గీర్వాణ కవుల కవితా గీర్వాణం -67
104- సాహిత్య అకాడెమి పురస్కారగ్రహీత -రేవా ప్రసాద్ ద్వివేది
విద్యాభ్యాసం
మధ్య ప్రదేశ్ లో నర్మదానదీ తీరం లో నాదేర్ గ్రామం లో పండిత నర్మదా ప్రసాద్ ద్వివేది ,లక్ష్మీ దేవి దంపతులకు రేవా ప్రసాద్ ద్వివేది 22-12-1935నజన్మించాడు .ఎనిమిదేళ్ళ వయసులో తలిదండ్రులను కోల్పోయిన దురదృష్ట వంతుడు .కాశీకి వెళ్లి సంస్కృతాన్ని అభ్యసించాడు .సంస్కృత పూర్వ ఆధునిక సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు .బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం నుండి సాహిత్యా చార్య సంస్కృతం లో ఏం ఏ డిగ్రీ పొందాడు రాయపూర్ లోని రవి శంకర యూని వర్సిటి లో పి హెచ్ డి సాధించాడు .మధ్య ప్రదేశ్ జబల్పూర్ యూని వర్సిటి నుండి డి లిట్ పొందాడు .ప్రతిభా విశేషం తో సంస్కృత ఆచార్య పదవిని బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం లో పొంది 1977-95వరకు నిరాఘాటం గా పద్దెనిమిదేళ్ళు పని చేశాడు .ఈ విశ్వవిద్యాలయ ‘’డీన్’’గా రెండు సార్లు సేవలందిం చాడు రేవాప్రసాద్ ద్వివేది .వారణాసిలో ‘’కాళి దాస సంస్థాన్ ‘’ఏర్పరచిన ఘనత ద్వివేదీదే .
రేవా ప్రసాదీయం
రేవా ప్రసాద్ సంస్కృతం లో ‘’సీతా చరిత్రం ‘’ స్వాతంత్ర సంభవం ‘’అనే మహాకావ్యాలు రాశాడు .మొదటగా ‘’ఉత్తర సీతా చరితం ‘’మొదలు పెట్టి1956నుండి పన్నెండేళ్ళు 1968వరకు రాశాడు .ఇది రామాయణాన్ని అనుసరించి రాసినదే .ఉత్త్తర రామాయణ కద ఉంది .దీన్ని ఆనాటి సాంఘిక రాజకీయ పరిస్తితులనుస్పృశిస్తూ దేశ భక్తీ ప్రపూర్వాకం గా రాశాడు . 1991లో రెండవ మహాకావ్యమయిన ‘’స్వాతంత్ర్య సంభవం ‘’కు కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం లభించింది .ఇందులో భారత స్వాతంత్రోద్యమ చరిత్ర ను విపులంగా వర్ణించాడు .అణుయుగం పై రాసిన సంస్కృత కవితలను ‘’ప్రమతః ‘’పేరు తో ప్రచురించాడు .మధ్య ప్రదేశ్ జీవన వాహిని అయిన రేవా అంటే నర్మదా నదిని స్తుతిస్తూ ‘’శ్రీ రేవా భద్ర పీఠం ‘’ అనే కావ్యాన్ని రాశాడు .శత పత్రం అనే కవిత సంపుటిని ,’’యూతిక’’అనే నాలుగు అంకాల నాటకాన్ని రేవా రాశాడు .కావ్యాలంకారిక ,నాట్యాను శాసనం ,సాహిత్య శరీరం అనే మూడు అలంకార శాస్ట్ర గ్రంధాలను సంస్కృతం లో రాశాడు .వీటిపై తానె హిందీలో వ్యాఖ్యానాలు రాశాడు .1976లో కాళిదాస సమగ్ర సాహిత్యాన్ని ముద్రించాడు .కాళిదాసకృత ఋతు సంహార ,రఘు వంశ కావ్యాలపై సమగ్ర వ్యాఖ్యానం రాశాడు ద్వివేదీ .సంస్కృత అలంకార శాస్త్రాలపై హిందీ లో వ్యాఖ్యానాలు రాశాడు .
ప్రసాద్ కు పురస్కారాలు
1978లో రాష్ట్ర పతి పురస్కారం అందుకొన్నాడు .స్వాతంత్ర్య సంభవ కావ్యానికి సాహిత్య అకాడెమి ,కల్పవల్లి ,వాచస్పతి ,శ్రీవేణిలనుండి నాలుగు పురస్కారాలు లభీంచాయి .అలంకార శాస్త్ర రచనకుమహా మహోపాధ్యాయ పి .వి కాణే పురస్కారాన్ని బంగారు పతాకాన్ని పొందాడు .మధ్య ప్రదేశ్ ,ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలనుండి మొత్తం తొమ్మిది అవార్డులను అందుకొన్న ఘనత రేవా ప్రసాద్ ది.భోపాల్ సంస్కృత అకాడెమి ‘’వ్యాసపురస్కారాన్ని’’ అంద జేస్తే ,రెండు సార్లు మిత్ర పురస్కారం ఒకసారి ‘’భోజ’’ అవార్డ్ గ్రహించాడు .న్యు ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ .మధ్య ప్రదేశ్ కాళిదాససంస్థాన్ ,సంస్కృత అకాడెమీ మొదలైన అనేక సంస్థలు ద్వివేదీని అనేక హోదాలలో నియమించి సేవలు అందుకొన్నాయి .,
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-11-14-ఉయ్యూరు