గీర్వాణ కవుల అవితా గీర్వాణం -65
100-సాహిత్య రత్న రహస్ బిహారీ ద్వివేది
ఉత్తర ప్రదేశ్ లోని అలహా బాద్ లో రహస్ బిహారీ ద్వివేది 2-1-1947 జన్మించాడు సంస్కృతం లో రాష్ట్ర పతి ప్రశంసా పత్రం2012లో అందుకొన్నాడు .సంస్కృత సాహిత్యం లో ఆచార్య డిగ్రీని ,సాహిత్య రత్నను ,ఏం. ఏ .లను పొందాడు .1977లో మధ్య ప్రదేష్ లోని జబల్పూర్ లో ఉన్న రాణి దుర్గా వతి యూని వర్సిటి నుండి సంస్కృతం లో పి. హెచ్ .డి.పొందాడు .సంస్కృత మహా కావ్యాల గురించి ధీసిస్ సమర్పించాడు .తర్వాత జబల్పూర్ లో రాణి దుర్గావతి యూని వర్సిటి సంస్కృత శాఖలోనే అధ్యాపకునిగా చేరి శాఖాధ్యక్ష హోదా పొందాడు .ఆ కాలం లో 16మంది ఆయన వద్ద డాక్టరేట్ దీసేస్ చేశారు .విద్యా వాచస్పతి డిగ్రీ ని పొందాడు .
సంస్కృత హిందీ ఆంగ్లాలలో సుమారు యాభై పరిశోధనా పత్రాలను సమర్పించిన మేటి విద్యా వేత్త ద్వివేదీ .అందులో ముఖ్యమైనవి-ఏడవ శతాబ్దం లో సంస్కృత మహా కావ్యాలపై విమర్శనాత్మక పరిశోధన చేసి పి హెచ్ డి కి ధీసిస్ ను రాశాడు .తరువాత ‘’అర్వాచీన సంస్కృత కావ్యాను శీలనం ‘’ను ఆధునిక సంస్కృత కావ్యాలను విశ్లేషిస్తూ 1981లో రాశాడు .దీన్ని మధ్య ప్రదేశ్ లోని సాగర్ లో ఉన్న సాగరిక సమితి ముద్రించింది .సంస్కృత విమర్శనా వ్యాస సంకలం గా ‘’సాహిత్య విమర్శనం ‘’ను 2002లో తెస్తే సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం ప్రచురించింది .స్వస్తి సందేశం ,స్వరిత సందేశం ,సంస్కృత వాజ్మయే విజ్ఞా న్ ,తీర్ధ భారతం అనే భారతీయ యాత్రా స్థలాలపై గ్రంధం రాశాడు
101-శతావ దాని గణేష్
సంస్కృత కన్నడ ,ఆంద్ర భాషలలో శతావధానం చేసి ఆశుఅవిత్వం లో దిట్ట అని పించుకొన్న బహు భాషా వేత్త ఆర్ .గణేష్ కర్నాటక లోని కోలార్ లో 4-12-196న జన్మించాడు .తండ్రి శంకర్ అయ్యర్ .తల్లి అలివేలమ్మ .చిన్నప్పుడు సంస్కృత తమిళ కన్నడ తెలుగు భాషా పరిచయం ఏర్పడింది .సంస్కృత కావ్యాలు చదివి జీర్ణం చేసుకొని పదహారో ఏట నే కవిత్వం చెప్పాడు .స్కూలు లో ఇంగ్లీష్ అభ్యసిస్తూ ప్రాకృత ,పాళీ ,గ్రీక్ లాటిన్ ఇటాలియన్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు .మెకానికల్ ఇంజినీరింగ్ లో బి .ఇ .పాసైనాడు .మెటలర్జీ లో ఏం ఎస్ .చేశాడు .మెటీరియల్స్ ,సైన్స్ మెటలర్జీ లలో పరిశోధన చేశాడు .సంస్కృతం లో ఏం ఏ .డిగ్రీని కన్నడం లోహంపి యూని వర్సిటి నుండి డి .లిట్ ను ‘’అవధాన కళ’’పై ధీసిస్ రాసి పొందాడు .
