గీర్వాణ కవుల కవితా గీర్వాణం -15 14-అపర శంకరులు – శంకర భగవత్పాదులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -15

14-అపర శంకరులు – శంకర భగవత్పాదులు

కేరళలో కాలడి గ్రామంలో జన్మించిన అపర శివావతారులే ఆది శంకరాచార్యులు. అద్వైత మత స్తాపకాచార్యులు త్రిమతా చార్యులలో ప్రధములు ..జగద్గురువులు గా భావిమ్పబడ్డారు .కాలం పై భిన్నాభిప్రాయాలున్నాయి .కాని  క్రీ.శ.780-820అని అందరూ అంటారు .’’దుస్టాచార్య వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే –స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః ‘’-శ్రోత స్మార్త ప్రతిస్టార్ధం భక్తానాం హితకామ్యయా –కరిష్యత్సవతారం స్వం శంకరో నీల లోహితః ‘’అని శివ రహస్యం లో ఉంది .స్వయానా పరమ శివుడే వేద విహిత కర్మలను వ్యాపింప జేయటానికి ,దుస్టాచారాలను నిర్మూలించటానికి భూమిపై అవతరించాడని తాత్పర్యం .విద్యారణ్య స్వామి రచించిన ‘’శంకర విజయమే’’ అందరికి ఆధారం .దానిని బట్టి శంకరాచార్య కాలడిలో ఆర్యాంబ శివగురువులకు పూర్ణా  నది ఒడ్డున జన్మించారు .తలిదండ్రులు వ్రుషా చలం కొండమీద ఉన్న శివుడిని ప్రార్ధించి ఆయన అనుగ్రహం తో శకరుడికి జన్మ నిచ్చారు .వైశాఖ శుద్ధ పంచమి ,ఆర్ద్రా నక్షత్రం లో సూర్య ,శని కుజ ,గురులు ఉచ్చస్తితిలో ఉండగా జన్మించారు .కంచి మఠం రికార్డుల ప్రకారం ఆదిశంకరుల జననం క్రీ.పూ 509.

శంకరుని బాల్యం లోనే తండ్రి చనిపోయారు .తల్లి ఆర్యాంబ పిల్ల  వాడిని పెంచి ఉపనయన సంస్కారం చేయించింది .ఏక సంతాగ్రాహి అయిన ఈ బాలుడు వేదం విద్యలన్నీ చిరుప్రాయం లోనే అభ్యసించాడు .బాల బ్రహ్మ చారిగా ప్రతి ఇంటా  భిక్షాటన చేసేవాడు .ఒక రోజు ఒక ఇంటిముందు భిక్షాం దేహీ అని అన్నప్పుడు ఆ ఇంటి ఇల్లాలు కడు పేదరిం తో ఉండటం వలన ఉసిరికాయలను మాత్రమె భిక్షా పాత్రలో వేసి కన్నీటితో నిలబడింది .అర్ధం చేసుకొన్న బాల శంకరుడు ఆశువుగా లక్ష్మీ దేవిని ‘’నక ధారా స్తోత్రం ‘’తో ప్రసన్నం చేసుకొని ఆ ఇంటిముందు బంగారు నాణాలు రాలేట్లు అమ్మవారి అనుగ్రహం పొందాడు .ఆ ఇల్లాలి ఇక్కట్లు తీర్చాడు .తల్లి ఆర్యాంబ పూర్ణా నదినుండి రోజూ నీరు తెచ్చుకోలేక పోతుంటే నదినే ఇంటి ముందు ప్రవహింప జేసి అందరికి ఆశ్చర్యం కలిగించాడు .

