గీర్వాణ కవుల కవితా గీర్వాణం -69
106-మహా వ్యాఖ్యాన కర్త,శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిష్ట చేసిన –అద్దేపల్లి కృష్ణ శాస్త్రి
దివి సీమ రత్నం
కృష్ణా జిల్లా దివితాలూకా టేకు పల్లి లో(ఘంటసాల గారు పుట్టిన ఊరు ) అద్దేపల్లి శివావధాని కుమారులు అద్దేపల్లి కృష్ణ శాస్త్రి 1846లో జన్మించి అరవై ఒక టవ ఏట 1907లో నిర్యాణం చెందారు .ఈయన సోదరులు అయిదుగురూ మహా విద్వాం సులే.ఆంగ్ల విద్య నేర్చుకోమని అన్నగారు ధవళేశ్వరం లో చేరిస్తే ,ఆ చదువుపై ఇష్టం లేక విజయనగరం వెళ్లి అప్పన భొట్ల గోపాల శాస్త్రి గారి వద్ద చాలాకాలం శుశ్రూష చేసి సాహిత్య ,తర్క వ్యాకరణాలలో పాండిత్యాన్ని సాదిం చారు .గురువు గారి మంత్రం శాస్త్ర విద్య శిష్యునికీ సంక్ర్రమించింది .కృష్ణ శాస్త్రి గారికి రాని శాస్త్రమే లేదు ఈయన తో ఆయనకు రాని దానిపైన కూడా వాదం చేయటానికి ఆనాటి మహా పండితులు జంకేవారు .గణపతి, బాల మహా మంత్రొపాసకులు .పాదుకాంత దీక్ష పొంది మూడు నెలలలో ప్రస్తాన త్రయాన్ని చదివేసిన అపర అగస్త్యులు .వీరి ప్రజ్ఞను కధలు గాధలుగా చెప్పుకొనేవారు .
గోపాల పుర వాసి
తూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా గోపాల పురపు నివాసి ఉప్పల పాటి జానకమ్మ అనే క్షత్రియ స్త్రీ విజయ నగర ప్రభువు అనుమతితో పన్నెండు మంది పండితులను తన గ్రామానికి దగ్గరలో పొడగట్ల పల్లిలో ఒక్కో పండితుడికి ఒక్క్కో ఇల్లు ,నాలుగు ఎకరాల సేద్య భూమి ఇచ్చి పండితులపట్ల తనకున్న భక్తిని చాటుకొన్నది. ఇలా వచ్చి స్థిరపడిన వారిలో మన కృష్ణ శాస్త్రి గారూ ఒకరు .ఇది గాక గురువుగారు గోపాల శాస్త్రి గారు చనిపోయినప్పుడు రాసిన వీలునామా ప్రకారం అయిదేకరాలపోలం ,మొత్తం డబ్బూ కృష్ణ శాస్స్త్రి గారికి సంక్రమించింది .శిష్యునిపై గురువుగారికున్న వాత్సల్యానికిది నిదర్శనం .గురువు ములికి నాటి వారైతే శిష్యుడు వెలనాటి వారు .పుత్రునిలా ఆదరించారు శిష్యుని. గురువుగారి అంత్య క్రియలను శిష్యులు శాస్త్రి గారి చేతుల మీదుగశాస్త్రోక్తం గా జరిగాయి .
కృష్ణ శాస్త్రి ప్రజ్ఞ
1892లో కృష్ణ శాస్త్రి గారు శ్రీ సత్యనారాయణ స్వామిని అన్నవరం లో ప్రతిస్టిం చారు .అప్పటికి అన్నవరానికి ఏమీ ప్రాముఖ్యత లేదు .శాస్త్రి గారి మంత్రోపాసన ఎందరికో ప్రేరణ కల్గించింది .విదేశీయులు కూడా ఆయన వద్ద మంత్రం శాస్ట్ర రహస్యాలను తెలుసుకొనేవారు .’’జగన్మోహన మంత్రం ‘’లో గొప్ప ఉపాసకులు. దీన్ని గురించిన పుస్తకం శాస్ట్రి గారు రాస్తే అది జర్మనీ చేరిందట .
గోపాలపురం రాజా వారి ఆస్థాన పండితులుగా కృష్ణ శాస్త్రిగారు చాలాకాలం పని చేశారు .పురాణ ప్రవచనం లో అందే వేసిన చెయ్యి .వీరికి మించిన వారు ఆనాడు లేరట .వీరి ప్రజ్న బహు విచిత్రమైనది .ఒకో శ్లోకానికి 108రకాల అర్ధాలు చెప్పగల మహా నేర్పరి .దీనితో పండితపామరులందరూ వారి పురాణ శ్రవణం కోసం ఎదురు చూసేవారు .
సంస్కృత భాషలో వీరు రాసిన గ్రంధాలకు లెక్క లేదు .శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానం ను విచిత్ర విధానం లో రాసి ముద్రించారు .వాల్మీకి రామాయణం లోని ఒక్కో శ్లోకానికి వంద రకాల వ్యాఖ్యానం రాసి కాశీ పండితులను మెప్పించిన మహా జ్ఞాని .ఈ గ్రంధానికి ‘’ఏక శ్లోక వ్యాఖ్యానం ‘’అనే పేరు పెట్టారాయన .’’ఆలంకార ముక్తావళి ‘’అనే వ్యాఖ్య రాసి ఆ శాస్త్రం లోను తన అసాధారణ పాండిత్య ప్రకర్షను నిరూపించుకొన్నారు .తర్క శాస్త్రం లో ‘’తర్కామృత తరంగిణి ‘’అనే గ్రంధం రాశారు కాని అముద్రితం .
