నా దారి తీరు -85 గండ్రాయిలో ఒకే గదిలో కాపురం

నా దారి తీరు -85

గండ్రాయిలో ఒకే గదిలో కాపురం

స్కూల్ తెరిచే రోజుకు జగ్గయ్య పేటకు వంట సామాను మడతమంచం మా తమ్ముడు ఇంగ్లాండ్ నుంచి తెచ్చినఅలారం కం  రేడియో వగైరా సరంజామాతో శోభనాద్రి వాళ్ళింటికి చేరాను .వాళ్ళు నాకోసం భోజనం రెడీ చేసి ఉంచారు తిని బస్ ఎక్కి స్కూల్ సమయానికి గండ్రాయి చేరాను .రోజూ అసెంబ్లీ ఉండేది .హెడ్ మాస్టారు సమయానికే వచ్చేవారు .అంతాఅయిన తర్వాత పిల్లలు క్లాసులకు వెళ్ళేవారు .నేను లాబ్ ను సుబ్బారావు గారనే సెకండరీ గ్రేడ్ మాస్టారి నుంచి హా౦ డోవర్ చేసుకొన్నాను  సైన్స్ క్లాసులు అక్కడే నిర్వహించేవాడిని .చిన్న బల్బు తప్ప ఏ సౌకర్యమూ లేదు .ఏ క్లాస్ వాళ్ళకూ లైట్లు లేవు .వర్షం వచ్చినా చీకటిపడినా కళ్ళు కనిపించేవికవు. అలానే గడుపుకోస్తున్నారు .ఇదంతా చూడటానికి నాకు చాలా ఇబ్బందిగా ఉండేది .వర్క్ అలాట్ మెంట్ చేసి టైం టేబుల్ వేసి ఇచ్చారు .నేను  ఎనిమిదో క్లాస్ కు ఇంగ్లీషు ,ఎనిమిది నున్చిపదో క్లాస్ వరకు ఫిజికల్ నేచురల్ సైన్సూ చెప్పాలి .క్రమంగా అలవాటుపడ్డాను ఈ వాతావరణానికి .

వారం రోజులు జగ్గయ్య పేట నుంచే వచ్చేవాడిని .ఉదయం కాఫీ వేళకు భోజనం ఏర్పాటు చేసింది సత్యవతిపిన్ని నన్ను చాలా ఆప్యాయం గా చూసేది అలానే కోడళ్ళూ కొడుకులూ మనవలూ మనవరాళ్ళు కూడా .ఎక్కడో దూరంగా ఇంటికి దూరంగా ఉన్నాననే భావం నాలో నుంచి పోగోట్టారందరూ .సాయంత్రం రాగానే టీ తాత్రి భోజనం అన్నీ యదా ప్రకారం గా ఉండేవి వీళ్ళకు శోభనాద్రి గూడెం నుండి రోజూ బస్ లో బస్ స్టాండ్ కు స్వంత గేదెల పాల కాన్ వచ్చేది .దాన్ని ఎవరొ ఒకరు  వెళ్లి ఇంటికి తెచ్చుకొనే వారు . ఇంట్లో ఫ్రిజ్ కూడా లేదు .

రోజూ స్కూల్ కు వెళ్ళగానే పిల్లలు ట్యూషన్ చెప్పండి అని వెంటపడేవారు .రెండుమూడురోజుల తర్వాత అలాగే అన్నాను .ఉండటానికి రూమ్ కావాలన్నాను  .ఎవరికి వాళ్ళు మా ఇంటికి రండి మా ఇంటికి రండి అనే వాళ్ళు .ట్యూషన్ చెప్పాలంటే  షరతులు  పెట్టాను .నేను ప్రతి శనివారం సాయంత్రం ఉయ్యూరు వెడతానని దసరా ,సంక్రాంతి సెలవల్లో ఉండనని చెప్పాల్సినదంతా ఉన్న రోజుల్లోనే చెప్పుతానని ,అవసరం అయితే తెల్ల వారుజ్హామునే రావాల్సి వస్తుందని రాత్రి తొమ్మిది దాకా ఉండాల్సి ఉంటుందని చెప్పాను. అందరూ చాలా ఆనందం గా ఇష్టపడ్డారు .

