దర్శనీయ దైవ క్షేత్రాలు శ్రీ త్రికూటేశ్వర స్వామి -కోటప్పకొండ
సాహితీ బంధువులకు శుభ కామనలు -నిన్న 20-11-14 గురువారం మేమిద్దరం ,మా కుటుంబ స్నేహితురాలు శ్రీమతి మల్లికాంబ గారు ఉదయం అయిదింటికి ఉయ్యూరులో కారులో బయల్దేరి విజయవాడ గుంటూరు మీదుగా నరసరావు పేట వెళ్లి ఆడ మా బంధువుల అమ్మాయి తెలుగు లెక్చరర్ అయిన శ్రీమతి యడవల్లి మనోరమ వాళ్ళ ఇంట్లో ఒక గంట ఉన్నాం . తర్వాతగుంటూరు జిల్లాలోని కో టప్ప కొండ వెళ్లి అక్కడ శ్రీ త్రికోటీ శ్వర స్వామి దివ్య దర్శనాను భూతిని పొంది ,ఆక్కడి నుండి ప్రకాశం జిల్లాలోని త్రిపురాసుర సంహారాన్ని మహాశివుడు చేసిన త్రిపురాంతకం చేరి ఆక్కడ డ మహా మహిమాన్విత,మరియు బావి లో వెలసిన శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ,ఛి న్న మస్తకాదెవిని ,కొండ పైనున్న శ్రీ త్రిపురాన్త కేశ్వర ,పార్వతీ అమ్మవార్లనుదర్శించాం అక్కడి నుండి మళ్ళీ గుంటూరు జిల్లా పొన్నూరు చేరి అక్కడ అతిపెద్ద శ్రీ ఆంజనేయ స్వామిని , ప్రసిద్ధ శ్రీ భావనారాయణ స్వామిని ,శ్రీ ఆంజనేయ శివ దేవాలయాల సమూహ దేవాలయాలను దర్శించి ,రాత్రి పది గంటలకు ఉయ్యూరు చేరుకొన్నాం . కా ర్తీక మాసం చివరి రోజుల్లో చేసిన ఈ క్షేత్ర దర్శనమ్ దాదాపు అరవై ఏళ్ళ కల సాఫల్యం అయింది ఆనన్దమ్ గా గా ఉంది .
మేమిద్దరం ,మల్లికాంబగారు -20-11-14గురువారం నరసరావుపేటలో శ్రీమతి యడవల్లి మనోరమ ఇంట్లో ను కోటప్ప కొండ ,త్రిపురాంతకం ,పొన్నూరు దేవాలయ సందర్శన చిత్ర భోగం .కోటప్పకొండపై మా శ్రీమతి ప్రభావతి అమ్మగారు పద్మావతమ్మగారి త్తండ్రి తండ్రి గారు శ్రీ చతుర్వేదుల పున్నయ్య గారు తమస్సు చేసి, కపాల మోక్షం పొందినఎత్తైన పై కొండ ,కొండకింద మా గబ్బిటవారైన శ్రీ గబ్బిట కోటయ్య గారు శివరాత్రి రోజుల్లో చేసే బ్రాహ్మణ అన్నదాన సత్రం -ఉన్నాయి చూడండి
ఈ యాత్రలో మొదటి అను భూతి మా పాపాయి పిన్ని (బుల్లిమూతి పిన్ని )మేనకోడలు శ్రీమతి యడవల్లి మనోరమ దంపతులను నరసరాపేట లో వారింటికి వెళ్లి చూడటం .ఆమె చేసిన సత్కారం పొందటం సరసభారతి పుస్తకాలు ఆమకు అందించటం, ఆమె ఇచ్చినవి తీసుకోవటం శ్రీ గంధం యాజ్ఞ వల్క్య శర్మ గారికి మన పుస్తకా లు అందజేయమని మనోరమకు ఇవ్వటం శర్మగారి కొత్త కదా సంపుటి(ఇంకా ఆవిష్కారం కా నిది) ఈమె ద్వారా నాకు అంద జేయటం .
