చలపాక ‘’జీవితం ‘’

చలపాక ‘’జీవితం ‘’

మిత్రుడు ,ఆత్మీయుడు ,నిత్య సాహిత్యోపజీవి ,కవి ,కధకుడు, విమర్శక విశ్లేషకుడు సంపాదకుడు అనేక  సత్కారా పురస్కారాలు అందుకొన్న వారు ,  నాకు ,సరసభారతికి అత్యంత సన్నిహితుడు  తలిదండ్రుల మధ్య జీవిస్తూ ఆదరాభిమానాలు పొందుతూ ఆ జననీ జనకులకు తన జీవితమాదుర్యాన్నిపంచుతున్న  శ్రీ చలపాక ప్రకాష్ ఇటీ వలే వెలువరించి ఆవిష్కరించిన  కదా సంపుటి ‘’జీవితం ‘’ను వారికి కృతజ్ఞతగా అంకితమిచ్చారు .జీవితం లోని బహుపార్శ్వాలను అందులో స్పృశించి రాసిన కధలవి .కొన్నివెయ్యి రూపాయల పారితోషికాన్ని కూడా పొంది పేరు తెచ్చుకోన్నాయి .దీనికి ముందుమాట రాసి మెచ్చి ఆశీర్వదించారు ప్రముఖ కదా రచయిత శ్రీ వేదగిరి రాంబాబు.ఈ సంపుటిని నాకు అందజేశారు ప్రకాష్ ఇప్పుడే చదివే తీరిక దొరికి చదివి నా అభిప్రాయం రాస్తున్నాను .

జీవితం ఒక నాణెం .దానికి బొమ్మా బొరుసూ ఉన్నట్లే జీవితానికి రెండు పార్శ్వాలున్నాయి. ఆ రెండు పార్శ్వాలను తరచి రాసిన 16 కధలివి .సమకాలీనతకు సన్నిహితమైనవీ కూడా .ఈ రోజు చానెళ్ళ భీభత్స ప్రసారానికి నిదర్శనం గా ‘’ప్రళయం ‘’కద రాశారు ప్రకాష్ .ఉన్నదానికంటే వెయ్యి రెట్లు భయం సృష్టించి క్షణ క్షణ నరకం చూపించి ఇక ప్రళయం ముంచుకొచ్చి ఈ ప్రపంచం ఉండదేమో అని భయం కలిగించి సొమ్ములు దన్నుకొనే చానెల్ సృష్టించిన విలయం తో ఓముసలి గుండె తనవారినందర్నీ ముంచుకొచ్చే తుఫాను కు దూరంగా పంపేసి భార్య తో ఇంట్లో ఉండి చివరి ఫ్లాష్  బ్రేకింగ్ న్యూస్ విని గుండె ఆగి చనిపోయిన ముసలాయన కధే .అద్భుతం గా ఉంది .ప్రసార మాధ్యమాల వికృత చేష్టలకు ఇది దర్పణం .రెందోకద ఇలాంటి బలిదానమే. ప్రభుత్వోద్యోగి సమైక్య ఉద్యమం లో పాల్గొని తిండీ తిప్పలూ లేకుండా తిరిగి అరిచి అలసిపోయి గుండె ఆగి ప్రాణాలుకోల్పోతే ‘’సమైక్యత కోసం అసువులు బాసిన అమరజీవి ‘’అని ముద్ర వేసి ఉద్యమా గ్నికి సమిధగా వాడుకోవటం .  మూడోకద’’ 3 జి మహిమ ‘’ సారాంశం  ప్రకాష్ మాటల్లోనే ఆధునిక టెక్నాలజీని మనిషి తన అవసరాలకు అనుగుణం గా ఎలా మలుచుకొంతటున్నాడో ,అంతకంటే వేగం గా అనవసర విశ్రు౦ఖలతల కు బానిస అవుతున్నాడు ‘’.సెల్, వీడియో ఫోన్ ఇంటర్ నెట్ లు ప్రదర్శించే అశ్లీలతపై అవి చూపే వ్యామోహం పై చాచికోట్టిన దెబ్బ .అలాగే ‘’బుల్లితెర ‘’భూతానికి  అతుక్కొనిపోయి  జీవిత మాధుర్యాన్ని మరచి జీవితాన్ని నరకం చేసుకొనే వారి కద’బుల్లితెర ‘’.

