గీర్వాణ కవుల కవితా గీర్వాణం -78
118-భారతీయ గణిత శాస్త్రాన్ని కొత్త మలుపు త్రిప్పిన జగద్గురు –శ్రీ భారతీ కృష్ణ తీర్ధజీ మహారాజ్
జననం విద్యాభ్యాసం
వెంకట రమణ అనే పేరు తో 1884 లో జన్మించిన భారతీ కృష్ణ స్వామీజీ తండ్రి నరసింహ శాస్త్రి మద్రాస్ రాష్ట్రం లోని తిన్నె వెళ్లి లో తహసీల్దార్ గా పంచేశారు .పదోన్నతి పొంది డిప్యూటీ కలెక్టర్ గా రిటైర్ అయ్యారు .తిన్నె వల్లి తిరుచిరాపల్లి లోనే వెంకట రమణ కాలేజీ విద్యా భ్యాసం పూర్తీ చేశారు .1899 లో మద్రాస్ యూని వర్సిటీ నుండి మెట్రిక్ పరీక్ష సర్వ ప్రధములు గా పాసైనారు .వీరి సంస్కృతా పరిజ్ఞానాన్ని వక్తృత్వ పాటవాన్ని గుర్తించిన మద్రాస్ సంస్కృత సంస్థ ‘’సరస్వతి ‘’బిరుదును అందించి గౌరవించి సత్కరించింది .
వెంకట రమణ శ్రీ వేదం వెంకట రాయ శాస్త్రి గారి వద్ద సంస్కృతం అధ్యయనం చేశారు .తర్వాత బి ఏ .సర్వ ప్రధములుగా పాసై ,బొంబాయి లో ‘’అమెరికన్ కాలేజ్ ఆఫ్ సైన్సెస్’’నిర్వహించిన ఏం.ఏ.పరీక్ష లో , ఉత్తీర్ణత సాధించారు .ఇరవై ఏళ్ళ వయసులో 1904 లో మరికొన్ని సబ్జెక్టులు సంస్కృతం ,తత్వ శాస్త్రం ,ఇంగ్లీష్ ,గణితం చరిత్ర లలో ఏం ఏ.పరీక్ష రాసి అన్నిటా సర్వ ప్రధములుగా ఉత్తీర్ణులయ్యారు .తత్వ శాస్త్రం ,సనాతన ధర్మం ,సామాజిక శాస్త్రం ,చరిత్ర ,రాజనీతి శాస్త్రం ,సాహిత్యం మొదలైన పలు విషయాలపై వెంకట రమణ రాసిన వ్యాసాలను చదివి అయన అవగాహనా పటిమకు అబ్బురపడి W..T.Stead పండితుడు ‘’రివ్యూ ఆఫ్ రివ్యూస్ ‘’లో 1905లో ప్రచురించాడు .
ఉద్యోగం –యోగ సాధన –
1905 లో గోపాల కృష్ణ గోఖలే మార్గ దర్శ కత్వం లో వెంకట రమణ జాతీయ విద్యా ఉద్యమం లో పాల్గొన్నారు .ఆడి నుండి ఆధ్యాత్మిక విద్య లో ఆసక్తి ఉన్న వెంకట రమణ 1908లో శృంగేరీ పీఠాదిపతి జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామిని వారిని సందర్శించారు . తర్వాత రాజ మండ్రి జాతీయ కళా శాలకు మొట్ట మొదటి ప్రిన్సిపాల్ గా నియమింప బడి 1911వరకు పని చేశారు .పదవికి రాజీనామా చేసి శృంగేరీ పీఠం చేరి జగద్గురువుల వద్ద వేదాంత విద్యనూ అభ్యసిస్తూ అరణ్య వాసం చేస్తూ ,యోగ సాధనలో ఎనిమిదేళ్ళు గడిపారు .
