నా దారి తీరు -84 గండ్రాయి హైస్కూల్ లో చేరిక

నా దారి తీరు -84

గండ్రాయి హైస్కూల్ లో చేరిక

ఆత్కూరు హైస్కూల్ లో రిలీవ్ అయి వేసవి సెలవలలో 24 -4-86నుండి 30-4-86 వరకు ట్రాన్సిట్ వాడుకొని గండ్రాయి హైస్కూల్ లో చేరటానికి ఏప్రిల్ ముప్ఫై వ తేదీన ఉయ్యూరు నుండి బయల్దేరి గండ్రాయి కి విజయవాడ వెళ్లి అక్కడినుండి జగ్గయ్య పేట బస్ ఎక్కి ,అక్కడినుండి వల్లభి బస్ ఎక్కి షేర్ మహమ్మద్ పేట మీదుగా గండ్రాయి హైస్కూల్ దగ్గర స్టాప్ లో దిగా. ఎండ అదిరిపోతోంది .అప్పటి దాకా గండ్రాయి ఎక్కడ ఉందొ తెలీదు తెలుసుకొని వెళ్లాను .లాస్ట్ వర్కింగ్ డే కనుక జీతాలు చెక్కు మార్చి ఇచ్చేరోజు .నేను వెళ్లేసరికి హెడ్ మాస్టారు లేరు .జీతాల చెక్ మార్చటానికి జగ్గయ్య పేట వెళ్ళారని నైట్ వాచర్  చెప్పాడు .అక్కడే బల్లమీదో కుర్చీలోనో కూర్చున్నా.సాయంత్రం నాలుగింటికి హెడ్ మాస్టారు శ్రీ పి.వి సుబ్రహ్మణ్యం గారు ,గుమాస్తా  అటెండర్ వచ్చారు .జీతాలు తీసుకోవటానికి కొద్దిమంది మేస్టార్లు కూడా వచ్చారు .నా ట్రాన్స్ ఫర్ వలన  అప్పటిదాకా గంద్రాయిలో పని చేసిన సైన్స్ టీచర్ హూస్ట్ అయిందని ముందే రాశాను .ఆమె కూడాస్వగ్రామం బందరు నుంచి  జీతాలకోసం వచ్చింది .పరిచయం అయింది .సారీ చెప్పాను .హెడ్ మాస్టారి గార్ని పరిచయం చేసుకొని  విషయం చెప్పి నా జాయింగ్ రిపోర్ట్ అందించాను .వారు వెంటనే  హాజరు పట్టీ లో   రాసి నా సంతకం పెట్టించారు .నేను ఏప్రిల్ ముప్ఫైవ తేదీ సాయంత్రం గంద్రాయిలో డ్యూటీలో చేరినట్లు అయిందన్నమాట .