స్వతహాగా స్వర్నకారుడైన చలపాక కే .డి .య౦ .కిటుకును బయటపెట్టాడు .అది బంగారు వస్తువుల జాయింట్లకు వాడే ‘’అతుకు ‘’మాత్రమె ‘’నని నిజం చెప్పాడు   .కార్పోరేట్ జ్యూయలరీ మాయా జాలాన్ని గురించి తెలుసుకోక మైకం లో పడిపోయే వారి గురించి చెప్పిన కద’’గుర్తింపు .‘’స్వర్నకారుడి పని తనాన్ని గుర్తించాలని వారిలో డిజైన్ చేసి అద్భుతాలు సృష్టించే డిజైనర్  నైపుణ్యాన్ని మెచ్చుకొని వారికి ప్రోత్సాహకాలివ్వాలని సూచించారు . బంగారు పని చేస్తున్నానని  తాను  చెబితే తానేదో అంటరానివాడిని అన్నట్లు చూసే లోక జనాలే అంటరాని వారన్న ఫీలింగ్ కలిగిస్తాడు .కష్టాల్లో ఉన్న వారిని చూసి చేతనైనంత సహాయం చేయాలని అది ప్రభుత్వం ఇచ్చే అవార్డులు రివార్డులకోసం కాదని కనీస మానవ ధర్మమమని   తెలియ జెబుతూ రాసిన కద ‘’అభినందన ‘’.బలవంతపు బందులు నాయకుల దండాలు ,పీడించే  వసూళ్లు ఒక  బక్క స్వర్ణకార ప్రాణి ఆచారి జీవితాన్ని ఎలా బలి తీసుకోన్నదో చెప్పిన కద ‘’శిక్ష ‘’ వ్యవస్తలో ఎదురుతిరిగే అవకాశం లేని వారికి పడే శిక్ష మరణమే .అదిప్రమద వశాత్తో అయినా సరే కావాలనుకోన్నదో .ఈ శిక్ష ఎవరికి తనకా ?తనపై ఆధార పడ్డ  కుటుంబానికా?ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న  గా మిగిలే పోయింది ,పోతూనే ఉంటుంది .ఈ ఏడు కధలు ‘’జీవితానికి ఒక వైపు’’లోవి .అదీ విషాదం వైపువి .

‘’జీవితానికి మరోవైపు ‘’లోసరదా గా రాసిన  తొమ్మిది కధలున్నాయి .ఇందులోనూ మొదటికద ‘’టి వి రిపోర్టర్ ల అతి కి ప్రతిబింబం ‘’గోరంత –కొండంత ‘’.ఒకమ్మాయి ఆయాసపడుతూ టాంక్  బండ్ పై  పరుగెత్తుతూ ఉంటె వెనకో కుర్రోడు సీసా లో ఏదో ద్రవం పట్టుకొని ఆమె వెంట బడతాడు .ఇంకేముంది చానేల్ వాళ్ళు కెమెరా పెట్టేసి స్టూడియో నుంచి రిపోర్టర్ ను  ప్రశ్నలమీద ప్రశ్న సంధించటం వాడు సుళ్ళు తిరుగుతూ చొంగ కార్చుకొంటూ అదేదో రేప్ సీన్ గా ,లేక యాసిడ్ దాడిగా తన వాక్ ప్రవాహం తో కధలూ గాధలూ చెబుతూ ప్రేక్షకుల్ని టివిలకు కట్టి పడేయ్యటం –చివరికి ఆ కుర్రాడు మార్కెట్లో కొత్తగా వచ్చిన కూల్ డ్రింక్ ప్రేయసికోసం తెచ్చాడని ఆమెకొత్తడాన్ని టేస్టు చేయ్యటం ఇష్టం లేక పరిగెత్తుతోన్దని బలవంటంగా పట్టుకొని ఆమె నోట్లో దాన్ని పోసి ఆమె ఇష్టం గా తాగుతుంటే ఆనందం అనుభవించారని తెలిసి రిపోర్టర్ తో సహా అందరూ నోరెళ్ళ బెట్టాడమే ఇందులో తమాషా .కధ ,కధనం బాగా సాగాయి  .ఆద్యంతం రక్తికట్టి హుషారిచ్చింది  మరొకద ‘’భలే వ్యాపారం ‘’లో మినరల్ వాటర్ ఫాన్సీ పై చమక్కు .ఇపుడు అందరూ దాని వ్యామోహం లో పడిపోయారని వీధి కొళాయిల దగ్గర ‘’పానీ పట్టు ‘’యుద్ధాలు లేవని హాయిగా బిందెల నిండా నీళ్ళు దొరుకుతున్నాయని సరదాగా చెప్పిన కద.

