నా దారి తీరు -89 భారతం పై తుది తీర్పు

నా దారి తీరు -89

భారతం పై తుది తీర్పు

జగ్గయ్య పేట గెంటేల శకుంతలమ్మ డిగ్రీ కాలేజి లో ఒక రోజు సాయంత్రం ఆరు గంటలు ‘’భారతం పై తుది తీర్పు ‘’అనే కార్యక్రమం జరుగుతుందని ఈ నాడు పేపర్లో చదివి ఆ రాత్రికి ట్యూషన్ లేదని చెప్పి జగ్గయ్య పేట వెళ్లాను .కాలేజి చిల్లకల్లు నుంచి జగ్గయ్య పేట కోచ్చే అయిదు కిలోమీటర్ల దారిమధ్య లో ఉంటుంది .ఉయ్యూరునుంచి వచ్చినప్పుడల్లా ఆకాలేజి మీదనుంచే బస్ లో కాలేజీని చూసేవాడిని .ఇప్పుడు మొదటిసారిగా కాలేజిలో అడుగుపెడుతున్నాను  గెంటేల వారు బ్రాహ్మణులు .శకు౦తలమ్మ గారి పేర భర్తా మిగిలిన కుటుంబ సభ్యులు దాతలు కలిపి  కట్టిన  కాలేజి.  మంచి పేరే ఉంది .   ఈ కార్యక్రమం ముగ్గురు మాత్రమె ముఖ్య పాత్రలుగా నిర్వహిస్తూ రాష్ట్రం అంతా తిరిగి ప్రదర్శిస్తున్నారు .అందులో జడ్జి పాత్రను ప్రముఖ ఐఎస్ ఆఫీసర్ ,సాహితీ వేత్త డా.శ్రీ కనుపుల వెంకట శివయ్య గారు ,పాండవుల తరఫున న్యాయ వాది.గా డా. శ్రీ ప్రసాద  రాయ కులపతి ,కౌరవ ప్లీడర్ గా డా. శ్రీ మొవ్వ వృషాద్రి పతి ధరించారు .ముందుగా న్యాయాధిపతి కేసు పూర్వాపరాలను వివరించి  కక్షిదారుల ప్లీడర్ లను వాదించ మంటాడు .అంటే దీని ఉద్దేశ్యం ధర్మం న్యాయం పాండవుల పక్షాన ఉందా ?కౌరవుల పక్షాన ఉందా ?అన్నదానిపై ఆర్గ్యు మెంట్లు .చివరికి జడ్జి గారి తీర్పు .రసవత్తరం గా దాదాపు గంటన్నర సేపు కులపతిగారు, వృషాద్రిపతి గారు తమ వాగ్దోరణితో రసవత్తరమైన భారత పద్యాలతో వ్యాస శ్లోకాలతో ఎవరి వాదన వారు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాదించారు .అది వింటూ ఉంటె న్యాయం ఎవరి పక్షాన ఉందొ తెలియనంత కన్ఫ్యూజన్ కు లోను చేశారు .శివయ్య గారు ధర్మ న్యాయ పక్షపాతం గా పాండవుల వైపే తీర్పు చెప్పటం తో క్లైమాక్స్ బాగా పండింది .ముగ్గురూ ఆంద్ర దేశం లో దిగ్గజాలైన పండితులు ,కవులు విమర్స కులు కులపతిగారు అష్టావధాన శతావధాన   దురంధరులు .అవధానాలపై పుస్తకాలు రాసిన వారు . వృషాద్రిపతి గారు నాగార్జున యూని వర్సిటిలో తెలుగు లెక్చరర్ అని గుర్తు .   చివరికి నాకేమనిపించింది అంటే ‘’అసలు భారతం మీద తుది తీర్పు చెప్పే యోగ్యతా ,సామర్ధ్యం మనకు ఉందా?’’ అని .ఏమైనా ఒక కొత్త ప్రయోగం .ఈ ముగ్గురే మిగిలిన కవి పండితులను కలుపుకొని’’ భువన విజయం ‘’ చాలా చోట్ల ప్రదర్శించి నీరాజనాలు అందుకొన్నారు .’’తీర్పు ‘’ అంత క్లిక్ అయినట్లు లేదు .అవదుకూడా  .