బాల శంకరులకు సన్యాసం పై మనసైంది .ఒక్క గానొక్క కొడుకు ఇలా అయితే ఎలా అని తల్లి అడ్డు చెబుతోంది .ఒక రోజు పూర్ణా నదిలో స్నానం చేస్తూ ఉండగా మొసలి కాళ్ళను పట్టి లగేస్తుంటే ఒడ్డున ఉన్న తల్లిని ఇప్పటికైనా సన్యాస స్వీకారానికి అంగీకరించాని వేడుకొన్నాడు  తల్లి మనసూ కరిగి సరే నంది .మనస్సాక్షిగా సన్యాసి అయ్యాడు దీనిని  ‘’ఆతుర సన్యాసం ‘’అంటారు . సన్యాస స్వీకార మంత్ర్రాలు జపిస్తుండ గానే   మొసలి పట్టు వదిలేసింది .జీవితాంతం సన్యాసిగా ఉండిపోతానని శపథం చేశాడు ,విద్య మీద  మక్కువ ఎక్కువై తగిన గురువు కోసం ఉత్తర దేశ యాత్రకు బయల్దేరుతూ తల్లి అనుమతి పొందాడు. ఆమె ఏ సమయం లో ఎప్పుడు మనసులో తానూ రావాలని అనుకుంటుందో అ సమయానికి ఆమె ముందు వచ్చి వాలుతానని  తానూ యతి అయినా ఆమె  అంత్య  సంస్కారాలను తన చేతుల మీదుగానే చేస్తానని ప్రతిజ్ఞ చేసి బయలు దేరాడు .

గురు దర్శనం –విద్యా వ్యాసంగం

కాలి నడకన బయల్దేరిన శంకరుడు మధ్య భారతం లోని నర్మదా నది ఒడ్డున ఉన్న గౌడ పాడుల శిష్యుడైన గోవింద భగవత్పాదులున్న గుహను  చేరాడు .వ్యాసమహర్షి కుమారుడైన శుక మహర్షి యేగౌడపాదులని అంటారు .గోవింద భగవత్పాదులకు శంకరుడు నమస్కరించాడు .ఆయన ‘’ఎవరు నువ్వు ?’’అని అడిగాడు వెంటనే శంకరుడు –‘న భూమి ర్నతోయం  నతేజో న వాయు ర్మఖంనేన్ద్రియం వా నతేషాంసమూహః –అనైకాన్తికత్వా త్సుషు ప్యైక సిద్ధి స్తదేకోవ శిష్ట శ్శివోహం శివోహం ‘’అంటూ పది శ్లోకాలను ఆశువుగా చెప్పాడు .వీటికే ‘’దశ శ్లోకి ‘’అని పేరు .ఇంత విజ్ఞాన్ని మూట కట్టుకోచ్చిన ఆ శంకరుడు సాక్షాత్ శివుడే అని గ్రహించారు గోవింద పాదులు .’’స ప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్ ‘’అంటే భూమికి దిగివచ్చిన శంకరుడే ఈ  శంకరుడు అని మెచ్చారు .వెంటనే గోవిందపాదులకు పాద పూజ చేశాడు శంకరుడు .బ్రహ్మ జ్ఞానాన్ని ,ఉపనిషత్ సారాన్ని నాలుగు మహా వాక్యాలతో గురువు శిష్యుడికి బోధించారు .ఒక రోజు ర అకస్మాత్తుగా నర్మదా నదికి ఉధృతం గా వరద వచ్చి భగవత్పాదుల తపస్సుకు భంగం కలిగిస్తుంటే ‘’ఓంకార శక్తితో ‘’నది ప్రవాహాన్ని తగ్గించాడు .గురువు వద్ద విద్యాభ్యాసం పూర్తీ అయిన వెంటనే గురువు ఆదేశం పై బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాయటానికి పండితలోక వాసి అయిన కాశికి చేరాడు శంకరుడు .

