ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -18
9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్ ఎడ్డీ -2
తన కొత్త మతాన్ని సంస్థాపించటానికి ముందు మేరి బెకర్ ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నది .డాక్టర్ పాటర్సన్ నుండి ఏడాదికి రెండు వందల డాలర్ల పెన్షన్ తప్ప ఇంకే ఆదాయమూ లేదు .ఉండటానికి స్వంత ఇల్లే లేదు .ఎవరో ఒక ఇల్లాలి మానసిక స్థితిని సరిచేసి వారింట్లో ఆ రోజు ఆతిధ్యం పొందుతూ సంచారి జీవితం గడిపింది .ఇలా ఉంటున్నా క్విమ్బీ జీవిత విశేషాలను రాస్తూనే ఉంది .నాలుగేళ్ళు బాధ దుఖం ,బీదరికం ఒంటరితనం లో జీవించి చివరికి మొదటి డ్రాఫ్ట్ ‘’extracts from doctor P.P.Quimby ;s writings ‘’ పూర్తీ చేసింది .ఇది బాధా నివృత్తి చేసేదేకాక భరించలేని మానసిక సంక్షోభానికి పరిష్కారం గా కూడా ఉన్నది .దీనితో ఆమె అసలైన క్రిస్టియన్ సైన్స్ ఆవిర్భావానికి మార్గం సుగమమైంది .దీనితో బాటు ప్రేమించటం గురించి బోధించేది .
మొదటి సారిగా ఆమె శిష్యులు బాధా నివారాన చేయటం లో ప్రసిద్దులవటం తో ఆమె కీర్తి నెమ్మదిగా ప్రపంచమంతా పాకింది అదే ఆమె విజయానికి తోలి మెట్టు అయింది .వారికి బోధించటానికి ఫీజు వసూలు చేసేది .దీనితో అనేక సంస్తలేర్పడ్డాయి వారిలో భేదాలు తారా స్థాయికి చేరాయి .57 ఏళ్ళ వయసులో పాటర్సన్ కు విడాకులిచ్చి గిల్బర్ట్ ఎడ్డీ ని పెళ్ళాడింది .456పేజీల ఉద్గ్రంధాన్ని పూర్తీ చేసి 1875 లో విడుదల చేసింది .క్విమ్బీ పద్ధతిని ‘’ది సైన్స్ ఆఫ్ హెల్త్ “’అన్నది దానికి ‘’విత్ కీ టు స్క్రిప్చర్స్ ‘’ అని జోడించింది .పది హేనేల్లు దానినేప్కటి క ప్పుడు కొత్తవి చేస్తూ ఆధునీకరిస్తూనే ఉంది .ఆ పుస్తకం లక్షా యాభై వేల కాపీలు అమ్ముడు పోయి రికార్డ్ సృష్టించింది .తన స్వంత చర్చిలోని ప్రతి వ్యక్తీ ఒక కొత్త కాపీ కోనేట్లు చేసిండి అమ్మకాలపై ప్రతి పుస్తకానికి ఒక డాలర్ రాయల్టీ పొందింది .
పదార్ధం పై మనసు ఆధిక్యతను ఆధారం గా రాసిన పుస్తకం అది .చెడు అనేది లేదని అంటు0ది .చెడు అనేది భయం వలన ఏర్పడే ఒక మానసిక స్థితి అన్నది .ఆమె రాసిన పుస్తకం లో విరుద్ధ విషయాలెన్నో ఉన్నాయి .కాని శిష్యులపై ఆమెకు గొప్ప పట్టు ఉండేది .55 వయసులో ‘’క్రిస్టియన్ సైన్స్ అసోసియేషన్ ‘’ఏర్పాటు చేసింది .మూడేళ్ళ తర్వాత ‘’ది చర్చ ఆఫ్ క్రైస్ట్ ,సైంటిస్ట్ ‘’ను స్థాపించింది .రెండేళ్ళ తర్వాత ఇందులోని ఎనిమిది మంది చార్టర్ సభ్యులు రాజీనామా చేశారు .61 వయసులో తన చర్చ ని బోస్టన్ నగరానికి మార్చింది .ఆమె ప్రతికదలికా ఒక వార్తా సంచలనమే అయింది .దాన్ని బాగా కాష్ చేసుకొందికూడా .తన మాటకు చేష్టకు ఆమె పురాణ గ్రంధాలనుండి ఆధారాలు చూపి అప్రతిభులను చేసేది .అపోకా లిప్స్ చెప్పిన ‘’ and there appeared a great wonder in heaven ,a woman clothed with the sun and the moon under her feet ,and upon head a crown of twelve stars ‘’అనే మాటలను తనకే అన్వయిన్చుకోనేది
క్రిస్టియన్ సైన్స్ కొద్దికావులం లోనే గొప్ప వ్యాప్తి పొందింది .ఈ అతి వ్యాప్తిని చూసి మహా రచయిత మార్క్ ట్వేన్ ‘’ఇలా అయితే క్రిస్టియన్ సైంటిస్టులు 1920కి పది మిలియన్లు ,1930కి వారంతా బలమైన శక్తి గా రూపొంది ప్రతి రాజకీయ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తారు .1940 నాటికి రిపబ్లిక్ అధికారాలు చేబట్టి అధికారం లో పాతుకు పోయే అవకాశం ఉంది ‘’అని రాశాడు .ట్వేన్ మాటలు పూర్తిగా ఉత్ప్రేక్షలె అభూతకల్పనలే అయ్యాయి .1950 నాటికి మేరీ స్థాపించిన మదర్ చర్చ్ బ్రాంచీల సంఖ్య మూడు వేలు అని ఎన్ సైక్లో పీడియా బ్రిటానికా తెలియ బర్చింది .అందులో రెండు వేలరెండొందల బ్రాంచీలు అమెరికా కెనడాలలో ఉన్నాయి .