నా సూచన –ముట్నూరి కృష్ణారావు గారి సాహితీ దర్బార్

అంతా అయిపోయిన తర్వాత  ఒక కాగితం మీద కులపతి గారికి ‘’అయ్యా !ఈ వాదాలు తీర్పుల వలన ధర్మ చ్యుతి తప్ప ధర్మ సంస్థాపన జరగదు .నెగటివ్ భావ వ్యాప్తి చేయటం మంచిది కాదు. అయినా మీ ప్రదర్శన ప్రదర్శనగా బాగుంది .నాదొక విన్నపం –ఎన్నో చోట్ల భువన విజయం ఆడారు .సంతోషం .కాని మహాను భావుడు  ,ఆలోచనా సంస్కారం ఉన్నవారు కృష్ణా పత్రిక సంపాదకులు శ్రీ ముట్నూరి కృష్ణా రావు గారి సమక్షం లో  విశ్వనాధ, కాటూరి, పింగళి ,బాపిరాజు  వంటి ప్రసిద్ధులు ‘’దర్బారు ‘’జరిపే వారని మనకు తెలుసు .ఆ ప్రక్రియను కూడా చేబట్టి ప్రదర్శిస్తే ఏంతో ఉచితం గా ఉన్నతం గా ఉంటుంది .ఆ ప్రయత్నం చేసి నాబోటి’’ కృష్ణరాయ ‘’విధేయులకు ఆనందం కల్గించండి –‘’అని రాసి  అడ్రస్ రాసి ఇచ్చి ,అప్పటికే రాత్రి తొమ్మిది అయినందువల్ల  ,బయల్దేరి బస్ ఎక్కి చివరిబస్ లో గండ్రాయి రాత్రి పదిన్నరకు చేరుకొన్నాను .

అమలైన నా సూచన -ముట్నూరి సాహితీ దర్బార్

నాఆలోచనా, సూచనా వారు చదివారో లేదో నాకు తెలియదు .కాని అది అమలయింది .కృష్ణా పత్రిక ఎడిటర్ శ్రీ పిరాట్ల వెంకటేశ్వర్లుగారు కృష్ణా రావు గారుగా , కులపతి గారు ,వృషాద్రి పతి గారు  మొదలైన వారంతా కలిసి ‘’ముట్నూరి వారి సాహితీ దర్బార్ ‘’నిర్వహిస్తున్నట్లు పేపర్ లో చదివి పిరాట్ల వారితో నాకు సాన్నిహిత్యం ఉండటం వలన ఒక కార్డు రాసి ఈ కార్యక్రమం జరగటం ముదావహవమని ,నేను సుమారు అయిదేళ్ళ క్రితం ఈ సూచనను రాత పూర్వకం గా జగ్గయ్య పేట లో కులపతి గారికి  తెలియ జేశానని నాకల ఈ నాడు సాకారం అయిందని రాశాను .ఇందులో నాపాత్ర ఉందొ లేదో నాకు తెలీడుకాని నేను కోరింది జరిగింది .ఈ దర్బారునూ చాలా చోట్ల ప్రదర్శించి పేరు తెచ్చుకొన్నారు .’’మై డ్రీం హాస్ కం ట్రూ ‘’   అదీ నాకు మహదానందం .ఈ ముఠాయే ‘’ఇంద్ర సభ ‘’కూడా దేశమంతా ప్రదర్శించారన్న సంగతి సాహితీ వేత్తలకు తెలిసిన విషయమే .

