మనుషుల్ని ”ఏదోలా ”చేస్తున్న ”ఎబోలా ”

ఒకప్పుడు ఎయిడ్స్.. మొన్న సార్స్.. నిన్న హెచ్ వన్ వన్ .. నేడు ప్రపంచానికి ఎబోలా భయం పట్టుకుంది. నిన్నమొన్నటి వరకూ స్వైన్‌ఫ్లూతో భీతిల్లిన ప్రపంచం తాజాగా ఎబోలా వైరస్ పేరు చెబితే చాలు ఉలిక్కిపడుతోంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు అనేక ప్రపంచ దేశాలను ఎబోలా వైరస్ వణికిస్తోంది. ఆఫ్రికా అడవుల్లోని గబ్బిలాల నుండి వచ్చిన ఈ వైరస్ ప్రపంచం అంతా వ్యాపిస్తున్నట్టు శాస్తవ్రేత్తలు గుర్తించారు. గతంలో ఎయిడ్స్ వెలుగు చూసినపుడు కూడా ఇంతగా భయపడని పెద్ద దేశాలు ఎబోలా పేరు వింటే చాలు గజ గజ వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఒకసారి సోకిందంటే ప్రాణాలు హరించేదాకా విడిచిపెట్టదని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఇంత వరకూ ఈ వైరస్ బారిన పడి వేల మంది మృత్యువాత పడ్డారు. అసలు ఎబోలా అమెరికా వ్యాపించకుండా ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే అక్కడి పౌరులకు కూడా కోపం తెప్పిస్తోంది. ఎబోలాకు చికిత్స లేకపోవడమే దీనికి కారణం. ఎబోలా లేని ప్రాంతాలకు పారిపోవడం మినహా సోకిన తర్వాత చేయగలిగింది ఏమీ లేదన్నది సుస్పష్టం. వైరస్ అనేది లాటిన్ భాష నుండి ఉద్భవించింది. వైరస్ అంటే టాక్సిన్ లేదా విషం అని అర్థం. వైరస్‌లు అతి సూక్ష్మమైనవి. అంటే 150600 నానో మీటర్లు ఉంటాయి. ఇవి ఇతర జీవుల కణాలపై దాడి చేసి వ్యాధులను కలుగజేస్తాయి. ఈ దాడి ముఖ్య ఉద్దేశం వైరస్‌లు తమ సంతతిని పెంచుకోవడంతో ముడిపడి ఉంటుంది. వైరస్‌లు వాటంతట అవి విభజన చెందలేవు. విభజన చెందాలంటే వేరే జీవకణం తప్పనిసరి. వైరస్‌లలో అతి సరళమైన జన్యుపదార్థం ఒక రక్షణ కవచంతో రక్షించబడి ఉంటుంది. ఈ రక్షణ కవచం ప్రోటీన్లతో చేయబడి ఉంటుంది. దానిని క్యాప్సిడో అంటారు. వైరస్‌లు చాలా రకాల జీవులపై దాడి చేస్తుంటాయి. బ్యాక్టీరియా, జంతురాజ్యం-వృక్షరాజ్యంతో శిలీంద్రాలు, ప్రోటిస్టాకు చెందిన జీవులు కూడా దాడికి గురవుతుంటాయి. బ్యాక్టీరియాపై దాడి చేసే వైరస్‌ను బ్యాక్టీరియా ఫేజ్ అని అంటాం. వైరస్‌ల వల్ల మానవ జాతిని రకరకాల వ్యాధులు పీడించాయి. ఎయిడ్స్, ఆటలమ్మ, మశూచి, తట్టు, పోలియో, ఎల్లో ఫీవర్, రేబిస్ వంటివి అన్నీ వైరస్ వల్ల వచ్చినవే. 1717 నుండి వైరస్‌ల ఉనికి గుర్తింపబడుతూనే ఉంది. వైరస్‌లు బ్యాక్టీరియాపై దాడి చేయగలవని 20వ శతాబ్దంలో ఫ్రెడరిక్ త్వార్ట్ కనుగొన్నాడు. అనేక వైరస్‌లను ఎదుర్కొన్న మనిషి మేథస్సుకు ఇపుడు ఎబోలా వైరస్ పెద్ద సవాలుగా పరిణమించింది. వైరస్ సోకిన వారే కాదు, వారికి చికిత్స చేసిన వారిని కూడా ఇది వదిలిపెట్టడం లేదు. ఈ కారణంగానే ఈ వ్యాధి సోకిన వారికి చికిత్స చేసేందుకు కూడా వైద్య వర్గాలు వణికిపోతున్నాయి. ఎందుకంటే ఎబోలా సోకిన రోగులను చికిత్స చేస్తున్న క్రమంలో వైద్యులు