ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -1
సాహితీ బంధువులకు రధసప్తమి ,అరవై వ గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు –
నాకు ,సరస భారతికి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా)అత్యంత ఆత్మీయులు అన్న సంగతి మీకు తెలిసిన విషయమే .ఎప్పుడూ ఆయన తనకు నచ్చి చదివిన పుస్తకం నేను కూడా చదవాలన్న ఉద్దేశ్యం తో కొని ,నాకు పంపటం దాదాపు పదేళ్లుగా జరుగుతున్న విషయం ఎప్పటికప్పుడు నాకేదైనా పుస్తకం కావాలంటే నిస్సంకోచం గా తనకు తెలియ జేయమని చెబుతూనే ఉంటారు .కాని నేను ఏనాడూ ఆ అవకాశం ఉపయోగించుకోలేదు . నిరుడు ప్రముఖ అమెరికన్ రచయిత ‘’లూయీ అంటర్ మేయర్ ‘’ రాసిన ‘’లైవ్స్ ఆఫ్ ది పోయెట్స్’’పంపటం వెంటనే నేను చదివి ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’గ నెట్ లో రాయటం దాన్ని వారు స్పాన్సర్ చేసి పుస్తకరూపం లో సరసభారతి తీసుకురావటం తెలిసిందే .ఆ తర్వాత ఎప్పుడో నెట్ లో వెతుకుతుంటే లూయీ రాసిన ‘’మేకర్స్ ఆఫ్ ది మోడరన్ వరల్డ్ ‘’అనే పుస్తకం చూశా .మైనేని గారికి రాసి ఆయన చదివారేమో అడిగా .చదవలేదని చెప్పటం ,వెంటనే కొని నాకు పంపటం అది కిందటి అక్టోబర ఇరవైన నాకు చేరటం చక చకా జరిగిపోయాయి .ఆరోజే చదవటం ప్రారంభిచాను అందులో ‘’గుజ్జు ‘’ఉందనిపించింది .దాన్ని సమయం ఉన్నప్పుడు చదువుతూ నెమ్మదిగా మూడు నెలలు చదివి ఈ ఇరవై తేదీకి పూర్తీ చేశానని పించాను .
1909లో జన్మించిన చార్లెస్ డార్విన్ తో ప్రారంభించి 1914లో పుట్టిన డిలాన్ ధామస్ తో పూర్తీ చేసి వందేళ్ళ కాలం లో మధ్యలో ఎందేరెందరో రాజకీయ వేదాంత ధార్మిక ఆర్ధిక శాస్త్ర సాంకేతిక చిత్రలేఖన,సాహిత్య నాటక సినిమా ,సంగీతాది రంగాలలో చరిత్రను మలుపు తిప్పిన92 ప్రముఖుల జీవితాలను వారు సాధించిన విజయాలను ,పొందిన కీర్తిని అపకీర్తిని,పడిన కష్టాలను అన్నిటినీ కళ్ళకు కట్టేట్లు లూయీ అంటర్ మేయర్ తన ప్రతిభా సర్వస్వం తో మహా గొప్పగా చిత్రించాడు .వీరిని ఆయన ‘’movers and shakers ‘’అన్నాడు అంటే కదిలించి చైతన్యం తెచ్చిన వారన్నమాట . ఇందులో ఎందరో నాకు తెలియని వారే ఉన్నారు .వారిని ఈ పుస్తకం ద్వారానే తొలిసారి తెలుసుకొన్నాను .కనుక మీకూ వారి విశేషాలను అందించాలనే ఆలోచన కలిగి ‘’ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు ‘’అనే శీర్షిక తట్టి మైనేనిగారికి మెయిల్ రాస్తే శుభస్య శీఘ్రం అని ఆశేర్వదించారు .ఇవాళ రధ సప్తమి ,భారత రిపబ్లిక్ దినోత్సవం కలిసి వచ్చిన శుభ సందర్భం గా ఈ ధారా వాహిక ను ప్రారంభిస్తున్నాను .ఇందులోని వారి జీవితాలలో సాధించిన జయాపజయాలకే ప్రాధాన్యం ఇస్తున్నాను .వారెక్కడ ఎప్పుడు పుట్టి ఎక్కడెక్కడ ఏమేం చదివారో వగైరా ల జోలికి పెద్దగా పో దలచుకోలేదు . సంక్షిప్తం గా ,సూటిగా మాత్రమే రాస్తున్నాను .ఆదరిస్తారని భావిస్తున్నాను –మీ –దుర్గా ప్రసాద్
1 –చార్లెస్ డార్విన్
చార్లెస్ డార్విన్ రాసిన ‘’పరిణామ సిద్ధాంతం ‘-‘’ది ఆరిజిన్ ఆఫ్ స్పెసీస్ ‘’’పై సాప్రదాయ వాదులు తిరగ బడితే ,నవీనులు సమాదరించారు .ఆరేళ్ళప్పుడే తల్లిని కోల్పోయాడు .జంతువులంటే అమితమైన ప్రేమ ఉండేది పసితనం నుంచే .రక్తాన్ని చూస్తె బెదిరిపోయేవాడు .ప్రతిదీ తెలుసుకోవాలన్న తపన తో సైన్స్ మీద ద్రుష్టిపెంచుకొన్నాడు .దక్షిణ అమెరికా కు పరిశోధన కోసం వెడుతున్న బీగిల్ అనే ప్రభుత్వ నౌకలో నేచరిస్ట్ అయిన డార్విన్ కు అవకాశం ఇచ్చి ఆహ్వానిస్తే వెళ్ళాడు .దొరికిన లక్షణాలను బట్టి ఆ జీవి రూపు రేఖలు ,ప్రవర్తన నిర్నయిఇంచ వచ్చుననే వాడు .దీన్ని నౌక కెప్టెన్ ,మరియు ‘’ఫ్రేనాలజిస్ట్ ‘’అయిన ఫైజ్ రాయ్ ఈసడిస్తూ ‘’ఈకల్ని బట్టి పక్షి సంగతి చెప్పే నీ ముక్కు మాత్రం నాకు నచ్చ లేడు’’అన్నాడు . రెండేళ్ళు అనుకొన్న ఈ పరిశోధన అయిదేళ్ళు పట్టింది .
