తెలుగుకు’’ స్టార్డం ‘’మాత్రమే తెచ్చిన సభలురెండవ రోజు 22-2-15 ఆదివారం దృశ్యమాలిక
కృష్ణాజిల్లా రచయితల సంఘం ఫిబ్రవరి 21,22 తేదీలలో విజయవాడలో నిర్వహించిన మూడవ ప్రపంచ తెలుగు రచయితల సభలు దిశా నిర్దేశం చేయలేదనే అభిప్రాయం కలిగించింది .సినీ ప్రముఖులు తనికెళ్ళ ,అశోక్ తేజ ,గొల్లపూడి ,బ్రహ్మానందం లు స్టార్ అట్రాక్షన్ మాత్రమే కలిగించారు .దానివలన తెలుగుకు ఒరిగిందేమీలేదు .రెండవ ప్రపంచ సభల చివరి రోజు స్వర్గీయ జాలాది గొప్ప ప్రేరణ స్పూర్తి కలిగిస్తే ,ఈ మూడవ ప్రపంచ సభల మొదటి రోజు రాత్రి సుద్దాల అశోక్ తేజ అదే స్పూర్తిని కలిగించి మనసులో నిలిచిపోయాడు .మిగతా వారి వన్నీ ఊక దంపుడు ఉపన్యాసాలే . శ్రీ కూచి భొట్ల ఆనంద్ బృందం రెండవ సభలలో సాంకేతికాంశాన్ని సర్వ సమర్ధం గా చాటి చెప్పిన దిశా దిర్దేశం చేసిన దృశ్యం ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది .ఆరోజు సభ అవగానే అందరూలేచినిలబడి ‘’స్టాండింగ్ ఒవేషన్’’తో హర్షాన్ని ఆన౦ దాన్ని కృతజ్ఞతలను ప్రకటి౦చటం మరువరాని మరువలేని అనుభూతి .అదే తర్వాత యునికోడ్ ప్రాముఖ్యతకు పెద్ద పీట వేసింది.ఈ సభల్లో కూడా శ్రీ ఆన౦ద్ ఉపన్యాసం మనం అందరం ఏం చేయాలో కర్తవ్య నిర్దేశకం గా సాగింది .బహుశా నా దృష్టిలో ఈ సభల్లో ఇది హైలైట్. ఆయన స్పీచ్ ‘’మైడేన్ స్పీచ్ ‘’.సభలు అంటే అలా ఉండాలి ఉపన్యాసం అంటే అ౦త నిబద్ధత తో ఉండాలి .అందులో ప్రపంచ సభలంటే గొప్ప స్పూర్తి తో ప్రతినిధులు ఇంటికి చేరుకోవాలి ఫాలో అప్ యాక్షన్ లో పడాలి .అంతసీను ఈ సభల్లో దృశ్యమానం కాక పోవటం నిరాశ మిగిల్చింది .ఇంకో విషయం శ్రీ బుద్ధ ప్రసాద్ ను శ్రీ గుత్తికొండను ,శ్రీ పూర్ణచంద్ ను పాసివ్ గా కూర్చోబెట్టి,బైపాస్ చేసి శ్రీ లక్ష్మీ ప్రసాద్ ఏకపాత్రాభినయం చేశారని పిస్తుంది .మొదటి రోజు 21-2-15 శనివారం దృశ్యమాలిక
కుర్రాడైనా సాహిత్య ఆకేడేమీ కార్య దర్శి ఛి .కృత్తి వెంటి శ్రీనివాసరావు ఎన్నో ఆచరించాల్సిన విషయాలను ,కార్య రూపం దాల్చాల్సిన వాటిని అతి సహజం గా సరళం గా చెప్పాడు .అతని చిన్నతనం పేద ప్రోలు లో నా కళ్ళ ముందు గడిచింది .అతని అన్న మాధవ్ నాకు అభిమాన శిష్యుడు అక్కడ .రావు చెప్పిన దానిలో ‘’కుంచేన్ టూర్ ప్రోగ్రాం ‘’తప్పక సాహిత్య సంస్థలు నిర్వహిచి కేరళ తీసుకొని వెళ్లి ఆసభలలో పాల్గొనే అవకాశాన్ని సాహితీప్రియులకు కలగ జేయటం తక్షణ కర్తవ్యమ్ .అది అమలు చేస్తారో లేదో చూద్దాం .సభా వైరాగ్యం లా మర్చేపోతారో?సభలో ఉన్న శ్రీనివాస్ నేను ఫలానా అని పరిచయం చేసుకోగానే లేచి నిలబడి షేక్ హాండ్ ఇచ్చిన సహృదయుడు .ఈ రెండు రోజుల సభలలో చివరి రోజు మంత్రుల కవాతు బాగుంది.శ్రీ చంద్రబాబు రాలేక పోయిన దాన్ని వీళ్ళు చక్కగా కవర్ చేశారు .ప్రసిద్ధ రచయితల పేర్లు సభా వేదికలకు పెట్టి కనీసం వారి చిత్రపటాల బానర్ కూడా కూడా లేక పోవటం మరీ అవమానకరం గా అందరూ భావించటం లో తప్పేమీ లేదు .ఇదివరకెన్నడూ ఇలా జరగలేదు .బహుశా అసలు సభా వేదిక మన రచయితల సంఘం చేతిలో లేకుండా చేశారేమో ననిపిస్తోంది .మేనేజి మెంట్ అధీనం లో ఉందా అని అనుమానం కలిగించింది .