ప్రభావతి గండ్రాయి రాక

గండ్రాయి లో నా ‘’ఒంటి గది కాపురం ‘’చూడటానికి నా భార్య  ప్రభావతిని ఒక సారి ఉయ్యూరు నుంచి వస్తూ నాతొ తీసుకొచ్చాను .ఒక వారం ఉందని జ్ఞాపకం .నాకు కావలసినవన్నీ ఉన్న ఒకే  స్టవ్ మీద  ఉన్నకాసిని గిన్నేలతో వంట చేసి పెట్టింది .ఒక సారి మా మరదలు దుర్గా వాళ్ళింటికి మిర్యాల గూడా వెళ్లి వచ్చాము .ఆ తర్వాత దుర్గ భర్త శంకరం కూడా వచ్చారు గండ్రాయికి .మా ఇంటి వారి ఆతిధ్యానికి అందరూ ఆశ్చర్య పోయారు .అలాగే ఖమ్మం మేమిద్దరం వెళ్లి మా పెద్ద తోడల్లుడి గారింటికి ఒక రోజు వెళ్లి వచ్చాం .పేటలో శోభనాద్రి ఇంటికి వెళ్లి  సత్యవతి పిన్నిని కుటుంబాన్ని చూసి వచ్చాం .ఒక రోజు మధ్యాహ్నం మా హెడ్ మాస్టారు సుబ్రహ్మణ్యం గారిని భోజనానికి ఆహ్వానించి ఆ ఇరుకు గదిలోనే షడ్రసోపేత భోజనం వండించి పెట్టాం.ఆ యన సంత్రుప్తికి అవధుల్లేవు . ఇంత లిమిటెడ్ సామగ్రితో మీ శ్రీమతి ఎన్ని వడ్డించారండీ అని ఆయన నాతొ  ఆశ్చర్య పోతూ అని , స్టాఫ్ అందరితోనూ చెప్పారు .సుధాకర్ దంపతులనూ పిలిచి భోజనం పెట్టాం .ప్రైవేట్ పిల్లకు లడ్డూ ,బూంది చేసి తినిపించాం .

మామయ్య మరణం

గండ్రాయి లో పనిచేస్తున్న కాలం లోనే మా మేనమామ గుండు గంగయ్య గారు అనే గంగాధర శాస్త్రి దాదాపు అయిదేళ్లుగా పక్షవాతం తో తీసుకొని ,మూడవ కొడుకు మోహనాయ్ రోడ్డుమీద యాక్సి డెంట్ లో చనిపోవటం తో కుంగిపోయి చిక్కి శల్యమై హాస్పిటల్ లో చేరి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయాడు .నాకు తెలియంగానే వెళ్లి కార్యక్రమాలో పాల్గొన్నాను .మా మయ్య లేని లోటు మా కుటుంబానికి తీరది కాదు .నేనంటే మహా అభిమానం ఆయనకు .అప్పుడేవో శలవలోచ్చాయి ,శలవల్లో ట్యూషన్ పెట్టి కోర్సు లాగించాను .

నా సైన్స్ టీచరే మా గజెటెడ్ ఇన్స్పెక్టర్

నేను ఉయ్యూరు హైస్కూల్ లో ఎస్ ఎస్ ఎల్ సి చదువుతున్నప్పుడు మాకు సైన్స్ టీచర్ గా1956లో  వచ్చిన శ్రీ మతి పుష్పావతమ్మ గారు కొద్ది కాలమే అక్కడ పని చేశారు అప్పుడు ఆమె భర్త ఎదోకాలేజీ లో లెక్చరర్ గా పని చేసేవారు .ఉయ్యూరులో వాళ్ళ నాన్నగారింట ఉండేవారు .తర్వాత ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గా ప్రమోషన్ పొంది చాల చోట్లపని చేసి ఇప్పుడు విజయవాడ డివిజన్ కు గజెటెడ్ ఇస్పెక్టర్ గా అంటే సహాయ జిల్లా విద్యా శాఖాదికారిణిగా (డి వై ఇ ఒ ) వచ్చి ,గండ్రాయి హైస్కూల్ కు ఇన్స్పెక్షన్ కు వచ్చారు .నేను ఆమె శిష్యుడనని గుర్తు చేస్తే  ఏంతో సంబరపడ్డారు .అన్ని సబ్జెక్టులు ఆమె తనిఖీ చేశారు .నా ఫిజిక్స్ బోధన బాగా ఉందని నేచురల్ సైన్స్ లో అంతగా సంతృప్తి చెందలేదని చెప్పారు .ఆ మాట నిజమే .పుష్పావతమ్మగారు నేను మంగళాపురం హెడ్ మాస్టారుగా పని చేసినపుడు మచిలీపట్నం గజెటెడ్ ఇన్స్పెక్టర్ గా వచ్చారు. మళ్ళీ ఆమెతో పరిచయం కలిగింది .ఆమె కు ఒక కన్ను మెల్ల .ఆ కన్ను సగం మూసి చూస్తారు .మంచిమాటకారి .హుందాగా ఉండేవారు .రూల్స్ బాగా తెలిసిన వారే .

