ఆంగ్ల నాటకాన్ని అనువదించిన తొలికవి –వావిలాల వాసుదేవ శాస్త్రి

ఆంగ్ల నాటకాన్ని అనువదించిన తొలికవి –వావిలాల వాసుదేవ శాస్త్రి

అన్నిటా ప్రధములు

ఆదునికాంధ్ర ప్రధమ నాటక కర్తలలో నాల్గవ వారు ,ఆంగ్ల నాటకాన్ని అనువదించిన మొట్టమొదటి వారు ,విషాదాంత నాటక రచనలో ప్రప్ర ప్రధములు ,తోలి సాంఘిక నాటకం రాసిన వారు ఒక్కరే ఆయనే వావిలాల వాసుదేవ శాస్త్రి గారు .

ఆధునిక కవిత్రయం

వడ్డాది సుబ్బారాయుడు ,వీరేశలింగం వావిలాల వాసుదేవ శాస్త్రి గారాలను ఆధునిక కవిత్రయం అంటారు ముగ్గురూ రాజమండ్రి వాస్తవ్యులే .దీనిని గురించి వాసురాయ కవి అంటే వడ్డాది సుబ్బారాయకవి గారు పందొమ్మిదవ శతర్ధం ఉత్తరార్ధం లో ఒక పద్యం లో చెప్పుకొన్నారు –

‘’భావను ,రాన్మహేంద్రమున బాదము వెట్టితి,నాడిటంగవుల్ –వావిలాల వాసు దేవ గురు వర్యు డోకండు వివేక వర్దినీ

ధీవర పత్రికాధిపతి దేశిక వీరప లింగ మొక్కడుం – గావుట చే గావిత్రయముగా గనియించిరి మమ్మిటీవలన్ ‘’

నన్నయ లాంటి వాడు వాసు దేవా శాస్త్రి గద్య  తిక్కన  వీరేశ లింగం ,ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన వడ్డాది .ఇలా ఆధునిక కవిత్రయం అయ్యారు

వావిలాల వారు –మా బంధుత్వం

.ఇందులో వావిలాల వారి గురించి తెలుసుకొందాం ఆయన మాకు దూ —-రపు చుట్టం కూడా .ఆయన మనవడు వావిలాల కృష్ణ   ఆంద్ర దేశం నుండి అమెరికా వెళ్ళిన తోలి తరం వాడు .కృష్ణ ఉయ్యూరులో మా చిన్న తాతగుండు అంతర్వేది గారి  కుమారుడు ‘’అప్పన కొండ’’ అనబడే గుండు వరాహ లక్ష్మీ నరసింహ మూర్తి-జి వి.ఎల్ .యెన్ .మూర్తి  అంటే నాకు మేన మామ .అయన జంషెడ్పూర్ తాతా ఐరన్ స్టీల్స్ లో చీఫ్ కెమిస్ట్ .  ఆయన కుమార్తె లక్ష్మి భర్త వావిలాల కృష్ణగారు  .దాదాపు అరవై ఏళ్ళనుండీ అమెరికాలో ఉంటూ  సుమారు నలభై ఏళ్ళ నుండి టెక్సాస్ రాష్ట్రం లోని హూస్టన్ లోనే ఉంటున్నారు .తోలి తెలుగు సంఘాన్ని అమెరికాలో స్థాపించిన వారిలో కృష్ణ ప్రముఖ పాత్ర పోషించారు .భార్య లక్ష్మి మంచి సాంఘిక సేవా కార్య ,వాలంటీర్ .మేము మొదటి సారి అమెరికా లో టెక్సాస్ లోని హూస్టన్ కు 2002లో మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి ,అల్లుడు ఛి కోమలి అవధాని వాళ్ళ ఇంటికి వెళ్ళినపుడు గాఢ పరిచయం ఏర్పడింది అంతకు ముందొక సారి లక్ష్మిగారు ఉయ్యూరుకు అప్పన కొండ మామయ్యఎదూరికి బాచీ వాళ్ళింటికి  వస్తేపరిచయం అయింది .వావిలాల కృష్ణ-లక్ష్మి  అంటే హూస్టన్ లో తెలియని తెలుగు వారుండరు .అంట కలుపుగోలు తనం గా ఉంటారు .మా అమ్మాయి ఆయన్ను పెదనాన్న అని ఆవిడను అమ్మక్కయ్యా అని ఆప్యాయంగా పిలిచేది . ఆవిడే  మాకు అక్కడి ప్రముఖ  మీనాక్షి,దుర్గా. ఇస్కాన్  దేవాలయాలను చూపింది ప్రసిద్ధ డాన్సర్ రత్న పాపను అంటే సీతా అనసూయ అనే కృష్ణ శాస్త్రిగారి మేనకోడళ్లలో ఒకరైన అనసూయా దేవి కుమార్తే. ‘’హూస్టన్ లో ‘’అంజలి ‘’అనే నృత్య శిక్షనాలయం స్థాపించి వందలాది మందికి కూచిపూడి ,భరతనాట్యం నేర్పిస్తోంది .అనసూయ గారు మా మద్రాస్ పెదబావ గారు గాడేపల్లి క్రుపా నిధి గారికీ బంధువే .వావిలాల వారికి ఇద్దరమ్మాయిలు పెద్దమ్మాయి అమెరికాలోనే ఉంది రెండవ ఆమ్మాయి’’ఎమెండా’’ హూస్టన్ లో ఉంటుంది .ఇదీ ఆకుటుంబ పరిచయం .