శతావధానం
చక్కని చిక్కని ఆశుదారా కవిత్వం ,సునిసిత మేధా ,అవగాహన, ధారణా ,జ్ఞాపక శక్తి ,హాస్య స్పూర్తి ,చిక్కులను అధిగమించే ఓర్పూ నేర్పూ విస్తృత లోక పరిశీలన ,బహు శాస్త్ర పరిచయం, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అన్నీ పుష్కలం గా ఉన్న గణేష్ అష్టావధాన శాతావదానాలను అలవోక గా చేసి ప్రుచ్చకులను , సభాసదులను మెప్పించాడు .సంస్కృత కన్నడ తెలుగు -మూడు భాషలలో గణేష్ 1000కి పైగా అవధానాలు చేసి అపర గణేశుడని పించాడు .అమెరికా యూరప్ దేశాలలో ఇరవైకి పైగా అవధానాలు చేసి మెప్పుపొండాడు .15-12-1991 నమొదటి శతావదానాన్ని బెంగళూర్ లోని భారతీయ విద్యా భవన్ లో నిర్వహించాడు .మరో పదిహేను రోజుల్లో మరొక అవధానాన్ని చేశాడు .ఇలా జైత్ర యాత్ర సాగింఛి2012లో పూర్తిగా కన్నడం లోనే చేశాడు .
గ్రంధ రచన
అవధానాలు చేసి ఊరుకోలేదు గణేష్ .’శతావధాన శారద’’, ‘’శతావధాన శ్రీవిద్య ‘’శతావధాన శాశ్వతి ‘’అనే గ్రంధాలు కూడా రాశాడు .ఇవి అవధాన విద్యలో రాణించాలనుకొన్న వారికి కరదీపికలు గా ఉన్నాయి .నాట్యాలకు పాటలు రాశాడు .యక్షగాన విద్య అభ్యసించి ,’’ఏక వ్యక్తీ యక్ష గానం ‘’అనే దాన్ని తాను తయారు చేసి ఎన్నో ప్రదర్శనలలిచ్చి తన ప్రజ్ఞను చాటాడు .ఈ విద్యకు ‘’మంటప ప్రభాకర ఉపాధ్యాయ ‘’అనే బిరుదు పొందాడు .షేక్స్పియర్ నాటకం హామ్లెట్ కు కన్నడాను సరణం గా ‘’హొరాషియో ‘’రాసి తానె ముఖ్యపాత్ర ధరింఛి ప్రదర్శించాడు .
సంస్కృతం లో గణేష్ –అన్వేషణం అనే ఏకాం కిక ,సాంబ లహరి అనే ఖండకావ్యం ,శంకర వివేకీయం అనే పద్య కావ్యం,అంతః కాంతి ,సౌగందిక చిత్ర చూళిక (చిత్ర కావ్యం ),,శ్రీ కృష్ణ లహరి ,శ్రీ జాంబ లహరి ,శృంగార లహరి ,జటా శకుంతల ,ఇళాకైవల్యమ్ ,ఏవం అపిర్వతః ,చాటు చంద్రిక ,శ్రీ చంద్రేశ్వరి స్తవం ,మధు సద్మ అనే సంస్కృత కవిత్వ సంకలం .
కన్నడం లో వితాన ,నిత్య నీతిమొదలైన ఇరవై గ్రంధాలను రాశాడు .
బిరుదులూ పురస్కారాలు
గణేష్ కు కర్ణాటక ప్రభుత్వం ‘’రాజ్యోత్సవ ప్రశస్తి ‘’పురసారాన్ని అందించి గౌరవించింది .కావ్య కంఠప్రశస్తి ,రాష్ట్రీయ యువ ప్రతిభా పురస్కార ,బాదరాయణ –వ్యాస పురస్కారం ,తుంకూర్ యూని వర్సిటి నుండి గౌరవ డాక్టరేట్ ,చిత్ ప్రబంధ అవార్డ్ ,ఎర్యా ,సేదియాపు అవార్డులెన్నో ఆయన్ను వరించాయి .ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశీలి డా.ఆర్ గణేష్ నడిచే సరస్వతిగా గణపతిగా భాసిస్తున్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-11-14-ఉయ్యూరు
.