుద్దు గారికి కానుకగా అంద జేసింది .వినాయకుడు రావి ఆకుపై ఉండేట్లు గా నాణెం తయారు చేసి కింద  సంస్కృతం లో ‘’వక్ర తుండ ‘’అని  రాశారు .

వినాయకుడు వివిధ దేశాలలో పూజలందుకొంటున్నాడు .భక్తీ తో ప్రజలు దేవాలయాలు నిర్మించి నిత్య పూజాదికాలు నిర్వహిస్తున్నారు .ఒకరకం గా ఇప్పుడు గణేశుడు ప్రపంచ ప్రసిద్ధ ‘’ఐకాన్ ‘’అయి బుద్ధుడిని మించిపోయాడని మీడియా తెలియ జేస్తోంది .ఓంకార స్వరూపం లో విఘ్నేశ్వరుడు మొదటి మూర్తి అని స్వయంభు అని అంటారు .చెట్ల కాండాలలలో గణపతి ఆకృతులు కనిపిస్తాయి .అక్కడే స్వామిని దర్శించి తరిస్తున్నారు .ఇందుగలడు అందు లేడుఅనే సందేహమే లేదిప్పుడు .రుద్రాక్షలలో ,జాతి రాళ్ళలో ,పూసల్లో పార్వతీ నందనుడు ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు .ఎక్కడ తొండం ఆకారం లో గణేశ రూపు కనిపిస్తే అక్కడికే వెళ్లి దర్శనం చేసుకొని తరిస్తున్నారు .

ఆగ్నేయ ఆసియా లో వక్రతుండుని అర్చన మొదటినుంచి ఉన్నదని మనకు తెలుసు .మెక్సికో ,దక్షిణ అమెరికా ,ఇరాన్ ,దక్షిణాఫ్రికా దేశాలలో మధ్య యుగం నుండి మంగళ గౌరీ తనయుని పూజ జరుగుతూనే ఉంది .ప్రపంచ వ్యాప్తం గా ఉద్యోగాన్వేషణకోసం వెళ్లి స్తిరపడ్డ భారతీయులు అక్కడ దేవాలయాలు కట్టి వెనకయ్యను కొలుస్తున్నారు .ఇప్పుడు ఆస్ట్రేలియా జర్మని ఫ్రాన్స్ మొదలైన దేశాలలో నూ గణేశ సంస్కృతీ పెరిగి ఆరాధన ఎక్కువైంది .లండన్ ,న్యూయార్క్ ,పారిస్ ,డర్బన్ ,.మెల్బోర్న్ ,ఎడ్మన్టన్ సిటీలలో అపూర్వ ఆధునిక విఘ్నేశ దేవాలయాలు వెలిసి భక్తులను ఆకర్షిస్తున్నాయి .బౌద్ధ దేశమైన శ్రీలంక లో పద్నాలుగు గణపతి దేవాలయాలు జాఫ్నా అలవెడ్డి,బట్టిక లోమా ,కొలంబో కాండీ ,కతార్గామా మొదలైన చోట్ల ఉన్నాయి అంటే ఆశ్చర్యమేస్తుంది .కొలంబో లోని కలానియా గంగానది ఒడ్డున ప్రసిద్ధ బౌద్ధ దేవాలయం పై అనేక గణేశ చిత్రాలు ,వాక్యాలు చిత్రీక రింప బడి ఉండటం తమాషా గా ఉంటుంది .ఈ నాడు శ్రీలంకలో దాదాపు ప్రతి ఇంటిలో గణేశ విగ్రహాలు పెట్టుకొని ,సర్వ సిద్ధి కలగాలని ప్రార్ధించటం ఒక ఆచారమై పోయింది .

నేపాల్ దేశం హిందూ దేశం అయినా అక్కడ తాంత్రిక ఆరాధన ఎక్కువ .ఆ దేశం లో ఉండే శూర్ప కర్ణుని విగ్రహాలలో  కళ్ళు ఒక వైపుకు తిరిగి నట్లు కనిపిస్తాయి. ఇదొక విశేషం .బర్మా ,కంబోడియా ,సియాం ,ఇండోనేషియా దేశాలలో చాలా ప్రసిద్ధ మైన చారిత్రాత్మక హిందూ దేవాలయాలు ప్రపంచ పర్యాటకులను విశేషం గా ఆకర్షిస్తున్నాయి .రెండవ శతాబ్దానికి చెందినా బర్మా లోని బాగాన్ సామ్రాజ్యం 1057 స్వర్ణ యుగాన్ని సృష్టించింది .అప్పుడు అక్కడ 13,000దేవాలయాలు ఉండేవి .కుబ్లాయ్ ఖాన్ 1287లో మా ముఖ్య పట్టణాన్ని ఆక్రమించాడు .వరదలు ,భూకంపాలు ,మొదలైన ప్రక్రుతి వైపరీత్యాల తో చాలా దేవాలయాలు నాశనమై ఇవాళ 2,200మాత్రమె సజీవ సాక్ష్యం గా నిలిచిఉంనాయి .ఇందులో ఒక విశేషం ఉంది .ఈ ప్రాంతం అంతా యూరప్ కు చెందినా కేధలిక్కుల హయాములో ఉండటం . ప్రతి దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద హేరంబుని విగ్రహాలు ఉండటం విశేషం కూడా .వీటిలో 1957లో రాజు అనవ్రతుడు కట్టించిన ‘’శ్వేశాండ ‘’దేవాలయం ను మాత్రమె గణేశ దేవాలయం గా భావిస్తారు .దీనికి కారణం ఆలయం నాలుగు మూలల వినాయక విగ్రహాలున్డటమే .మానస్ వంశ రాజుల కులదైవం గణేశుడే .దక్షిణ భారత పరిపాలకులైన చోళ రాజుల ప్రభావం ఇక్కడి దేవాలయాలపై ఉండటం వలననే అక్కడి ప్రతి దేవాలయం లో గణపతి బప్పా విగ్రహాలు ఉన్నాయి అని చారిత్రక విశ్లేషకులు తెలియ జేశారు .యునెస్కో వారి సర్వే  ప్రకారం కాంభోజ దేశం అయిన నేటి కాంబో డియా లో అంగ కోర్ వాట్ లోని అనేక హిందూ దేవాలయాలున్నా విఘ్నేశుని ఆరాధనే ఎక్కువగా ఉండేదని తెలుస్తోంది .

జావా ,సుమత్రా ,ఇండో నేషియా బాలి ద్వీప దేవాలయాలలో సింహ భాగం గజాననుని ఆలయాలే .మిగిలినవి శివ దుర్గ ,మహిషాసుర మర్దిని లకు చెందినవి .వీటిని ఏడు ఎనిమిది శతాబ్దాలలో హిందూ రాజులే నిర్మించారు .తూర్పు జావాలోని తులసి కాయో గ్రామం లో ఉన్న ‘’బారా దేవాలయం ‘’లో భారీ గా మూడు మీటర్ల ఎత్తున్నశివ తనయుడైన వినాయక విగ్రహం ఉంది .తొమ్మిదో శతాబ్దిలో కట్టిన రాతూ బాకా దేవాలయం లో ఇప్పటికీ అసంపూర్తి గా  ఉన్న గణాది నాయకుని విగ్రహం ఉంది .ఇవాళ ఇండో సేషియా ముస్లిం ల పాలన లో ఉంది .కనుక బాలి లో తప్ప మిగిలిన చోట్ల గణేశ  ఆరాధన  నిషేధింప బడింది .దీనికి విరుద్ధం గా బౌద్ధ దేశం అయిన తాయ్ లాండ్ లోని బాంకాక్ దేవాలయం లో మహాశివరాత్రికి వినాయక స్వామి దేవాలయాన్ని భక్తులు అశేష సంఖ్యలో సందర్శిస్తారు .కాని ఇక్కడిపూజా విధానం మన ప ద్ధతికి  భిన్నం గా ఉంటుంది .వీరి భాషలో అనేక తమిళ పదాలు వచ్చి చేరాయి .

మాలే లో పెటలింగ్ ,జావా ,కౌలాలంపూర్ మొదలైన చోట్ల అనేక వినాయక గుడులను హిందూరాజులు నిర్మించారు .మారిషస్ ,సింగపూర్ లలోనూ ‘’కుమారస్వామి తమ్ముడి’’ దేవాలయాలు ఉన్నాయి .మెక్సికో ,గ్వాటిమాలా ,పెరూ ,బొలీవియాలో సంపన్నమైన గణేశ ,విష్ణు ,సూర్య హనుమాన్  హిందూ దేవాలయాలున్నాయి .మెక్సికో లోని త్రవ్వకాలలో అనేక గణేశ విగ్రహాలు బయట పడ్డాయి .అక్కడి వ్రాత ప్రతులలో గణేశ పూజా విధానం  ఆజ్తెక్ సంస్కృతిలో భాగం గా  ఉన్నట్లు తెలుస్తోంది .రక్షక దేవునిగా ఇక్కడ గనేశుని భావించి పూజిస్తారు .ప్రాంతం ,ఆచారం లను బట్టి గనేశుని విగ్రహాల రూపాలు మారిపోయాయి .తాంత్రిక పూజా విధానం ఉన్న దేశాలలో గణపతి హస్తాలలో విచిత్రమైన మొక్కలు దర్శనమిస్తాయి .కొన్ని చోట్ల తలపాగా తో వస్త్రాలతో దర్శన మిస్తాడు .మెక్సికో మధ్య అమెరికాలలో వినాయకుడు ఆజ్తెక్ సంస్కృతీ ననుసరించి వదులు దుస్తులు ధరించి ఉంటాడు .హవాలీలో ఆయన్ను ‘’లోనో ‘’అని ,దక్షిణ భారతం, శ్రీ లంకలలో పిల్లైయార్ (పిల్ల దేవుడు )అని ,పిలుస్తారు .టిబెటన్లు ‘’చోగస్ బ్దాగ్ ‘’అంటారు .బర్మీయులు ‘’మహా పియన్నీ ‘’అని ,మంగోలులు ‘’తోకారోర్ ఖగన్ ‘’అని , కాంబో డియన్లు ‘’ప్రహ కినీస్ ‘’అని ,జపనీయులు ‘’శో టెన్ ‘’లేక వినాయక అని పిలుస్తారు .