కూడా ప్రాణాలు కోల్పోవడమే. భారత్ నుండి వివిధ పనుల నిమిత్తం విదేశాల్లో నివసిస్తున్న వారి సంఖ్య చాలానే ఉంది . ఎబోలా ప్రభావం ఉన్న దేశాల్లో దాదాపు 45వేల మంది భారతీయులు నివసిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ చెప్పారు. ఎబోలా కరాళ నృత్యం చేస్తున్న లైబీరియాలోనే ఐక్యరాజ్యసమితి సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారిలో 300 మంది భారతీయ సిఆర్‌పిఎఫ్ జవాన్లు ఉన్నారు. వీరితో పాటు 2700 మంది భారతీయులు ఇతర పనుల నిమిత్తం లైబీరియాలో ఉన్నారు. సియోర్రాలియోన్‌లో 1200 మంది, గనియాలో 500 మంది భారతీయులున్నారు. నైజీరియాలో పెద్ద సంఖ్యలో 40 వేల మంది భారతీయులు ఉన్నారు. ఈ దేశాలన్నీ ఎబోలాతో సతమతమవుతున్న దేశాలే. ఈ దేశాల్లో ఉంటున్న భారతీయులు స్వదేశానికి వస్తే పరిస్థితి ఏమిటన్న దానిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మన పౌరులు ఎబోలా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక సూచనలను అందిస్తోంది. అన్ని విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఐదు రకాలు ఎబోలా వైరస్‌లోనే ఐదు భిన్న జాతులు ఉన్నాయి. ఎబోలా వైరస్‌ను ఫైలో వైరస్ అని కూడా అంటాం. బుండిబుగ్యో ఎబోలా వైరస్, జైరో ఎబోలా వైరస్, రెస్టాన్ ఎబోలా వైరస్, సూడాన్ ఎబోలా వైరౌస్ , టాయ్ ఫారెస్టు ఎబోలా వైరస్ అనే పేరుతో ఐదు వైరస్‌లున్నాయి. సామాజిక మాధ్యమాల్లో…. జడ్‌మ్యాప్ అనే ఔషధం దీనికి విరుగుడుగా చెబుతున్నారు..అయితే ప్రయోగాత్మక దశలోనే ఉన్న ఈ ఔషధం ఇంకా విస్తృతంగా అందుబాటులోకి రాలేదు. దాంతో ఆఫ్రికా దేశాల్లో తీవ్రమైన నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. గివ్ ఆఫ్రికా జడ్‌మ్యాప్, గివ్ దెమ్ ఎక్స్‌పెరిమెంటల్ డ్రగ్స్, ఆఫ్రికా క్యూర్ పేరిట ఆఫ్రికన్లు ఆన్‌లైన్ ప్రచారోద్యమాన్ని ముమ్మరం చేశారు. ప్రయోగాల పేరిట ఆఫ్రికన్ల పిల్లలు పనికొస్తారు, కాని వారికి మందులు ఇవ్వడానికి మీకు చేతులు రావా? అంటూ అమెరికాపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇపుడు కనుగొన్న జడ్‌మ్యాప్ అనే ఈ ఔషధం కూడా ఒక ఆఫ్రికా బాలుడి రక్తం నుండి తీసుకున్న సీరమ్ నుండి తయారుచేసిందే. ఎబోలాను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉన్నాయో లేదో అమెరికా పరీక్షించింది. సాధారణంగా ఏదైనా వ్యాధి ఔషధాలకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు వివిధ దశల్లో పరీక్షిస్తారు. అంతా సంతృప్తికరంగా ఉందనుకున్నతర్వాత ఎలాంటి ప్రమాదం ఉండదని దాదాపుగా ధృవీకరించుకున్నాక చివరిదశలో మానవులపై ప్రయోగిస్తారు. కానీ ఎబోలా వైరస్ శరవేగంతో వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇంకా ప్రయోగదశల్లో ఉన్న మందులనే దాని బారినపడ్డవారిపై ప్రయోగిస్తున్నారు. లైబీరియాలో ఈ వైరస్ బారిన పడ్డిన