గీర్వాణ కవితా గీర్వాణం -57
63- స్వభావోక్తికవయిత్రి మురళ
మురళ అనే కవయిత్రిపేరు బిల్హనుడి సూక్తి ముక్తావళి లో ,శార్జ్న రాసిన పద్ధతిలో చోటు చేసు కొన్నది .ఒక శ్లోకం లో విరహం ,మరోశ్లోకం లో కలయిక వర్ణించింది సుందర సరళ సులభ శైలి లో కవిత్వం రాసింది .స్వభావోక్తికి పట్టం కట్టింది .ఈ శ్లోకాలను బట్టి ఆమె ప్రసిద్ధ కవయిత్రి అనే అభిప్రాయం కలుగుతుంది .ప్రసిద్ధ కవయిత్రుల పేర్లలో మురళ పేరును ధనాద దేవుడు పేర్కొనటం గమనార్ధం .కాలం సుమారు పదిహేను వందలు .
‘’శీలా విజ్ఞామారుళా మొరికాద్యాః –కావ్యం కర్తుం శాంతి విజ్ఞాః ప్రియ్యోసి
విడ్యాం వేట్టుం వాదినో నిర్వి జేతుం –దాతుం వక్తుం యః ప్రవీణః నవంద్య’’
64-ప్రణయ కవయిత్రి -మోరిక
ధన దేవుడు మెచ్చిన మరోకవయిత్రి మోరిక . ఈమె శ్లోకాలలో ప్రణయం ముఖ్య ఇతి వృత్తం .పైన తెలుసుకొన్న కవయిత్రి మురళ తో సమానమైన పాండిత్యం కవిత్వం ఉన్న మహిళ. పదిహేను వందలు కాలానికే చెందింది .
65- లీలాశుకుడనే -బిల్వ మంగళుడు
పదకొండవ శతాబ్దానికి చెందినా బిల్వ మంగళుడు శ్రీ కృష్ణ కర్ణామృతం రాశాడు .శ్రీకృష్ణ గానం చేసిన చిలుక కనుక లీలా శుకుడు అయ్యాడు .ఇందులో మూడు వందల పది శ్లోకాలున్నాయి .భక్తీ రసం పొంగిపోరలేట్లు రాసినకవ్యం ఇది శ్రీకృష్ణ భక్తీ పరాకాష్టగా చెప్పాడు లీలాశుకుడు .మూడు ఆశ్వాసాలున్నాయి .ఒక్కోదానిలో నూటపది శ్లోకాలున్నాయి .మొదటిదానిలో శ్రీ కృష్ణ సాక్షాత్కారం ,రెండవ దానిలో కృష్ణ లీలలు ,మూడు కృష్ణుని జీవితం లో అనేక మధుర ఘట్టాలున్నాయి .నిత్య పారాయణ గ్రంధం గా గొప్ప వ్యాప్తి ఉన్నది .భక్తీ తప్ప శృంగారానికి చోటు కల్పించలేదు .జయదేవుడే లీలాశుకుడు అయ్యాడనే ప్రచారం ఉంది .చింతామణి అనే వేశ్య తో బిల్వమంగళుడు ఉండేవాడు .ఒకసారి పెద్ద గాలి వానలో ఆమెను కలుసుకోవటానికి పెరటి గోడ ఎక్కుతూ తాడు అనుకోని పామును పట్టుకొన్నాడు .జ్ఞానోదయమై లీలాశుకుడుగా మారాడు .’’కస్తూరీ తిలకం లలాట ఫాలకే ‘’శ్లోకం రాణి వారుండరు .అది లీలాశుకుని శ్లోకమే .కర్నామ్రుతాన్ని రాగామాలికలలో సభల్లో గానం చేస్తారు .ఈయన కృష్ణా జిల్లాకు చెందినవాడే అంటారు .శ్లోకాలన్నీ ముక్తక రూపం లో ఉండటం ప్రత్యేకత దేనికదే ప్రత్యేకత కలిగి ఉంటుంది .కృష్ణుడు గోప బాలకుడుగా ,గోపా బాలకుల స్నేహితుడుగా ,లోకోత్తరశృంగార పురుశోత్తముడుగా ఇందులో దర్శన మిస్తాడు .