హెడ్ గారు చాలా మర్యాదస్తులు బ్రాహ్మణులు .జగ్గయ్య పేటలో స్వంత ఇంట్లోనే ఉండి రోజూ గండ్రాయికి అప్ అండ్ డౌన్ బస్ లో చేస్తారు .ముఖం కొంచెం స్పోటకం పోసినట్లుంటుంది నవ్వుముఖం .బ్లూ కలర్ లేక ఖాకీ కలర్ పాంటు ఖద్దరు ఫుల్ చేతుల షర్ట్ ధరిస్తారు .అక్కడ వారు చెప్పిన దాన్నిబట్టి జగ్గయ్య పేటలో వారికి లెక్కల టీచర్ గా మంచి పేరుంది .ఆయన శిష్యులు ఆయనమీద ఉన్న గౌరవం భక్తికి నిదర్శనం గా ఒక డాబా ఇల్లు కట్టించి కానుకగా ఇచ్చారు .చుట్టుప్రక్కల హెడ్ మాస్టర్లలో తలలో నాలుకగా ఉంటారు. రూల్స్ అన్నీ ధరో.ఇక్కడ టెన్త్ క్లాస్ కు ఇంగ్లీష్ బోధిస్తున్నారు  ఈ స్కూల్ లో అన్నీ సింగిల్ సేక్షన్లే .స్త్రెంగ్థ్ మూడు వందల లోపే .ఒక లెక్కల మేస్టారు ఒక సైన్సు ఒక సోషల్ ,హిందీపండిట్ తెలుగుపండిట్ ,డ్రాయింగు డ్రిల్లు క్రాఫ్ట్ మేష్టారు  ఇద్దరు సేకండరీగ్రేడ్ మాస్టర్లు ఉన్నారు .ఒక గుమాస్తా .ఇదీ స్టాఫ్ .క్రాఫ్ట్ మేస్టారు వెంకటేశ్వర రావు స్టాఫ్ సెక్రెటరి లైబ్రరీ ఇంచార్జి కూడా .ఒక చిన్న లాబరేటరి ఉంది .దాన్ని వాడిన పాపాన పోయినట్లు అనిపించలేదు .స్కూలు రోడ్డు మీదే ఉంది .కాంపౌండ్ వాల్ లేదు .మంచిప్లె గ్రౌండ్ ఉంది కాని ముళ్ళమయం .రూములన్నీ రేకుల షెడ్ లే అని గుర్తు .సరే ఇక చేరాముకనుక ఉండటానికి ఎలా అనే ఆలోచన .ఇంతలో ఆ వూరి మాజీ ప్రెసిడెంట్ కనుపర్తి ఆయన  ,స్కూలుకు చాలాకావలసిన వాడు అయిన ఒకాయన వచ్చాడు .మల్లు పంచే లుంగీతో  పరిచయం చేసుకొన్నాడు .ఇక్కడ అంతా బాగా ఉంటుందని పిల్లలకు ట్యూషన్ చెప్పే వారు లేరని ఇక్కడే ఉంటె పిల్లలకు బాగా ఉపయోగం గా ఉంటుందని అన్నారు  ఆయన్ను అందరూ ‘’మాజీ గారు ‘’అంటారు ఆలోచనలో పడ్డాను సోషల్ లెక్కల మేష్టర్లూ హెడ్ మాస్టారు జగ్గయ్యపేట నుంచి వస్తారు .కనుక పిల్లలకు ప్రైవేట్ చెప్పేవారు లేరు .నాకు ఇక్కడి వాతావరణం అంతా కొత్తగా ఉంది .మంచినీరు దొరకదు .వేడిప్రదేశం కాకిరాయికి గండ్రాయి బాగా ప్రసిద్ధి అని విన్నాను చదివాను .ఫామిలీ పెట్టె ఆలోచన ఎలానో లేదు .ఏం చేయాలి ? రిఒపెనింగ్ రోజున వస్తానని చెప్పి అందరి దగ్గర సెలవు తీసుకొని ఉయ్యూరు బయల్దేరా .

జగ్గయ్య పేటలో మా బుల్లిమామ్మ మనుమడు వెలమకన్ని శోభనాద్రీశ్వర రావు అనే శోభనాద్రి వాళ్ళు సీతారాం పురం లో ఉంటారు .కనుక వాళ్లకు ఒక సారి కనిపించి వెడదామని అనుకోని జగ్గయ్య పేట దిగి బస్ స్టాండ్ కు దగ్గరలోనే ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్లాను .సత్యవతి పిన్ని శోభనాద్రి భార్య రాముడు భార్య అందరూ కలిసే ఉంటున్నారు పెద్ద ఇల్లే .గంద్డ్రాయిలో చేరానని స్కూల్ తెరిచే నాటికి మళ్ళీ వస్తానని చెప్పాను ఎక్కడా ఉండద్దు వాళ్ళింట్లోనే ఉండి రోజూ గండ్రాయి వెళ్లి రావచ్చునని భోజనం వసతి అంతా వాళ్ళ ఇంట్లోనే అని వాళ్ళంతా చాలా ఆప్యాయం గా చెప్పారు .కాదనటం ఎందుకని సరేనన్నాను  .ఇక్కడ ఉండి కొన్ని రోజులు వెడుతూ గండ్రాయిలో ఒక రూమ్ తీసుకొని ఉండవచ్చు అని నా ఆలోచన .కనుక ఆవాసానికి వెళ్లి రావటానికి ఇబ్బంది లేదు .’’ఏ బ్లెస్ ఐ  దిస్గైజ్ ‘’ వాళ్ళనుంచి బస్ స్టాండ్ కు వెళ్లి బస్ ఎక్కి బెజవాడ మీదుగా ఉయ్యూరు రాత్రికి చేరుకొన్నాను .