సభలు అంటే షడ్రసోపేత భోజం ఉండాల్సిందే .ఉన్నాయికూడా వెరైటీ బానే చూపారు రెండవ రోజు మధ్యాహ్న భోజనం లోవె రాత్రికి రంగూ హంగూ మార్చి వడ్డించటం కొంచెం తమాషా అనిపించింది .రెండు రోజులూ సాయంత్రాల్లో ‘’మినపసున్ని ఉండలు ‘’వేసి పొద్దున్నుంచీ సభల్లో పాతుకుపోయినందువల్ల వచ్చిన నీరసాన్ని దూరం చేసి ఇన్స్టంట్ బలం ఇచ్చినట్లనిపించింది .అందరికీ ఇబ్బందికలిగించిన మరో ముఖ్యమైన విషయం టాయ్ లేట్ల నిర్వహణ .కంపు భరించలేకపోయారుజనం .ఒక్క కుళాయి నున్చికూడా నీరు రాలేదు .చేతులు కడుక్కోటానికి పాపం బకెట్లతో నీరు తెచ్చి శుభ్రం చేసేవాల్లున్నారుకనుక సరిపోయింది లేకుంటే రోగాలబారిన పడాల్సి వచ్చేది .
సాధారణం గా కృష్ణా జిల్లారచయితలసంఘం చివరిరోజు సభలో తీర్మానాలు రాసి చదివి ఆమోదాన్ని తెలిపేట్లు చేసే ఆనవాయతీ ఉంది .ఈ సారి ఆ దారిలో నడవ లేదు కారణం ఏమిటో ఎవరికీ అంటూ బట్టలేదు .అయితే మంత్రి శ్రీ ఉమా తెలుగు దేశ ప్రభుత్వ ఎన్నిక వాగ్దానాలు ,నిర్ణయాలు చదివి వినిపించారు .బహుశా మనం కోరినా అవే కోరేవారమేమో ఆలోటు తీర్చిన శ్రీ ఉమాకు అభినందనలు .జ్ఞాపికలు ,బ్యాగులు ఘనంగానే ఉన్నాయి .సంఘం తెచ్చిన రెండు పుస్తకాలు ‘’తెలుగు భారతి ‘’,యువ భారతి ‘’గర్వించదగిన గ్రంధాలే సందేహం లేదు గొప్ప రిఫరెన్స్ పుస్తకాలే .ఈ రెండూ తీసుకురావటం లో శ్రీ పూర్ణ చంద్ కృషి ,ఆలోచన ,అమలు ,అంకిత భావం అనన్య సదృశం,అసాధారణం .ఆరోగ్యం కొంచెం బాగుండక శ్రీ గుత్తికొండ కొంత డల్ గా కనిపించినా నిబద్ధతకు ఏమీ లోపం రాలేదు .శ్రీ తుర్లపాటి శ్రీ బుద్ధ ,లక్ష్మీ ప్రసాద్ లను ఒకే శాలువాతో బంధించారు కాని దీనికంతటికి ముఖ్య కారకులు శ్రీ సుబ్బారావు శ్రీ పూర్ణ చంద్ ద్వయాన్ని కూడా అలాగే బంధించి ఉంటె చారిత్రాత్మకం గా ఉండేది .రావు గారు ఏది చేసినా ఒక ప్రయోజనం ఉంటుందేమో?