కనపర్తి పిచ్చయ్య గారు భారతమ్మ గారి ఆదరణ ఆప్యాయత

కనపర్తి ప్రసాద్ అనే కుర్రాడు తొమ్మిది చదువుతున్నాడు .వాడు వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ ఉందని అది ఇస్తారని పూర్వం ప్రసాద్ అనే సైన్స్ మేష్టారు అక్కడే ఉండి ట్యూషన్ చెప్పేవారని చెప్పి ఇంటికి తీసుకొని వెళ్ళాడు .అక్కడ అతని తండ్రిగారు పిచ్చయ్య గారు అమ్మగారు భారతమ్మ గారు నన్ను ఏంతో ఆప్యాయం గా పలకరించి ఆహ్వానించారు కాఫీ ఇచ్చారు .టిఫిన్ పెట్టారు .వాళ్ళ ఇంట్లో ఉండటానికి ఏ విధమైన అభ్యంతరం లేదని హాయిగా ప్రైవేట్ చెప్పుకోవచ్చని అన్నారు .ఏ సహాయం కావాలన్నా తాము చేయటానికి సిద్ధం అన్నారు .నేను ఒకడినే ఉంటానని ఫామిలీని తీసుకొని రానని వంట చేసుకొంటానని ప్రతివారం ఉయ్యూరు వెడతానని నా రికార్డు పెట్టాను .నవ్వి అలాగే అన్నారు .వాళ్ళ అబ్బాయి ప్రసాద్ చదువులో బాగా వెనక పడిఉన్నాడని ప్రత్యెక శ్రద్ధ తీసుకోవాలని కోరారు అలాగేనన్నాను .వాళ్ళు ఉంటున్న డాబా లో వాకిలి వైపున్న కుడివైపు గది చూపించారు .బాగానే ఉంది నాకు సరిపోతుంది. లోపలా బయటా వరండాలో ట్యూషన్ చెప్పచ్చు .నచ్చిందని చెప్పాను .అద్దె యాభై అనిజ్ఞాపకం .

సుమారు వారం తర్వాత పిచ్చయ్య గారింట్లో చేరాను .వంట చేసుకొనే వాడిని .ముందుగా మాజీ గారి అమ్మాయి  తారకేశ్వరి అనే తార అనే అమ్మాయి ఆ అమ్మాయితో పాటు కొందరమ్మాయిలు టెన్త్ క్లాస్ చదివే వాళ్ళు చేరారు .క్రమంగా బాయిస్ కూడా వచ్చారు .దాదాపు ఇరవై మంది చేరారు. ప్రసాద్ తొమ్మిది చదువుతున్నాడుకనుక అతనికోసం తొమ్మిది వాళ్ళనూ చేర్చుకోవాల్సి వచ్చింది .స్కూల్ లో టీచింగ్ చూసి ఎనిమిది వాళ్ళూ  వచ్చారు .సందడే సందడి .దీనికి కారణం ఆ మార్చిలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు దారుణం గా ఉన్నాయి అంతా కలిపి పదహారుశాతం మాత్రమె పాస్ అయ్యారు .అందుకని తలిదండ్రులు పిల్లల్లో బాగా చదవాలని చదివించాలని కోరిక కలిగింది .ట్యూషన్ చెప్పే వారు ఇన్నాళ్ళకు దొరికి నందుకు వారి సంతృప్తి కి హద్దు లేకుండా పోయింది .అందుకని చాలామంది చేరుతున్నారు .అదీ అసలు విషయం .టెన్త్ వాళ్లకు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు ఫీజు పెట్టాను .రెండు వాయిదాలలో ఇవ్వాలి .చేరిన నెల లోపు మొదటి వాయిదా చెల్లించాలి .తోమ్మిదివారికి రెండు వందలు ఎనిమిదివారికి నూటయాభై తీసుకొన్న జ్ఞాపకం .పిల్లలు పెరిగే సరికి పిచ్చయ్యగారికి కొంత ఇబ్బంది గా ఉండేది .అయన బాగా తెలుగు దేశం రాజకీయం మనిషి .ఎప్పుడూ ఇల్లు పెద్ద సత్రం లా జనం తో కిట కిటలాడేది .అందుకని నారూమ్ ను డాబా పైన ఉన్న ఉన్న గదిలోకి మార్చారు  గది కూడా విశాలమైనదే  బయట ఖాళీ చాలా ఉంది గాలి వెలుతురూ కు ఢోకాలేదు .పిచ్చయ్య గారి ఇంటి వెనకే వల్లభి వెళ్ళే బస్ స్టాప్ ఉంది చాలా దగ్గర .ఇక్కడే దిగి ఇంట్లోకి రావచ్చు .

