ఎవరితోనైనా ఈజీగా కలసిపోయే మనస్తత్వం నాన్నది- హరనాథ్‌ తనయుడు శ్రీనివాసరాజు

ఎవరితోనైనా ఈజీగా కలసిపోయే మనస్తత్వం నాన్నది- హరనాథ్‌ తనయుడు శ్రీనివాసరాజు
‘మా ఇంటి మహాలక్ష్మీ’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన హరనాథ్‌ అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్‌ తర్వాత అందగాడైన కథానాయకునిగా ఆయన పేరు పొందారు. . రొమాంటిక్‌ ఐకాన్‌గా గుర్తింపు పొందిన ఆయన‘అమరశిల్పి జక్కన’, ‘పాండవ వనవాసం’, ‘భీష్మ’ వంటి క్లాసికల్స్‌లో కూడా నటించారు. తెలుగులో 115కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించారు. పరిశ్రమ ఆయన్ని ఎప్పుడో మరిచిపోయినా శాటిలైట్‌ ఛానల్స్‌లో హరనాథ్‌ చిత్రాలను చూసే ప్రేక్షకులకు ఆయన చిరస్మరణీయుడే. . నేడు హరనాథ్‌ 25వ వర్థంతి. ఈ సందర్భంగా హరనాథ్‌ జ్ఞాపకాలను గురించి ఆయన తనయుడు శ్రీనివాసరాజుతో ముచ్చటించింది ‘చిత్రజ్యోతి’. ఆ విషయాలు ఆయన మాటల్లోనే.
మా చిన్నతనంలో నాన్న షూటింగ్‌లతో బిజీగా ఉండేవారు. ఎంత బిజీగా ఉన్నా మాకోసం కొంత సమయాన్ని కేటాయించేవారు. ఆయనది చాలా ఫ్రెండ్లీ నేచర్‌. సున్నిత మనస్కుడు. మాకు ఊహ తెలిసే సరికి ఆయనకు సినిమా మార్కెట్‌ తగ్గింది. నాన్నకు స్నేహితులంటే ప్రాణం. వారికి ఆపద అని తెలిస్తే చాలు ఈయన దగ్గర ఉన్నా లేకపోయినా సహాయం చేసేవారు. వెనుకాముందుఆలోచించకుండా పరిధిని దాటి దానం చేసేవారు. ఆయనది చాలా పెద్ద సర్కిల్‌. దానికి తగ్గట్టే మెయింటెనెన్స్‌ ఉండేది. ఆయన జీవితానికి ఫ్రెండ్‌షిప్పే ప్లస్‌, మైనస్‌ అయింది. ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చారు కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొలేదు. సంపాదించాలనే తపన ఆయనకు ఉండేదికాదు. రియలైజ్‌ అయ్యే సరికి జరగాల్సింది జరిగిపోయింది.
పైలట్‌ ట్రైనింగ్‌కి వెళ్ళి
మా తాతగారు చాలాకాలం చెన్నైలో ఉన్నారు. ఎన్టీఆర్‌తో మంచి అనుబంధం ఉండేదట. కొన్ని సినిమాలకు దర్శకత్వపు శాఖలో కూడా పనిచేశారు. అదే సమయంలో నాన్న పైలట్‌ ట్రైనింగ్‌ కోసం మద్రాస్‌ వెళ్ళారు. బస్‌ కోసం వెయిట్‌ చేస్తున్న నాన్నను చూసి గుత్తా రామినీడుగారు సినిమా హీరోగా అవకాశం ఇచ్చారు. సినిమా ఇండస్ర్టీలో అడుగుపెట్టడానికి మా నాన్నగారు ఎటువంటి కష్టం పడలేదు. నాన్న సినిమాలు చూస్తుంటే ఆయన యాక్ట్‌ చేసినట్లు అనిపించదు. ఇంట్లో ఎలా ఉండేవారో తెరపైన కూడా అలాగే కనిపించేవారు. ఎవరితోనైనా ఈజీగా కలిపిసోయే తత్వం ఆయనది.
ఆ సంఘటన గుర్తొస్తే బాధగా ఉంటుంది
నాన్నకు క్యాన్సర్‌ అని తెలిసి కూడా నేను లండన్‌ వెళ్ళాను. అప్పటికే రెండేళ్ళు చికిత్స పొందడంతో చాలావరకు ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. లండన్‌ వెళ్ళడం గురించి ఆయనను అడగగా వెళ్ళమనీ చెప్పలేదు. వెళ్ళొద్దని చెప్పలేదు. 1989 ఆగస్ట్‌లో లండన్‌ వెళ్ళాను. వెళ్లిన మూడు నెలల్లో (నవంబర్‌, 1న) ఆయన మరణించారు. చివరి క్షణాల్లో దగ్గరలేనని చాలా బాధపడ్డాను. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొస్తే ఆ రోజు లండన్‌ వెళ్లి పొరపాటు చేశానని బాధపడుతుంటాను. నాన్నతో ఎన్ని మధుర జ్ఞాపకాలున్నా ఇది మాత్రం మరచిపోలేని సంఘటన.
నిర్మాతగా కొనసాగాలనుంది

నిర్మాతగా తెలుగు, తమిళ భాషల్లో ఏడు సినిమా తీశాను. ఇప్పుడు కూడా సినిమాలు తియ్యాలనుంది. కానీ ఇప్పటి పరిస్థితులను బట్టి తొందరపడను. ప్రస్తుతం మిత్రులతో కలిసి ప్రొడక్షన్‌ హౌస్‌ నడుపుతున్నాను. బడ్జెట్‌ కంట్రోల్‌లో తియ్యాలనుకుంటున్నాను. పవన్‌కళ్యాణ్‌, ప్రభాస్‌తో సినిమాలు చెయ్యాలనేది నాకున్న మరో కోరిక. ఎప్పటికి కుదురుతుందో చూడాలి.
పవన్‌కళ్యాణ్‌కి నాన్నకి పోలికలు
సహాయం చేసే విషయంలో నాన్నకి, పవన్‌కళ్యాణ్‌గారికి చాలా దగ్గర పోలికలున్నాయి. ఆయన కూడా దానం చేసే విషయంలో ఎంత ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఆలోచించేవారు కాదు. ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ని చూస్తుంటే నాన్న మనస్తత్వానికి, ఆలోచనకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది. కాకపోతే పవన్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నాన్నకు ఆ ఆలోచన ఉండేది కాదు. నాన్న పుట్టినరోజు, పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు ఒకే రోజు కావడం కూడా ఒక పోలికగా భావిస్తాను.
సినిమా పరిశ్రమలో ఉన్నందుకు గర్వపడుతున్నా
కుటుంబ సభ్యులు మరణిస్తే వారి జ్ఞాపకాలను ఫోటోల రూపంలో చూసుకుంటూ ఆయా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాం. కొన్ని సందర్భాలో బాధ కూడా కలుగుతుంది. ప్రతి నాలుగైదు రోజులకి నాన్న తాలూకు జ్ఞాపకాలను సినిమాల రూపంలో చూస్తూ చాలా ఆనందపడుతుంటాం. చాలామంది ‘‘ఈరోజు మీ నాన్న సినిమా టీవీలో చూస్తున్నాం’’ అంటూ ఫోన్‌ చేసి చెబుతుంటే సినిమా మనిషిని అయినందుకు గర్వపడుతుంటా. కేవలం నటులకు మాత్రమే దక్కిన అవకాశమిది.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.