మా-బాపు -రమణ ల సందర్శనం దృశ్యమాలిక

మైనేని గోపాల కృష్ణ (USA)

బాపు గారి కళా జీవిత భాగస్వామి ఆయన్ను వదిలి వెళ్లి పోవటం ఆయనకు,మనకు బాదే.

తెలుగు హాస్యాన్ని కొత్త మార్గం పట్టించిన వాడాయన.చురుకు,మెరుపు వున్న సజీవ హాస్యమది .ఆయన రాసినవన్నీ హాస్య గుళికలే .అదేదో ఆయన రాసాడని, మనం చదువుతున్నామని అనిపించదు.అందులో మనమే వున్నామనే ఫీలింగ్ కల్గుతుంది .అరవయట  ఏళ్ళకు పయిగా ఆ జంట కాపరం చేసి బంగారపు పంట పండించారు .

మీ వల్ల బాపు ,ramanalanu చూసే భాగ్యం కలిగింది .ఇవన్ని ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాయి .2oo8 december  21  న వుయ్యూరు లో ప్రముఖ ఆర్ధిక వేత్త ఆరికపుడి ప్రేమ చంద్గారి సన్మాన సభ వుయ్యురులో మీ సహకారంతో ఏర్పాటు చేసినప్పుడు

నేను మా శ్రీమతి ప్రభావతి మద్రాస్ వెళ్తున్నట్లు మీకు తెలిసి బాపు రమణ గార్లను చూసే,మాట్లాడే అవకాసం మీరే కల్పించారు .ముందుగ వారిద్దరి తో మాట్లాడి వారిని కలిసే సమయాన్ని ఫిక్స్ చేసారు .మీ బంధువు రోజా గార్ని స్టేషన్ కు వచ్చేట్లు చేసి అ.చ.(ఏ.సి )కారులో మమ్మల్ని మా మేనల్లుడి ఇంటి దగ్గర కు చేర్చే ఏర్పాటు చేసారు మీరు .ఆ సాయంత్రం రోజా గారు మమ్మల్ని బాపు రమణల ఇంటికి తీసుకు వెళ్లారు.

మా కోసం ఎదురు చూస్తూ బాపు గారు వీధి లోకి వచ్చి మమ్మల్ని లోపలి ఆహ్వానించి తీసుకు వెళ్లారు .కమ్మని కాఫీ వారి శ్రీమతి గారు కలిపి ఇచ్చారు .అప్పుడు మా ఆవిడ బాపు గారి చిత్రం గొప్పద,ఈ కాఫీ గొప్పద ఆంటే చెప్పలేం అన్నది ముసిముసి నవ్వులు నవ్వారు బాపు .

బాపు రమణలు బాపు రమణలు

అప్పటికే ఆయన సంతకాలతో .వున్న పుస్తకాలూ న్న ద్వార వుయ్యూరు లైబ్రరీ కి కానుకగా ఇవ్వమని ఇచ్చారు .తన స్టూడియో అంతా దగ్గరుండి చూపించారు ఫోటో లు తీసుకున్నాం ;

వుయ్యూరు లైబ్రరీ కి కానుక

”మీకు కార్టూనిస్ట్ గానే గుర్తింపు వచ్చింది చిత్రకారునిగా ఎందుకు గుర్తింపు రాలేదని అడిగాను .నాకు .అక్కడే సందేహం అని నవ్వారు .

అక్కడినుంచి పయి అంతస్తు కు మమ్మల్ని వెంట పెట్టుకొని వెళ్లి రమణ గారిని పరిచయం చేసారు .అక్కడ అందరం కలిసి ఫోటోలు తీసు కున్నం.మేము వెళ్లేసరికి రమణగారు చేతులకు excercise.చేస్తున్నారు.

ప్రభావతి (నా భార్య)ప్రభావతి (నా భార్య)

మైనేని గోపాల కృష్ణ గారు మేము అమెరికా లో వుండగా మీ కోతి కొమ్మచ్చి పోస్ట్ లో పంపితే చదివానని,తెలుగు జనంతో కోతి కొమ్మచ్చు లాడే గడసరి మీరు ఆంటే నవ్వారు రమణ.తన భార్య కృష్ణ జిల్లాకు చెందినా వారె నని పరిచయం చేసారు ఆమె మా జిల్లా ఆడపడుచేనని అన్నా.అంతా నవ్వుకున్నాం .

ఆయన గది అంతా తిప్పి చూపించారు.వారిద్దరిని జీవితం లో చూడగలమ అనుకొన్నాం మీ వల్ల ఆ కల సాక్షత్కారం అయింది .బాపు,రమణను చూస్తే వారి కుటుంబాలను చూస్తే స్వంత బంధువులను chusinatanipinchindi .