వాసుదేవ శాస్త్రిగారి జననం –విద్య –ఉద్యోగం

వావిలాల వాసుదేవ శాస్త్రిగారు 1851జూన్ లో జన్మించి 1897జూన్ లోనే మరణించారు .నలభై ఆరు సంవత్సరాలు మాత్రమె జీవించినా చరిత్రలో నిలిచిపోయారు .బి.ఏ.పాసైనారు .రాజమండ్రి  కాలేజిలో తెలుగు లెక్చరర్ గా పని చేశారు .1895లో కృష్ణా  ,గుంటూరు జిల్లాలో ‘’అసిఅస్తంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ‘’గా కొంతకాలం ఉద్యోగించారు . వావిలాల వాసుదేవ శాస్త్రి ,వీరేశ లింగం వడ్డాది సుబ్బా రాయుడు లను” ఆధునిక కవి త్రయం ”అనే వారు

-వావిలాల వాసుదేవ శాస్త్రి గారు బి .ఏ .పరీక్ష లో (1877 )ఉత్తర సర్కారు లో ఇంగ్లిష్ లో మొదటి మార్కు పొందిmacdonaald  మెడల్ సాధించారు .”  -వావిలాల వాసుదేవ శాస్త్రి గారి పేరు ఆటవెలది పద్య పాదానికి సరిపోతుంది యతి తో సహా .వీరి బావ గారు వీరిని   ”బావ గారు ఆటవెలది పాదాలలో చిక్కు కున్నారు ”అని వుడికించే వారట. .

‘’సరిగ్గా ఆ కాలంలోనే వావిలాల వాసుదేవ శాస్త్రి అనే పట్టభద్రుడు, షేక్స్‌పియర్ రాసిన జూలియస్ సీజర్ ని “సీజర్ చరితము”అనే నాటకాన్ని 1874 లో అనువదించాడు. ఇదే ఇంగ్లీషు నాటికకి మొట్టమొదటి తెలుగు అనువాదం. ఈ నాటికలో తేటగీతి పద్యాలుపయోగించారు. వావిలాల వారు “నందక రాజ్యం” అనే సాంఘిక నాటకాన్ని కూడా రాసారు. ఇందులోనూ తేటగీతి పద్యాలు వాడారు. నందక అనే జమిందారు రాజ్యంలో ప్రజలకష్టాలు, ఆ కాలంలో ఉన్న సమస్యలూ, రాజకీయాలూ అన్నీ ఈ నాటికలో చిత్రీకరించబడ్డాయి. ఈ విధంగా వావిలాల వారే మొట్ట మొదటి సాంఘిక పద్య నాటక కర్త గా చరిత్రలో మిగిలిపోయారు.’’అని శ్రీ గొర్తి సాయి బ్రహ్మానందం తెలియ జేశారు .

