కోయజాతి గిరిజనులు సంస్క ృతి సంప్రదాయాలు

కోయజాతి గిరిజనులు సంస్క ృతి సంప్రదాయాలు

Added At : Sun, 03/08/2015 – 03:11

భారతదేశంలో కోయజాతిగిరిజనులు ఎక్కువగా కోరాపుట్‌, బస్తర్‌, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌,బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లతో పాటు తెలుగువారున్న ఆంధ్ర, తెలంగాణాలో రాష్ట్రాలలోనూ ఉన్నారు. 2001 నాటి ఆంధ్రప్రదేశ్‌ జనాభా లెక్కలను బట్టి చూసినట్లైతే ఈ కోయజాతి జనాభా విశాఖ మొదలైన ఉత్తరాంధ్ర జిల్లాలలో 76,895 తెలంగాణాలోని భద్రాచలం ఏజన్సీ ప్రాంతంలో 24, 329 మంది బస్తర్‌ వంటి కోరాపుట్‌ ప్రాంతాలలో మూడు లక్షల వరకు ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
అయితే తెలుగు రాష్ట్రాల రెంటిలో ఉన్న గిరిజన జాతుల్లో కోయజాతి ఆదివాసీలు సంఖ్యా పరంగా ద్వితీయ స్థానంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముందు చెప్పిన ప్రాంతాలలో వారు బాగా విస్తరించి వున్న, తూర్పు గోదా వరి, పశ్చిమగోదారి, ఖమ్మం, వరంగల్లు, ఆదిలాబాద్‌ జిల్లాలో
కూడా వీరి సంఖ్య సుమారుగా కనిపిస్తుంటుంది. ఈ కోయ జాతి జనులు అటవీసంపదపై ఆధారపడి బతుకుతుంటారు. అడవితల్లే వారికికన్న తల్లిగా భావిస్తారు.
కోయల్లో వ్యవసాయం ముఖ్యవృత్తిగా జీవించేవారి సంఖ్య తక్కువేంకాదు. ఈ వ్యవసాయక తెగల్లో కొండదొర, కొండరెడ్డి, కోలం, తోటి, జతపు అనే వారు ముఖ్యులు. ఓరుగల్లు (వరంగల్‌) జిల్లాలో కోయలు అధికంగా నర్సంపేట, ములుగు, మహబూబా బాద్‌, ఇంకా ఖమ్మం జిల్లాలో భద్రా చలం కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గుం పాడు, నూగూరు,మధిర, పాల్వంచ మొదలైన చోట్ల కనిపిస్తుంటారు. నాలుగు జిల్లాలో కలిసివారి సంఖ్య దాదాపు 14.33 లక్షలుంటారు.
4.92 లక్షల మంది వరకూ భూమిని సాగుచేసుకుంటూ వ్యవ సాయం చేస్తున్నారు. వ్యవసాయ కూలీలుగా భూమి పుట్రాలేని వారైతే 1.50 లక్షల వరకూ ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. వీరు గతంలో ఎన్నో రాజకీయ పోరాటాలలో పాల్గొన్న దాఖలు కనిపిస్తున్నాయి. వాటిలో 1969లో శ్రీకాకుళ గిరిజ నోద్యమం కొండమొదలు గిరిజనపోరాటం, తెభాగా గిరిజన పోరాటం ప్రధానమైనవిగా చెప్పుకోవాలి.
బేరీజు వేసి చెప్పుకోవాల్సి వస్తే ఈ కోయజనం ఒక్క శ్రీకాకుళ గిరిజనోధ్యమంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయారంటే అతిశయోక్తికాదు. ఇదే మాదిరిగా నేటి తెలంగాణాలోని ఆది లాబాద్‌ లోగల ఇంద్రవెల్లిలోకూడ ఉద్యమంలో 13మంది గిరిజ నులు కాలగర్భంలో కలిసి పోయి సంగతి అసత్యం మాత్రం కాదు. కోయజాతిలో అధికంగా తెలుగుభాష, ఇదే సంప్రదాయాలు కనిపిస్తుంటాయి. కొన్ని అక్కడ కొండ ప్రాంతపు మండలి కాలకూడా వారి భాషలో చోటు చేసుకున్నాయి. వీరిని గుర్తించి ప్రత్యేకించి చెప్పాల్సొస్తే ముఖ్యంగా నక్సలైట్‌ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని చెప్పక తప్పదు. 1970 సంవత్సరం నుంచి ఈ జాతి అభివృద్ధి కోసం ప్రభుత్వం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఈ కోయలలో ఒక్క ఆదిలాబాద్‌లోనే 18
ఉపజాతులు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఖమ్మం, కరీంనగర్‌, తూర్పు, పశ్చిమ జిల్లాల్లో వీరి ఉపజాతులుగా ఈ విధంగా చెబుతున్నారు. అవి రాజకీయ గుత్తకోయ, (గొత్తి), అడవికోయ, డొల్లకోయ, బొమ్మకోయ, మన్నెకోయ, చిత్తకోయ, పుష్టికోయ, లింగకోయ మొదలైన వర్గాలుగా చెప్పుకోవడం పరిపాటి.
