ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -20-

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -20-

10-ఫియోడర్ డాస్టో విస్కీ –2

సెమి పాలంట్ నిస్కి  లో మిలిటరీకవాతు చేస్తూ ఖాళీ సమయం లో రచనావ్యాసంగం కొన సాగించాడు .అప్పుడే ఒక పిల్లాడి తల్లి అయిన మేరియా డిమిత్రివాన ఇసఎవను ప్రేమించాడు .ఆమె భర్తను వదిలి రావటం కష్టమైంది .భర్త చనిపోయిన తర్వాత ఆమె వేరొకరిని  మనసిచ్చి మనవాడికి నిరాశ కలిగి౦చి౦ది .కాని ఆమె అంటే ఆరాధనమాత్రం తగ్గలేదు .ఆమెనే పెళ్లి చేసుకొని ఆమె కొత్త భర్తను, కొడుకును ,ఆమెను పోషించాడు . ప్రభుత్వం పూర్తిగా క్షమ ప్రసాదించి పీటర్స్ బర్గ్ లో మామూలు జేవితాన్ని గడపటానికి అంగీకరించిం ది.రష్యాలో సంస్కరణ ఉద్యమం ఊపులో ఉంది .సోదరుడు మైకేల్ తో కలిసి దాస్తోవిస్కి ‘’వ్రేమ్యా ‘’(టైం )మేగజైన్ ను నడిపాడు రెండు విలువైన పుస్తకాలు ‘’ది ఇన్ సల్టేడ్ అండ్ ఇంజూరేడ్ ‘’’’ది హౌస్ ఆఫ్ ది డెడ్ ‘’రాశాడు .రెండవ నవలను టాల్ స్టాయ్ బాగా మెచ్చాడు. ఇది ఆయన జైలు జీవితమే జీవిత పోరాటం లోనే జీవిస్తున్నాడు .ఆగిన సృజన ప్రవాహాన్ని కదిలించి వేగవంతం గా రాసేస్తున్నాడు .జర్మని ఫ్రాన్స్ ఇంగ్లాండ్ టూర్ చేశాడు .అక్కడి భౌతిక వ్యామోహం పై ఏవగింపు కలిగి ‘’వింటర్ నోట్స్ ఆన్ సమ్మర్ ఇంప్రె షన్స్ ‘’రాశాడు వాటిపై .మొదట్లో  ఆంక్షలు విధించినా తర్వాత వదిలేశారు అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది .

40 లో మూర్చ తీవ్రమైనది. జ్ఞాపక శక్తి క్షీణించింది .స్థలమార్పు అవసరమన్న డాక్టర్ సూచన పై విదేశీ యానం చేశాడు .పోలినా సుస్లోవా అనే పిల్లపై పారిస్ లో  వ్యామోహం లో పడ్డాడు .చేతిలో చిల్లిగవ్వ లేని స్తితిలో ఉన్నాడు .జాక్ పాట్ కొట్టి ఏదో లబ్దిపొందాలని జర్మన్  గాంబ్లింగ్ లో దిగాడు .గెలుపు ఓటమిల దోబూచులాటలో పడి అదే వ్యామోహమై తానూ ఎందుకిక్కడికి వచ్చాడో మర్చేపోయాడు .పారిస్ చేరాడు .ప్రేమించిన పోలినా లవర్ ఆమెను మోసం చేసి జంప్ జిలానీ .ఆమె పోషణ కూడా మీదేసుకొన్నాడు మన విశాల హృదయుడు .ఆమెతో వీస్ బెడేన్ వెళ్లి మళ్ళీ వీల్ ఆఫ్ ఫార్చూన్ లో కూరుకుపోయాడు . ఇంటిదగ్గర భార్యకు తీవ్ర అనారోగ్యం గా ఉందని తెలిసి రష్యా చేరాడు .భార్య కు పిచ్చెక్కి చనిపోయింది .కొంతకాలానికి తాను  అధికం గ ప్రేమించిన సోదరుడూ చనిపోయాడు మళ్ళీ డిప్రెషన్ లో పడ్డాడు. మైకేల్ చేసిన విపరీతామైన అప్పులు తీర్చాలనే సంకల్పం తో విపరీతంగా వేగం గా రాశాడు, గాంబ్లింగ్ ఆడాడు .ఉన్నదంతా ఊడ్చుకు పోయింది పోలినాడబ్బును కూడా క్షవరం చేశాడు .కాండిల్స్ కొనే స్తోమతకూడా లేక  రాత్రుళ్ళు  చదవటం రాయటం మానేశాడు .ఒక్క రూబుల్ అప్పుకోసం వీధుల వెంబడి మూడేసి రోజులు తిరిగిన సందర్భాలెన్నో ఉన్నాయి .