ఇప్పటికే నేను హెడ్ మాస్టర్ అకౌంట్ టెస్ట్ ఒక్క పేపర్ మినహా అన్నీ పాసై ఉన్నాను అదీ రాశాను రిజల్ట్ రావటం దాదాపుగా సంవత్సర ఆలస్యం .అయింది మధ్యలో సమ్మెలు హడావిడి తో అంతా అనుకోని డిలే .ఏ నెలలోనైనా రిజల్ట్ రావచ్చు .వస్తే హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ వస్తుంది .కనుక గండ్రాయి నుంచి మళ్ళీ ఉయ్యూరు వైపుకు ట్రాన్స్ ఫర్ కోసం ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టాను. లేకపోతె ప్రతిసారీ లాగా జిల్లా పరిషత్ వాళ్ళు ట్రాన్స్ ఫర్ చేయటం నేను మళ్ళీ ప్రయత్నంచటం అక్కడి నుండి బయట పడటం ఇంతదాకా జరుగుతోంది .సరే ఇదీ ఒకందుకు మంచిదే .ఫలితాల కోసం ఎదురు చూస్తూ జిల్లా పరిషత్తు వారు పానెల్ తీసే లోపు రిజల్ట్ వస్తే వారికి తెలియ జేస్తే పానెల్ లో చేర్చి ప్రమోషన్ ఇస్తారు .లేక పొతే మళ్ళీ సంవత్సరం దాకా ఆగాల్సి ఉంటుంది .రోట్లో తలపెట్టాం ఎదురు చూడక తప్పదు.ఇప్పటిదాకా హెడ్ మాస్టర్ ప్రమోషన్ మనకెందుకులే అనుకోని అశ్రద్ధ చేసి పరీక్ష రాయలేదు .ఇన్నాళ్ళకు కుచ్చెళ్లు సవరించి రాస్తే రిజల్ట్ ఆలస్యం .సర్వం కాలాదీనం అన్నారు అందుకే అనిపిస్తుంది .

ఇంటికి చేరి గండ్రాయి విశేషాలన్నీ చెప్పాను .జగ్గయ్యపేట నుంచి అరగంటకు ఒక బస్ వల్లభికి ఉంటుంది. అది ఖమ్మం కు దగ్గరఖమ్మం జిల్లాలోని ఊరు  .గండ్రాయి మీదగా వెడుతుంది ఖమ్మం ప్రయాణీకులు వల్లభి దిగి అక్కడినుంచి వెడతారు. కనుక ఈ బస్ కు గిరాకీ ఎక్కువే .జన రద్దీ బాగా ఉంటుంది .షేర్ మహమ్మద్ పేట బెజవాడ హైదరాబాద్ రూట్ లో చిల్లకల్లుకు సుమారు ఎనిమిది కిలోమీటర్లలో జగ్గయ్యపేటకు ఆరు కిలో మీటార్ లలో  మయిన్ రోడ్ మీదనే ఉంది .అక్కడి నుంచి కుడి వైపు రోడ్డు గండ్రాయికి వెడుతుంది .కనుక షేర్ మొహమ్మద్ పేటలో దిగి అక్కడినుండి వల్లభి బస్ పట్టుకొని గండ్రాయి వెళ్ళాలి ఉద్యోగం చేయాలి అంటే ఇన్ని తిప్పలు పడాలి .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-1-15 –ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.