మనం పైన చెప్పుకున్న వేకాకుండా వారివారి వృత్తిపరమైన విభజన చేస్తూ మరికొన్ని అవాంతర విభాగాలుగా చేసి పిలవడంకూడా పరిశీలిద్దాం! కమ్మరి కోయ (వీరు పని ముట్లు తయారు చేసేవాళ్లు) కావ చ్చు, ముసరకోయ, ఒడ్డి కోయ, వీళ్లంతా అటవీ సంబంధమైన సంపదపైన ఆధారపడి బతు కుతుంటారు. కొండదేవర పేరు, చెబుతూ కొందరు పల్లెలు, గ్రామాలు పట్టణాలలో తిరుగుతూ జ్యోతిష్యం చెప్పటం నేటికీ మనం చూస్తూనే ఉన్నాం! వీరు అడవుల్లో సంచారం చేస్తూ బెల్లం, తేనె, చింతపండు, మూలికలు, జింక చర్మాలు, వేర్లు, పులిచర్మాలు, పులి గోళ్లు, పాము చర్మాలు, జీడిపప్పు, ఇప్పపువ్వు, తునికాకు, కరకోయలు, వేపతేనె, పులినెయ్యి, గోందు లేక బంక (జిగుర్లు) ఉసిరి కాయలు మొదలైనవి భాగా సేకరిస్తుంటారు. వాటిని ఎంత దూరమైనా వెళ్లి అమ్ముకుపోతుంటారు. బాగా రేటు బాగా పలికితే బజార్లలో గాని విక్రిస్తారు. వారు వెదురు బొంగులు, కారెగడ్డి, తుంగతతో (అదొకరమైన గడ్డి) గుడిసెలు వేసుకుని గూడేలలో జీవిస్తుంటారు. ఎడమ చేతి మీద పచ్చబొట్లు పొడిపించుకోవడం కోయస్త్రీలలో బాగా ఉంది. ఎక్కువగా హిందూ సాంఘీక ఆచారాలే వీరు పాటిస్తుంటారు. హిందువుల పండుగలైన దసరా, దీపావళి, సంక్రాంతి మొదలైన వాటిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా వీరికి భూమాత, మూర్పక, అమ్మోరు మొదలైన పండుగ జాతర్లు నిర్వహించడం గమనించవలసిన అంశం.
పాటలు పాడుతూ ఆడుతూ ఉన్నప్పుడు తలలపై మగవారు పశువుల తలలతో చేసిన కిరీటం లాంటి దాన్ని ధరించే అలవాటు ఈ కోయ జాతివారికి వుంది. డప్పులు, బూరలు వాయిస్తూ స్త్రీ పురుషులున్నట్లు చేస్తారు. అమ్మోరు జాతరలో ఎన్నో మేకలను, గొర్రెలను బలిస్తుండటం వీరికి అనాదిగావస్తున్న ఆచారం. ఒకానొకప్పుడు అనాగరికులుగా ఉన్నప్పుడు చిన్నపిల్లన్ని
కన్నెపిల్లల్ని బలిచ్చే సంప్రదాయం ఉండేదట. పిల్లాపాపలు పాడి పంటలు బాగా పండాలని వారి క్షేమం కోసం ఈ జాతర్లు చేస్తుంటారు. వరంగల్‌ జిల్లాలో గల సమ్మక్క-సారలమ్మ జాతర ఇంకా మగద పూర్ణిమ రోజున జరిగే కోయ జాతర్లు పేరు పొందాయి. తెలంగాణా ప్రాంతంలో నివసించే కోయజాతులే వంశ పారంపర్యంగా లింగదారి, కోయ, రాజకోయ, కమ్మర, అరితదోలు అనే శాఖలు కనిపిస్తుంటాయి. కోయగ్రామ పెద్దమ్మను ముత్యాలమ్మ, లేక దేవర అని వ్యవహరిస్తుంటారు. గూడేల్లో ఎలాంటి నేరాలు జరిగినా వీరి సమక్షంంలో అవి విచారించ బడతాయి.