పీఠాదిపతిత్వం
పూనా బొంబాయి ,అలమనేరు మొదలైన చోట్ల ‘’శంకర దర్శనం ‘’పై ధారావాహిక మహోపన్యాసాలు చేశారు .1919జులై నాలుగున వారణాసి శారదా పీఠం లో జగద్గురువులు స్వామి త్రివిక్రమ తీర్ధజీ మహా రాజా గారి వద్ద సన్యాస దీక్ష గ్రహించి ‘’స్వామిశ్రీ భారతీ కృష్ణ తీర్ధ జీ మహా రాజా’’గా ప్రసిద్ధిపొందారు .1921లో శారదా పీఠాన్ని అధిస్టిం చారు .వెంటనే భారత దేశ యాత్ర మొదలు పెట్టి సనాతన ధర్మం పై ఉపన్యాస పరంపర నిచ్చారు .1925లో గోవర్ధన పీఠాదిపతి పదవి స్వీకరించారు .
గణిత శాస్త్రం లో గణనీయ కృషి-వేద గణిత పిత
ప్రాచీన భారతీయ విజ్ఞానం లో స్వామీజీ కృషి గణ నీయమైనది .వారి గణిత శాస్త్ర సేవ చిరస్మరణీయం .వేదాలను వేదాంగాలను శాస్త్రీయ దృక్పధం తో పరి శోధించి’’ అధర్వణ వేదానికి అను బంధం ‘’ నిర్మించారు .గణిత శాస్త్రానికి సంబంధించిన 16 సూత్రాలను పునర్నిర్మించారు .ఈ సూత్రాల సహాయం తో పెద్ద పెద్ద లెక్కలను మానసికం గానే గణన చేసి జవాబులు తెలుసుకొనే వినూత్న ప్రక్రియను స్వామీజీ ఆవిష్కరించారు .అంక గణితం బీజ గణితం ,కలన గణితం (కాల్క్యులస్)అవకలన సంకలనాల లో ఎన్నో గణిత సమస్యలకు ,,5,10,15,40 వరకు సోపానాలు చేయటానికి బదులు ఒకే పంక్తి లో చేసే పద్ధతులను సోదాహరణం గా స్వామీజీ వివరించారు .
ప్రధాన సంఖ్యలన్నిటికి పాజిటివ్ నెగటివ్ ఆస్క్రు లేటర్స్(ధన ,రుణ వేస్టనం ) తో భాజనీయతా నికష అంటే డివిజబిలిటీ టెస్ట్ ను సూచిం చారు .అంటే గణిత శాస్త్రాన్నిఅత్యంత ఆకర్షణీయం గా ,ఆసక్తి దాయకం గా అతి సులభంగా తయారు చేశారన్న మాట .దీనితో గణిత శాస్త్రాన్ని ఒక కొత్త మలుపు త్రిప్పిన ఘనత కృష్ణ తీర్ధ స్వామీజీ కే దక్కింది .ఏదో పుస్తకాలు రాసి కూర్చో కుండా వీటిని విద్యార్ధులకు,ఉపాధ్యాయులకు ,ఆచార్యులకు విద్యాలయలో కాలేజీలలో విశ్వ విద్యాలయాలలో బోధింఛి చక్కని అవగాహన కల్పించి స్పూర్తినిచ్చారు .అందుకే స్వామిని ఫాదర్ ఆఫ్ వేద గణిత అంటే వేద గణిత పిత అంటారు
గ్రంధ రచన
1958 ఫిబ్రవరి లో స్వామీజీ అమెరికా ,కెనడా దేశాలు పర్య టించి ఉపన్యాసాలిచ్చారు .స్వామీజీ రాసిన భక్తీ శ్లోకాల సంఖ్య 3,000లకు పైనే ఉన్నాయి వీటిని సంకలనం చేసి ప్రచురించారు .సనాతన ధర్మం పై స్వామి కృష్ణజీ రాసిన గ్రంధాన్ని బొంబాయ్ భారతీయ విద్యా భవన్ ప్రచురించింది .వీరి ప్రసిద్ధ గణిత గ్రంధం ఆంగ్లం లో రాసిన ‘’వేదిక్ మేధ మాటిక్స్ ‘’.దీన్ని వీరి మరణాంతరం ధిల్లీ లోని మోతీలాల్ బనార్సి దాస్ వారు ముద్రిం చారు .అపూర్వ భారతీయ విజ్ఞాని ,గణిత మేధావి ,సనాతన సారధి -జగద్గురు శ్రీ భారతీ కృష్ణ తీర్ధజీ మహారాజ్
డెబ్భై ఆరేళ్ళ వయసులో నిర్యాణం చెంది శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధికి చేరుకొన్నారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-12-14-ఉయ్యూరు