రెండవది మా శ్రీమతి ప్రభావతి తల్లిగారు (నా అత్త గారు )పద్మావతక్కయ్య తండ్రి గారు చతుర్వేదుల వెంకటప్పయ్య గారి తండ్రి గారు చతుర్వేదుల పున్నయ్యగారు కోటప్ప కొండలో త్రికూట పర్వతాలలో అత్యంత ఎత్తైన కొండమీద దారి తెన్నూ లేని మార్గాన వెళ్లిసుమారు మూడు వందల ఏళ్ళ క్రితం అక్కడే తపస్సు చేసి కపాల మోక్షం తో ముక్తిని సాధించిన ఆ కొం డను త్రికూటేశ్వర స్వామి కొండ నుంచే దూరంగానే చూసి పరవశిం చటం, మా ఆవిడ ఎన్నో ఏళ్ళుగా చూడాలని తపించిన ఈ క్షేత్రాన్ని ,ఆ కొండను ఇన్నాళ్ళకు చూపించ గలగటం
,మూడవ విశేషం -దాదాపు ముప్ఫై ఏళ్ళ క్రితం వరకు కోటప్ప కొండ నుండి ఒక బ్రాహ్మణుడు కోటప్ప కొండలో శివరాత్రి రోజుల్లో బ్రాహ్మణులకు అన్నదానం నిర్వహించే శ్రీ గబ్బిట కోటయ్య గారి తరఫున ఉయ్యూరుకు శివరాత్రికి నెల రోజుల ముందే వచ్చి మా ఇంటిలోనూ ,ఊళ్ళోని బ్రాహ్మణ్యం దగ్గరా చందాలు వసూలు చేసి రసీదులు ఇచ్చి మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళేవారు అప్పుడు మేమిచ్చిన చందా రెండు రూపాయలు మాత్రమె అని ఇప్పుడు చెబితే ఆశ్చర్యం గానే ఉంటుంది అదే ఎక్కుకు ఆరోజుల్లో .. దాన్ని అయిదు రూపాయలకు చివరికి పది రూపాయలు చేసి ఇచ్చిన జ్ఞాపకం .శివరాత్రి అవగానే ప్రసాదం ,అక్షతలు పోస్ట్ లో పంపే వారు. మా నాన్న గారి కాలం లో మా అమ్మగారికా లమ్ లోను , నాకాలం లో ఇది అవిచ్చిన్నంగా జరిగింది గత ముప్ఫై ఏళ్ళుగా అక్కడి నుండి ఆ బ్రాహ్మణు డు కాని ఆయన తరఫున కాని ఎవరూ చందాలకు రాకపోవటం మాకు వెలితిగానే ఉంది .నిన్న కోటప్ప కొండలో ఆ గబ్బిట కోటయ్య గారి అన్నదాన సత్రం ను చూసి గొప్ప అనుభూతికి లోనయ్యాం . శిధిలావస్థ లో ఉంది సత్రం అయితె మనోరమ చెప్పినదాని ప్రకారం గబ్బిట కోట య్య గారి వంశానికి చెందిన వారు ఇప్పటికీ ప్రతి శివరాత్రీ కి పది హీను రోజులు ముందు ఈ సత్రానికి వచ్చి బ్రాహ్మణులకు అన్నదానం చేస్తున్నారని తెలిసి మహదానందం వేశింది . . మాకు అందులో భాగం కల్పించి విరాళాలు స్వీకరించి మాకు పుణ్యాన్ని కల్పించ లేక పొతు న్నందుకు మనసులో బాధ గానే ఉంది .కాని ఆ కోటయ్య గారి సత్రం చూసినందుకు సంతృప్తిగా ఉంది .కొట య్యగారికి శతకోటి నమస్కా రాలు ,క్క్రుతజ్నతలు మనసులోనే అర్పించాను సత్రం శిదిలమవుతున్నందుకు బాధగా కూడా ఉంది .
ఇదంతా నిన్నటి మహానందా ను భవం కా ర్తీకం లో దక్కిన మహా పుణ్యం .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ – 21-11-14
Like this:
Like Loading...
Related
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D