గీర్వాణ కవుల కవితా గీర్వాణం -42
42-వ్యంజనా వ్రుత్తి కారుడు -ముమ్మటుడు
ముమ్మటుడు 1050-1100వాడు .అభినవ గుప్తుడి శిష్యుడనని తానే చెప్పుకున్నాడు .’’కావ్య ప్రకాశం ‘’అనే అలంకార గ్రంధం రాశాడు .సాహిత్య శాస్త్ర ములో ముమ్మటుడికావ్యానికి ప్రత్యెక స్థానం ఉంది .ఇతని జన్మ స్థలం తల్లిదండ్రుల గురించి తెలియదు .
ముమ్మట సమ్మత కావ్యత్వం
కావ్య ప్రకాశం లో ముమ్మటుడు పూర్వ అలంకార వాదుల మార్గాన్నే అనుసరించాడు .కాని ధ్వని సిద్ధాంతాన్ని బాగా సమర్దించాడు . ఈ సిద్ధాంతాన్ని ఎదిరించిన వారికి దిమ్మ తిరిగే సమాధానాలు చెప్పి యుక్తులతో ధ్వని కి అశేష ప్రాచుర్యం సాధించాడు .ఆనంద వర్ధనుడి ధ్వని సిద్ధాన్తానికి తిరుగు లేని ప్రచారం ముమ్మటుని వల్లనే సాధ్యమైంది .భామహుడు కూడా ధ్వని వాదియే అని నిరూపించాడు .కావ్య ప్రకాశం లోని భాగాలను ‘’ఉల్లాసాలు ‘’అన్నాడు ఇందులో నూట నలభై కారికలున్నాయి .మొదటి ఉల్లాసం లో మామూలుగానే కావ్య ప్రయోజనాలు ,కావ్య హేతువులు ,భేదాలు ,కావ్య భేదాలు చెప్పాడు .రెండులో శబ్ద వ్యంజనం గురించి చెప్పాడు . .మూడులో అర్దీ వ్యంజన గురించి చెప్పాడు . నాలుగులో రసాది ధ్వని చర్చ చేశాడు .అయిదులో వ్యంజన యొక్క శక్తిని వివరించాడు .ఆరవ ఉల్లాసం లో చిత్రకావ్య ప్రస్తావన చేశాడు .ఏడులో గుణ దోష చర్చ చేశాడు .ఎనిమిదిలో గుణం అంటే ఏమిటో తెలియ జేశాడు .తొమ్మిదో ఉల్లాసం లో శబ్దాలంకారాలను వివరించాడు .పదిలో అర్దాలంకార వివరణ ఉంది .’’తద దోషౌ శబ్దార్ధౌ సగుణా నవలం కృతీ పునః క్వాపి ‘’అని గుణాన్ని నిర్వచించాడు .దోషాలు లేకుండా గుణ సహితం గా కావ్యం ఉండాలని దండి చెప్పినదాన్ని దండిగా సమర్ధించాడు .దీనికి బలీయం గా దోష చర్చను చాలా విపులం గా చేసి ఆ దారి పట్టవద్దని హెచ్చరించాడు .ఎక్కువ గా అలం కారం రం మీద ఆధారపడలేదు .అందుకే ‘’అనలం కృతీ పునః క్వాపి’’అని సమర్ధించుకొన్నాడు .కాని అలంకార భేదాలను మాత్రం విపులం గా చర్చించాడు .ముమ్మటుడి కావ్య ప్రయోజనాల ,కావ్య హేతువుల గురించి చేసిన చర్చ అందరినీ ఆకర్షిం చింది .అతని శబ్ద శక్తుల వివరణ ప్రాచుర్యం పొందింది ..