రోమన్ లు గనేశుని ‘’జానస్ ‘’అని పిలిచేవారని చరిత్ర చెబుతోంది .అంటే శుభానికి ప్రారంభకుడు అని అర్ధం .అందుకే వాళ్ళు సంవత్సరం లో మొదటి నెలకు జనవరి అని పేరు పెట్టారట విలియం జోన్స్ అనే ప్రముఖ రచయితరోమన్ దేవుడు రెండు ముఖాల వాడు అయిన జానస్ కు మన రెండు దంతాల గణేశుడికి ఉన్న పోలికలను విశదీకరించాడు .గణేశుడిని ‘’జానస్ ఆఫ్ ఇండియా’’అన్నాడు .ద్విముఖ గణపతి కి రెండు తలలలో ఒకటి ఏనుగు తల కుడి వైపుకు చూస్తున్నట్లుగా , రెండవది మానవ శిరస్సు తో ఎడమ వైపు చూస్తున్నట్లుగా ఉంటాడు .నాలుగు చేతులు ఉంటాయి .గణేశుని రోమన్లు పూజించారో లేదో అన్న విషయాన్ని జేమ్స్ చెప్పలేదు .జానస్ వినాయకుడుగా మారాడా లేక గణేశుడే జానస్ గా మారాడా అన్నదీ తేల్చేలేదు .ఎడ్వర్డ్ మూర్ కూడా జోన్స్ మాటను సమర్ధించి జానస్ ద్వార పాలకుడైన దేవత అన్నాడు .’’శ్రీ తత్వ నిధి’’ అనే గ్రంధం లో వర్ణింప బడిన 32గణేశ రూపాలలో ఒక ముఖం యేనుగుది రెండవ ముఖం మానవునిది అయిన రూపం లేదు .

జైనులు గణపతిని ఆరాధిస్తారు ఆయన కుబేరుని నుండి కొన్ని శక్తులు పొందాడని వారి నమ్మకం . జైన గ్రంధం అభిదాన చింతామణి అనే గ్రంధం లో హేమచంద్రుడు హేరంబ , గణ విఘ్నేశ ,వినాయక వినాయకులను ఎలుక వాహనం తో బానెడు పొట్టతో ఉన్నట్లు వర్ణించాడు రాజస్థాన్ ,గుజరాత్ జైన దేవాలయాలలో గణపతి ప్రతిమలు కనిపిస్తాయి .గుప్తులకాలం నాటి బౌద్ధ దేవాలయాలలో నృత్య గణపతి  విగ్రహాలున్నాయి .టిబెట్ దేశం లో మహా రక్త గణపతి నృత్య గణ పతి కనిపిస్తారు .అవలోకితెశ్వరుని రూపమే గణపతి గా వారి గ్రంధాలలో ఉంది .చైనా జపాన్ లలో కూడా గణేశ సంస్కృతీ 806ceలో ఉన్నట్లు గ్రంధాలు తెలియ జేస్తున్నాయి.జపాన్ బుద్ధిజం లోని ”శిన్గాన్ ”వర్గం వారు గణపతి ని ”గానాపత్య ”విధానం లో ఆరాధించారు . జపాన్ రాజ దాని టోక్యో 131దేవతా విగ్రహాలలో100 గణేశుడివే గణేశసహస్ర నామాలలో బుద్ధ అని కూడా ఉంది

.విశ్వ వ్యాప్తం గా బౌద్ధులు జైనులు సిక్కులు గణేశుని సర్వ శుభ దాయకుని గా పూజిస్తున్నారు .ఇలా వివిధ దేశాలలో వినాయకుడు అందరి హృదయాలలో నిండి ఉండి విఘ్న నివారకునిగా ,సర్వ శ్రేయో దాయకునిగా ,సంరక్షకుని గా ,వరసిద్ధిని వెంటనే కలిగించే దేవునిగా ఆరాధింప బడుతున్నాడు .

   

  

  

 

వినాయక చవితి ,మరియు మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-8-14-ఉయ్యూరు .

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.