”భళా” త’భలా’ ప్రసాద్‌!

త’భలా’ ప్రసాద్‌!

వయ్యారిభామ నడక తీరును, ఆమెను అనుసరించే పోకిరి కుర్రాడి అల్లరి చేష్టలను.. లయకారుడి ఉగ్రతాండవాన్ని, ఆయన్ని శాంతింపజేసే మంత్రపఠనాన్ని తబలా వాయిద్యంతోనే చూపించగల నేర్పరి ఈయన. తన 72 ఏళ్ల వయసులో 65 ఏళ్లపాటు తబలాతోనే సావాసం చేసిన విద్వాంసుడాయన. ఘంటసాల నుంచి నేటి కార్తీక్‌ రాజా వరకు ఎంతోమంది సంగీత దర్శకుల వద్ద తబలా విద్వాంసునిగా పని చేసిన ఆయన ఆ వాయిద్యాన్నే తన ఇంటిపేరుగా మార్చుకుని ‘తబలా ప్రసాద్‌’ అయ్యారు. చెన్నైలోని ఎన్‌టీఆర్‌ వీధిలో నివశిస్తున్న ప్రసాద్‌.. వెయ్యి సినిమాలకు 
‘‘మాది విజయనగరం. మా నాన్నగారు జె.జగన్నాధం, అమ్మ గుబ్బమ్మ. నాన్న జెమినీ స్టూడియోలో నలభయ్యేళ్ల వరకూ తబలా విద్వాంసునిగా పని చేశారు. నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. 11 మంది సంతానంలో నేను మూడోవాడిని. తేనాంపేటలో వున్న కేసరి స్కూల్లో చదువుకున్నాను. నాతో పాటు రాజశ్రీ, జయచిత్ర, రాఘవేంద్రరావు, రేలంగి గారి పిల్లలు, మణిమాల, బాబూరావ్‌ వంటి వారంతా ఆ స్కూల్లోనే చదువుకునేవారు. అన్నయ్య వీజే రామలింగం కూడా తబలా వాయిద్యకారుడే. అప్పట్లో ఆయన కేవీ మహదేవన్‌ వద్ద పని చేశారు. ఆయనకు సహాయకుడిగా నేను వెళ్తుండేవాడిని. 1950లో, అంటే నా ఏడవ ఏట ఘంటసాల గారి పాట రికార్డింగ్‌కి వెళ్లాను. అప్పుడు నాకన్నా నేను వాయించే తబాలా ఎత్తుగా వుండేది.
ఏడేళ్లకే.. 
అప్పటికే ఇంట్లో నాన్న, అన్నయ్య తబలా వాయిస్తుండడంతో వారి వద్ద నేర్చుకునేవాడిని. ఆదిలో ఆసక్తితో, ఆ తరువాత అలవాటు ప్రకారం నేర్చుకున్నాను. నా ప్రావీణ్యం చూసిన నాన్నగారు ఏడేళ్లకే తీసుకెళ్లి ఘంటసాల మాస్టారి వద్ద పెట్టేశారు. ఆయన దగ్గర ముప్ఫయ్యేళ్లపాటు పని చేశాను. చిన్నపిల్లాడినైనా పెద్దలంతా నాకు అవకాశం ఇచ్చేవారు. నాలోని విద్యని ప్రోత్సహించేవారు. ఘంటసాల వారి వద్ద పని చేస్తూనే నాన్న, అన్నయ్యలతో కలిసి కచేరీలకు, సినిమా రికార్డులకూ వెళ్తుండేవాడిని. ‘‘ఒసే వయ్యారి రంగీ! వగలమారి రంగీ…’’ పాటకి తబలా వాయించింది నేనే. ‘విప్రనారాయణ’ సినిమాలో నాన్న, అన్నయ్య, నేను కలిసి పని చేయడం విశేషం. ‘భక్త ప్రహ్లాద’ సినిమాకు కూడా మేం ముగ్గురం కలిసి పని చేశాం. అప్పటికి నా వయసు పన్నెండేళ్లు. ఎంఎస్‌ విశ్వనాధన్‌ వద్ద 1972 నుంచి పని చేస్తున్నాను. నేను తబలాతో పాటు డోలక్‌, డోల్కీ, పఖావాజ్‌ కూడా వాయిస్తాను. చిన్న రేకు ముక్క ఇచ్చినా దానిని వాయిద్యంగా ఉపయోగిస్తాను. అలా ఎన్నో సినిమాల్లో చాలా ప్రయోగాలు చేశాను.
