శ్వేతను మళ్లీ బతకనివ్వండి.

శ్వేతను మళ్లీ బతకనివ్వండి.
ఒకప్పుడు నేషనల్‌ అవార్డు విన్నర్‌, తెలుగులో ప్రముఖ హీరోయిన్‌ అయిన శ్వేతబసు ప్రసాద్‌.. ఊహించని పరిస్థితుల్లో వ్యభిచారం కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆమెను విచారించిన కోర్టు.. ప్రజ్వల రెస్క్యూ హోమ్‌కు పంపింది. కోర్టు విధించిన సమయాన్ని పూర్తి చేసుకుని ఈ మధ్యనే ముంబయికి వెళ్లిపోయింది శ్వేత. ప్రజ్వలహోంలో ఉన్నప్పుడు శ్వేత ఎలా ఉంది? ఆమె వ్యక్తిత్వం, ఆలోచనలు, ఉద్వేగాలు ఎలా ఉన్నాయి? కెరీర్‌ను మళ్లీ మొదలు పెడుతుందా? వంటివన్నీ ఆ హోం నిర్వాహకురాలు సునీతాకృష్ణన్‌కు తెలుసు. ఆ విశేషాలే ఇవి..

‘‘శ్వేతను ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నా. ఒక మహిళ తప్పు చేసినప్పుడు ప్రపంచం ఎన్నో మాటలు మాట్లాడుతుంది. అలాగే శ్వేతను గురించీ మాట్లాడింది. కాని నేను చూసిన శ్వేత వేరు. ఆ అమ్మాయిది ఊహించనంత మంచి వ్యక్తిత్వం. తను నా వద్దకు వచ్చిన తర్వాత
ఒక్క అబద్దమైనా చెప్పలేదు. అన్నీ నిజాలే చెప్పింది. చాలా కాన్ఫిడెంట్‌గాను కనిపించింది. నా దగ్గరకు ప్రతినెల వ్యభిచారం కేసుల్లో పట్టుబడిన వాళ్లు దాదాపు 65 మంది దాకా వస్తారు.
వారిలో ఎక్కువ మంది రకరకాల ఫిర్యాదులు చేస్తారు. గొడవలు పెట్టుకుంటారు. అందర్నీ బూతులు తిడతారు. ఈ హోం నుంచి ఎప్పుడెప్పుడు బయట పడతామని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తారు, అయితే శ్వేత అలాంటివేమీ చేయలేదు. వచ్చిన వెంటనే అన్నీ చాలా సహజంగా చెప్పింది. ‘‘మేడమ్‌ నాకు నాటక ప్రదర్శన మీద పట్టుంది. సితార్‌ వాయించడం బాగా వచ్చు. మంచి ఇంగ్లీషు నేర్పించగలను. ఫోటోగ్రఫీ స్కిల్స్‌కూడా నాకున్నాయి. నా నైపుణ్యాలతో నేను ఎలాంటి సర్వీసు చేయగలనో మీరే చెప్పండి’’ అంది. నేను ఆశ్చర్యపోయాను. శ్వేత ఒక హీరోయిన్‌గానే మనకు తెలుసు. ఒక వ్యక్తిలో ఇన్ని కోణాలున్నాయన్నాయంటే ఆశ్చర్యకలిగింది. తెలిసో తెలియకో తప్పు చేశాను. దానిని ఎలా సరిదిద్దుకోవాలి? అనే తాపత్రయం ఆమెలో కనిపించింది..
ఇంగ్లీషు పాఠాలు చెప్పింది..
ప్రజ్వలహోంలో ఉన్నంత కాలం – ఇక్కడ ఆశ్రయం పొందుతున్న పిల్లలందరికీ ఆంగ్ల పాఠాలు నేర్పించింది . నాటకాలలో తర్ఫీదును ఇచ్చింది. పిల్లల చేత నాటక ప్రదర్శనలు కూడా చేయించింది . ఽథియేటర్‌ఆర్ట్స్‌లో శ్వేతకు మంచి పట్టుంది. ఇవన్నీ చూశాక – ఆమెను బయటి ప్రపంచం అసభ్యంగా మాట్లాడుతుంటే విని బాధపడ్డాను. శ్వేత ఒక మంచి హ్యూమన్‌బీయింగ్‌. ఆమె తరఫు నుంచి నేను చేసే విజ్ఞప్తి ఒకటే..
శ్వేతను పదే పదే ఆ కోణం నుంచే చూస్తూ.. బాధపెట్టకండి. ఆమె తిరిగి కొత్త జీవితం మొదలు పెట్టేందుకు తోడ్పాటు నివ్వండి. మీ నైతిక మద్దతు ఆమెకు అవసరం.
ఏ దారీ కనిపించనప్పుడు..