ఈ సుదీర్ఘ ప్రయాణం లో సరైనా తిండి లేదు పడక లేదు చాలా దారుణ పరిస్తితుల్లో గడిపాడు .సముద్ర జ్వరం తో బాధ పడ్డాడు .ఆరోగ్యం బాగా దెబ్బతిని జీవితాంతం బాధ పడ్డాడు .కాని ఈ ప్రయాణం తన జీవితం లో గొప్ప విద్యనూ అందించిందని సంబరాపడ్డాడు .డార్విన్ ఇప్పుడు’’ సెర్చింగ్ బయాలజిస్ట్ ‘’అవతారం ఎత్తాడు .ఎప్పుడూ అనారోగ్యం ,జ్వరం ,కడుపు నొప్పి ,వాంతులు మొదలైన వాటితో బాధలు పడుతూ సంసారం చేస్తూ అయిదుగురు కొడుకుల్ని ఇద్దరు అమ్మాయిల్ని కన్నాడు .యాభై వ ఏట ఆరిజిన్ ఆఫ్ స్పెసీస్ ప్రచురించాడు దీని ప్రభావం సోషల్ సైన్స్ ,వేదాంతం ,మతం మొదలైన వాటిపై పడి గణనీయమైన మార్పులు చెందాయి అవి .దీనితో డార్విన్ ప్రాభవం పెరిగిపోయి ‘’న్యూటన్ ఆఫ్ బయాలజీ ‘’అని డార్విన్ ను అందరు కీర్తించారు .ధామస్ హక్స్లీ కూడా డార్విన్ ఫాన్ గా మారిపోయాడు
ఆరిజి న్ ఆఫ్ స్పెసీస్ ను అధిక్షేపించటమేకకుండా నిషేధానికి గురి చేశారు .అలాంటి పాఠాలు స్కూళ్ళలో బోధించ రాదన్నారు .డార్విన్ చెప్పినవి బోధిస్తున్న జాన్ ధామస్ స్కోప్ అనే ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు దీనిపై ప్రజా సంఘాలు మండిపడి ఎడురుతిరిగినాయి .కోర్టు కేసులు నడిచి ఆ ఉపాధ్యాయుడిని ఎన్నో ఇబ్బందులకు గురి చేసి౦ది వేసవిలో కోర్టుకు హాజరై న ఆ మేస్టారి ప్రాణాలు హరీ మన్నాయి పాపం నిజం చెప్పిందుకు ఇంతటి శిక్ష అనుభ వి౦ చాడు ఆ పూర్ క్రీచర్ టీచర్ .
దేనికీ వెరవని డార్విన్ తన పుస్తకాన్ని పెంచి రాస్తూనే ఉన్నాడు మెరుగులు దిద్దుతూనే ఉన్నాడు .డార్విన్ చెప్పిన పరిణామ సిద్ధాంతాన్ని గురించి రాసిన పాల్ సియర్స్ అనే ఆయన ‘’the immediate effect of Darwin on science was one of magnificent release .It was not ,properly speaking ,a stimulus –the vast unexplored world of the unknown was stimulus enough ,and curiousity was straining to under stand it .Darwin cut the leash ,and the human mind leaped a head .He wrought mightily ,and others with him ,for a newer and greater faith –in universal order ,whose secrets open themselves to men truly free to question ‘’ అని గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చాడు .
నూట ఇరవై జాతులకు ,తొమ్మిది ఉపజాతులకు డార్విన్ పేరుపెట్టి గౌరవించారు .ఆయన కనిపెట్టిన గాలాపగాస్ దీవులకు ‘’డార్విన్ ఫించేస్ ‘’అనే గౌరవనామం పెట్టి గుర్తించారు .ఇతరులు కనిపెట్టిన పరిణామాత్మక విషయాలకు డార్వినిజం ‘’అని పేరుపెట్టారు .రాయల్ సొసైటీ రాయల్ మెడల్ ఇచ్చి సన్మానించింది .
డార్విన్ 2-12-1809 లో ఇంగ్లాండ్ లో జన్మించి ,డెబ్భై మూడవ ఏట 19-4-1882న చనిపోయాడు .మతాన్ని మాట నమ్మకాలను ఒక మలుపు తిప్పిన జీవ శాస్త్ర వేత్త చార్లెస్ డార్విన్ .జీవ పరిణామ సిద్ధాంతం నవ శాస్త్ర సూర్యోదయానికి నాంది పలికింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-1-15-ఉయ్యూరు