వత్సవాయి హైస్కూల్ లో టెన్త్ పరీక్షల ప్రహసనం

1987 మార్చ్ టెన్త్ క్లాస్ పరీక్షలకు నన్ను డిపార్ట్ మెంట్ ఆఫీసర్ గా ,తెలుగు మేష్టారు సుధాకరరావు ఇన్విజిలేటర్ గా వత్సవాయి హైస్కూల్ కు నియమించారు .రోజూ గండ్రాయి నుండే వెళ్లి వచ్చే వాళ్ళం .అక్కడ హెడ్ మాస్టారు లింగం వెంకటేశ్వరరావు  గుడివాడ ప్రాంతం వాడు .కాని విపరీతమైన కాపీలు చేసేవారుపిల్లలు .ఎక్కడేక్కడి నుంచో స్లిప్పులు  గైడ్లు వచ్చిపడేవి .కాపలా కాయటం చాలా కష్టం గా ఉండేది .ఇంవిజిలేషన్ కు వచ్చిన టీచర్స్ కూడా కాపీకి సాయం చేసేవారు .అక్కడ చదువు అంతంత మాత్రమే .నేను సహించలేక పోయాను .పరీక్ష హాల్ లోకి వచ్చిన పిల్లల్ని ముందే చే చేయించి నేనూ  చేసి ఆడపిల్లలను లేడీ టీచర్స్ చేత చెక్ చేయించి లోపలి పంపేవాడిని .రెండున్నర గంటల పరీక్ష లో ఒక్క క్షణం కూడా కూర్చునే వాడిని కాను .భయం వేసి క్రమంగా రెండో రోజునుంచి కాపీలు తగ్గి కంట్రోల్ లోకి వచ్చింది సెంటర్ .సుధాకరరావు కూడా బాగా సహకరించాడు .ఇద్దరం కలిపి ముతక భాషలో చెప్పాలంటే ‘’రేకాడించాం ‘’.సోషల్ పేపర్ ఎక్కడో లీక్ అయి ఆ పరీక్ష వాయిదా పడింది .దానికోసం మళ్ళీ రావాల్సి వచ్చింది పదిహేను ఇరవై రోజుల తర్వాత .అలాంటి స్కూల్ కు నేను తర్వాత హెడ్ మాస్టారు గా ప్రమోషన్ మీద వచ్చాను. చాలా విచిత్రం గా ఉంది .ఈ అనుభవం .

