గీర్వాణ కవుల కవితా గీర్వాణం -75
114-వైయాకరణి-వజ్ఝల చిన సీతారామ శాస్త్రి
వైయాకరణి అని పేరు పొందిన వజ్ఝల చిన సీతా రామ శాస్త్రి గారు ముఖ లింగేశ్వర శాస్త్రి ,వేంకటాంబ దంపతులకు 25-6-1878 నజన్మించారు .ఒజ్జ(ఉపాధ్యాయుడు ) అనేపేరు వజ్ఝల గా మారి ఉండచ్చు .వీరి కుటుంబం లో గణిత శాస్త్రాధ్యయనం ,ముహూర్త నిర్ణయం ,జాతక పరిశీలన మొదటి నుంచి ఉన్నాయి .శాస్త్రిగారికి గొప్ప పాండిత్యం ఉపజ్న ,బుద్ధి సూక్ష్మత ,సూక్ష్మ పరిశీనా బుద్ధి ,భుద్ధి తీక్ష్ణత ,వివేచన ,విషయ సంగ్రహణం సహజం గా అబ్బిన గొప్ప లక్షణాలు .ఆంద్ర శబ్ద చింతామణి ,వికృతి వివేకం లను తన వ్యాకరణ పరి శోధనకు మూల గ్రంధాలుగా స్వీకరించారు .వీటిని జోడించి ‘’వైయాకరణ ,పారిజాతం’’ ,’’వ్యాకరణ సంహితా సర్వస్వం’’ అనే రెండు అపూర్వ వ్యాకరణ గ్రంధాలను రచించారు .ఆంద్ర విశ్వవిద్యాలయం లో వజ్ఝల వారు భాషా పండితులుగా నియమింప బడ్డారు .విజయ నగర సంస్కృత కళాశాల ,మద్రాస్ ,ఆంద్ర విశ్వ విద్యాలయాలలో బోధనా వృత్తిలో దశాబ్దాల పాటు పని చేసి భాషా సేవ చేశారు .చిన తాత గారు చిన వెంకట సిద్ధాంతి గారి వద్ద ముహూర్త సిద్ధాంత విభాగాలు ,లీలావతి గణితం అభ్యసించారు .మరొక చిన తాత గారి వద్ద సంస్కృత వ్యాకరణ ,ధర్మ శాస్త్రాలను నేర్చారు .నడాదూర్ అనంతాల్వార్ దగ్గర తర్క వేదాన్తాలను నేర్చుకొన్నారు .
మూల గ్రందాలలోనికొన్ని సంజ్ఞా పరిచేద సూత్ర కారికలను కలిపి ‘’వైయాకరణ పారిజాతం’’రాశారు .ఇందులో ప్రత్యేకతలు కవి సంశయ విచ్చేదనాల ననుసరించి ధ్వని శాస్త్రాన్ని వివవివరణాత్మకం గా శాఖాద్యాదులననుసరించి లిపి స్వభావాన్ని నిర్ణయించారు .ప్రాచీన శాసనాలలో ఉన్న లేఖన సంప్రదాయాలను పరి శోధించారు .పూర్వ లాక్షణికులు చేసిన రేఫా ,శకట రేఫల పరిశోధనలను సమీక్షించారు ‘’సంహితా సర్వస్వం ‘’లోచింతామణి ,వికృతి వివేకాలను బాల వ్యాకరణ ప్రణాలికా బద్ధం గా విభజన చేసి ,కల్ప తరు వ్యాఖ్యను చేర్చి మహాద్భుత బృహద్గ్రంధం గా గా రచన చేశారు . బాల వ్యాకరణ సంజీవనీ వ్యాఖ్య దీనికి ముఖ్యమైన అను బంధం గా ఉంది .దీనిలో అనేక లక్షణ గ్రందాల పరామర్శ ఉంది .
వజ్ఝల వారి నిశిత పరిశీలనా దృష్టికి దృష్టాం తాలే –అధర్వ కారికావళిపీఠికలు ,బాల సరస్వతీయ పీఠిక,చింతామణి విషయ పరిశోధనలు .వీరి బాల వ్యాకరణ ఉద్యోతం వ్యాకరణ సంహితా సర్వస్వం అని చెప్ప వచ్చు .వీరు రాసిన ‘’ద్రావిడ భాషా పరిశీలనం ‘’భాషా పరం గా శాస్త్రి గారి పరిశోధనా తీక్ష్ణ దృష్టికి గీటు రాయి .ఇందులో ప్రతిపాదించిన సిద్ధాంత సారమే’’ద్రావిడ భాషా సామ్యాలు ‘’అనే ఉత్క్రుస్ట గ్రంధం .వీరి నిశిత పరిశీలనా నై పుణ్యానికి గొప్ప ఉదాహరణలే –‘’వసు చరిత్ర విమర్శ’’,,’’హరిశ్చంద్ర నలోపాఖ్యాన పీఠిక ‘’ లు .ఈ బహుముఖ ప్రజ్ఞా శాలి 29-5-1964న ఎనభై అరవ ఏట పరమపదించారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-12-14-ఉయ్యూరు