ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -5
ఆధునిక సంగీత సృష్టికర్త –రిచార్డ్ వాగ్నర్ -3
వాగ్నర్ ‘’ఆర్ట్ వర్క్ ఆఫ్ ది ఫ్యూచర్ ‘’,’’ఆర్ట్ అండ్ రివల్యూషన్ ‘’ఓపెరా అండ్ డ్రామా ‘’లను ‘’జూడాయిజం ఇన్ మూజిక్ ‘’తో పాటు రాశాడు .మొదటి దానిలో తన గొప్పతనాన్ని డబ్బా కొట్టుకొంటే రెండో దానిలో తన జీవిత దుఖాన్ని ఆరబోసుకొన్నాడు .క్రమంగా ధోరణిమార్చి ఎక్కువమంది ఇస్టపడేదాన్ని చేతిలో రూపాయి పడేదాన్ని ఎంచుకొని రాయసాగాడు .1848-53మధ్య కాలం అతని వదిలేసిన కాలం వృధాగా నే గడిచిపోయిందని విమర్శకులు భావించారు .కాని ఆకాలం లో ఖాళీ గా ఏమీలేడు. లవ్ అఫైర్స్ లో మునిగి తేలాడు .35ఏళ్ళ వయసులో 22 ఏళ్ళ అమ్మాయిని ముగ్గులోకి దించితే ఆమె ధనిక భర్త ,తల్లీ వ్యతిరేకిస్తే ఆమెతో లేచిపోదామని ప్లాన్ వేసి ఆమె భర్త వాగ్నర్ ను కాల్చిపారేస్తానని భయపడితే ఆచిన్నది సాహసం చేయలేకపోతే తనను ఆదుకోవటానికి ఆమె చేసిన ప్రయత్నం ఒక చిన్నపిల్ల మనస్తత్వం అనుకోని సర్దుకు పోయాడు .మనవాడిని వలచిందీ మనవాడు వలచిండదీపెళ్లి అయిన భార్యలే . భర్త ఉన్న ఇంకో ధనవంతురాలితో ప్రేమాయణం సాగించి ఆ భార్యా భర్తల వలన తన సంగీతానికి ప్రచారం తెచ్చుకొన్నాడు .
‘’మై లైఫ్ ‘’అనే పుస్తకం వాగ్నర్ రాసి తన జీవిత విశేషాలను పొందుపరచాడు .ఈ సమయం లోనే ‘’రింగ్ ‘’అనే దానికి సంగీతం కూరుస్తూ ఆ కుటుంబం తో సాన్నిహిత్యం పెరిగి ఆమెను ప్రేమించి దగ్గరయ్యాడు .దీనితో ‘’రింగ్ ‘’ను పక్కన పెట్టాడు .భార్యా పిల్లా తిరిగి వచ్చి ఇతన్ని చేరాక ఈ తాత్కాలిక ప్రేమకు తెర పడింది .వెనిస్ వెళ్లి ‘’ట్రిస్టాన్ ‘’పూర్తీ చేశాడు .భార్య డ్రెస్ డేయిన్ వెళ్లి అ భర్త కు క్షమాభిక్ష కోసం ప్రయత్నించింది .ఆరేళ్ళు కస్టపడి ట్రిస్టాన్ ను పూర్తీ చేశాడు .భార్య ప్రయత్నం ఫలించి వాగ్నర్ కు క్షమా భిక్ష లభించి జర్మనీలో ఉండే అవకాశం ఏర్పడింది
జెర్మనీ స్పిరిట్ తో ఇంకా బాగా సంగీతం లో దూసుకుపోవాలన్న కోరిక బలీయమైంది .అంకిత భావం తో పనిచేసి ‘డస్క్ ఆఫ్ దిగాడ్స్ ‘’,డై వాకీర్ ‘’ ది రైన్గోల్డ్ ‘’చేసి హిట్లు కొట్టాడు .ఇలాంటి సంగీతం అంతకు ముందు ఎన్నడూ ఎవరూ ఎక్కడా విని ఉండలేదని గొప్పగా కీర్తించారు .అందులో వేగం ధృతి ,పెద్ద ధ్వని తో ఉన్నా అద్భుతమైన శ్రావ్యత ఉండటం వాగ్నర్ సంగీతం లో ప్రత్యేకత .ఛందస్సు బంధాలు తెంచేశాడు .సంప్రదాయాన్ని దూరం చేశాడు .ఉదాత్త అనుదాతాత్తలతో తీవ్ర సంచలనమే సృష్టించాడు .చెవులకు ఇంపైన సంగీతాన్ని ఆర్కెస్ట్రా లో మాధ్యమంగా చేసుకొని సృష్టించిన ఈ సంగీతం కొత్త రికార్డు సృష్టించింది .ఏక వాద్య సంగీతం కాక సామూహికం గా ఇంతటి మాధుర్యాన్ని సృష్టించటం అనితర సాధ్యం అని అందరూ మెచ్చుకొన్నారు