ఇద్దరు అమెరికన్ మతప్రచారకులకు ఇలాగే ప్రయోగదశలో ఉన్న జడ్‌మ్యాప్ ఔషధాన్ని ఇచ్చారు. వారిద్దరి పరిస్థితి ఇపుడు నిలకడగానే ఉంది. అయి వారి శరీరాల్ల్లో సహజంగా ఉన్న రోగనిరోధక శక్తి వల్ల తగ్గిందా లేదా ఈ ఔషధం వల్ల తగ్గిందా అనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. తాజాగా స్పానిష్ తమ ప్రచారకుడికి (75) ఈ వ్యాధి సోకింది. దాంతో ఆయనను స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌కు తరలించి ఆయనకు కూడా జడ్‌మ్యాప్‌తో చికిత్స చేస్తున్నారు. అయితే ఇలా ప్రయోగదశల్లో ఉన్న ఔషధాలతో చికిత్స చేయడంలోని నైతికతపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎబోలా వైరస్ ప్రపంచం మీద దండయాత్ర చేస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించింది. ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వ్యాధి నియంత్రణ సంస్థలు మందుల తయారీ ప్రయత్నాల్లో ముమ్మరమయ్యాయి. ప్రత్యేక బృందాలు జరుపుతున్న పరిశోధనలు ఆశాజనక వాతావరణంలో సాగుతున్నాయి. కోతులపై మూడు పరీక్షలను నిర్వహించగా, అవి సత్ఫలితాలను ఇచ్చినట్టు చెబుతున్నారు. పరిశోధకులు. వీరు చేస్తున్న పరిశోధనలకు కాలిఫోర్నియా బయోటెక్ మ్యాప్ బయోఫార్మస్యుటికల్ వేదికగా మారింది. శాన్‌డిగోకు చెందిన బయోఫార్మాస్యుటికల్ సంస్థ కూడా జడ్‌మ్యాప్ పరిశోధనల్లో ఉంది. జడ్‌మ్యాప్‌లో మూడు యాంటీ బాడీలు ఉంటాయి. ఇవి శరీరంలోని ఎబోలా వైరస్‌ను గుర్తిస్తాయి. ఈ వైరస్ సోకిన కణాలను అంటిపెట్టుకుని ఉండీ ఆయా కణాలను సమర్ధంగా నిర్మూలించేలా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్‌ను 1976లోనే గుర్తించారు. అసలు అప్పట్లో ఏం జరిగింది..? ఎవరు గుర్తించారు…ఎవరు కనుగొన్నారు..ఇన్ని వైద్యసదుపాయాలున్న ఈ రోజుల్లో కూడా ఈ వైరస్‌కు ఇన్ని వేల మంది మరణిస్తున్నారంటే అప్పటి పరిస్థితి ఎలా ఉండేదో..అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈవీడీకి మరో పేరే ఎబోలా..ఎబోలా హెమరోజిక్ ఫీవర్. ఎబోలా వైరస్ డిసీజ్. తర్వాత మళ్లీ ఇంతకాలానికి పశ్చిమ ఆఫ్రికా గనియాలో ఎబోలా వైరస్ తొలి కేసును 2014 మార్చిలో గుర్తించారు. ఆ తర్వాత పొరుగునే ఉన్న లైబీరియా, సియెర్రా లియోన్, నైజీరియా తదితర దేశాల్లో ఉందనుకున్నతర్వాత ఎలాంటి ప్రమాదం ఉండదని దాదాపుగా ధృవీకరించుకున్నాక చివరిదశలో మానవులపై ప్రయోగిస్తారు. కానీ ఎబోలా వైరస్ శరవేగంతో వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇంకా ప్రయోగదశల్లో ఉన్న మందులనే దాని బారినపడ్డవారిపై ప్రయోగిస్తున్నారు. లైబీరియాలో ఈ వైరస్ బారిన పడ్డిన ఇద్దరు అమెరికన్ మతప్రచారకులకు ఇలాగే ప్రయోగదశలో ఉన్న జడ్‌మ్యాప్ ఔషధాన్ని ఇచ్చారు. వారిద్దరి పరిస్థితి ఇపుడు నిలకడగానే ఉంది. అయి వారి శరీరాల్ల్లో సహజంగా ఉన్న రోగనిరోధక శక్తి వల్ల తగ్గిందా లేదా ఈ ఔషధం వల్ల తగ్గిందా అనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. తాజాగా స్పానిష్ తమ ప్రచారకుడికి (75) ఈ వ్యాధి సోకింది. దాంతో ఆయనను స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌కు తరలించి ఆయనకు కూడా జడ్‌మ్యాప్‌తో చికిత్స చేస్తున్నారు. అయితే ఇలా ప్రయోగదశల్లో ఉన్న ఔషధాలతో చికిత్స చేయడంలోని నైతికతపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎబోలా వైరస్ ప్రపంచం మీద దండయాత్ర చేస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించింది. ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వ్యాధి నియంత్రణ సంస్థలు మందుల తయారీ ప్రయత్నాల్లో ముమ్మరమయ్యాయి. ప్రత్యేక బృందాలు జరుపుతున్న పరిశోధనలు ఆశాజనక వాతావరణంలో సాగుతున్నాయి. కోతులపై మూడు పరీక్షలను నిర్వహించగా, అవి సత్ఫలితాలను ఇచ్చినట్టు చెబుతున్నారు. పరిశోధకులు. వీరు చేస్తున్న పరిశోధనలకు కాలిఫోర్నియా బయోటెక్ మ్యాప్ బయోఫార్మస్యుటికల్ వేదికగా మారింది. శాన్‌డిగోకు చెందిన బయోఫార్మాస్యుటికల్ సంస్థ కూడా జడ్‌మ్యాప్ పరిశోధనల్లో ఉంది. జడ్‌మ్యాప్‌లో మూడు యాంటీ బాడీలు ఉంటాయి. ఇవి శరీరంలోని ఎబోలా వైరస్‌ను గుర్తిస్తాయి. ఈ వైరస్ సోకిన కణాలను అంటిపెట్టుకుని ఉండీ ఆయా కణాలను సమర్ధంగా నిర్మూలించేలా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్‌ను 1976లోనే గుర్తించారు. అసలు అప్పట్లో ఏం జరిగింది..? ఎవరు గుర్తించారు…ఎవరు కనుగొన్నారు..ఇన్ని వైద్యసదుపాయాలున్న ఈ రోజుల్లో కూడా ఈ వైరస్‌కు ఇన్ని వేల మంది మరణిస్తున్నారంటే అప్పటి పరిస్థితి ఎలా ఉండేదో..అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈవీడీకి మరో పేరే ఎబోలా..ఎబోలా హెమరోజిక్ ఫీవర్. ఎబోలా వైరస్ డిసీజ్. తర్వాత మళ్లీ ఇంతకాలానికి పశ్చిమ ఆఫ్రికా గనియాలో ఎబోలా వైరస్ తొలి కేసును 2014 మార్చిలో గుర్తించారు. ఆ తర్వాత పొరుగునే ఉన్న లైబీరియా, సియెర్రా లియోన్, నైజీరియా తదితర దేశాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ దేశాల్లో ఎబోలా విజృంభన అంచనాకు మించి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 1976లోనే నైజీరియా, సూడాన్, యాంబుక్, కాంగో దేశాల్లో ఎబోలా కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత ఇలాంటి కేసులే ఎబోలా అనే నదికి దగ్గరగా ఉన్న గ్రామంలో ఎక్కువగా నమోదయ్యాయి. ఎబోలా ఎలియాస్ జైరో ఎబోలా…జీనస్ ఎబోలా వైరెస్ ఐదు జాతుల్లో అత్యంత ప్రమాదకరమైన జాతి ఇది. ఈ వైరస్ సోకిన వారికి వచ్చే వ్యాధిని ఎబోలా వైరస్ డిసీజ్ అని వ్యవహరిస్తారు. గతంలో దీనిని ఎబోలా హెమరేజిక్ ఫీవర్ అని పిలిచే వారు. ఆఫ్రికా ఖండంలోని డెముక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో -జైరీలో 1976లో బెల్జియం పరిశోధకుడు పీటర్ పయట్ ఎబోలా