వారిద్దరే ముఖ్యులు..
ఘంటసాల మాస్టారితో పాటు ఎంఎస్‌ విశ్వనాధన్‌, సత్యం, పెండ్యాల నాగేశ్వరరావ్‌, ఇళయరాజా, సాలూరి రాజేశ్వరరావ్‌, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌, ఆర్‌డీ బర్మన్‌, నౌషద్‌, చిత్రగుప్తా, రవి, బప్పిలహరి, కీరవాణి, చక్రవర్తి, ఏఆర్‌ రెహ్మాన్‌, యువన్‌శంకర్‌ రాజా, కార్తీక్‌ రాజా వంటి ఎంతోమంది సంగీత దర్శకుల వద్ద పని చేశాను. వారంతా నన్నెంతో ప్రోత్సహించారు. ఏఆర్‌ రెహ్మాన్‌తో ‘రోజా’ సినిమాకు పని చేశాను. ఓసారి ఎంఎస్‌ విశ్వనాధన్‌ ఏదో సినిమాకు రికార్డింగ్‌ చేస్తున్నారు. పాట పాడేందుకు స్టూడియోకు జె.ఏసుదాస్‌ వచ్చారు. మామధ్య ఏదో చిన్న వాగ్వివాదం జరిగింది. దాంతో ఆగ్రహించిన ఏసుదాస్‌ నన్ను ట్రూప్‌ నుంచి తీసేయాలని విశ్వనాధన్‌కు చెప్పారు. ఎంత సర్ది చెప్పినా ఆయన వినలేదు. రికార్డింగ్‌లో నేనుంటే ఆయన పాడనన్నారు. దాంతో ఎంఎస్‌ నేనే ముఖ్యమని తెగేసి చెప్పారు. మనిషిని చూడగానే అతను ప్రతిభావంతుడా కాదా అని ఎంఎస్‌ విశ్వనాధన్‌, ఇళయరాజా ఠపీమని చెప్పగలరు. నేను ఎంతోమంది మహామహులతో పని చేశాను. కానీ వీరిద్దరు మాత్రం కళాకారులను అంచనా వేయడంలో దిట్ట.
బాంబేకు రమ్మన్నారు…
ఓసారి చెన్నైలోని పామ్‌గ్రూవ్‌ హోటల్లో ఏదో కచ్చేరీ ఇస్తుండగా లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ చూశారు. నా పనితీరు నచ్చి బాంబేకి పిలిపించుకున్నారు. అలా అలా ఎంతోమంది హిందీ సంగీత దర్శకుల వద్ద పని చేశాను. ఆర్‌డీ బర్మన్‌ సంగీత దర్శకత్వం వహించిన ‘షాలిమర్‌’ సినిమా నాకు మంచిపేరు తెచ్చి పెట్టింది. హిందీలో ‘అమర్‌-అక్బర్‌-ఆంటొనీ’ సినిమాలో ‘పరదా హై పరదా…’ సినిమా కూడా నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ‘ఆమె కథ’ చిత్రంలో తబాలా సోలో నాకు ఎనలేని గుర్తింపునిచ్చింది. ‘అపూర్వ రాగంగళ్‌’ తమిళ చిత్రంలో కమల్‌ మృదంగం వాయిస్తారు. హిందీ రీమేక్‌లో ఆయన తబలా వాయిస్తాడు. అందుకోసం ఆయనకు తర్ఫీదునిచ్చేందుకు నన్నే పిలిచారు. ఒకటిన్నర నెలలపాటు నేను ఆయనింటికి వెళ్లి తబలా వాయుద్యం నేర్పాను. ఆయన కూడా అప్పుడప్పుడూ మా యింటికి వచ్చేవారు.
వారసులదీ అదే బాట..