పాపం ధిల్లీ నుంచి పిలిపించి మాట్లాడిస్తే శ్రీ వెంకయ్య అచ్చం గా పుస్తక మహోత్సవం లో జనవరి నాలుగవ తేదీన పుస్తకప్రియుల పాద యాత్ర అయి ఎక్సిబిషన్ గ్రౌండ్ లో ఏమి మాట్లాడాడో ఒక్క అక్షరం బీరు పోకుండా అదే హేళన అదే చీత్కారం అదే ధోరణిలో పాడిందే పాటరా —-పళ్ళ దాసరీ ‘’అన్నట్లు ఎబ్బెట్టు కలిగించింది .మాటల మా౦త్రి కత ఎప్పుడూ చెల్లుబాటుకాదు’’ బోరున్నర ‘’ అనిపించింది .ఇక శ్రీ బుద్ధ ,లక్ష్మీ ప్రసాద్ ల మాటలు కూడా అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డే .కొత్తవిషయం మచ్చుకైనా లేక పోవటం .ఒకే మూస దారిలో మాట్లాడటం రక్తి కట్టించాల్సినదిపోయి వెగటుపుట్టించాయి ఎప్పుడు మొదలు పెట్టినా అక్కడినుండే ,ఎప్పుడు ఆపేసినా అక్కడే .రొటీన్ ఉపన్యాసాలే ఇద్దరివీ .ధిల్లీ నుంచి అయన వచ్చి ,రెండు రోజులసభల్లో వీళ్ళిద్దరూ మాట్లాడినదేదీ స్పూర్తి దాయకం గా లేకపోవటం మరీ కొట్టవచ్చినట్లనిపించింది .శ్రీ పూర్ణ చంద్ కు అవకాశమిస్తే ఆ లోటు పూడేది .ఎక్కడో ఎవరో సభలను కబ్జా చేసిన భావం కనిపించింది .ఇది మంచిదికాదు .
1300 మంది ప్రతినిధులు ఏంతో దూర తీరాలనుండి వ్యయ ప్రయాసలకోర్చి వచ్చారు .వారి మధ్య ఇంటరాక్షన్ కలిపింఛి ఉంటె ఏంతో బాగుండేది .పొద్దున్నుంచీ సాయంత్రందాకా కూర్చుని కూర్చుని విని విని జనాలకు బోర్ కొట్టదా/
?ఏదైనాతెలుగు పైనో రచయితలపైనో మంచి డాక్యుమెంటరీ లు ప్రదర్శిస్తే ప్రయోజనం బాగుండేది వెరైటీగా ఉండేది మనకున్న ఆధునిక సాంకేతికను ప్రతిబింబించే సభలుగా ఉండేవి ఆ దృష్టిలో ఉండకపోవటం బాధకలిగించింది .అయితే తెలుగు దేశం భౌగోళికం గా విడిపోయినా భాషా పరం గా ,మానసిక పరం గా కలిసే తెలుగుప్రజలున్నారు అనే గొప్ప సంకేతాన్ని ఈసభలు మిగిల్చాయి అనే సంతృప్తి మాత్రం కలిగింది . విదేశాంధ్రులు చాలా ఉత్సాహం గా పాల్గొన్నారు .అందులో ఆచార్య డేనియల్ నిగార్స్ అందరితో రెండు రోజులూ చాలాకలుపుగోలుగా ఉండటం ఇంటరాక్ట్ అవటం ఎందరినో ఆకర్షించింది .అలాగే యువకుడు డా.శ్రీ జొన్నలగడ్డ మూర్తి కలుపుగోలుతన౦ గా చిలిపి కవితలతో అందర్నీ ఆకట్టుకొన్నారు .మిగిలిన వారు వేదికకే పరిమితమైనారు .
తెలుగు వికాసం ,ప్రాచీనహోదా ,ప్రపచ భాష ,రాస్త్రేతర ,ప్రసార మాధ్యమాలు సాహిత్య సంస్థలపై సదస్సులు రొటీన్ గా ఎప్పుడూ పాల్గొనే వాళ్ళతోనే చర్విత చర్వణం గా సాగాయి .కొత్తదనం లేదు .సభల తర్వాత వీటికి ఫాలోఅప్ యాక్షన్ ఎలాగూ ఉండదని నమ్మకం .కవిసమ్మేళనాలు ఉత్సాహం గా సా—గాయి .మొదటి రోజు కరెంట్ లేక ‘’కపి మ్మేళనం‘’గా ఉందని కొందరు కామెంట్ చేశారు మర్నాడు ఉదయమ్ .ఈ సమ్మేళనాలకు నేను లేనుకనుక విన్నదే రాశా .ప్రచార మాధ్యమాలు సభల ప్రారంభానికి చాలా రోజుల ముందునుండే చక్కని ప్రచారం చేశాయి .సభలనూ బాగానే కవర్ చేశాయి .మొత్తం మీద హడావిడి ఆర్భాటమేకాని ప్రయోజనాత్మక సభలు అని అనిపించలదనే అందరి అభిప్రాయం .ఒడ్డున ఉండి రాళ్ళు వేయటం తేలికే .దిగితెకాని లోటు, లోతు తెలియదు .ఏమైనా .కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్య దర్శులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు శ్రీ పూర్ణ చంద్ ల సంయుక్త కృషి ఫలితమే ఈ విజయానికి శ్రీరామ రక్ష .’’వన్ మోర్ ఫెదర్ ఐ న్ దెయిర్ కాప్ ‘’.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-3-15- ఉయ్యూరు
sir,
meeru vrasina unicode, sabhalo cheppinadi naku artham kaledu. youtube link dorakaledu.. dayachesi unicode gurnchi sayam cheyyandi please.
a.v. ramana
9441426555