బాపు రమణలు సొంత అన్నదమ్ముల కంటే ఆప్యాయం గా వున్నారు వారి స్నేహ షష్టి పూర్తిని చిట్టెన్ రాజు హైదరాబాద్ లో చేస్తే చూసాను ఇద్దరు ఆటోగ్రాఫ్ లు ఇచ్చారు ఫోటోలు తీయించుకున్నారు .ఇద్దరు దంపతుల పాదాలకు వెళ్ళిన వాల్లమందరం వొంగి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాం .

 దుర్గా ప్రసాద్ దుర్గా ప్రసాద్

గొప్ప అనుభూతి అది మాటల్లో కొద్దిగానే చెప్పగలిగాను.హృదయమంత వారి సౌహార్దం నిండిపోయింది .ఆ బంధం ఆ ఋణం తీర్చుకోలేనిది .మళ్లి రండి .వస్తుందండీ అని ఆ దంపతులు శాశ్వత ఆహ్వానాన్ని అందిచారు

ఉప్పొంగిన ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాము మొన్న పొద్దునే మైనేని వారు చెప్పగా బాపు గారు నాకు పంపిన గుటాల కృష్ణముర్తి గారు compile చేసిన అతి విలువయిన టంగుటూరి సూర్యకుమారి పుస్తకం అందింది వెంటనే బాపు గారికి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పా చాల సంతోషించారు.ఇంతలోనే ఆయనకు ఈ విషాదం.జీవిక జీవులు గా మెలగిన జంట .స్నేహానికి నిర్వచనం ,ఆదర్శం బాపు ,రమణ

బాపు గారితోబాపు గారితో

దుర్గా ప్రసాద్

http://picasaweb.google.com/lh/sredir?uname=gabbita.prasad&target=A

 

బాపు -రమణ గార్లతో మా భేటి -మీ సౌజన్యం తో

 