107-నృత్త రత్నావళి రాసిన జాయప సేనాని
జాయప సేనాని కృష్ణా జిల్లా దివిసీమ కు చెందిన వాడు .కాక తీయ గజ సైన్యాధ్యక్షుడు .నాట్యకళా మర్మజ్ఞుడు .వెలనాటి క్రోయ్యూరు రాజు అయ్య వంశం వాడు భీమయ్యకు ప్రపౌత్రుడు .దుర్జయ సైన్యాధిపతి నారప నాయకుని పౌత్రుడు. పిన్న చోడుని కుమారుడు .తల్లి దానమ్మ .ఇతని సోదరులు పృధ్వీ ,నారప నాయకులు .నారమ్మ ,పేరమ్మ సోదరిలు .ఈ అయ్య వంశం వారందరూ సామంత రాజులే సేనాదిపతులే .వెలనాటి చోళ భూపతికి సామంత రాజులుగా ఉండేవారు .
దివిసీమ నుండి –ఓరుగల్లుకు
1213లో కాకతీయ గణపతి మహారాజు తూర్పు ఆంద్ర పై దాడికి వచ్చి వెలనాటిని జయించాడు .జాయప సోదరీమణులైన నారమ్మ పేరమ్మలను పెళ్లి చేసుకొన్నాడు .జాయప శౌర్య పరాక్రమాలకు ఆకర్షితుడై తనతో ఓరుగల్లు తీసుకొని వెళ్లి గజసేనాదిపతిని చేశాడు .అతనికి ‘’వైరి గోదూమఘ రట్ట’’అంటే శత్రువుల్ని తిరగలిలో గోధుమలను పిండి చేసినట్లు చేసేవాడు అనే బిరుదినిచ్చి సత్కరించాడు .జాయప కృతజ్ఞతాపూర్వకం గా ‘’గణపతీశ్వరాలయం ‘’నిర్మించాడు.అనేక గ్రామాలను ఈ ఆలయానికి దానం చేసి స్వామి భోగాలకు ఉపయోగపడేట్లు చేశాడు . ఈ నాటి చేబ్రోలు ఆ నాటి తామ్ర పురం లో తండ్రి పేరిటచౌడే శ్వరాలయం నిర్మించాడు .
ఆలయానికి ఎదుట దేవదాసీలు ఉండటానికి రెండేసి అంతస్తుల భవనాలు కట్టించాడు .
జాయప సేనానీయం
కాకతి ప్రభువు గణపతి దేవుడికి సంగీత ,నాట్య శాస్త్రాలపై అపారమైన అభిరుచి ఉండేది. జాయపకు కూడా యవ్వనం నుండి వీటిపై గొప్ప ఆరాధన ఉంది .జాయప భరతుని నాట్య శాస్త్రం ,సోమేశ్వర దేవుని మానసోల్లాసం అప్పటికే చదివి లోతైన పాండిత్యాన్ని సంపాదించాడు .ఇవికాక అనేక ఆధునిక ప్రాచీన గ్రంధాలను చదివి జీర్ణం చేసుకొన్నాడు జాయప లో ఉన్న ఈ ప్రతిభ ను గురించిన చక్రవర్తి ఆయనను ‘’నృత్త రత్నావళి ‘’గ్రంధాన్ని రాయమని కోరాడు కాదు కాదు శాసించాడు .వెంటనే మోదలు పెట్టి రాశాడు జాయప .దీని తాళ పత్ర ప్రతులు రెండు తంజావూర్ సరస్వతీమహల్ లో ఉన్నాయి .ఇందులో మొత్తం ఎనిమిది అధ్యాయాలు .అయిదవ అధ్యాయం లేదు .చివరి మూడు అధ్యాయాలను దేసీ నృత్యానికి కేటా ఇంచాడు .అయినా చాలా లోతైన అధ్యయనం తో రాసిన గ్రంధం అనిపిస్తుంది నృత్త గీతాలలో ఉండే మార్గ దేశి లపై చర్చ చేశాడు .మార్గ విభాగానికి భరతుని గ్రంధం, దేశీయ విధానానికి సోమేశ్వర గ్రంధం లను ఆధారం చేసుకొని రాశాడు .కీర్తి ధర ,భట్ట తండు రాసిన వాటినీ చర్చించాడు .నృత్త గీతాలలో జరిగిన పరిశోధన అంతాతెలియ జేశాడు .సిద్ధాంత రహస్యాలను సంస్కృతీ వైభవాన్ని గొప్పగా నిరూపించాడు .దేశి నృత్యాలలో పేరిణి ,ప్రేక్ఖనం రాసకం ,చర్చరి ,నాట్య రాసకం ,దండ రాసకం ,శివప్రియం ,చిందు ,కన్డుకం భాన్దికం ఘంట సరి ,చరణం బహురూపం కోలాటం మొదలైన జాన పద నృత్య రీతులపై కూడా రాశాడు .వీటిలో పేరిణి శివ తాండవాన్ని అత్యధిక ప్రచారం చేసిన వారు నట రాజ రామ కృష్ణ గారు .వారికి ఏమిచ్చినా ఆంద్ర జాతి ఋణం తీర్చుకోలేదు .,జాయప ‘’గీత రత్నావళి ‘’అనే సంగీత గ్రందాన్నికూడా రాశాడు .నృత్త రాత్నావలిలోని నృత్యాలకు ఇందులోని సంగీతాన్ని ఉపామ్గం గా ఉండేట్లు రాశాడు కాని ఏ ఏ గ్రంధం శిధిలమైంది .జాయప సేనాని నృత్త రత్నావళిని 1254లో రాసినట్లు భావిస్తున్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-12-14-ఉయ్యూరు