వైరస్‌ను మొదటిసారిగా గుర్తించారు. ఈ వైరస్‌కు మూలం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం బాగానే జరిగింది. పశ్చిమ ఆఫ్రికాలోని ఈ వైరస్ ప్రబలిన ప్రాంతాల్లో 30వేలకు పైగా జీవజాతుల నమూనాలను సేకరించి పరీక్షించారు. ఎట్టకేలకు 2005లో ఫ్రూట్ బ్యాట్స్‌గా వ్యవహరించే మూడు గబ్బిల జాతుల్లోని ఆర్‌ఎన్‌ఎల్లో ఈ నమూనా ఉన్నట్టు కనుగొన్నారు. ఈ వైరస్ దాగి ఉన్నా వాటికి ఎలాంటి హానీ జరగకపోవడంతో ఎబోలా వైరస్‌కు ఆ గబ్బిలాలే సహజ ఆశ్రయాలుగా ఉన్నట్టు గుర్తించారు. 2013 డిసెంబర్ 6న పశ్చిమ ఆఫ్రికా దేశం గనియాలోని గుయ్‌కెడో అనే గ్రామంలో రెండేళ్ల బాలుడు ఎబోలా వైరస్‌తో మృతి చెందాడు. ఆ బాలుడు మరణించిన వారం రోజులకు అతని తల్లి, తర్వాత మరికొన్ని రోజులకు క్రిస్మస్ రోజున అతని మూడేళ్ల సోదరి మరణించారు. మరో ఐదు రోజులకు వాళ్ల నాయనమ్మ కూడా చనిపోయింది. వీరి అంత్యక్రియలకు హాజరైన బంధువుల ద్వారా ఎబోలా మిగిలిన సమీప గ్రామాలకు పట్టణాలకు విస్తరించింది. అయితే ఆ రోజున దానిని ఎబోలా వ్యాధి ప్రభావంగా గుర్తించలేదు. నైజీరియాలోని పాట్రిక్ సాయెర్ అనే అమెరికా పౌరుడు లైబీరియా నుండి వచ్చిన తర్వాత జూలై నెలాఖరుకు మరణించాడు. అతడికి చికిత్స చేసిన వైద్యుడికి కూడా ఎబోలా వ్యాధి సోకింది. ఆఫ్రికా అడవుల్లో చింపాంజీలు, గొరిల్లాలు, కోతులు , అడవి దుప్పిలు, గబ్బిలాలు వ్యాధికి గురై మరణించినపుడు వాటిని తొలగించే క్రమంలో ఎబోలా మనిషికి సోకినట్టు పరిశోధకులు గుర్తించారు. ఎబోలా వైరస్ వ్యాప్తికి గబ్బిలాలు కారణమని కూడా పరిశోధకులు చెబుతున్నారు. గబ్బిలాలు సగం తిని పడేసిన వాటిని అడవుల్లోని గొరిల్లాలు, చింపాంజీలు, దుప్పులు ఇతర జీవాలు తినడంతో వాటిలోకి వైరస్ సోకి ఉంటుందని అంటున్నారు. ఆయా జీవాలను చంపి తిన్న మనుషులకు వాటి ద్వారా వచ్చే వీలుంది. అలాగే గనియా, తోమా, కిస్సీ, గయోర్ట్ వంటి ప్రాంతాల్లో గబ్బిలాలు తిని పడేసిన పండ్లను తినడం ద్వారా ఈ వ్యాధి మనుషుల్లో ప్రవేశించిందని అంటున్నారు. ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాల ప్రజలు అడవి జంతువుల మాంసాన్ని ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. గబ్బిలాల సూప్ తాగే అలవాటు ఉంది, అలాగే గబ్బిలాలను మంట మీద కాల్చుకుని తినే అలవాటు కూడా ఉంది. చింపాంజీ, గబ్బిలాలను కూడా వారు తింటారు. ఈ జంతువులే ఎబోలా వ్యాధికి కారణమవుతున్నాయనేది మరో విశే్లషణ. ఈ పరిస్థితుల్లోనే మార్చి 26న గనియా ప్రభుత్వం తమ దేశంలో గబ్బిలాల సూప్ తయారీని, వినియోగాన్ని నిషేధించింది. ఈ జంతువులను తాకేటపుడు జాగ్రత్తగా ఉండాలని, వీటి మాంసాన్ని పూర్తిగా ఉడికించిన తర్వాతనే తినాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఎబోలా వైరస్ వ్యాధి ప్రారంభ లక్షణాలు సాధారణంగానే ఉంటాయి. ఈ వైరస్ ఒకసారి మనిషికి చేరితే వెంటనే