తెలుగు తల్లికి కవితా మల్లె పూ దండ
శంకరంబాడి శత జయంతి
‘’అయ్యా !మీ విద్వత్తును తెలుసుకొన్నాను .మీకు ఏ విధమైన సన్మానం కావాలో చెప్పండి ?రాష్ట్ర పతి
‘’అయ్యా గుర్తించి నందుకు ధన్యవాదాలు. అది మీ విజ్ఞత .నాకు 116 రూపాయలు ,ఒక శాలువాచాలండి ‘’కవి జవాబు .ఆ ప్రశ్నించిన రాష్ట్ర పతి అకలంక దేశ భక్తులు ,భారత దేశ ప్రధమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు .ఆ జవాబు చెప్పిన కవి ‘’మా తెలుగు తల్లికీ మల్లె పూ దండ ‘’గీతం రాసి నేటి మన రాష్ట్ర గీతం గా గౌరవిం అందుకొనేట్లు చేసిన వినయ మూర్తి అయిన తెలుగు కవి స్వర్గీయ శంకరం బాడి సుందరా చారి గారు .ఇది వారి శత జయంతి సంవత్సరం .మన ప్రభుత్వాలకు పెద్దగా పట్టి నట్లు లేదు .బడా బడా సాహిత్య సంస్థలూ బుజాన వేసుకోలేదు .ఏదో ఇంకా సాహిత్యాభిమానం ఉన్న మధ్య తరగతి సంస్థలు మాత్రం భక్తిగా ఆరాధనా భావం తో నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకొంటున్నాయి .సరస భారతి కూడా ఉడతా భక్తిగా ఈ నెలలో 27వ తేదీ శనివారం73వ సమావేశం గా ఉయ్యూరు ఫ్లోరా స్కూల్ లో శంకరం బాడి సుందరా చారి గారి శత జయంతి వేడుకలను విద్యార్ధుల మధ్య జరుపుతూ వారికి అవగాహన కల్గించటానికి వ్యాస రచన పోటీ ని నిర్వహిస్తూ అభిమానాన్ని తెలియ జేస్తోంది .అలాంటి మహా నీయుని ఒక సారి గుర్తుకు తెచ్చుకొనే ప్రయత్నమే ఈ వ్యాసం .
అచ్చిరాని చదువు
ఇంతటి మహాకవి జన్మ దినం కూడాచరిత్రలో మనం నమోదు చేసుకోలేక పోవటం దురదృష్టం .వారు 10-8-1914 న తిరుపతి దగ్గర తిరు చానూర్ లో శంకరం బాడి అనేసంప్రదాయ వైష్ణవ కుటుంబం లో సుందరాచారిజన్మించారు .తిరుపతిలోనే దేవస్థానం పాఠ శాలలో చదివి తెలుగు సంస్క్రుతాలను నేర్చుకొన్నారు .ఆయన్ను బాగా ప్రభావితం చేసిన గురువు గారు ‘’పాతాళ భేది సుబ్రహ్మణ్య శర్మ ‘’ ‘’అల్లసాని రామనాధ శర్మ ‘’గార్లు అని ఆయన ఎప్పుడూ భక్తితో తలపోస్తూ ఉండేవారు . ఇక్కడ ఎస్ ఎస్ ఎల్సి చదువుతుండగానే నాస్తిక భావన లో కొట్టుకుపోయారు .తలిదండ్రులు మందలించారు .ఇంట్లో ఉండలేక బయటికి వచ్చి స్వతంత్రం గా జీవిస్తూ హోటల్ సర్వర్ గా కూడా పని చేశారు .చిన్ననాటి కవి మిత్రుడు శ్రీ రంగాచారి పాతికేళ్ళ లోపే చనిపోయాడు యా దిగులు వీరిని నిరంతరం బాధిస్తూ ఉండేది .