శ్రీశంకర కవితా గీర్వాణం

వారణాసి చేరి గంగా స్నాన పులకితులై విశ్వేశ్వర దర్శనం అంటే నిజ దర్శనమే గా చేసుకొన్నారు శంకరులు .వేదం విచారణ చేసి సూక్ష్మాలు గ్రహించారు .అక్కడ సదానందుడు మొదటి శిష్యుడైనాడు .కాశీ వీధుల్లో తిరుగుతుంటే ఒక చండాలుడు నాలుగు శునకాలతో ఎదురౌతాడు .శంకరుడు  అతన్ని దారి తొలగమంటాడు .ఆతను తప్పుకోకుండా ‘’అన్నమయాత్ అన్నమయం అధవా చైతన్య మయాత్ చైతన్యం –ద్విజ వర దూరీకృతం వాంచసి కిం బ్రూహి గచ్చ గచ్చతి ‘’అన్నాడు .అంటే అన్నిటికీ ఆధారామిన  అన్నం తో ఈశరీరం నిర్మితమైంది .అడ్డు తప్పుకోమన్నది శరీరాన్నా ,లోపలి ఆత్మనా?’’అన్నాడు .సాక్షాత్తు పరమ శివుడే నాలుగు వేదాలతో ప్రత్యక్షంయ్యాడని గ్రహించి శంకరులు పాదాక్రాన్తులయ్యారు . మహేశ్వరుడిని  ‘’మనీషా పంచకం ‘’తో స్తోత్రం చేశాడు .శివుడు అపర శివుడికి కర్తవ్య బోధ చేశాడు .వేదవ్యాస ప్రణీతమైన బ్రహ్మ సూత్రాలకు ఇంత వరకు లేనట్టి అద్భుత భాశ్యాం  రాసి దేవతలచే ప్రశంసలు పొంది వాటి వ్యాప్తికి శిష్యులను దేశమంతా పంపమని హితవు చెప్పాడు . ఈ పనులు పూర్తీ చేసి తనను చేరాలని చెప్పి అదృశ్యమయ్యాడు శివుడు .పన్నెండేళ్ళ  వయసులోనే భగవత్పాదులు బ్రహ్మ  సూత్రా భాష్యం రాశారు .భగవద్ గీతకు ఉపనిషత్తులకూ అంటే ప్రస్తాన త్రయానికి భాష్యాలు  రాశారు ఆ లేత వయసులో ,పండిన జ్ఞానం తో .

పరమ శివుని అనుజ్ఞతో బదరికా వనం చేరాడు .అక్కడ పండిత గోస్టులు జరిపారు .బడరినుంది కాశీకి తిరిగి వచ్చి బ్రహ్మ సూత్రా భాష్యాల సారం అయిన అద్వైతాన్ని శిష్యులకు, ప్రజలకు బోధించటం ప్రారంభించారు .సనత్సుజాతీయం ,విష్ణు సహస్రనామం ,లలితా త్రిశతి ,నృసింహిత పాణిలకు భాష్యాలు పూర్తీ చేశారు .ఒక రోజు శిష్యులకు బోధిస్తుండగా వ్యాసమహర్షి వృద్ధ బ్రాహ్మణ  వేషం లో వచ్చి ఎనిమిది రోజులు ఆయనతో వాదించాడు  . వచ్చిన వాడు వ్యాసర్షి అని పద్మపాదుడు శంకరులకు తెలియ జేస్తే పాదాలపై వ్రాలి పూజించారు .బ్రహ్మ సూత్రాలకు అసలైన అర్ధాన్ని గ్రహించింది శంకరాచార్యులు మాత్రమె నని కృష్ణ ద్వైపాయన వ్యాసుడు ప్రస్తుతించి ఆశీర్వదించాడు .తాను ఏఎ  ప్రపంచం లోకి వచ్చిన పని పూర్తీ అయిందని శరీరం చాలించటానికి అనుమతిమ్మని వ్యాసుని వేడారు .అప్పుడు వ్యాస భగవానులు ‘’నీ అసలు ఆయుర్దాయం ఎనిమిదేళ్ళు .అగస్త్యాది మహర్షుల వరం తో మరో ఎనిమిదేళ్ళు పొందావు .నేను ఇంకా నీకు పదహారేళ్ళ ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తున్నాను .వేద విహిత కార్యప్రచారం చేయి. దీనికి విరుద్ధమైన  మతాలను చీల్చి చెండాడి అద్వైతాతానికి పట్టం కట్టే పని నీవల్లనే సాధ్యం అందుకే నీ ఆయుస్సు పోడిగిస్తున్నాను ‘’అని అదృశ్యమైనాడు

సశేషం

ఈ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-14-ఉయ్యూరు .

.

.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.