మత తత్వం !!
సర్వేజనా సుఖినోభవంతని అన్నది హైందవ ధర్మం !
అహింస పరమ ధర్మం అని అన్న భౌధ్ద ధర్మం !
పొరుగువానిని ప్రేమించమని అన్నది క్రైస్తవ ధర్మం !
దానధర్మాలతో పేదవారిని బ్రతికించమని అన్నది ఇస్లాం ధర్మం !!
మతం ఏదైనా జన హితాన్ని కోరుకున్నదనుట నిజం !
మానవత్వాన్ని గౌరవించే మతమేదైనా మంచిదే !
ఆ మత తత్వాన్ని ప్రతిపాదించినవారు మాన్యులు !
ఆ మత తత్వాన్ని అనుసరించేవారు సామాన్యులు !!
మత మౌఢ్యాన్ని పెంచుతూ! పరులపై విద్వేషాన్ని కక్కుతూ !
అధికారపు అందలాలు ఎక్కతూ ! మతాన్ని మలంలో కుక్కుతూ !
స్వార్ధమనే సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు ! అసామాన్యులు !
వారే శ్రమను దోచుకునే పెట్టుబడిదార్లు ! సాటివారిని చంపే విప్లవకారులు !!
బ్రతికే హక్కును కాలరాస్తున్న కాప్టలిజం ! కమ్యూనిజాలకన్నా !
సెక్యులర్ భావాలున్న మాన్యుల మత తత్వం మిన్న !
ఇది కాలం కని పెంచిన నిజం ! కదిలే కాలానికి సాక్ష్యం !
అందుకే ! ఇది ఓ త్రి కాల వేదం ! ఈ బందా నాదం !!
రచన : బందా వేంకట రామారావు, 9393483147,
బందా భవనం, యాదవుల బజారు , పటమట సెంటరు
, విజయవాడ – 520010 .