ముమ్మటుడి కావ్య ప్రాకాశానికి మొట్ట మొదటి వ్యాఖ్యానం మాణిక్య చంద్రుడు అనే జైన మతాచార్యుడు 1159 లో రాశాడు .తర్వాత చాలా మంది రాశారు .దాదాపు యాభై టీకలు రాశారు .భగవద్గీతకు తప్ప ఇన్ని టీకాలు మరి ఏ ఇతర గ్రన్ధానికీ లేదని అంటారు .టీకలకు వివరణలు ,వివరణలకు మళ్ళీ టీకలు రాస్తూనే ఉన్నారు .ప్రతి ఇంటిలో ముమ్మటుడి ‘’కావ్య ప్రకాశం ‘’ ఆవరించి ఉంది అని ఒక శ్లోకం ప్రచారం లో ఉంది –‘’కావ్య ప్రకాశస్య కృతాగృహే గృహే టీకా తదాప్యేష తధైవ దుర్గమః ‘’-
43- అభివ్యక్తివాద వ్యాపకుడు- అభినవ గుప్తుడు
అభినవ గుప్తుడు మహా మేధావి ,గొప్ప దార్శ నికుడు గా ,ఆలంకారికుడు గా ప్రసిద్ధుడు .కొత్త గ్రంధాన్ని రాయలేదుకాని ఇతర గ్రంధాలకు గొప్ప వ్యాఖ్యలు రాశాడు .భరతుని నాట్య శాస్త్రానికి ‘’అభినవ భారతి ‘’వ్యాఖ్యానాన్ని ,ఆనంద వర్ధనుడి ‘’ధ్వన్యా లోకం ‘’కు ‘’లోచన ‘’ వ్యాఖ్యను రాసిన మహా పండితుడు .స్వతంత్ర ఆలోచనలున్న వాడుగా సుప్రసిద్ధుడు
అభినవ గుప్తీయం
ధ్వన్యాలోకం లో అస్పష్టం గా ఉన్న సిద్ధాంతాలను స్పస్టపరచి పుస్ష్టి కల్గించాడు .రస ధ్వనికి ఆతనుచేసిన వివరణ చిర స్థాయిగా నిలిచిపోయి ఆనంద వర్ధనుడిని చిరంజీవి ని చేసింది .అభినవ గుప్తుడు ‘’అభి వ్యక్తి వాదం ‘’అనే దాన్ని సిద్ధాంతీకరించాడు .శైవ అద్వైతం లో ఉన్న ఆనంద వాదం భూమికగా అభినవ గుప్తుడు రసాన్ని చర్చించాడు .విభావ ,అనుభావ మొదలైన వాటిద్వారా సామాజికు లలో ఉన్న వాసనా రూపం లో రసం అభి వ్యక్తం అవుతుందని ,రసం వలన కలిగే ఆనందం బ్రహ్మానంద సహోదరమైనదని తిరుగు లేని తీర్పు నిచ్చాడు .యితడు రాసిన ‘’ధ్వన్యాలోకం ‘’ ‘’చాలా ప్రౌఢ రచన .ఈ వ్యాఖ్యానమే తర్వాతి ఆలం కారులకు మార్గ దర్శనం చేసింది .
పందొమ్మిది మంది మహా పండితుల వద్ద అభినవ గుప్తుడు శాస్త్ర విద్యలను నేర్చాడు .భట్ట ఇందురాజు దగ్గర ధ్వని సిద్ధాంతాన్ని ,భట్ట తౌతుడివద్ద నాట్య శాస్త్రాన్ని ,అభ్యసించాడు .శైవ సంప్రదాయం లో ‘’ప్రత్య భిజ్న’ గ్రంధం రాశాడు .గుప్తుడికి తండ్రియే గురువు .తల్లి విమల ,తండ్రి నరసింహ గుప్తుడు .తాత వరాహ గుప్తుడు .ఈతని పూర్వులు పంజాబ్ లోని ‘’దో ఆబ్ ‘’ప్రాంతం వారు .తర్వాత కాశ్మీరం చేరుకున్నారు .గుప్తుడు శైవ ఆగమాలలో నిష్ణాతుడు .తంత్ర శాస్త్రం లోనూ దిట్టయే.శైవానికి చెందిన నలభై ఒక్క గ్రంధాలను రాశాడు .ఇందులో పదకొండు మాత్రమె లభ్యం .శైవ ఆగమాలమీద, స్తోత్రాల మీద అనేక వ్యాహ్యలు రాశాడు .భట్ట తౌతుడు రాసిన ‘’కావ్య కౌతుకం ‘’కు ‘’వివరణ ‘’రాశాడు అభినవుడు .