నిలకడ లేని జీవితం
ఈ చిలక్కొట్టుడు ఉద్యోగాలు విసుగు తెప్పించాయి .ఆంద్ర పత్రికలో ఉద్యోగం సంపాదించాలనే కోరికతో దాని వ్యవస్థాపకులు కాశీ నాధుని నాగేశ్వర రావు పంతులు గారిని మద్రాస్ వెళ్లి కలిశారు .వీరి ప్రతిభను గుర్తించిన ఆయన పత్రికలో ఉద్యోగం ఇచ్చారు .కొద్దికాలమే చేసి స్వతంత్ర జీవనం అలవాటు పడ్డ అయన రాజీనామా చేసేశారు ..బి ఏ పాసైన ఆచారిగారు చిత్తూరు జిల్లా స్కూల్ ఇన్స్పెక్టర్ గా కొద్దికాలం పని చేశారు .విధి నిర్వహణ లో చాలా కఠినం గా ఉండేవారు అందరిని ప్రోత్సహించేవారు .దీనితో ఆచారి గారంటే అభిమానం ఎక్కువైంది అందరిలో .
ఆకస్మిక నిర్ణయం –ఫలితం
ప్రతి ఆదివారం కంచి వెళ్లి కామాక్షీ అమ్మవారిని సందర్శించి శని ఆదివారాలు అక్కడే గడిపి రాత్త్రికి ఏ ఇంటి అరుగు మీదనో పడుకొని సోమవారం మళ్ళీ డ్యూటీకి వెళ్ళేవారు .ఒక సారి అలా పడుకొని ఉన్న సమయం లో ఆ ఇంటిలోని భార్యా భర్తలు తమ కుమార్తె పెళ్లి విషయమై తగాదా పడటం విన్నారు .తలుపు కొట్టి లోపలి వెళ్లి వారు పోట్లాడుకోవాల్సిన పని లేదని వారి అమ్మాయిని తానూ వివాహం చేసుకొంటానని తిరుపతి వచ్చి తన తల్లిదండ్రులను సంపర దించమని ఆకస్మిక నిర్ణయాన్ని ప్రకటించి తగాదాను తీర్చి అన్నమాట ప్రకారం ఆమెనే వివాహం చేసుకొన్నారు .త్వరలోనే భార్యకు మతి స్తిమితం తప్పిపోవటం తోకొద్దికాలం లోనే చనిపోయింది . ఆచారిగారు మొదటి సారిగా కుంగిపోయారు .విరక్తి కలిగి ఉద్యోగానికి రాజీనామా చేసేశారు .
దేశ దిమ్మరి జీవితం
అప్పటికే వారికి జిల్లా అంతటా కవిమిత్రులు స్నేహితులు చాలా మంది ఉండేవారు వారి దగ్గరకు తిరుగుతూ ఏదీ పట్టించుకోకుండా తిరిగారు .వీలైనప్పుడు నాటక సమాజాలకునాటకాలు రాసి ఇస్తూ వారి వెంట దేశ ద్రిమ్మరిగా తిరిగారు స్థిర మైన ఆదాయం ,నిలకడ అయిన జీవితం కోల్పోయారు .1940-50మధ్య కొన్ని సినిమా లు .బిల్హణీయం ,మహాత్మా గాంధి దీన బంధులకు సంభాషణలు రాసి దీనబందులో నటించారు కూడా .
మా తెలుగు తల్లికి గీతం ఆవిర్భావం
ఒక సారి ‘’దీన బంధు ‘’ చిత్ర దర్శకుడు తెలుగు తల్లిపై పాట రాయమని కోరాడు .అప్పుదు వీరి కలం నుండి జాలువారిన అద్భుత గీతమే ‘’మా తెలుగు తల్లికీ మల్లె పూ దండ ‘’కాని ఆ సినిమాలో ఆ పాటను డైరెక్టర్ వాడుకోలేక పోయాడు అలానే ఉండిపోయింది .
ఇంటింటా మారు మోగిన మా తెలుగు తల్లి
హెచ్ ఏం వి. గ్రామ ఫోన్ కంపెని ఆ పాటకు సుందరాచారి గారికి నూట పదహారు రూపాయలు ముట్ట జెప్పి ఎస్ బాలసరస్వతి ,మధుర గాయిని టంగుటూరి సూర్య కుమారి గారి చేత బాణీ కట్టించి సూర్య కుమారితో పాడించి రికార్డ్ చేసి దేశానికి అందజేసి మహోపకారమే చేసింది .ఇంటింటా ఆ పాట ఆమె గాన మాధుర్యం తోనూ ఆయన గీత మాధుర్యం తోనూ మారు మొగి పోయి యేన లేని ప్రచారాన్ని తెచ్చింది .
