సరసభారతికి అత్యంత ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి 80 వ జన్మ దినోత్సవ (10-1-15)సందర్భం గా మా కుటుంబం తరఫునా సరసభారతి తరాఫునా శుభాకాంక్షలు అంద జేస్తున్నాం మంచి ఆరోగ్యం తో ఆనందం గా జీవితం కొన న సాగాలని అందరి వాంచితం ..
మరో శుభ వార్త కూడా -నేను అంతర్జాలం లో 140 మంది సంస్క్రుతకవులపై రాసిన ”గీర్వాణ కవుల కవితా గీర్వాణం ”ను ఆన్ లైన్ లో శ్రీ గోపాల కృష్ణ గారికి అంకితమిచ్చిన సంగతి మీకు తెలిసిందే . దాని సి డి ని రేపు అంటే 11-1-15 ఆదివారం సరసభారతి 74 వ సమావేశం గా నిర్వహిస్తున్న ”దర్శనీయ దైవ క్షేత్రాలు ”గ్రంధా విష్కరణ సందర్భం గా మైనేని వారి మెంటార్ ,మార్గ దర్శి సచివులు సన్నిహితులు సారధి ప్రియ నేస్తం, కపటమెరుగని సౌశీల్య సౌజన్య మూర్తి శ్రీ కోగంటి సుబ్బారావు గారు ఆవిష్కరిస్తారు
మరొక శుభ వార్త”గీర్వాణ కవుల కవితా గీర్వాణం ”గ్రంధానికి స్పాన్సర్ గా ఉండి ముద్రణ ఖర్చులు భరించి సరసభారతి తరఫున పుస్తకం ముద్రించటానికి సౌజన్యం తో స్వచ్చందం గా ముందుకొచ్చి, మేనమామ శ్రీ గోపాలకృష్ణ గారిపై ఉన్న ఆదరాభిమానాలకు నిదర్శనం గా నిలిచిన డాక్టర్ శ్రీమతి జ్యోతి (అమెరికా)గారికి సరసభారతి కృతజ్ఞత తెలియ జేస్తూ అభినందనలను అంద జేస్తోంది
ఇంకొక శుభవార్త -ఈ గ్రంధాన్ని సరసభారతి15-3-15 బుధవారం సాయంత్రం నిర్వహించే శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలలో ఆవిష్కరింప జేస్తామని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాం మేము కోరిన వెంటనేముద్రణ బాధ్యతలు స్వీకరించటానికి అంగీకరించిన శ్రీ చలపాక ప్రకాష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకొంటు న్నాం .
అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -ఉయ్యూరు
—

Watch Live
దర్శనీయ దైవ క్షేత్రాలు గ్రంధా విష్కరణ సభ –
దర్శనీయ దైవ క్షేత్రాలు గ్రంధా విష్కరణ సభ –