గీర్వాణ కవుల కవితా గీర్వాణం -25
23- భరత నాట్య సృష్టికర్త -భరత ముని
క్రీ .పూ .మూడవ శతాబ్దానికి చెందిన భారత ముని నాట్య శాస్త్ర రచయిత .సంగీత నాట్యాలలో మహా పండితుడు .భారతీయ నాటక ధర్మాలను అవలోడనం చేసిన వాడు .నాటక శాలా నిర్మాణం లో సుప్రసిద్ధుడు .ప్రాచీన భారత దేశ సంగీత నృత్య సంప్రదాయాలను బాగా తెలిసి ప్రయోగించాడు .గాన ,వాద్య సంగీతాలను నాట్య కళ లను గురించి సంపూర్ణం గా వివరించిన మహా గ్రంధం నాట్య శాస్త్రం .ఇవన్నీ సంస్కృత నాటక రంగ భాగాలే .దశ విధ రూపక భేదాలను గుర్తించి వివరించాడు .పాశ్చాత్యులు డ్రామా అని పిలిచే నాటకం ఈ పదిలో ఒకటి మాత్రమె .దశ విధ రసాలపై చర్చించాడు .35అధ్యాయాలున్న ఈ శాస్త్రానికి భరతుడు ఆద్యుడు .భారత నాట్యానికి అభినవ గుప్తుడు అనితర సాధ్యమైన’’అభినవ భారతి ‘’అనే పేరిట వ్యాఖ్యానం చేశాడు .గాంధర్వ వేదం అంటే సామగానం ఆధారం గా దీన్ని రాశాడు .36,000శ్లోకాలున్న ఉద్గ్రంధం భారత శాస్త్రం .నాట్య వేదం అని పిలువ బడేది దొరకక పోవటం దురదృష్టం .
భరతముని కవితా గీర్వాణం
ఇప్పుడు మనకు లభిస్తున్న భరత శాస్త్రం లో ఆరు వేల శ్లోకాలున్నాయి.దీనిని ఆంగ్లం లో ‘’డ్రామాటిక్ ఆర్ట్ ‘’’’పెర్ఫార్మన్స్ ఆర్ట్ ధీరీ ‘’అన్నారు .నాట్యాన్ని దృశ్య రూపకం లేక దృశ్య కావ్యం అంటారు .ఇది నాట్య నృత్య సంగీత త్రివేణీ సంగమం .మునులు భరతుని వద్దకు వచ్చి నాట్య వేదాన్ని గురించి తెలియ జేయమని కోరితే బ్రహ్మ తెలియ జేసిన దానిని వారికి దీనిద్వారా తెలియ జేశాడు .దుస్తులు ఆహార్యం రంగ స్తలం ,విభజన ,నటన ,దర్శకత్వం వగైరాలను గురించి వివరంగా తెలిపాడు .ఆంగిక ,వాచిక ,ఆహర్యాలను వివరించాడు .అరిస్టాటిల్ రాసిన పోయేటిక్స్ తో పోలుస్తారు .ప్రేక్షకులు ఆదరించే రాసోత్పత్తి కోసం నటులు రంగం మీద అభినయించి రసోత్పత్తి చేస్తారు .సంగీతాన్ని గురించి విపులంగా చర్చిన తోలి గ్రంధం భరతుని నాట్య శాస్త్రమే .పదమూడవ శతాబ్దం వరకు భారత దేశానికి ఇదే ఉపయుక్త సంగీత గ్రంధం ఆ తర్వాత ఉత్తరాది సంప్రదాయం ,దక్షిణాది సంప్రదాయాలు ఏర్పడ్డాయి. వాటినే హిందూస్తానీ అని, కర్నాటక సంగీతం అనీ అని పిలుస్తున్నాం .
భరతుడు షడ్జమాన్ని ‘’గ్రామ ‘’(గామ )అన్నాడు అదే మొదటిది .మూలమైనవి అవినాశి అని అవిలోపి అని అవిమారవని తెలియ జేశాడు .శ్రుతుల మధ్య సామరస్యమే సంగీతం అన్నాడు .నాట్య శాస్త్రాన్ని అయిదవ వేదం గా గుర్తిస్తారు .దీనిపై ఎన్నో వ్యాఖ్యానాలోచ్చాయి అందులో మాతంగుడు రాసిన బృహద్దేశి ,అభినవ గుప్తుని అభినవ భారతి ,సారంగ దేవుని సంగీత రత్నాకరం ముఖ్యమైనవి .భరతుని నాట్య శాస్త్రం నాట్యకళా సంబంధ ‘’విజ్ఞాన సర్వస్వం ‘’.ఇందులో లేనిది లేదు .భరతుని తర్వాత నందీశ్వరుడు అభినయ దర్పణం రాశాడు .ఇతనికాలం పన్నెండో శతాబ్దం .ఆచార్య పోనంగి శ్రీరామ అప్పారావు గారు భరతముని నాట్య శాస్త్రాన్ని తెలుగులోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాన్ని పొందారు
.
మరో కవి దర్శనం చేద్దాం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-10-14-ఉయ్యూరు