ఇతర రచనలు
ఆచారిగారు భారత ,రామాయణ ,భాగవతాలను సరళమైన ఆట వెలది పద్యాలలో ‘’సుందర రామాయణం, సుందరభారతం, సుందర భాగవతం ‘’గా రాసి తమ ప్రతిభను చూపించారు .దాతల ఆర్ధిక సాయం తో వాటిని ముద్రించి ఊరూరు తిరిగి పాఠశాలలో అమ్ముకొని జీవించేవారు .అడిగిన వారికి ప్రతిఫలాపేక్ష లేకుండా ఉచితం గా అందజేసేవారు . . ‘’ బుద్ధ గీత ను రాసి పది వేల కాపీలు ముద్రిస్తే హాట్ కేకుల్లాగా చెల్లిపోయాయి .వారిపై అంత గొప్ప అభిమానం అన్న మాట .ఏకలవ్యుడు ఖండకావ్యం,బలిదానం కెరటాలు ,సుందర బిందువులు ,జానపద గీతాలు స్థల
సాహిత్య రాజకీయ ప్రోత్సాహం
కపిస్థలం శ్రీ రంగా చారి గారితో నిరంతర సాన్నిహిత్యం ఏర్పరచుకొని వారితో సాహిత్య విషయాలను సుందరాచారిగారు చర్చిస్తూ ఉండేవారు .రాజ కీయ విషయాలను లోక సభ స్పీకర్ మాడ భూషి అనంత శయనం అయ్యంగార్ తో చర్చించేవారు .వీరిద్దరూ అదే వీధిలో ఉండేవారు .
నిరుపేద జీవితం
‘అంతటి కవికి ఎంతటి కస్టాలోచ్చాయో తలుచుకొంటే గుండె బరువెక్కుతుంది . నిరాడంబర జీవితమే గడిపిన దేశ భక్తులు .బీద తనమే ఆచారి గారి ఆరోగ్యాన్ని కబలిమ్చింది దీన్ని మర్చిపోవటానికి మద్యానికి బానిస అయ్యారు .ప్రతిభ ఉన్నా ఆదరించి ఆదుకొనే సహృదయత ఎవరూ చూపలేదు నిరాదరణకు గురైనారు .ఎన్నో అవకాశాలు దీనివల్ల చేజారిపోయాయి .ఎన్నో గౌరవ పురస్కారాలూ దూరమైపోయిన మిక్కిలి దురదృష్ట వంతులు .
మొక్కుబడి గౌరవ పురస్కారాలు
ప్రధమ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ,ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు చేతుల మీదుగా అందుకొన్న శాలువా ,116 రూపాయలు మాత్రమె వారి జీవితం లో ఘనం గా చెప్పుకోదగిన బహుమతి పురస్కారం .తిరుపతి వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ‘’ప్రసన్న కవి ‘’ బిరుదు నిచ్చి సత్కరించింది .ప్రధమ ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ లో జరిగినపుడు ఆచారి గారిని సగౌరవం గా ఆహ్వానించి ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం సన్మానించింది .తిరుపతి నగరపాలక సంస్థ వారి కాంశ్య విగ్రహాన్ని నిర్మించి ఆవిష్కరించి గౌరవించింది .వీరిపై ఆకాశవాణి మాజీ స్టేషన్ డైరెక్టర్ శ్రీ ఆర్ అనంత పద్మ బాభ రావు గారు విపుల పరిశీలనతో గొప్ప గ్రంధం రచించారు
1977లో తెలుగు తల్లికి కవితా మల్లె పూదండ అల్లిన శంకరంబాడి సుందరాచారి గారు 1977లో మరణించారు.
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-12-14-ఉయ్యూరు .