గీర్వణ కవుల కవితా గీర్వాణం -81
121-కౌముది పాఠ ప్రవచన శ్రేష్ట –శోంఠీ భద్రాద్రి రామ శాస్త్రి .
తూర్పు గోదావరిజిల్లా పిఠాపురం దగ్గర కొమరగిరి లో శోంఠి భద్రాద్రి రామశాస్త్రిగారు 1850లో జన్మించారు తలిదండ్రులు రంగరామయ్య ,కామాంబ.మాత్రు,పితృ వంశాలలో ఇరువైపులా అపూర్వ పండిత కవులే .శాస్ట్ర నిష్ణాతులే శ్రోత్రియులే నిస్టా గరిస్టూలే .సదాచార సంపన్నులే .కనుక చిన్ననాడే రామ శాస్త్రిగారిక్ ఆంద్ర గీర్వాణాలు సహజం గానే అబ్బాయి .పాండిత్య కవితా ప్రావీణ్యం అలవడ్డాయి .మనోహర కావ్యనిర్మాన నైపుణ్యం ఉభయ భాషల్లోనూ ఇరవై ఏళ్ళకే పట్టు బడింది .
శాస్త్రి గారు కౌముది పాఠ ప్రవచనం లో ఉద్దండులని దేశమంతా మార్మోగింది .తెలుగులోనూ సమానమైన పాండిత్య గరిమ ఉంది .విస్పష్టంగా బోధించే సామర్ధ్యమూ ఉన్నది .ఆంద్ర ప్రబంధాలు రూపకాలు రచించే నేర్పు వచ్చేసింది .ఉర్లాం సంస్థానం లో రాజా మంత్రి ప్రగడ భుజంగ రాయుని ఆస్థాన పండితులయ్యారు .
సంస్కృతం లో అహోబల పండితీయం కు తెలుగులో వ్యాఖ్య రాశారు .లఘుకౌముదిని ఆంధ్రీకరించారు .వసుచరిత్రకు భూమిక రాశారు .సంస్కృతం లో ముక్తావళి అనే రూపకం ,శంబరాసుర విజయం అనే చంపువు ,శ్రీరామ విజయ చంపువు ,రాశారు .స్వీయ తెలుగు కృతులు –కాళిందీపరిణయం,చిత్ర సీమ ,జగన్నాధ క్షేత్ర మహాత్యం ,మల్లికా ,శంతనూపాఖ్యానం ,శివరామ శతకం ,శ్రీ రామ స్తవం ముక్తావళి నాటకం ,శ్రావణ మహోత్సవ తారావళి .అరవై అయిదేళ్ళు జీవించి భద్రాద్రి రామ శాస్త్రి గారు 1915లో శ్రీరామైక్యమైనారు .
122-పండిత ప్రవర –మల్లాది రామ కృష్ణ చయనులు
1885లో మల్లాది రామ కృష్ణ చయనులుగారు గుంటూరు జిల్లా సత్తెన పల్లి లో వెలనాటి బ్రాహ్మణ కుటుంబం లో రాఘవయ్య ,అచ్చమ్మ దంపతులకు జన్మించారు .వీరిని హైదరాబాద్ వాస్తవ్యులు దత్తతకు స్వీకరించగా అక్కడ పార్శీ ఉర్దూలను నేర్చుకొన్నారు .గోరంట్లకుతిరిగి వచ్చి సంస్కృత భాష నేర్చారు .కావ్యాలు చదివి అమలాపురం వెళ్లి ఏలేశ్వరపు తమ్మన్న శాస్త్రి గారి దగ్గర కావ్యం నాటకం సాహిత్యం అభ్యసించారు .పేరూరు లో మందా చెన్నయ్యగారి నుండి తర్కం నేర్చారు .పేరి నరసింహ శాస్త్రి గారి వద్ద వ్యాకరణం శ్రీపాద రామ మూర్తి శాస్త్రి గారి దగ్గర ,విజయనగరం లో భీమాచార్యుల వారి దగ్గర తర్కాన్ని మెరుగు పరచుకొన్నారు .ఇరవై రెండవ ఏటనే వాదాలు చేసి పండితులను గెలిచే సామర్ధ్యం పొందారు .అమరావతికి చెందిన గుడి మెళ్ళ వెంకట సుబ్బయ్య గారి కుమార్తె కృష్ణ వేణమ్మను పెండ్లాడారు .
ఇరవై నాలుగో ఏట మైసూర్ వెళ్లి పజమాని సుందర రామ శాస్త్రి గారి వద్ద బ్రహ్మ సూత్రా శంకర భాష్యాన్ని చదివివారు. అప్పయ్య దీక్షితులకు తోమ్మిదవ తరం వారైన త్యాగరాజ శాస్త్రి దగ్గర ,కల్ప తరువు ,వ్యుత్పత్తి వాద వాచాస్పత్యాది గ్రంధాలు చదివారు .
విజయవాడలో నివాసం ఉన్నారు .ముప్ఫై ఆరవ ఏట తిరువయ్యూర్ వెళ్లి స్థల పురాణం బాల కృష్ణ శాస్త్రి గారి వద్ద ఉపనిషద్ భాష్యం మొదలైనవి నేర్చుకొన్నారు పుష్పగిరి ,హంపి విరూపాక్ష పీఠాలకు ఆస్థాన పండితునిగా నియమింప బడ్డారు .వైదిక కర్మాను స్టానం వీరు యదా విధి గా పాటించారు .అమరావతిలో జ్యోతి స్టోమం ,బెజవాడలో చయనం చేశారు .అప్పటి నుండి రామ కృష్ణ చయనులు అయ్యారు
వేదాంత విషయాలను అతి సూక్ష్మగా సూటిగా తేలికగా అర్ధం అయ్యేట్లు చెప్పగల సామర్ధ్యం చయనులుగారిది .మహా వక్తగా విఖ్యాతి పొందారు .వేదాంత ప్రవచనానికి కాశీ పండితులు మెచ్చుకొని ‘’పండిత ప్రవర ‘’బిరుదు నిచ్చి సత్కరించారు .పంజాబు రాష్ట్రం లో సంచారం చేసి అక్కడి వారిని మెప్పించి ‘’వ్యాఖ్యాన వాచస్పతి ‘’బిరుదును అందుకొన్నారు .బాల బోధిని ,భ్రమ మంజరి అనే వేదాంత గ్రంధాలను సంస్కృతం లో రచించారు .ప్రాయశ్చిత్త పశు విషయక విమర్శ గ్రంధాలనూ మహా భారత కదా తత్వ నిర్ణయం ‘’అనే గ్రంధాన్ని చయనులు గారు రచించారు .డెబ్భై ఆరేళ్ళు జీవించి రామ కృష్ణ చయనులుగారు 1941లో స్వర్గం చేరారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-12-14-ఉయ్యూరు