‘’చింతా మణిర్జయతి సోమ గురుర్మే-శిక్షా గురుశ్చభగవాన్ శిఖి పించమౌళిః
యత్పాదకల్ప తరు పల్లవ శేఖ రేషు –లీలాస్వయం వర రసం లభతే జయశ్రీ ‘’
అనంత పద్మనాభ స్వామి ని మొదట దర్శించిన వాడు బిల్వ మంగళ రుషియే.కర్ణామృతం కాక శ్రీ చిహ్నం ,పురుష కారం ,అభినవ కౌస్తుభ మాల ,దక్షిణా మూర్తి స్తవం ,కాలవధ కావ్యం ,దుర్గా స్తుతి , బాల కృష్ణ స్తోత్రం ,బాల గోపాల స్తుతి ,శ్రీకృష్ణ వరదాస్టకం ,బృందావన స్తోత్రం ,భావన్నాముకురం ,రామ చంద్రాస్టకం ,గణపతి స్తోత్రం అనుభావాస్స్టకం ,మహా కాలాస్టకం,మహా లక్ష్మి సోత్రం ,కర్కోటక స్తోత్రం ,కృష్ణ లీలా వినోదం ,సాకార హృదయంగమంసుబంధ సామ్రాజ్యం ,తిన్ గంధ సామ్రాజ్యం ,క్రమ దీపిక మొదలైన ఇరవై రెండు గ్రంధాలు రచించాడు .కర్ణామృతం వింటూ శ్రీకృష్ణుడు టా ఊపే వాడని అంటారు .
66- ఆర్యా సప్త శతి కర్త -గోవర్ధనా చార్యుడు
క్రీ శ.1116వాడిన గోవర్ధనా చార్యుడు లక్ష్మణ సేన మహా రాజు ఆస్థాన కవి .ప్రాకృత గాదా సప్త శాతిని అనుకరిస్తూ ‘’ఆర్యా సప్త శతి ‘’ని సంస్కృతం లో రాశాడు .ఇందులోనూ ఏడు వందల శ్లోకాలున్నాయి .ఇదికూడా ముక్తక కావ్యం .ప్రతి శ్లోకానికి ఒక కదా ఉంటుంది .ముక్తకాలలో గొప్ప పెరుపొందినడిది .జయదేవుడి ప్రస్తుతి పొందిన కవి గోవర్ధనుడు –‘’శృంగారోత్తర సత్ప్రమేయ రచనానైరాచార్య గోవర్ధన –స్పర్దీకో పి న విశ్రుతః శృతి దారో ధోయీ కవిక్ష్మా పతిః’’అంటూ జయదేవుడు ధోయీ ని గోవర్ధనుడిని పొగిడాడు .దోయి ఏక సంతాగ్రాహి గోవర్ధన్ శృంగారస పట్లు తెలిసిన వాడు ఇద్దరూ లక్ష్మణ సేనుని ఆస్థాన కవులే .
కవితా గోవర్ధనం
అప్పటిదాకా ప్రాకృతం లోనే ఉన్న ముక్తక సాహిత్యాన్ని సంస్కృతం లోకి ప్రవేశ పెట్టిన మొదటి వాడను తానె నని గోవర్ధనుడు చెప్పుకొన్నాడు –‘’వాణీ ప్రాకృత సముచిత రాసా బలేనైవ సంస్కృతం నీతా-నిమ్నాను రూప నీరా కాళింద కన్యేవ గగన తలం ‘’.దీని భావం –లోతులో ప్రవహిస్తున్న యమునా నదిని బలరాముడు గగన తలానికి చేర్చి నట్లు ప్రారుత పాతాళం లో ఉన్న రసమయ వానిని సంస్కృతం లో ప్రవేశ పెట్టాను అని కావ్యం మొదట్లో చెప్పాడు ..ఈ కావ్యం రాసి తాన సోదరు లిద్దరికీ నేర్పాడు వారు దీన్ని గొప్పగా ప్రచారం చేశారు ఆమాల పద విన్యాసం తో ఈ ముక్తకాలు ముత్యాల సొగసును వెదజల్లుతాయి .మనసుకు బాగా పట్టుకొనే సులభ సుందర ఆర్యా వృత్తాలలో వీటిని రాసి విపరీతమైన క్రేజ్ తెచ్చాడు .సజ్జన హృదయాలను అయస్కాంతం లాగా ఆకర్షిస్తాయి .మదన రూప బ్రహ్మ జ్ఞానానికి ఉపనిష్టుల లాంటివి అన్నారు వీటిని .