అదృష్టం ఒక్క సారిగా తలుపు తట్టింది ‘’ది గాంబ్లర్  ‘’’’క్రైం అండ్ పనిష్మెంట్ (నేరము శిక్ష)నవలలు రాయటానికి పబ్లిషర్ తో ఒప్పందం కుదుర్చుకొని గడువు లోపల పూర్తీ చేయటానికి అన్నా గ్రిగేరేవ్నా ‘’అనే స్టె గ్రాఫర్ ను పెట్టుకొని పూర్తీ చేసి చివరికి ఆమె ప్రేమబంధం లో చిక్కి పెళ్లి చేసుకొన్నాడు .నేరము శిక్ష గొప్ప విజయాన్ని సాధించింది కాసుల వర్షమే కురిపించింది.అప్పులవాళ్ళు మీద పడి ఉన్నదంతా ఊడ్చుకెళ్ళారు.చిప్ప చేతిలో పట్టుకొని కొత్తభార్య తో రాష్యా వదిలి జెర్మని స్విట్జెర్లాండ్ ఇటలీలు తిరిగాడు .సుఖం ఆనందం పొందలేక పోయాడు .స్వంత ఇల్లు ఎర్పరచుకోవాలనే కోరిక కలిగింది .అందులో కూర్చుని హాయిగా స్వేచ్చగా రాసు కోవాలనుకొన్నాడు .రష్యా గాలి అ నీరే తనకు బలవర్ధకం అనుకొన్నాడు ఫిట్లు ,గాంబ్లింగు జోరైనాయి .శక్తి  క్షీణించి పోతోందని సృజన మందగించిందని బాధ పడ్డాడు .సరదా గా మొదలైన జూదం వ్యసనమై పీల్చి పిప్పి చేసింది .ఇడియట్ ,దిపోసేసింగ్ నవలలు రాస్తున్నాడు .జెనీవాలో భార్య గర్భవతి గా ఉన్నప్పుడు చేతిలో 5 ఫ్రాంకులు మాత్రమే ఉన్నాయి .మొదటి బిడ్డ మరణం రెండో బిడ్డ ద్రేస్దేన్ లో జననం .తన దీన స్తితిని తెలియ జేస్తూ స్నేహితునికి ‘’నా భార్య ఒక పిల్లాడిని పోషించాలి .నేను ఎందుకూ పనికి రాని వాడినైపోయాను . ఎప్పుడూ ఆకలి తో ఉంటున్న నేను ఏమి ఎలా రాయగలను .ఆకలి రాక్షసినన్ను కొరికి తినేస్తోంది .చదరంగం ఆడి డబ్బు సాధించటం తప్ప గత్యంతరం లేదు ‘’అని రాశాడు .

వేదనా బాధ దరిద్రం నిర్లక్ష్యం పెనవేసుకు పోయి అతనితో చదరంగం ఆడాయి .ఓడిపోయాడు అన్ని ఆటలలో .విముక్తి భావాలను గాలికి వదిలేశాడు . చాందసం పెరిగింది మతం నరనరానా పాకింది .గురూగారికి 50 ఏళ్ళకు మొకాలిలోని మెదడు అసలు స్థానానికి చేరి చేసిన తప్పులకు చెంపలేసుకొని పశ్చాత్తాపపడి జూదానికి గుడ్ బై చెప్పి మళ్ళీ రష్యాలో అడుగు పెట్టాడు .అప్పులాళ్ళు అతని రచనలకు అడ్డుపడలేదు .స్వేచ్చగా రాయనిచ్చారు .ఊపిరి తీసుకొని మహా రచనలని పించుకొన్న ‘’ది పోసేసేడ్ ‘’’’ది ఎటర్నల్ హస్బండ్ ‘’ది బ్రదర్స్ కర్మ జావ్ ‘’లను క్షణం తీరిక లేకుండా గాంబ్లింగ్ లో వృధా చేసుకొన్న కాలాన్ని సద్వినియోగం చేసుకొని తీక్షణం గా రాశాడు అధిక శ్రమ చేశాడు .చావు మీద పడిన వాడైపోయాడు అలసట తో .