నా హెడ్ మాస్టర్  ప్రమోషన్

అప్పటికే సుమారు గా 24 ఏళ్ళు సైన్స్ మేస్టరుగా పని చేశాను. ఎప్పుడెప్పుడా ప్రమోషన్ అని ఎదురు చూస్తున్నాను .మా తమ్ముడు మోహన్ పూనా నుంచి అప్పటికే హైదరాబాద్ వచ్చి స్తిరపడ్డాడు .మా హెడ్ మాస్టర్ పరీక్షా ఫలితాలు ముందుగా గెజిట్ లో ప్రచురిస్తారు .అవి జిల్లాకు చేరటానికి వారం పది రోజులు పడుతుంది .అప్పుడు నెట్ సర్వీస్ లేదు .అందుకని మోహన్ కు ముందే చెప్పి ఉంచా గెజెట్ నోటిఫికేషన్ రాగానే ఒక కాపీ తీసుకొని నాకు అర్జెంట్ గా పంపమని .అలాగే చేశాడు .ఆగస్ట్ మొదటి వారం లో ఒక కాపి ఉయ్యూరుకు అందింది .నేను ఉయ్యూరు వెళ్లి దాన్ని’’ ట్రూకాపీలు’’ తీయించి (అప్పటికి జిరాక్స్ రాలేదు ) కాపీలు చేతితో తీసుకొని బందర్ వెళ్లాను. జిల్లాపరిషత్ కు వెళ్లాను అనుకోకుండా అప్పుడు చైర్మన్ శ్రీ పిన్నమ నేని కోటేశ్వర రావు గారు  ఆఫీసులోనే ఉన్నారు .ఆయన్నుకలిసి నేను టెస్ట్ పాస్ అయ్యానని కొత్తగా తీసే హెచ్ ఏం పానల్ లో నన్ను చేర్చమని ఒక గజెట్ కాపీ ఇచ్చాను. ఆయన వెంటనే అక్కడే ఉన్న కాంప్ క్లెర్క్ కు ఇచ్చి దీని విషయం  అర్జెంట్ గా   చూడమని చెప్పారు . .పరిషద్ ఎడ్యు కేషన్ ఆఫీసర్ శ్రీ నూకల శ్రీరామ మూర్తి గారినీఆఫీస్ లోకలిసి కాపీ ఇచ్చి విషయం చెప్పాను .తప్పకుండా ఇంక్లూడ్ చేస్తామన్నారు . హెడ్ మాస్టర్  క్లెర్క్ శ్రీ శేష గిరి రావు నుకూడా కలిసి కాపీ ఇచ్చిపానెల్ ల లిస్టు లో  చేర్చమని ,మళ్ళీ వచ్చికలుస్తానని చెప్పి మా హెడ్ మాస్టర్ల  సంఘం అధ్యక్షులు, మా గాడ్ ఫాదర్ ‘’శ్రీ సోమంచి రామం గారిని ఫోర్ట్ రోడ్ లో వారింటిలోకలిసి చెప్పి ఆయన ఆశీస్సుల౦దుకొని ఉయ్యూరు ఇంటికి చేరా .మర్నాడు గండ్రాయి వెళ్లి హెడ్ మాస్టారికి మిగిలిన వారికీ తెలియజేశా .నాకు ప్రమోషన్ వస్తోందన్న సంతోషం నా ప్రైవేట్ పిల్లల ముఖాలలో కనిపించలేదు .నేను  వెళ్లిపోతున్నాననే బాధ కనిపించింది .రుణానుబంధం ఎన్నాళ్ళో తెలీదు కదా .నన్నుపేనల్లిస్టు  లో చేర్చమని అడిగానే కాని నేను కలిసిన ఎవరికీ నాకు ఫలానా చోటు కావాలని కోరలేదు. కోరాలని తెలియదుకూడా . తర్వాత తెలిసింది యెంత తప్పు చేశానో .