ఇందులో వివిధ రకాల నాయికల వర్ణన ఉంది ప్రేమ సంయోగం వియోగం ,ఈర్ష్య అసూయ ,శృంగారం అనునయం యదా ప్రకారం ఉన్నాయి రసవాది అనిపిస్తాడు –‘’రాతిరేవ వీత వాసనా ప్రిఎవ శుద్ధాపి వాజ్ముదే సరసా –అరసా సాలంక్రుతి రాపి ణ రోచతే శాల భంజీవ ‘’భావం రాతిలో వస్రాలను వదిలేసిననాయిక , ,నాయకుని అనన్య రతి భావం కల ప్రియురాలు లాగా అలంకారం లేని సరస వాని ఆనంద ప్రదం గా ఉంటుంది అలంకారాలతో ఉన్నా రస శూన్యం గా ఉన్న వాని అలంకారాలతో నిండిన సాల భంజిక లాగా రుచికరం గా ఉండదు ‘’.అనుప్రాసద్యలంకారం అంటే గోవార్ధనుడికి మహా ఇష్టం .దీనితో కావ్యాన్ని రస మాగ్నం చేసి మానసికానందాన్ని కల్గిస్తాడు .అలంకారం అంటే చాలు పులకిమ్చిపోతాడు .అన్యోక్తి అలమ్కారమూ చాలా ఇస్టమైనదే .వ్యంగ్యార్ధం తోకావ్యాన్ని రస శోభా భరితం చేశాడు .
గోవర్ధనుడి లోక పరిశీలనాశక్తి గొప్పది మంచి లోక జ్ఞానం ఉన్నవాడు అతని శాస్త్ర పరిచయ జ్ఞానం దొడ్డది .రెండే పాదాలు ఉండే ఆర్యా ఛందస్సులో ఒక్కొక్కటి ఒక్కో కావ్య ఖండం గా తీర్చి దిద్దిన గొప్ప కవితా ప్రతిభ గోవర్ధనుడిది .రామనీయమియా వ్యంగ్యార్ధాలతో ప్రతి ముక్తకాన్ని ఒక మహా ముత్యం ళా మెరుగులు దిద్ది ప్రకాశమానం చేశాడు .ప్రాకృతం మీద మంచి గౌరవం కలిగిన వాడు .అందుకే గునాధ్యుడిని వ్యాస వాల్మీకి అంతటి వాడు అని కీర్తించాడు .
ఒక సఖి ని చెలులు యెంత నచ్చ చెప్పినా ప్రియుడిని చేరలేదు విసుగెత్తి వాళ్ళు వెళ్ళిపోగా ప్రియుడు ఆమె చెంత చేరగా ఆమె అతనితో ‘’నా సఖులు ‘చెప్పింది నేను వినలేదు .వాళ్ళు నన్నోడలి వెళ్ళిపోయారు .ఇప్పుడు నేను ఒంటరిని .నువ్వు నన్ను బలాత్కారించాలి అనుకొంటే ణా సర్వస్వం సమర్పించటానికి సిద్ధం గా ఉన్నాను ‘’అంటుంది =ఇడదేశ్లోకం లో ‘’అగ్రుహీతానునయాం మా ముపేక్ష్య సఖ్యోగతా బతైకాహం -ప్రసభం కరోపిమఇ చేత్వదుపరి వపురద్య మొక్షామి ‘’ఇదొక సాంపిల్ మాత్రమె .కావ్యం లో అడుగడుగునా ఇలాంటివి కోకొల్లలు .జుర్రుకొనే ఓపిక ఉండాలికాని కావ్యం ఆపాతమధురమే .