దేవుడినే బోల్తా కొట్టించిన ఆనంద రావు కద.తర్వాతిది .డిష్ యాన్తీనా కింద కూర్చుని గడ్డాలు మీసాలు పెరిగి నేలకు తాకే దాకా తపస్సు చేసి దేవుడిని ప్రత్యక్షం చేసుకొని ‘’ధనకనక వస్తువాహనాలు తప్ప ఏదైనా కోరుకో ‘’అంటే ఏమీ అక్కర్లేదు ‘’నేను కాలం వెనక్కి వెళ్ళేట్లు చేయి స్వామీ ‘’అనికోరి వరం పొంది 1983  కంటే వెనక్కి వెళ్లి భార్య సంతృప్తికోసం బస్తాడు బంగారం అతి తక్కువ ధరలో కొని వీపు మీద మోసుకొచ్చాడు అతి తెలివి ఆనంద రావు. మనిషి పన్నిన ఉచ్చులో దేవుడు పడి గిలగిల లాడి  ఆనండుడితో నవ్వుతూ ‘’ఏ షరతు విధించినా దేవుడినైన నన్నే బోల్తా బురిడీ కొట్టించి మీ కోర్కెలు తీర్చుకొనే అపూర్వమైన మీ మానవ తెలివి తేటలకు జోహార్లు ‘’అన్నాడు .మంచి ఆలోచనా భలే కదా కధనం .’’డిష్ యా౦టేన్నా  తో ప్రసారాలపై ఒక చమక్కు చళుక్కు ‘’ఫామిలీ పాక్ ‘’కధ .ఇంట్లో అందరికి తలో  చానల్ కావాలి .యజమాని ముసలాయనకి మాత్రం రాత్రి 11-30 తర్వాత వచ్చే ‘’మిడ్ నైట్ మసాలా’’ కావాలి .ఇదీ రోజంతా రావాలని ఆయన ఆశ .అలాంటిది ఇంకారాలేదని వస్తే ఫస్ట్ చాన్స్ ఆయనకే ఇస్తానని డిష్ పెట్టించుకోమని ఏజెంట్ చెప్పగా ఇంతమందికి ఇన్ని చానెళ్ళు చూడటానికి అన్ని టి వి లు తానూ కొనలేనని ఆ అమాయక చక్ర వర్తి అనటం  తో నవ్వుల పువ్వులే పూస్తాయి

భార్య కొత్తకారు మీద మోజు  ‘’నానో కారు ‘’తో తీర్చిన భర్త  వచ్చిన కొత్తలోనే హెడ్ లైట్లు క్రికెట్ బంతికి కృష్ణార్పణం .కొడుకు కోపానికి అద్దాలు ధ్వంసం .రిపైర్లకు చాలని డబ్బు .పక్కింటి వారి పెళ్ళికొడుకు ఊరేగింపుకు కారు  ఇచ్చి అది కరెంట్ స్తంభాన్ని ముద్దేట్టుకొని ముక్కలవటం  .మనకు నవ్వుతో కడుపు చేక్కలవటం ‘’సంతోషానికి తాళం ‘’కదలో విషయం .సినీ హీరో సినిమా రిలీజ్ అయినా పుట్టిన రోజు జరిగినా అభిషేకాలే కాక ఇప్పుడు ‘పాలాభి షెకాలు ‘’చేసి ఆయన పాపాలు కడిగేస్తున్నారు .దీనితో ఎంతడబ్బు వృధానో ఎన్నిపాలు నేలపాలో అనే సామాజిక స్పృహ లోపించటం గురించి రాసి ‘’మంచి దొంగ ‘’కధలో ‘’అన్న ‘’అభిషేకానికి తెచ్చిన పాల కాన్ లను తెలీకుండా వ్రుదాతత్వాన్ని చూడలేక దొంగలించి అనాధ శరణాలయానికి తీసుకు వెళ్లి ‘’ఆ అన్న’’పేరిట ఉచితంగా పంచిన  వాడి కద.

