ప్రాచీన కళల విశిష్టతపై సమగ్ర శోధన
- -జిఆర్కె
- 03/01/2015

భారతీయ స్వతంత్ర
కళాశాస్త్రం
– ప్రథమభాగం –
కళాబ్రహ్మ
హిందీ మూలం:
డా.కాంతి చంద్రపాండె
తెలుగు అనువాదం: డా.బొద్దుల వేంకటేశం
పుటలు: 282;
వెల: రూ.280/-
ప్రతులకు: శ్రీమతి బి.సరోజ
9-8-49, రాంనగర్
కరీంనగర్- 505001
చాలా ప్రపంచ దేశాలలో నాగరికత ప్రాథమికంగానైనా రెక్కతొడగకముందే భరతభూమి సముజ్వల నాగరికతా నిలయంగా భాసించింది, అనేక కళలకు కాణాచిగా నిలిచింది. ప్రాచీన వాఙ్మయం, చారిత్రక ఆధారాలు, పురాతన అవశేషాలు, వస్తుసామగ్రి వంటివి దీనిని నిరూపిస్తున్నాయి.
సమీక్షిస్తున్న గ్రంథం ఒక అనువాదకృతి. అనువాదకులు డా.బొద్దుల వేంకటేశం బహుభాషావేత్త. తెలుగు, హిందీ, ఆంగ్లంలో స్నాతకోత్తర పట్టాలు పొందిన విద్యాధికులు. సంస్కృతంలో కూడా మంచి పాండిత్యం సముపార్జించారు. ‘‘అన్యభాషల్లో సాహిత్య- కళాశాస్త్ర విషయంలో డి.లిట్. పట్టాలను సాధించిన సిద్ధాంత వ్యాసాలను ఇతర విశిష్ట గ్రంథాలను అనువదించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారాయన. ఈ క్రమంలో లోగడ కొన్ని ప్రామాణిక గ్రంథాలు తెనిగించారు. ప్రస్తుత గ్రంథం ‘్భరతీయ స్వతంత్ర కళాశాస్త్రం (ప్రథమభాగం)’ డా.కాంతిచంద్రపాండె హిందీ మూలానికి అనువాదం. డా.పాండె 1950లో డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ పర్యవేక్షణలో లక్నో విశ్వవిద్యాలయం నుంచి డి.లిట్.కోసం ‘కంపెరెటివ్ ఈస్థెటిక్స్’పైన బృహత్ సిద్ధాంత గ్రంథం సమర్పించారు. ఇందులో డా.పాండె ఎన్నో విషయాలు ఆవిష్కరించారని ప్రశంసిస్తూ డా.రాధాకృష్ణన్ ఇలా అంటారు. ‘‘హీజ్ వర్క్ డీల్స్ విత్ ఎ రిలెటివ్లీ అన్ ఎక్స్ప్లోర్డ్ సెక్షన్ ఆఫ్ ఇండియన్ థాట్.’’ సిద్ధాంత గ్రంథంలో ‘ఇండియన్ ఈస్థెటిక్స్’, ‘వెస్టర్న్ ఈస్థెటిక్స్’అనే రెండు భాగాలున్నాయి. ప్రథమభాగాన్ని డా.పాండె హిందీలో భారతీయ ‘స్వతంత్ర కళాశాస్త్రం’అన్నారు. అనువాదకులు ఈ ప్రయోగానే్న స్వీకరించారు. అనువాదం కళాబ్రహ్మ, శబ్దబ్రహ్మ, రసబ్రహ్మ అనే మూడుభాగాలలో సాగింది. ఏడు అధ్యాయాలలో మొదటి భాగం వాస్తు కళ, సంగీత కళ, నాట్యకళ గురించి సర్వ సమగ్రంగా వివరిస్తుంది. డా.పాండె ‘అధ్యేయ గ్రంథ సూచిక’లో 92 అత్యంత ప్రామాణిక కృతులను పేర్కొన్నారు. ఇవిగాక తమ గ్రంథంలో అనేక ఇతర కృతులు ప్రస్తావించారు. ‘ఈస్థెటిక్స్’ పదాన్ని ‘సౌందర్యశాస్త్రం’ బదులు ‘స్వతంత్ర కళాశాస్త్రం’ అనడానికి కారణం రచయిత ఇలా చెప్పారు.
‘‘స్వతంత్ర కళాకృతులు వ్యంజించే సౌం దర్య స్వరూపమేమి? దాని రచనా విధి ఎట్టిది? ఉత్కృష్టతమ రూపంలో దాని ప్రభావమేవిధంగా ఉంటుంది?- ఈ ప్రశ్నలు మన ప్రతిపాద్య విషయానికి ఘనిష్ఠంగా సంబంధించి ఉన్నాయి’’. ప్రతి అంశాన్ని కూలంకషం గా చర్చించారు. వేదోపనిషత్తులు, స్మృతులు, సూత్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, మహాకావ్యాలు, అనేక మహాకావ్యాలు, ప్రామాణిక శాస్త్రగ్రంథాలు ఇత్యాదుల నుంచి ఆధారాలు చూపారు. ‘వాస్తుకళ’లో వాస్తు శబ్దార్థమిచ్చి నిర్మాణం, వివిధ రీతులు, చిత్రశిల్ప విశేషాలు, ఇతర దేశాలలో భారతీయ వాస్తుప్రభావం మొదలైన పెక్కు సంగతులు విశదీకరించారు. ఈ కళపై ‘అధర్వవేదం’ అత్యంత ప్రాచీన ప్రమాణమని చెప్పి- అర్థశాస్త్రం, శుక్రనీతి, నాట్యశాస్త్రం, మత్స్యపురాణం, కామికాగమనం, అంశుమద్భేదం, తంత్ర సముచ్ఛయం, సమరాంగణ సూత్రధార, విష్ణ్ధురోత్తర పురాణం, రామాయణం, భారతం, మానసార వంటి ఎన్నో గ్రంథాలను ఉటంకించారు. సామవేదం సంగీతపరంగా ప్రాచీన ప్రమాణమని వివరిస్తూ పూర్వం ‘‘స్వర సమూహం మూడుగా ఉండేది. ఎందుకనగా వేదాలన్నింటిలో మూడు రకాలైన స్వరాలే అంగీకరింపబడినాయి’’ అని తెలియజేశారు. తర్వాత సప్తస్వరాలను గురించి విశదీకరించారు. ప్రామాణిక గ్రంథాలు, మూర్ఛనలు, ఉచ్చారణ కాలం, శాస్తక్రారులు, గీతకర్తలు, సంగీత సంప్రదాయాలు, ఇస్లాం ప్రభావం మున్నగు అంశాలు విపులీకరించారు. ‘‘నాట్యకళాకృతికి మించి వేరే ఏ స్వతంత్ర కళాకృతిని కూడా రసానుభవ విషయంగా పేర్కొనడం సముచితం కాదని అభినవగుప్తుని మతం’’తో ‘నాట్యకళ’ చర్చ ఆరంభమవుతుంది.
—
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Gabbita Durga Prasad
Rtd. head Master Sivalayam Street
Vuyyuru 521165 Krishan District
Andhra Pradesh
India
Cell : 9989066375
8520805566
Land Line : 08676-232797