60 మీద కొచ్చాయి .మూడు నెలల తర్వాత మృత్యువు కబళించింది .మనసులో అనుకొన్న పుస్తకాలు రాయటానికి ఇంక ఎక్కువకాలం బతికితే బాగుండును అనుకొన్నాడు .బ్రదర్స్ నవల చివరి భాగం రాస్తూ పెన్ను చేతిలోనుంచి జారిపడి దాస్తోవిస్కి 28-1-1881న మరణించాడు .రష్యా రచయితలూ చాదస్తం గా రాస్తారనే అపప్రధ లోకం లో ఉంది .కాని దాస్తోవిస్కి మనసుపెట్టి రాశాడని ,ప్రతివారితోను మాట్లాడినట్లు రచన చేశాడని మెచ్చుకొంటారు .అతని గొప్ప ఫాన్ అయిన వర్జీనియా ఉల్ఫ్ ‘’his novels are seething whirlpools ,gyrating sand storms ,water spouts which hiss and boil and suck us in .the y are composed purely and wholly of the stuff of the soul .The elements of the soul are seen not separately but streaked ,invoved ,inextricably confused ,a new panorama of the human mind is revealed ‘’అంటూ పరవశం తో చెప్పింది .ఆయన రచనలు పాపులు నేరస్తులు ,ఆత్మ పరాదీనులగురించే రాశాడు .ఒక కొత్త ప్రపంచాన్ని సృస్టించాడు .సెయింట్ అల్యోశా లాంటి పాత్రలు సృష్టించాడని సోమర్సెట్ మాం పొగిడాడు .ప్రపంచం లో జరిగే ప్రతినేరానికి మన బాధ్యతా ఉంది మన ప్రమేయం లేకపోయినా అనుభవించాల్సి వస్తోంది అంటాడు దాస్తోవిస్కి

కదా నవలా రచయితగా ,జర్నలిస్ట్ గా ఫిలాసఫర్ గా  గుర్తింపు పొందాడు .మత ఆధ్యాత్మిక వేదాంత విషయాలను గురించి రాశాడు .ఎపిగ్రామ్స్ కవితలూ రాశాడు .నవలలో జీవిత చరిత్రను జోడించాడు .తాను  ఫిలాసఫీలో బలహీనుడిని  అని చెప్పుకొన్నా డాస్తో విస్కీ రచనలలో ఫిలాసఫీయే ఎక్కువ గా కనిపిస్తుంది .రష్యన్ స్వర్ణ సాహిత్య యుగం లో టాల్ స్టాయ్ ,డాస్తో విస్కీ లే అధిక ప్రాచుర్యం పొందారు .ప్రఖాత గణిత విజ్ఞాన శాస్త్రజ్ఞుడు అయిన్ స్టీన్ అతన్ని ‘’గొప్ప మత రచయితఅని ‘’who explores the mystery of spiritual existence ‘’ అన్నాడు .ఆధునిక వచనానికి ఆద్యుడు దాస్తోవిస్కి అన్నాడు జేమ్స్ జాయిస్ ‘’.ఆతని రచనల్లో నమ్మేవి నమ్మలేనివీ ఉన్నా  చదువుతూ పోతే తను చెప్పినవన్నీ యదార్ధమే అనిపిస్తాయి’’అన్నాడు మరో అమెరికన్ లిజెండ్ హెమింగ్ వే .కాఫ్కా ‘’నాకు రక్త బంధువు దాస్తోవిస్కి ‘’అన్నాడు .ఫ్రాయిడ్ ‘’కర్మజారో నవల ఇంతకు  ముందెన్నడూ రాని మహత్తర నవల ‘’ అని పొంగిపోయాడు .సర్రియలిస్టూలు సింబాలిస్ట్ లు ఎక్సేన్శియలిస్ట్ లు  బీట్ సంగీతం వాళ్ళు తమకు ప్రేరణ దాస్తోవిస్కి అన్నారు

1956లో రష్యా ఆయన పేర పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది .ఆయన పేర మ్యూజియం ఏర్పరచారు .బుధ గ్రహం మీద ఒక క్రేటర్ కు ఆయన పేరు పెట్టారు .1991లో కనుగొన్న చిన్న గ్రహాన్ని ఆయన పేరుతొ పిలిచారు .ఆయన పేరుమీద ఎన్నో సంస్థలు ఎన్నో రకాల అవార్డులు అందజేస్తున్నాయి  .170ప్రపంచ భాషలలోకి ఆయన రచనలు అనువాదాలయ్యాయి .ఎన్నో సినిమాలు తీశారు .మొత్తం మీద పదిహేను  నవలలు నవలికలు రాశాడు .,రష్యా విప్లవం లో రెండు మూడు పేరాలు కుదించారు   .17చిన్నకధలు 5 అనువాదాలు చేశాడు .

సశేషం

 

మరో ప్రముఖ వ్యక్తీ తో మళ్ళీ కలుద్దాం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-3-15- ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.