దేవుడిని వరం అడిగితె ఏమిస్తాడు ఎవోపాతకాలపు సరుకు తప్ప అని భావించి ఒక ఆధునికుడు’’ బుడ్డా రావు  ‘’సైంటిస్ట్ కోసం తపస్సు చేసి మెప్పించి ముందు గ్రామఫోన్ తర్వాత  రేడియో టి వి ,కలర్ టివి ప్లాస్మా ఎల్సిడి  కంప్యూటర్ లాప్టాప్ వగైరాలు సృష్టింప జేసుకొని అవేవీ చాలక చివరికి సెల్ ఫోన్ అందులోనే ఇంటర్నెట్ తో సహా చేయించుకొని వీటన్నిటిని ఉపయోగించుకొనే సమయం చాలక వాటి ఆపరేషన్ కోసం  మరమనిషి రోబోను  కూడా సృష్టించి ఇచ్చాడు సైంటిస్ట్ .చివరకు  రచయిత ‘’అప్పటి వరకు ఉన్న ‘’మనిషి ‘’మాయమై రోబోలు మిగిలాయి .ఈ విశాల ప్రపంచం లో ‘’అని ‘’మాయం ‘’కదముగిస్తాడు .విలువలన్నీ మాయం అయి కృత్రిమత మాత్రమె ప్రపంచం లో రాజ్య మేలుతోందని అంతర్ ధ్వని  .దేవుడి సృష్టికంటే మానవ సృష్టి ‘’పాలిదిలీన్ ‘’తో విజ్రుమ్భించి అవి మట్టిలో కలిసిపోక పర్యావరణ కాలుష్యాన్ని పెంచి జంతు జీవావరణానికి హాని కలిగిస్తున్నాయని హెచ్చరించే కధే ‘’తరగని ముద్ద’’.

ఒక వేసవి లో దేవేంద్రుడు మానవుడికి ప్రత్యక్షమైతే వాడు  .అయన దాహార్తి తీర్చటానికి ద్రాక్షా పైనాపిల్  మాంగో జ్యూసులిప్పించి ఐస్ చేశాడు .వాటి బహురక రుచులకు ఇంద్రుడు సంప్రీతుడై దేవలోకం లో ఉన్న అమృతం ఎప్పుడూ ఒకటే రుచి కలిగిఉంటుందని ఈరుచుల జాడ దానికి లేదని వీటిని దేవలోకం పంపి అక్కడి అమృతం అందుకోమని భక్తుడిని దేవేంద్రుడు కోరటం భక్తుడు పారిపోవటం  కొసమెరుపు .బ్రహ్మకైన కలుగు రిమ్మ తెలుగు .కాదు ఇంద్ర కైనా  దిమ్మ తిరుగు అని పించేట్లు రాసిన చివరి కద ‘’అమృతాన్ని మించిన రుచి ‘’

ఇవన్నీ చివరికద లానే అమృతాన్ని మించిన రుచిగా ఉండటం ఈ సంపుటి ప్రత్యేకత .వీటిలో కొన్ని పత్రికలలో ముద్రితాలు .మొదటి ఏడు కధల్లో జీవితం లోని విషాద పార్శ్వాన్ని  చూపిస్తే,రెండు కధలు ఎక్కువగా రాసి  చివరి తొమ్మిదిలో ఆనందపు అంచుల్ని  చుంబింప  జేశారు . అంటే జీవితం లో నీరస నిరాశల కంటే ఆనందం తృప్తీ సంతోషం ఉన్నాయని రెండుకధలు ఎక్కువగా రాశారని పించింది నాకు. శ్రీ  ప్రకాష్ ఏ రకమైన కద నైనా తన విచక్షణా దృష్టితో లోక పరిశీలనతో గోప్పగా మలచగలిగిన ‘’కదా స్వర్ణకారుడు చలపాక’’  .ఆ ప్రకా(షం )శం మురిపించి ,మై మరపిస్తుంది ..జీవితానికి ఉన్న అన్నిరకాల అర్ధాలను ఇందులో మణులుగా పొదిగారు  .అందరూ కొనిచదివి ఆనందించాల్సిన కదా సంపుటి శ్రీ చలపాక ‘’జీవితం ‘’.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-15- ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.