అభినవ గుప్తుడికి పూర్వం ధ్వన్యా లోకానికి ‘’చంద్రిక ‘’అనే వ్యాహ్యనం ఉండేదని ,దాన్ని అభినవ గుప్తుని అన్న రాశాడని వారి వంశం లో దాన్ని పారం పర్యం గా అధ్యయనం చేసేవారని ప్రచారం లో ఉంది. చంద్రిక చాలదని లోచన వ్యాఖ్య రాశానని అభి చెప్పాడు .ముమ్మటుడు అభినవ గుప్తుని ‘’ఆచార్య పాదుడు’’అని కీర్తించటాన్ని బట్టి శిష్యుడే అని నిర్ధారించారు .క్షేమేంద్రుడు కూడా అభినవుడు తన గురువు అన్నాడు .శిష్య బృందం తో అభినవ గుప్తాచార్య పరంపర అభి వృద్ధి చెందింది
అభినవ గుప్తుడు తానూ ”యోగిని ”కుమారుడు అని చెప్పుకొన్నాడు వీరు భైరవారాధకులు ఇతని బావ వరుస అయిన కర్ణుడు చిన్నప్పుడే శైవాన్ని ఆవ పోసన పట్టాడ ట పెద్దాక్క అమ్బనిచ్చి వివాహం చేశారు వీరిద్దరికీ ”యోగీశ్వర దత్తు ”జన్మించాడు .ఇతదు యోగం లో పండి పోయాడు కనుక యోగీశ్వరుడ నిపించుకొన్నాడు రామ మ దేవుడు, క్షేమ కూడా అభి శిష్యులే .కర్నుడి స్నేహితుడు మంద్ర రాజు బాగా ఆదుకొన్నాడు మంద్రుని బంధువు ”వాతాసిక ”రచనలకు ప్రేరణ నిచ్చింది .పరిసరాల పరి రక్షణ చేస్తూ అభినవ గుప్తుడు ఒంటరిగా జీవించాడు నిశ్చల మనసుతో శైవ తాన్త్రికాలు రాశాడు మధ్య భారత నివాసి అయిన అత్రి గుప్త అనే పూర్వీకురాలు మధ్య భరతం నుండి హిమాలయాల వరకు అంతా గొప్ప పీఠ భూమి అని చెప్పిందట .వినాశన అనే నది ఉండేదట .శమ్భు నాధుడు అనే గురువు ప్రేరణతో తంత్రలోకం మొదలైన తాంత్రిక గ్రంధాలు రాశాడు
అభినవ గుప్తుడు ఆజన్మ బ్రహ్మ చారిగా ఉండిపోయాడు ముప్ఫై అయిదేళ్ళు సకల శాస్త్రాల అధ్యయనం చేసి దేశాటనం చేశాడు కాశ్మీర్ చేరాడు .”విరా సన ”లో శిష్యుల మధ్య కూర్చున్న చిత్రం ఒకటిఉంది .తన్త్రసార రాశాడు అతని శతకాలు చాలా ఉన్నాయి అందులో బోధ పంచ దశిక ,బోదార్ధ కారక ,అనుభవ నివేదన ,అనుభావస్టక ,క్రమ స్తోత్ర భైరవఅష్టకం ,దేహ స్తిత దేవతా చక్ర స్తోత్ర ,పరమార్ద్ధ వాదాసిక ,మహోప దేశ వింశతిక ,శివ శక్త్యావినాస స్తోత్రాలు ఉన్నాయి
వేదాంత గ్రంధాలు కూడా రాశాడు ఽ అందులోఈశ్వర ప్రజ్ఞాభిజ్న విమర్శన, వ్రుత్తి విమర్శిని ,ఘత కార్పర కులాక వ్రుత్తి కావ్య కౌతుక వివరణ ,పరాత్రిక లఘు వ్రుత్తి ,పర్యంత పనికషణ ,దేవీ స్తోత్ర వివరణ ఉన్నాయి
.
మరో కవిని చూద్దాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-10-14- ఉయ్యూరు