నమస్తే  గోపాల కృష్ణ  గారు

ముళ్ళపూడి జ్ఞాపకాలు ఇంకా తొలుస్తూనే వున్నాయి .
2008 డిసెంబర్ లో బాపు రమణలను మద్రాస్ లో వారింట్లో చూసినపుడు వారిద్దరూ మా ఇంటి పేరు తెలుసుకొని గబ్బిట వెంకట రావు గారు మీకు బంధువు లేనా  అని అడిగారు మాకు వున్న,తెలిసిన ఒకే ఒక్క జ్ఞాతి ఆయన అని చెప్పాను .ఆయనభార్య చెల్లెల్ని వుయ్యూరు లో వుండే మా మేనమామ గుండు గంగయ్య గారి పెద్దబ్బాయి పద్మనాభానికి ఇచ్చి పెళ్లి చేసారని వుయ్యూరు వచ్చినపుడల్లా మాయింటికి వచ్చేవారని ,ఆ పెళ్ళికి అగిరిపల్లి లో మేము మొదటిసారిగా చూసామని చెప్పాను.
వెంకట రావు గారు తమ రామాంజనేయ యుద్ధం సినిమా కు రాసారని గొప్ప కవి అని పద్యం ఆయనంత బాగా ఎవరు రాయలేరని మెచ్చారు .ఆయనతో మళ్లి ఒక సినిమాకు రాయిన్చాలను కుంటున్నామని చెప్పారు రావు గారు చని పోయి రెండేళ్ళయిందని చెప్పా తమకు తెలియదని,ఆశ్చర్య పోయరిద్దరూ .అవతలి వాడి ప్రతిభను గుర్తించే సహృదయం వారిద్దరిది ఆ మర్నాడు మద్రాస్ లో వున్న రావు గారి అబ్బాయిని చూడటానికి వెళ్తున్నామని చెబితే ఆ కుటుంబానికి తమ సంతాపం, సానుభూతి తెలియజేయమని చెప్పిన సంస్కారం వారిది
.బాపు గారు ,వారి భార్య అతి నిరాడంబరం గా వుండటం ఆశ్చర్యం కల్గించింది .నేత చీరెతో ఆమె,గళ్ళ లుంగి పొట్టి చొక్కాతో ఆయన .అంతా పేరు ప్రతిష్ట వున్న అంతటి సామాన్య జీవనం .ఆదర్శం మాటల్లో కాదు చేతల్లో ,నడవడికలో చూపుతున్న మార్గదర్శి గా అనిపించారు .
ఇక రమణ గారు తెల్లని బట్టలు ,తెల్ల జుట్టు ,భార్య సాదా  సీదా ఆకూ పచ్చ నేత చీర తో పార్వతి పరమేశ్వరులు అనిపించారు ఆమె నండూరి రామ మోహన రావు గారి చెల్లెలే.అరుగొలను వారిది . కారణ  జనములు అనిపించారు ఆ జంట జంటలు.
మా ఆవిడా మురిసి పోయింది వాళ్ళను చూసి ,వాళ్ళ ఆప్యాయతలు , పలకరింపులు ,మర్యాదలకు  ముగ్ధులం అయ్యాం.
మైనేనీ  గారి గురించి మాట   వచ్చినపుడల్లా ఇద్దరు  ఎంతో పొంగిపోయారు. ఎన్నో  పుస్తకాలూ  అరుదయినవి  సేకరించి  అమెరికా నుండి  ఆయన  పంపుతారని, ఆయన  స్నేహం మరువలేనిదని  అన్నారు  .గోపాలకృష్ణగారు  కూడా  బాపు గారు ఎన్నో  విలువయిన  పైంతింగ్స్  తనకు  పంపించారని  అమెరికాలో   మే ము వున్నప్పుడు  నాకు   ఫోన్
లో చెప్పేవారు.  అంతటి జిగినిదోస్తి వారిముగ్గురిది.
నాలుగు   ఏళ్ళ  క్రితం  ఆంధ్రజ్యోతి  దిన   పత్రిక లో  బాపు రమణల   ”sirinomu’ లోని   భాగాలను ధనుర్మాసం  సందర్భంగా  రోజు     వేస్తుంటే  చదివి  అద్భుతం   అనిపించి ఒక కార్డు  రాసాను.  అందులో వుయ్యుర్లో  మాకు  సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం   వుందని , ధనుర్మాసంలో  రోజు  నేను  ఆలయంలో తెల్ల వారు  ఝామున  అయిదు  గంటలకే  వెళ్లి  తిరుప్పావై  రోజు  చదువుతానని ,నేను వంస పారంపర్య ధర్మ కర్తనని    భోగినాడు  కళ్యాణం   కుడా  చేస్తామని,   హనుమ్మజ్జయంతి  కి కుడా శ్రీ  సువర్చలాన్జనేయ స్వామి కళ్యాణం    చేస్తమని, హనుమద్  వ్రతం  కూడా  చేస్తామని  కోతపోకదాలతో   సిరినోము  వుందని, రసభరితంగా ఉందని రాసాను.   ఆ  విషయం మర్చిపోయాను.
వారం తర్వాత  200 రూపాయల విలువకలిగిన  ఆ పుస్తకాన్ని  registerd post లో నాకు  అందేటట్లు పంపారు.  ఆశ్చర్యపోయాను.  వెంటనే ఫోన్ చేసి థాంక్స్ చెప్పాను.  మరునాడు ఉదయం ఆ పుస్తకాన్ని స్వామి పాదాల దగ్గర ఉంచి రోజు అందులోని విశేషాలను తెలియ చేసే వాడిని.  కళ్యాణం  అయింతర్వాత  వారిద్దరికీ  స్వామి  వారి ఫోటోలు  ,ప్రసాదం, కళ్యాణ   అక్షింతల్  పోస్ట్లో  లో పంపాను .
ఇది అనుకోని సంఘటన.   అంతటి భక్తీ ప్రపత్తులు వారికి ఉన్నాయని తెలియ్స చేయటానికి ఇది రాసాను.   ఇది మద్రాస్లో వారిని కలిసినపుడు గుర్తు చేస్తే ముసి ముసి నవ్వులు నవ్వి ఊరుకున్నారు అది వారి మనస్తత్వం.
– క్రౌంచ  మిధునం  విడిపోయినపుడు  వాల్మీకి   శోకం   శ్లోకంగా,   అది ఆది  కావ్యం   ఆరంభం అయింది .  అలాగే  ఉంది ఇప్పటి  స్థితి.
చిన్నపిల్లలను  శ్రీరామ రక్ష అని  తెలుగు వారు దీవిస్తారు.  తెలుగు తరం కొత్త హాస్యానికి ‘శ్రీ రమణ రక్ష’ అని అనిపిస్తుంది.
ఇందులో  రెండు   విశేషాలు ఉండటం  గమనించి    వుంటారు.  ఒకటి ముళ్ళపూడి  వెంకట రమణ  రక్ష  అని,  ముళ్ళపూడి తర్వాత  ఆ రకo హాస్యాన్ని వండి  పండించిన ఆ  వారసత్వాన్ని   తీసుకుని  ముందుకు సాగుతున్న శ్రీ రమణ అని అర్ధం.
అప్పు (నీరు), ఆకాశం ఉన్నతవరకు ముళ్ళపూడి వెంకట రమణ చిరంజీవే.

– నమస్సులతో …………….       మీ ………….

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ముళ్ళపూడి & బాపు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.