ఇతరులకు తేలికగా వ్యాపిస్తుంది. ఇది గాలి ద్వారా వ్యాపించదు. ఈ వ్యాధి సోకిన రోగి శరీర ద్రవాలు ముఖ్యంగా లాలాజలం, రక్తం, చెమట, వాంతులు, వీర్యం తదితరాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకగానే రక్తపీడనం పడిపోతుంది. కాలేయం, మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. శరీరం లోపల, బయట తీవ్రమైన రక్తస్రావం సంభవిస్తుంది. అవయవాల పనితీరు దెబ్బతిని రోగి మరణిస్తాడు. ఈ వ్యాధి లక్షణాలు బయట పడడానికి వారం రోజులు పడుతుంది. అయితే మానవ సంక్రమణం సంభవిస్తే వ్యాధి అలాగే ప్రజల మధ్య వ్యాపిస్తుంది. మగవారు రెండు నెలల వరకూ వీర్యం ద్వారా ఈ వ్యాధిని వ్యాపింపచేయగలుగుతారు. సత్వర చికిత్స అందిస్తే వ్యక్తి బయటపడతాడు. ప్రారంభ లక్షణాలు కనిపించిన వారిలో మలేరియా, టైఫాయిడ్, కలరా, ప్లేగు, హెపటైటిస్, డెంగీ జ్వరాలు లేవని నిర్ధారించిన తర్వాతనే ఎబోలా పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఎలీసా, యాంటిజెన్ డిటెక్షన్ టెస్టు, కణవర్ధనం తదితర పద్ధతుల్లో వ్యాధిని నిర్ధారిస్తారు. రోగి నుండి సేకరించిన రక్త నమూనాలు చాలా డేంజర్ , శరీరంలోని వైరస్‌ను నిర్మూలించేందుకు ప్రత్యేక నిరోధక మందులు లేవు. ఎబోలా వ్యాప్తిని నిరోధించే మార్గాలపై ప్రజల్లో అవగాహన పెంచాల్సి ఉంటుంది. ఆ మూడూ… 2003లో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్) ఆసియాలో కలకలం సృష్టించింది. ఆ తర్వాత సార్స్ ప్రపంచం అంతా విస్తరించింది. 2009 మార్చిలో మెక్సికోలో స్వైన్ ఫ్లూ గుర్తించారు. అది తర్వాత యావత్ ప్రపంచాన్ని వ్యాపించింది. ఈ రెండు సందర్భాల్లో వేలాది మంది మృత్యువాత పడ్డారు. ఇపుడు ఎబోలా విజృంభిస్తోంది. * అంతర్జాతీయ ఎమర్జన్సీ పశ్చిమాఫ్రికాలో ప్రారంభమైన ఎబోలా వైరస్ వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగస్టు 8వ తేదీన ప్రకటించింది. ఈ వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా అదనపు బాధ్యతలు తీసుకోవాలని ప్రపంచ దేశాలను కోరింది. ఇంతగా విజృంభించి ప్రపంచ ప్రజలను భయకంపితుల్ని చేస్తున్న ఎబోలా తరహా వైరస్ ముందెన్నడూ నమోదు కాలేదు. ఎబోలా వైరస్ సోకిన వారిలో మరణించే అవకాశాలు 50 శాతానికి పైగానే ఉన్నాయి. ఎబోలా మహమ్మారి వల్ల ఇంత వరకూ వేలాది మంది మరణించారు. 2009లో స్వైన్ ఫ్లూ సంభవించినపుడు కూడా మే నెలలో అత్యవసర పరిస్థితి ప్రకటించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. తప్పిన ముప్పు నైజీరియన్ మహిళ కేన్సర్ చికిత్స కోసం భారత్‌కు బయలుదేరి దారి మధ్యలో ఎబోలా వైరస్‌తో అబుదాబీ ఎయిర్‌పోర్టులో చనిపోయింది. ఆ మహిళ భారత్‌కు వచ్చి ఉంటే ఎబోలా వైరస్‌ను అక్కడ గుర్తించి ఉండకపోతే ఏం జరిగి ఉండేదో ఊహించుకుంటేనే భయం వేస్తోంది. ప్రజారోగ్యాన్ని ప్రైవేటు పరం చేసి, ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు పడకేసిన భారతదేశంలో ఎబోలా రెచ్చిపోయేది. పరిశుభ్రతా ప్రమాణాలు లేని మురికి వాడలు లెక్కలేనంతగా ఉన్న నగరాలను ఎబోలా అనకొండ మింగేసేదే. ఎబోలాను ఎదుర్కోవడానికి భారత్ సిద్ధమైంది. ముందస్తుగా విమానాశ్రయాల్లో క్వారంటైన్‌లను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతోంది. ఇంత వరకూ భారత్‌లో ఎబోలా కేసులను గుర్తించలేదు. అయితే గనియా నుండి వచ్చిన ఓ వ్యక్తికి ఎబోలా సోకినట్టు అనుమానం ఉండటంతో ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా, వైరస్ సోకలేదని తేలింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్ లేదని నిర్ధారించిన తర్వాతనే వారిని బయటకు పంపిస్తున్నారు. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ ఎబోలా కారణంగా లైబీరియా, సియెర్రాలియోన్, నైజీరియా దేశాల ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. ప్రపంచ దేశాలు ఈ దేశాలకు రావాలంటే భ యపడిపోతున్నాయి. ఇప్పటికే బ్రిటన్ తదితర దేశాలు విమానాలను రద్దు చేశాయి. లైబీరియాలోని తమ దౌత్య సిబ్బందిని వెనక్కు రావాలని అమెరికా ఆదేశాలు జారీ చేసింది. స్విట్జర్లాండ్‌కు చెందిన సంస్థ మెడికిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అనే సంస్థ ఎబోలా సంక్షోభాన్ని ఒక యుద్ధంతో పోల్చింది. అంతర్జాతీయ సంఘీభావం పలు దేశాల్లో ఎబోలా కేసులు నమోదు కాకపోయినా అంతర్జాతీయ సంఘీభావం కోరుతూ స్పష్టమైన పిలుపునిచ్చామని డబ్ల్యు హెచ్ ఓ చీఫ్ డాక్టర్ మార్గరేట్ చాన్ జెనీవాలో చెప్పారు. ఇంత వరకూ ఎబోలా ప్రభావానికి లోనైన దేశాలు దానిని ఎదుర్కొనే సామర్ధ్యాన్ని కలిగి లేవు అని డాక్టర్ మార్గరేట్ చాన్ తెలిపారు. అత్యంత అత్యవసర పరిస్థితి ప్రాతిపదికగా సాధ్యమైనంత వరకూ మద్దతు ప్రకటించాలని ప్రపంచ దేశాలను ఆమె కోరారు. ఎబోలా విజృంభన కొనసాగుతున్న నేపథ్యంలో దాని తీవ్రతను అంచనా వేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు డబ్ల్యుహెచ్‌ఓ ప్రకటించింది. వైరస్ గనియా నుండి సియెర్రా లియోన్, లిబేరియాకు వ్యాపించి అక్కడి నుండి నైజీరియాకు వ్యాపించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. **

 

 

 •  

  About gdurgaprasad

  Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
  This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

  Leave a Reply

  Fill in your details below or click an icon to log in:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out /  Change )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out /  Change )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out /  Change )

  Connecting to %s

  This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.