నాకు నలుగురు సంతానం. ఒకరు చనిపోయారు. ఇప్పుడు ఒక అమ్మాయి, ఇద్దరబ్బాయిలు రమణ, కుమార్‌ వున్నారు. వారిద్దరూ ఏఆర్‌ రెహ్మాన్‌, యువన్‌ శంకర్‌రాజా, హ్యారిష్‌ జయరాజ్‌ వద్ద తబలా వాయిస్తున్నారు. వారంతా చిన్నప్పటి నుంచీ స్నేహితులు. నా మనవడు కార్తీక్‌ వంశీ కూడా తబలా, డ్రమ్స్‌ వాయిస్తాడు. వారంతా బాగానే స్థిరపడ్డారు. మళ్లీ జన్మ వుందో లేదో తెలియదు. ఒకవేళ వుంటే మాత్రం మళ్లీ ‘తబలా ప్రసాద్‌’గానే పుట్టాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. 65 ఏళ్లపాటు తబలా వాద్యకారునిగా కొనసాగానంటే అంతకంటే కావాల్సింది ఏముంది? ఇప్పటికీ నాకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. శరీరానికి వయసు వచ్చింది తప్ప, మనసుకి కాదు.
నేడు సహజత్వం లేదు..
అప్పట్లో మద్రాస్‌లో తెలుగు పరిశ్రమ వున్నప్పుడు తెలుగులోనూ నాకు మంచి అవకాశాలు వచ్చేవి. కానీ ఇప్పుడిక్కడ తెలుగు పరిశ్రమ లేదు కదా, అందులో అవకాశాలు తగ్గడం సహజమే. అప్పట్లో పాటకు 100 నుంచి 200 రూపాయల వరకు ఇచ్చేవారు. ఇప్పుడు పాటకి 10 వేల నుంచి 20 వేల వరకు ఇస్తున్నారు. కానీ అప్పుడే హాయిగా వుండేది. అప్పుడు డబ్బు తక్కువైనా గౌరవం ఎక్కువగా వుండేది. కానీ ఇప్పుడు డబ్బు ఎక్కువ, మర్యాద తక్కువ అయిపోయాయి. కళాకారుడు డబ్బు కన్నా గౌరవమర్యాదల్నే అధికంగా కోరుకుంటాడు. ఇప్పుడు మర్యాదలతో పాటు అవకాశాలు తక్కువైపోయాయి. అన్నీ కంప్యూటర్లే చేసేస్తున్నాయి కదా!

ఇప్పుడు కంప్యూటర్‌తోనే అన్ని వాయిద్యాలు వినిపిస్తున్నారు. మ్యాన్యువల్‌ ఇన్‌సు్ట్రమెంట్‌ ఉపయోగించడం లేదు. అందుకే పాట సంగీతంలో సహజత్వం వుండడం లేదు. సంగీతకారులు దీనిని బాగా గుర్తించగలరు. సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ వల్ల కూడా డైలాగ్‌ మనకు స్పష్టంగా వినిపించదు. అదే మాన్యువల్‌ ఇన్‌సు్ట్రమెంట్‌ ఉపయోగిస్తే మనకు దేనికది స్పష్టంగా వినిపిస్తుంది. అంతేగాక పదిమందికి పని దొరుకుతుంది. పది కుటుంబాలు బాగు పడతాయి. సంగీత దర్శకులు దీనిని గుర్తిస్తే బావుంటుంది.
డాక్టర్‌ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా, చెన్నై

ఫోటోలు: కర్రి శ్రీనివాస్‌
పాట పాడేందుకు స్టూడియోకు జె.ఏసుదాస్‌ వచ్చారు. మామధ్య ఏదో చిన్న వాగ్వివాదం జరిగింది. దాంతో ఆగ్రహించిన ఏసుదాస్‌ నన్ను ట్రూప్‌ నుంచి తీసేయాలని విశ్వనాధన్‌కు చెప్పారు. ఎంత సర్ది చెప్పినా ఆయన వినలేదు. రికార్డింగ్‌లో నేనుంటే ఆయన పాడనన్నారు. దాంతో ఎంఎస్‌ నేనే ముఖ్యమని తెగేసి చెప్పారు. మనిషిని చూడగానే అతను ప్రతిభావంతుడా కాదా అని ఎంఎస్‌ విశ్వనాధన్‌, ఇళయరాజా ఠపీమని చెప్పగలరు.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.