నన్ను వత్సవాయి హైస్కూల్ కు హెడ్ మాస్టర్ గా ప్రమోట్  చేస్తూ ఆర్డర్ వచ్సుస్తున్నాయని వార్తా ముందే తెలిసింది .మళ్ళీ ప్రభావతిని తీసుకొచ్చాను .హెడ్ మాస్టారి భార్య గారినీ ఆయన్ను మా ఇంటికి (గదికి-సింగిల్ రూమ్)  ఆహ్వానించి మంచి భోజనం పెట్టి నూతన వస్త్రాలు పెట్టాం .దంపతులు ఏంతో సంతోషించారు .ట్యూషన్ పిల్లలకూ స్వీటు హాటు చేసి అందరికి ఇచ్చి మా ఆనందం లో భాగస్వాములను చేశాం .అలాగే పిచ్చయ్యగారు భారతమ్మ దంపతులకు కూడా .గండ్రాయి నాకు సైన్స్ మేష్టారు గా చివరి మజిలి .నా జీవితం లో మరపు రాని అనుభూతులను నింపిన గ్రామం ,స్కూలు . ఇక్కడి విద్యార్ధుల మనస్సులోస్తిరమైన స్థానం పొన్ది ఆదరాభిమానాలకు మన్ననలకు గౌరవానికి పాత్రుడనవటం  నా అదృష్టం . ఎందుకు ఈ మాట అన్నానంటే ఆగిరిపల్లిలో మా దూరపు చుట్టరికం ఉన్న సూరి శోభనాద్రి గారనే అక్కడి సంస్కృత పాఠ శాల నిర్వాహకుడి కొడుకు సోమశేఖరం ఒక సారెప్పుడో కనిపించి మాటల సందర్భం గా నేను గండ్రాయి లో పని చేశానని చెబితే ఆశ్చర్య పడి ‘’యెట్లా పని చేశావయ్యా అక్కడ .అక్కడ ఉండాలంటేనే చిరాకేసింది నాకు ఉండలేక పోయాను యు ఆర్ గ్రేట్ ‘’అన్నాడు .అంతే కాదు గండ్రాయిలో నేనున్న పిచ్చయ్య గారికి బాగా ఇష్టమైన సైన్స్ మేస్టారు ప్రసాద్ ఇక్కడ పని చేసి వీరి కుటుంబానికి చాలా సన్నిహితుడై ఉండేవాడు  ఆతను తర్వాత కపిళేశ్వర పురం సైన్స్ మేస్టారుగా  చేసి ప్రమోషన్ మీద పునాదిపాడు హెడ్ మాస్టార్ అయి అక్కడే రిటైర్ అయ్యాడు .పిచ్చయ్యగారి కుటుంబం ఇతని కుటుంబానికి రాకపోకలు బాగా ఉన్నాయి. మంచి టీచర్ గా ప్రసాద్ కు ఇక్కడ పేరుంది .అలాంటి వాడి స్థానం లో నేను పని చేసి ఇ౦త అభిమానం పొందటం మామూలు విషయం కాదు. ఏదో దివ్య శక్తి నడిపించిందనే అనిపిస్తుంది .

గండ్రాయిలో లో 750-30-1020-35-1300 స్కేల్ లో  బేసిక్ 1055+14(f p I )గా1-8-86 నుంచి  జీతం తీసుకొన్నాను .rc no.6468 /81b1 dt 12-9-1987 of the p e.o and d.d.o..krishna  ననుసరించి నన్ను గండ్రాయి నుంచి వత్సవాయి హైస్కూల్ కు హెడ్ మాస్టారుగా ప్రమోట్ చేశారు 15-9-87  సాయంత్రం సైన్స్ మాస్టర్ గా రిలీవ్ అయ్యాను .ఇక్కడ ఉండగానే 1986  వేతన సవరణ అమలులోకి వచ్చింది.2070+14 గా1330-60-1930-70-2630  స్కేల్ లో బేసిక్ ఫిక్స్ అయింది .

నాకు స్కూల్ లో వీడ్కోలు విందు ఇచ్చారు .అందరూ అభిమానం చూపారు .పిల్లల మొహాల్లో ఏడుపే తక్కువ .నామీది అభిమానాని రాఘవులు సహించలేక వారి ఎమోషన్ కు అడ్డ కట్ట వేసినట్లు కనిపించింది .అందరికీ వీడ్కోలు పలికి  16 వ తేదీ ట్రాన్సిట్ వాడుకొని వత్సవాయి హైస్కూల్ లో 17-9-87ఉదయం హెడ్ మాస్టర్ గా జాయిన్ అయాను.

సశేషం

మీ గబ్బిట దుర్గాప్రసాద్ -12-2-15- ఉయ్యూరు .

..

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.