నా దృష్టిలో శ్వేత ఒక బాధితురాలు. వ్యభిచారం చేయడానికి పేదరికం ఒక్కటే కారణం కాదు. జీవితంలో ఊహించని విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి సమయంలో ఏ దారీ కనిపించకుండా ఉన్నప్పుడు.. ఈ దారికి వెళతారు. ఎవరో ప్రేరేపిస్తారు. ఆ సమయంలో సంఘర్షణలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. మానసికమైన అనివార్యత ఏర్పడినప్పుడు తప్పులు జరగడం సహజం. ఒక సంఘటన వెనక ఇటువంటి కారణాలను సమాజం అర్థం చేసుకోదు. ఇదిగో ఇలా బయట పడినప్పుడు మాత్రం నిందించడం మొదలుపెడతారు. ఇవన్నీ పక్కన పెడితే – మా హోమ్‌కు వచ్చినప్పుడు తను ఎలా ట్రాప్‌ అయ్యిందో తెలుసుకుంది శ్వేత. ఆమెను మా హోంలో పెట్టుకున్నందుకు నేను ఎక్కడికిపోయినా మీడియా నా వెంట కూడా పడింది. ఇది బాధాకరవిషయం.
ఆమె ఒక్కరే కనిపించారా..
ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఈ కేసులో శ్వేత ఒక్కరే బాధితురాలు ఎందుకయింది ? ఆమెతో ఉన్న మగవాళ్ల పేర్లు ఎందుకు బయటకు రాలేదు ఇది కుట్ర అనిపిస్తుంది. వ్యభిచారం చేయాలంటే.. అక్కడ ఒక ఆడది మాత్రమే ఉండదు. అక్కడొక మగవాడు కూడా ఉంటాడు అని మరిచిపోకూడదు. శ్వేత వెనకున్న ఆ మగవాళ్ల మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్‌ చేయడం లేదు. ఆ వార్తల్ని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? ఆ బ్రోకర్ల మీద ఎందుకు దర్యాప్తు చేయరు? ఇలాంటి ప్రశ్నలను అందరు ఆలోచించాలి.
సానుభూతి అక్కర్లేదు…
భవిష్యత్తులో కెరీర్‌లో ఆమెకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆమె అద్భుతమైన నటి. హీరోయిన్‌గానే కాకుండా బోలెడన్ని డాక్యుమెంటరీలు తీసిన ఫిల్మ్‌మేకర్‌. ఆ నైపుణ్యాలు చాలు.. మరొకసారి జీవితంలో నిలబడటానికి. ఆమెకు మరొక ఛాన్స్‌ ఇవ్వాలి. అది మనందరి బాధ్యత. అయితే ఈ కేసులో ఇరుక్కున్న శ్వేతకు సానుభూతితో అవకాశాలు ఇవ్వడం కాదు. ఆమెలోని టాలెంట్‌ను గుర్తించి.. వాటికి మాత్రమే అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నాను. ఆ కోణంలో ఆమె పట్ల ప్రత్యేకశ్రద్ధ అక్కర్లేదు. ఒక్కడొక సంగతి చెప్పాలి – ఒక రోజున ఒక పెద్ద వ్యక్తి నాకు ఫోన్‌ చేసి.. ‘‘శ్వేత మీ దగ్గర ఉందని తెలిసింది. ఆమెకు సహాయం చేయాలనుంది? కలవొచ్చా’’ అని అడిగాడు. అప్పుడు ఆయనతో నేను అన్నాను.. ‘‘సార్‌ మీరు శ్వేతకు మాత్రమే హెల్ప్‌ చేయడం కాదు. మా దగ్గర అలాంటి అమ్మాయిలే మరో ఇద్దరు ఉన్నారు. వాళ్లకు కూడా హెల్ప్‌ చేయండి’’ అన్నాను. ఆప్పుడు ఆయన నుంచి సమాధానం లేదు. ఇటువంటి సమస్యలు కూడా ఎదురవుతుంటాయి.
కెరీర్‌ మొదలుపెడుతుంది..
శ్వేత ఇక్కడి నుంచి వెళ్లే ముందు – ఎమోషనల్‌గా ఉంది. ఈ రెండు మాసాలలో ఎంతోమందితో తనకు స్నేహం ఏర్పడింది. పిల్లలతో బంధం అల్లుకుంది. ఆమె వెళ్లేప్పుడు పిల్లలందరు ఎంతో ఆప్యాయతతో ఒక పెద్ద గ్రీటింగ్‌ కార్డును బహుమతిగా ఇచ్చారు. వెళుతూ వెళుతూ శ్వేత ‘‘ఈ సంస్థకు నా వంతు ఎంత వరకు అయితే అంత వరకు సహాయం చేస్తాను’’ అంది. గతంలో మోహన్‌బాబు కొడుకు విష్ణు మంచు నా వద్దకు వచ్చి ‘‘మేడమ్‌, మీరు ఎప్పుడైనా చెప్పండి. నేను ఆ అమ్మాయికి కెరీర్‌ ఇస్తాను. మంచి రోల్‌తో మళ్లీ ఇండసీ్ట్రలోకి తీసుకొద్దాం’’ అని హామీ ఇచ్చాడు. అన్నీ ఆలోచిస్తున్నాను. శ్వేత కెరీర్‌ కోసం నా వంతు కృషి చేస్తున్నాను..’’                                                                                         -చందు తులసి, ఏబీఎన్‌ ప్రతినిధి, హైదరాబాద్‌

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.