గీర్వాణ కవుల కవితా గీర్వాణం -62
96- భాషార్నవ కర్త -నుదురుపాటి వెంకన్న
పుదుక్కోట రాజు ఆస్థానం లో ఉన్న తెలుగు కవి నుదురు పాటి వెంకన్న సంస్కృతం తెలుగులలో దిట్టమైన కవి .’’ఆంద్ర భాషార్నవం ‘’అనే తెలుగు నిఘంటువు రాశాడు .తొండమాన్ రాజుల వంశావళి రాశాడు .తండ్రి సీతారామయ్యా గోప్పకవే ‘’.ఉద్దండకవి’’ బిరుదాంకితుడు తండ్రి .వెంకన్న పార్వతీ కల్యాణం,రఘునాదీయం ,మల్లుపురాణం,బృహనన్నాయిక దండకం ,తొండమాన్ వంశావళి అనే గ్రంధాలు రాశాడు .ఇతని భాశార్నవం తెలుగు తమిళ దేశాలలో బాగా ప్రచారమైన పద్య నిఘంటువు . మూడు భాగాలున్న ఈ బృహత్ నిఘంటువు అంతవరకూ ఎవరూ రాయని మహత్తర రచన .
వెంకన్న రాసిన రఘునాదీయం అనే సంస్కృత రచన ను సమకాలీనుడు ప్రభువు అయిన రఘునాధ రాయ తొండమాన్ కు అంకితమిచ్చాడు .పార్వతీకల్యాణం యశాగానం మల్లపురాణం తెలుగు రచన .మల్ల జాతి వివరాలుంటాయి .బృహన్నాయక దండకం రఘునాధ రాయని మీద చెప్పిన తెలుగు కవిత్వం .అద్భుతరచన గా ప్రాముఖ్యం పొందింది . ఇంతకంటే ఈ కవి వివరాలు మనకు తెలియటం లేదు .
97-వికట నితంబ
తొమ్మిదవ శతాబ్దానికి చెందినా ఈ మహిళా కవి సంస్కృతం లో సరళ విలక్షణ రచన చేసింది .’’భయంకర మైన పిరుదులుకలది ‘’ అని వయాట నితంబ అనే మాటకు అర్ధం .బహుశా నిక్ నేమ్ అయి ఉండచ్చు .తన కవిత్వం లో వీటిని మెక్చుఒన్తో రాసుకున్నది .ఆ కాలం లో ఇలాంటి పేర్లు ఉండేవి .జఘన చపాల అలాంటి పేర్లలో ఒకటి .వయాట నితంబ రాసిన వానిని తరువాతిఆలపు కవులు పేర్కొన్నారు .ముఖ్యం గా 1363వాడిన సారంగ ధరుడు ఆమె కవిత్వాన్ని సుభాషిత రత్న కోశం లోఉదాహరించాడు .విద్యాకారుడు సదుక్తి కర్ణామృతం ,సుభాషితావళిలో పేర్కొన్నాడు . శృంగార రసం లో కవిత్వాన్ని ముంచి తేల్చింది వికట నితంబ ..ఆమె కవిత్వాన్ని రాజశేఖరుడు ఆనంద వర్దానాచార్యుడు ఉదాహరించారు .భోజ దేవుడు శృంగార ప్రకాశ లో ఆమె కవిత్వాన్ని మెచ్చాడు .
‘’పృదా కాలే వదతి సభాషం-తద్విపరీతం యస్య హిరన్యే-లుమ్పతి చాస్తిత్రే రం వా షం వా –తస్మై దత్త వికట నితంబా ‘’దీని అర్ధం చదువురాని మూర్హ శిఖామణికి ఉస్త్ర అనే మాటనే పలకలేని సన్యాసికి వికట నితంబను కట్ట బెట్టారు ‘ఇదిఒక చాటువు .రుద్రకుడు దీన్ని ఉదాహరించాడు .
97-కిల్లినూర్ రాజ రాజ వర్మ
కరీంద్ర లేక చేర్నూరి అని పిలువా బడే కిల్లినూర్ రాజ రాజ వర్మ 1812-1845కాలం సంస్కృతకవి ,సంగీతకారుడు .తిరువాన్కూర్ సంస్థాన మహా రాజు కవి సంగీతజ్ఞుడు స్వాతి తిరుణాల్ రాజాస్థానం లో ఉండేవాడు .మనకవి కిల్లినూర్ రాజ ప్రాసాదం లో జన్మించాడు .ద్రుత కవిత్వం లో మహా విద్వాంసుడు .అందుకే అతనికి’’ ద్రుత కవి మణి’’.అని బిరుదు వచ్చింది .భారీ గా మంచి పర్సనాలిటీ తో ఉండే వాడు కనుక ‘’కరీంద్రన్’’.ఆశువుగా నిమిషాల మీద కవిత్వం చెప్పేవాడు .అందుకనే విద్వాన్ అనే బిరుదును మహా రాజా స్వాతి తిరుణాల్ నుంచి పొందాడు .కదాకాలి లేక అట్టకాలు అనే నాటకాలు సంస్కృతం లో రాశాడు .సంతాన గోపాలం రాశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-11-14-ఉయ్యూరు