 

వావిలాల వారి సాహితీ ప్రస్థానం

‘’నందక రాజ్యం ‘’అనే అయిదు అంకాల తోలి సాంఘిక నాటకం రాశారు వావిలాల వారు .ఇది 1888లో ముద్రణ పొందింది .తెలుగు స్వతంత్ర నాటకాలలో కోరాడ రామ చంద్ర శాస్త్రి గారి ‘’మంజరీ మధుకరం ‘’మొదటిది .నందక రాజ్యం రెండవది అయితే నందక రాజ్యం మొదటగా అచ్చు అయిన్దికనుక తోలి స్వతంత్ర నాటకం గా గుర్తింపు వచ్చింది .ఏ నాటకాన్నీ ,’’సీజరు ‘’నాటకాన్ని వావిలాల వారు ‘’తేట గీతుల’’లో రాశారు .అందుకని వావిలాల వారు ప్రధమాంధ్ర పద్య నాటక కర్త కూడా అయ్యారు .1853LO ‘ మర్చంట్ ఆఫ్ వెనిస్ ‘’ను ,హేమచంద్ర ఘోష్  ‘’చారుమతీ చిత్త విలాసం ‘’పేరుతొ ‘’బెంగాలీ భాష లోకి అనువదించాడు .ఇండియాలో షేక్స్పియర్ నాటకాల అనువాదానికి ఇదే  నాంది పలికింది .1872లో కే జి నేటర్ అనే ఆయన  నాటకాన్ని ‘’విజయ సింహుడు ‘’గా మరాఠీ భాషలోకి అనువాదం చేశాడు .ఇందులో కొంత స్వాతంత్రం కూడా తీసుకొని అనువదించాడు ..పూనా కాలేజిలో దాన్ని అప్పుడే ప్రదర్శించాడు .కనుక జూలియస్ సీజర్ నాటకానికి ఇండియాలో వచ్చిన అనువాదాలలో నేటర్ రాసిన మరాఠీ అనువాదమే మొదటిది .రెండవది తెలుగులో అనువాదం చేసిన వావిలాల వారిది .

వావిలాల వాసు దేవ శాస్త్రిగారు ‘’ముముక్షు తారకం ‘’(శంకరాచార్య  భజ గోవిందం ),’’ఆంద్ర రఘు వంశం ‘’కూడా రాశారు . మ్రుచ్చ కటికం ‘నాటకాంద్రీకరణాచేశారు .’’మాత్రు స్మ్రుతి ‘’,బ్రాహ్మణీయం ‘’,’’పిత్రారాధన ‘’,మాత్రారాధనా ‘’,రుక్మిణీ స్మరణం  (సతీ స్మ్రుతి) వ్రాశారు .

ఇన్ని రాసినా వావిలాల వారి రచనలు ఏవీ ప్రాచుర్యానికి రాలేదు .సంభాషణా చాతుర్యం ,పద్యం లో లోటు లేక పోవటం పెద్ద వెలితిగా కనిపిస్తుంది .1987లో శ్రీమతి మంగళగిరి ప్రమీలా దేవి  ‘’నందక రాజ్యం ‘’ను ముద్రించి లోకానికి తెలియ బర్చింది . 2002లో పౌత్రులు సర్వశ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి ,కృష్ణ శాస్త్రి ,వెంకటప్పయ్య శాస్త్రిలు కలిసి మళ్ళీ ముద్రించారు .

ఉయ్యూరుతో  బాంధవ్యం

వాసు దేవ శాస్త్రి గారి మొదటి భార్య శ్రీమతి రుక్మిణి గారుఒక పిల్ల  వాడిని ప్రసవించి  చనిపోతే శ్రీమతి పూర్ణ మహాలక్షమ్మ గారిని ద్వితీయం చేసుకొన్నారు .ఈమె రుక్మిణి గారి పిన తండ్రి కుమార్తెయే .పూర్ణమ్మ గారి కి శాస్త్రి గారి దాంపత్యం లో శ్రీమతిలక్ష్మమ్మ ,శ్రీమతి  భవాని , ,శ్రీ సత్యనారాయణ శాస్త్రి జన్మించారు .పెద్ద కూతురైన లక్ష్మమ్మ ను ఉయ్యూరులోని గుండు అంతర్వేదిలక్ష్మీ నృసింహం గారికిచ్చి వివాహం చేశారు .ఈయన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రాజ మండ్రి లో పని చేసి రిటైర్ అయ్యారు .ఈయనే మా అమ్మకు స్వయానా బాబాయి.లక్ష్మమ్మ గారు ఇరవై సంవత్సరాలు అంతర్వేదిగారితో కాపురం చేసి ఒక కొడుకును కని1921లో  చనిపోయారు .