‘’ది లీడింగ్ మోటివ్ ‘’లో ఆర్కెస్ట్రా తో సర్కసే చేయించాడు ‘’లీట్ మోటివ్ ‘’అనే సంగీత రూపకం ‘’is the embodiment of a person or an idea .It identifies with figure ,comment upon action ,and explains the fluctuating emotions and state of mind.’’అని పేరుపొందింది .శ్రోత చెవులకు ఇబ్బంది కలుగ కుండా దృశ్యాలు కనుల ముందు కదిలిపో యేట్లు తీర్చాడని అదొక స౦గీత చిత్రం musical portraitఅనీ తెగ మెచ్చారు. ట్రిస్టాన్ ను పారిస్ లో ప్రదర్శిద్దామనుకొంటే ‘’తన్నాహీసర్ ‘’ను వాళ్ళు సెలెక్ట్ చేయటం ఆశ్చర్య పరచింది వాగ్నర్ని .ఇంకో ఆశ్చర్యకరమైన వార్త విన్నాడు .గ్రాండ్ ఒపేరా హౌస్ లో బాలెట్ లేకుండా ఒపేరా ప్రదర్శన ఉండదు .తానూ రాసిన దానిలో బాలద్ద్ లేదు. అందుకని దానికోసం సంగీతం తయారు చేశాడు .ఏంతో కస్టపడి కూర్చాడు .కాని పారిస్ వనితలు పెదవివిరిచారు .గోల, అల్లరి ,ఆగం తో ప్రదర్శన సాగలేదు .మూడోసారి చేసిన ప్రయత్నమూ ముందుకు వెళ్ళక నిరాశ చెందాడు .పారిస్ అంటే రోత పుట్టింది. రైన్ నదీ తీరం లో బీబ్రిచ్ లో ఉన్నాడు .
యాభై ఏళ్ళ వయసులో అపజయాలు బాధించి కలవరపెట్టాయి .స్వదేశం లో మళ్ళీ తన ప్రతిభ నిరూపించుకోవాలనుకొన్నాడు .ఇంకో అమ్మాయిని లైన్ లో పెట్టి పెళ్ళాడాడు ప్రబుద్ధుడు .ఇద్దరిపెళ్ళాల ముద్దుల మొగుడు .ఎవరి మీద ద్రుస్ష్టిపెట్టాలో తెలియక తబ్బిబ్బయ్యాడు .ఇంటిలోని పోరుకు దూరం అవటానికి బెర్లిన్ ,ప్రేగ్ ,మాస్కో వగైరా ప్రదేశాలలో కచేరీలతో కాలక్షేపం చేశాడు .వలచి వలపించటం ఎక్కడికెళ్ళిన మానలేదు .మళ్ళీ రుణ బాధల్లో పీకల్లోతు కూరుకుపోయాడు .దీనిలోంచి బయటపడే గొప్ప సదవకాశం వెతుక్కొంటూ వచ్చింది .మ్యూనిచ్ లో బ్రవేరియా రాజు దర్బార్ లో పందొమ్మిదేళ్ళ లుడ్విగ్ తో సమానం గా హోదా లభించింది .అక్కడొక అమ్మాయి తో ఎఫైర్ సాగించి గుప్పుమన్నది .డబ్బు వస్తోంది గదిలో అతి విలాసమైన రగ్గులకు కర్టెన్ లకు .మాంచి ఖరీదైన సిల్క్ డ్రెస్ లకు డబ్బు బోలెడు ఖర్చు చేశాడు .ఇలాంటి సిల్క్ డ్రెస్సులు ఇరవై నాలుగు ఉండేవి .అంత ఆడంబరం ఒలక పోశాడు సంగీత గురుడు .వాగ్నర్ విలాస జేవితం సామాన్యులు ఈస డించారు .దానికి మనవాడి సమాధానం ‘’నేను అరవై వేల ఫ్రాన్కులను దుబారా గా ఖర్చు చేయటం లో గొప్ప చాకచక్యం కలవాడిని. కాని ఆ డబ్బు సంపాదించటం లో కాదు ‘’అని గొప్పలు పోయేవాడు .ఇవన్నీ చూసి కుర్ర రాజు అసహ్యిన్చుకొన్నాడు .చర్చి అధికారులూ అయిష్టత చూపారు .అతనిలోని విప్లవ భావాలకు కలత చెంది అందరూ క్రమంగా దూరమైపోయారు .అధికారులు వాగ్నర్ జీవితం ప్రమాదం లో ఉందని రాజుకు చెప్పగావిని లుడ్విగ్ కన్నీరు పెట్టుకొని గురువును మ్యూనిచ్ వదిలి వెళ్ళిపొమ్మని బ్రతిమిలాడాడు .అక్కడి నుండి స్విట్జెర్లాండ్ వెళ్లి రాజు ఇచ్చిన పెన్షన్ తో స్వంత ఇల్లు ఏర్పరచుకొని ఆయన ఉదారత వలన బతికి పోయాడు. ‘
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-1-15 –ఉయ్యూరు