పిచ్చయ్య గారి దంపతుల ఆతిధ్యం

పిచ్చయ్య గారికి వ్యవసాయం ఉంది .ఎడ్లు బండీ పాలేర్లు ఆవులు  గేదెలు ఉన్నాయి వీటితోపాటు మేకలూ గొర్రెలూ ఉండేవి .నారాయణ అనే పాలేరు నల్లగా ఉండేవాడు. లుంగీతో ఉండేవాడు స్లాక్ వేసేవాడు. వారింట్లో అన్నిపనులు చేసేవాడు .తెల్లవారగానే భారతమ్మగారు అతనితో కప్పూ సాసరు తోకాఫీ పంపేవారు. వారింట్లో ఇడ్లీలు చేస్తే టిఫిన్ పంపేవారు ఇంట్లో ఎవరైనా బంధువులు కాని పార్టీ వాళ్ళు కాని వస్తే వారి తో బాటు నాకూ మళ్ళీ కాఫీ వచ్చేది .మధ్యాహ్నం స్కూల్ నుండి ఇంటికి వస్తే టీ పంపేవారు .ఉదయం తోమ్మిదిన్తికోసారి కాఫీ వచ్చేది .సాయంత్రం మళ్ళీ ఇటికి రాగానే టీ పంపేవారు .నేను పాలు కొనేవాడిని కాదు అంటే కొన నివ్వలేదు నాకుకావలసిన పాలు అరలీటరు వారే పంపేవారు నేను కూడా కాఫీ పెట్టుకొని కావా ల్సినప్పుడు తాగేవాడిని . పొద్దునా రాత్రి గడ్డ పెరుగు పంపేవారు .నాకు ఏ లోటు లేకుండా స్వంత పిల్లాడిలాగా చూసుకొన్నారు .ఆ దంపతులు వారిద్దరి మాటలూ కొంత పడమటి యాస తో ఉండేది .మాస్టరు గారూ అని ఆప్యాయం గా ఇద్దరూ పిలిచేవారు .ఇంటికొచ్చిన వారందరికీ నన్ను పరిచయం చేసేవారు వారి స్వంత మనిషిగా చూసుకొన్నారు .ఇంతటి ఆప్యాయత నాకు మహాశ్చర్యం గా ఉండేది .మేస్టారు అంటే వారికున్న గౌరవం అది .

కమ్మ వారే అయినా పిచ్చయ్య దంపతులు ఏంతో అభిమానం కనపరచారు .నాకు ఎప్పటికప్పుడు ఏం కావాలో పాలేరు నారాయణ్ తో అడిగించి ఏ లోటూ రాకుండా చూశారు  .వాళ్లకు ఇద్దరబ్బాయిలు ఒక అమ్మాయి .అమ్మాయిని మేనల్లుడికే ఇచ్చి పెళ్లి చేశారు. పెద్దబ్బాయి హైదరాబాద్ లో ఉద్యోగం ప్రసాద్ రెండవ వాడు .వీడు చాలా సాత్వికుడు .నోటిలో నాలుకలా ఉండేవాడు .నెమ్మది పిల్లాడు ఎర్రగా పొడుగ్గా సన్నగా ఉండేవాడు మాట కూడా నేమ్మదే .చదువులో బాగా వెనక పడి ఉన్నాడు .వీడికి ప్రత్యేకం గా చెప్పి తీర్చి దిద్దాల్సి వచ్చేది .అలానే చేసేవాడిని భారతమ్మ గారి పుట్టిల్లు దగ్గరలోనే ఉన్న భీమవరం .తలిదండ్రులు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవారు .పెనుగంచిప్రోలుకు భీమవరం మీదుగా వెళ్ళచ్చు . .

కనపర్తి శేషగిరిరావు గారనే ఆయన కాంగ్రెస్ పార్టీ వారు .ఆయన మండలాధ్యక్షునిగా పని చేశారు .పిచ్చయ్యగారికి కజిన్ .పార్టీలు వేరైనా మంచి సంబంధ  బాంధవ్యాలు ఉండేవి  .రెండుకుటుంబాల మధ్య .ఏదో ఒక ఫంక్షన్ కు శేషగిరిరావు గారింటికి వెళ్ళిన జ్ఞాపకం .ఇంటిముందే ఇంకో రాజకీయ నాయకుడు ఉండేవాడు .పేచీకోరు మనిషిగా ఉండేవాడు కుక్కను పెంచేవాడు. పిచ్చయ్యగారికే పెంపుడుకుక్క ఉండేది .ఇంట్లో బోర్ వేసి నీటిగొట్టాల ద్వారా  సరఫరా పెట్టుకొన్నారు  ఇలా ఉన్న ఇళ్ళు  ఒకటో రెండో ఉన్నాయి గండ్రాయిలో .సెప్టిక్ లెట్రిన్ కూడా ఉం. అదీ పిచ్చయ్యగారిప్రత్యేకత . తెల్ల పాలిస్టర్ పంచెను లుంగీ గా కట్టి పైన స్లాక్ తొడిగి ఉండే వారేప్పుడు. ఎర్రగా కుదిమట్టం గా నవ్వు ముఖం తో కనిపించేవారు .భారతమ్మ గారు కొంచెం పొడగరి .నేతచీరే తో పెద్ద బొట్టు తో మహా లక్ష్మిగా కనిపించేవారు .మేడలో మంగళ సూత్రం తప్ప ఏ ఆభరణాలు పెట్టుకోగా నేను చూడలేదు .వాకిట్లో పిచ్చయ్య గారి స్వర్గీయ తలిదండ్రుల పెద్ద ఫోటోలున్నాయి .వాటికి వాడని పూల దండలు ఉండేవి బొట్టు పెట్టిఉ౦డేవి  .కోళ్ళు  ఎప్పుడూ మేస్తూ తిరుగుతూ ఉండేవి .బంధువులు వచ్చినప్పుడు వాటిపని గోవిందా .గంపల కింద కోళ్ళు ఉండేవి తెల్లవారుజ్హామునే కోడికూతలతో హడావిడి మొదలయ్యేది.

సశేషం

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -28-1-15 –ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.