67- భక్తికి శాస్త్రీయత కల్పించిన -మధు సూదన సరస్వతి
క్రీ శ పదహారవ శతాబ్దం వాడిన మధు సూడన సరస్వతి శ్రీ మహా విష్ణువు కు మహా భక్తుడు .విష్ణు మూర్తిని కేశాల దగ్గరనుండి పాదాల వరకు వర్ణిస్తూ ‘’ఆనంద మందాకినీ ‘’అనే కావ్యం రాశాడు దీన్ని స్తుతికావ్యం అంటారు .కోమలమైన భక్తీ గొప్ప హ్రుదయాను భూతి ఇందులో ప్రత్రి శ్లోకం లో దర్శనం ఇస్తుంది మధుసూదనుడు’’ భక్తీ రసాయనం’’ అనే గ్రంధాన్ని రాశాడు .ఇందులో శాస్త్రీయ పద్ధతిలో భక్తిని అన్నికోనాలలోను చర్చించాడు .రూప గోస్వామి భక్తిని రసం గా చెప్పినా ,దానికి శాస్త్రీయతను కల్పించిన వాడు మధు సూడాన సరస్వతి మాత్రమె .ద్వైతం నుండి అద్వైతానికి ప్రయాణం చేశాడు .బెంగాలుకు చెందినా మధు సూదనుడి అసలు పేరు కమల నయనుడు .నవ్య న్యాయ సిద్ధాంతాన్ని చదివి ప్రచారం చేశాడు .వారణాసి చేరి సన్యాసిగా మారి అద్వైతాన్ని జేఎవితాన్తమ్ ప్రచారం చేశాడు .ఇరవైకి పైగా రచనలు చేశాడు అందులో కృష్ణ –కుతూహలం అనే నాటకం కూడా ఉంది .ఈశ్వర ప్రతిపత్తి ప్రకాశం ,భాగవత రసాయనం బాగా ప్రసిద్ధి చెందాయి .అక్బర్ చక్ర వర్తితో గొప్ప దోస్తీ ఉండేది .తులసీదాసు కు మంచి మిత్రుడు .
68- మౌలికత ఉన్న కవయిత్రి -గౌరీ
పది హేడవ శతాబ్దికి చెందినా గౌరీ రాసిన ఇరవై ఎనిమిది శ్లోకాలే దొరికాయి ఇందులో రాజనీతి ,యుద్ధం ,శత్రురాజుఅల్ విషయాలు దొర్లాయి .మౌలికత ఉన్న రచయిత్రి అనిపిస్తుంది .సహజ ధోరణిలో లలితమదురకవిత్వం రాసింది .
69- ప్రకృతి కవయిత్రి -పద్మావతి
పద్మావతి కూడా పదిహేడవ శతాబ్దానికి చెందినకవయిత్రి .దొరికినవి పందొమ్మిది శ్లోకాలు మాత్రమె .ఘూర్జర స్త్రీలతో సహా అనేక విషయాలపై రాసింది గుజరాత్ వాసి అవచ్చు సుందరమైన ప్రక్రుతి వర్ణాలు చేసింది కవిత్వం సహజ సుందరం
70- సంస్కృత ద్వ్యర్ధి కావ్య కవి-వేంకటాధ్వరి
క్రీ శ .1650కాలం వాడిన వేంకటాధ్వరి ‘’విశ్వ గుణాదర్శం’’అనే చంపూ కావ్యం రాశాడు ‘’లక్ష్మీ సహస్రం ‘’అనే వెయ్యి శ్లోకాల స్తుతి కావ్యం రాశాడు ,దీనిలో లక్ష్మీ దేవి విష్ణు స్తుతి ఉంది .రసవత్తరమైన స్తోత్ర కావ్యం గా గుర్తింపు పొందింది .’’సుభాషిత కౌస్తుభం ‘’అనే కృతికూడా చేశాడు .రాఘవ యదవీయం అనే ద్వార్దికావ్యం సంస్కృతం లో రాశాడు ,మొదటినుంచి చదివితే రామాయణ కదా కుడివైపు నుంచి చదివితే భాగవత కదా వస్తుంది ,అంటే ఒక రకం గా ద్వార్దికావ్యం అన్నమాట .ఇది ముప్ఫై శ్లోకాల కావ్యం మాత్రమె .
మరోకవిని కలుద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-10-14-ఉయ్యూరు