వావిలాల వాసుదేవ శాస్త్రి గారి రెండవ కూతురు భవానిగారు 1891లోను ,కొడుకు సత్యనారాయణ శాస్త్రి 1906లోను అకాల మరణం చెందారు .అంటే శాస్త్రి గారికి పుత్రసంతానం మిగలలేదు .దౌహిత్రుడే అంటే లక్ష్మమ్మ గారి కుమారుడు వరాహ లక్ష్మీ నరసింహ మూర్తి అనే మా ‘’అప్పన్న కొండ మామయ్య ‘’మాత్రమె వారసుడు  అయ్యాడు .1911లో వావిలాల వారి మరణానంతరం భార్య పూర్ణ మహాలక్ష్మిగారు  భర్త వాసుదేవ శాస్త్రిగారి అన్న కుమారుడిని దత్తత చేసుకొన్నారు .ఈయనకు వాసుదేవ శాస్త్రి ,ఇద్దరు కూతుళ్ళు పుట్టారు .

నా చేతికి ‘’నందక రాజ్యం ‘’

నాకు అమెరికా లో వావిలాల కృష్ణ గారు బాగా పాతబడిన వాసుదేవ శాస్త్రిగారి ‘’నందక రాజ్యం ‘’గ్రంధాన్ని ఆప్యాయం గా అందజేశారు చదివేశాను .అమెరికాలో తెలుగు సాహిత్యం చదవటం అదే మొదలు .అందులో సాహిత్యం లో విఖ్యాతులైన ఆధునిక కవిత్రయం లో ఒకరైన వావిలాల వాసుదేవ శాస్త్రి గారి పుస్తకం  ఆయన మనవాడి ద్వారా పొంది చదివే అదృష్టం లభించి నందుకు గర్వపడ్డాను .అదొక థ్రిల్లింగ్ అనిపించింది .’’తేటగీతులు ‘’చాలా తెలిపోయినట్లనిపించింది .వ్యావహారికం గా అంటే’’ కలోక్వియాల్’’గా ఉంటుందని ఆయన అలా రాశారు .వ్రుత్తపద్యాలైతే ఇంకా సోగసుదనం వచ్చేదని అనుకొన్నాను .చెవులకు ఇంపుగా కూడా ఉండేవి .ఏమైనా తెలుగు సాహిత్యం లో ఒక అద్భుతాన్ని, సాహసాన్ని చేసిన సాహిత్య ఘనా పాటి శ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి గారు.ఈ పుస్తక ముద్రణకు మహా పండితులు శ్రీ శలాక రఘునాధ శర్మ గారు ఎక్కువగా తోడ్పడినట్లు వావిలాల వారి తమ్ముడు ముందుమాటలో రాశారు .

విశ్వనాధ ‘’సీతాయణం ‘’

వావిలాల కృష్ణ ,లక్ష్మి దంపతుల ఇంట్లో అమెరికా ‘’ఆటా ‘’వారి మాస పత్రిక చూసి చదివా .అందులో విశ్వనాధ సత్యనారాయణ గారి కుమారుడు శ్రీ అచ్యుత రాయలు ధారా వాహికం గా రాస్తున్న ‘’సీత ‘’చదివాను. తండ్రికి తగ్గ కొడుకు అనిపించారు .ఆయన అమెరికాలోనే ఉన్నారప్పుడు .రామాయణాన్ని ‘’సీతాయణం ‘’గా రాసినట్లు కనిపించింది .అందులోనే శ్రీమతి విశ్వనాధ కమలాదేవి ఒక పజిల్ నిర్వహించటం ఆకర్షించింది .విశ్వనాధ కుటుంబం అమెరికాలోనూ ‘’వైశ్వనాదీయాన్ని ‘’చాటుతున్నారు భేష్

2-11-2002 శనివారం నాటి నా అమెరికా (హూస్టన్ )డైరీ నుండి

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-12-14-ఉయ్యూరు

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.