ముసలితనం మీదా పడుతున్నకొద్దీ ఎద్దే బలం అధికారం మరీ పెరిగింది .ఒక యునితెరియాన్ మినిస్టర్ సాయం తో తన పుస్తకానికి తుది మెరుగులు దిద్ది తన అనుచరులకు బైబిల్ కు ప్రత్యామ్నాయం యెట్లు చేసింది .ఎశం లో సంచారం చేస్తూ ఉపన్యాసాలిస్తూ తన మతం లోకి జనాలను చేర్పిస్తూ మదర్ చర్చ్ ను బలీయం చేసింది .ఒక భారీ సంస్థకు ఆర్గనైజర్ గా ఎదిగిపోయింది అత్యంత సంపన్నుల జాబితాలో చేరిపోయింది .మగ పురుషులతో అంత సఖ్యతగా లేక పోయినా సంస్తా గత విషయాలకు వారిపైనే ఆధార పడాల్సి వచ్చేది ..డెబ్భై వ పడిలో 41ఏళ్ళ ఒక హోమియో పతి డాక్టర్ ను చేర దీసింది అయిదేలోల తర్వాత అతన్ని విసర్జించింది .అల్లాగే ఎవరినో దగ్గరకు తీయటం కొద్దికాలానికే వారికి గుడ్ బై చెప్పటం అలవాటైపోయింది ఆమెకు . ఆమె శీలాన్ని శంకించారు .చనిపోయిన వారి మరణానికి ఆమె చికిత్స వికటించే అనే ప్రచారమూ బాగా బలపడింది .పూర్తిగా ఆమె పై వ్యతి రేకత కాదు .ఆమె చుట్టూ ఉన్న కోటరీ పై వ్యతిరేకతే అది .సంస్థాగత వ్యవహారాలపై ఆమె పట్టు కోల్పోయిండానే ప్రచారం సాగింది.ఆమె స్వచ్చ ప్రవర్తనపై అపనమ్మకం కలిగింది .ఆమెను ఒంటరి దాన్ని చేసి పిచ్చిదానికిండా కట్టేశారు .86 ఏళ్ళ వయసులో కూడా ఆమె తనసంస్త్ర్హ ను పూర్తీ నియంత్రణలో ఉంచుకో గలిగింది .తొంభై ఎల్లువచ్చాయి వృద్ధాప్యం వలన నే మేరీ బెకర్ ఎడ్డీ 3-12-1910 న తను నమ్మిన క్రీస్త్ ను చేరుకొంది .పేదరికం లో అతి సాధారణ రైతు కుటుంబం లో పుట్టిన ఆమె చనిపోఎసరికి ఒక పెద్ద సువిశాల సంస్థకు అధికారిణిఅయి మూడు మిలియన్ డాలర్ల ఆస్తికి వారసురాలై చరిత్ర సృష్టించింది .ఈ ఆస్తి అంతా ఆమె తను పెంచిపోషించిన చర్చ కే దక్కేట్లు చేసి ,భౌతికవాదాన్ని రూపుమాపి ,పదార్ధ వాదాన్ని లేకుండా చేసేందుకే వినియోగించేట్లు చేసింది మేరీ బేకర్ ఎడ్డీ .
భారతీయ వేదాంతానికి క్రిస్టియన్ సైన్స్ కు అవినాభావ సంబంధం ఉందని మేరీ 33 వ ఎడిషన్ లో చెప్పింది .భగవద్గీతలోని అనేక శ్లోకాలను అందులో చేర్చింది .తర్వాత తీసేశారు .తర్వాత కాలం లో భారతీయ మైన అన్నివిష యాలను ఆ పుస్తకం నుండి తొలగించారు .ఎడ్డీ జీవితాంతం మార్ఫిన్ వాడుతూనే ఉందని ఒక రిసేర్చర్ తెలిపాడు .ఆమె చర్చ్ బ్రాంచీలు 76 దేశాలలో వ్యాపి0చి ఉన్నాయి ఆమె శత జయంతికి ఆమె జన్మించిన బౌ గ్రామం లో 100టన్నుల గ్రానైట్ పిరమిడ్ ను నెలకొల్పి ఘనం గా నివాళు లర్పి0చారు .దాదాపు 16 పుస్తకాలు రాసింది మేరీ .
మేరీ పుట్టిన ప్రదేశం
న్యు హాంప్ షైర్-కాంకార్డ్ లో మేరీ స్తాపించిన క్రైస్ట్ ఆఫ్ సైన్స్
మరో ప్రముఖునితో కలుద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-3-15 ఉయ్యూరు