జయించరాని మరణానికి తలవంచిన మానవత నిర్మించినవే స్మృతులు – అవే సమాధులు!
భరించరాని దుర్మార్గం కబళించలేక మిగిలించినవే స్మృతులు – అవే శిధిలాలు !
అనంతమైన సంపదలు ఆవిరవగ అగుపించేవే స్మృతులు – అవే పురాతన భవనాలు !
అన్యోన్యమైన ప్రేమ విఫలమైతే మరణించేవే స్మృతులు – అవే ఎందరో ప్రేమికుల విషాదాంతాలు !
అభాగినుల ఆక్రందనలో అంతమయేవి స్మృతులు – అవే నిర్భయల నిర్యాణాలు !!
పాపపుణ్యాల కోలాటంలో విగ్రహాల ఆరాధనాస్మృతులు – అవే ఆస్తికుల ఆవాసాలు !
విగ్రహారాధన వద్దంటూనే వాటికి జోహార్లు పలికే స్మృతులు – అవే నాస్తికుల మనస్తత్వాలు !
కాలం ఏదైనా ! గమనం ఎటైనా ! అనంతాలు స్మృతులు! అనిర్వచనీయాలు స్మృతులు !
———— రచన బందా వేంకట రామారావు , 9393483147..