ఈ కోయజాతి కోయగూడెంలో పదవులు వారి వారి వంశ పారం పర్యంగా సంక్రమిస్తుంటాయి. ఆస్తి పంపకాలు కూడా ఇదే పంథాలో సాగు తుంది. వారి 15 గ్రామాలు కలిసి ఒక సమితి ఉంటుంది. బలమైన ఈ గిరిజన సాంఘీక ఐక్యత ముందు నేరస్తులు శిక్షల నుండి తప్పించుకోవడం అసాధ్యం. ఏదైనా తప్పుచేసాక అది అబద్ధం కాదని వారి కోయజాతిలో ఎవరైనా ఆవుతో కనుకళ్లకు కట్టుకుని ప్రమాణం చెయ్యాల్సివుంటుంది. వీరి జాతిలో పెళ్లిళ్లు మూడు రోజులు జరుగుతాయి. వీరి వ్యవసాయ క్షేత్రాలు సమిష్టి ఆస్తిగా పరిగణింపబడుతుంది. బ్రిటీష్‌ వారి పాలనా కాలంలో వీరి భూములను తెల్లవారు బలంతంగా పరాయి కరణం చేసారు. వార్ని వారి భూముల నుంచి వెళ్లగొట్లడం చెప్పుకోదగిన అంశం. వీరిలో పెద్ద దొరకు కోయగూడెంలో భూముని అమ్మే అధికారమం మాత్రం ఉంటుంది. గిరిజనేతరులు ఈ మధ్య కాలంలో అడవుల్లో ప్రవేశించి అడవ లను నరికి నందువల్ల కోయ జాతి వలస పోవడం ప్రారంభించింది. పోడు వ్యవసాయం చేసుకుని జీవించే వీరి గుడిసెలు పొలాలకు ఆనుకునే నిర్మించు కుంటారు.
పెండ్లి విషయకంగా చెప్పాల్సి వచ్చినట్లైతే పెళ్లికొడుకు పెండ్లికుమార్తెకి చెందిన రెండు కుటుంబాల మధ్యతో సరిపెట్టుకోరు. ఆ ఇద్దరి తండాలు అంటే గ్రామాలలో పెండ్లి జరుగుతుంది. ప్రజ లంతా ఈ వివాహ వేడుకలో పాలు పంచుకుంటారు. అయితే ఈ పెండ్లి తంతులో పాల్గొనే ప్రతికోయ వ్యక్తీ కొంత ధాన్యం, మద్యం పట్టుకొని వస్తారు. మగ పెళ్లి వారు, ఆడపెళ్లి వారికి పెండ్లి నిశ్చయం చేసుకున్న రోజున రెండు కడవల మద్యం, ఆడమగ రెండు మేకలు, ఒక గొడ్డలి, పువ్వులు ఇస్తారు. బహుశా ఇది కన్యాశుల్కమే మోమరి. ఈ కోయ కుటుంబాలను కుతుం అనివ్యవహరిస్తుంటారు. ఒక స్త్రీకి ఒకే భర్త అన్నదే ప్రాచుర్యంలో ఉంది. వీరి భౌగోళిక పరిసరాలను ముతా అంటారు.వీరిలో సంబరాలు అంబరాన్ని అంటే రీతిలో సాగుతాయ.
కోయజాతి జనులు నేడు వ్యవసాయానికి ఎన్ని ఆధునిక పద్ధతులను అవతలించినా అనాదిగా వస్తున్న అనుష్ఠానాలకు వారు విస్మరించక పోవడం విశేషం. ఆ అనుష్ఠాలివి 1. విత్తనాలు వేసే దానికి ముందు కావించే అనుష్టానం 2. కాలనిర్ణయం కోసం సుంకువేయటం 3. విత్తనం వేసేముందు చేసే అనుష్ఠానం 4. పంటకు తెగులు తగిలితే చేసే అనుష్టానం వరి పొట్టుకు వచ్చిన ప్పుడు చేసే అనుష్టానం 6. వరి చెెనుకోసేటప్పుడు అనుష్టానం 7. వరి కోసిన తర్వాత చేసే అనుష్టానం ప్రసిద్ధంగా ఉన్నాయి. ఇవి ఎక్కువగా తెలంగాణాలోని వరంగల్‌ జిల్లా ఏటూరు నాగారం, ప్రాంతవాసులైన కోయజాతులే ప్రసిద్ధంగా నేటికీ కొన సాగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందులో కొన్ని వైయ్యక్తిక ములైతే మరికొన్ని సామూహికాం షాలని చెప్పు కోవచ్చును.
ఈ జాతివారిలో కొందరు కోయపూజారులుంటారు. నమ్మ కాలు విశ్వాసాలు వీరిలో బాగానే ఉన్నట్లుగా గోచరిస్తుంది. ఇదే ప్రాంతంలో శానాపురం అనే ఊళ్లో ఒకరింట్లో చీపురు దయ్యం ఉండేదట. అతగాడు కళ్లం వేస్తే ఆ ఊళ్లో మరెవ్వరూ కళ్లంవేయరు. ఆ ఇంటి యజమాని కల్లం అయిపోయాక ఒకరి తర్వాత ఒకరు వేయాలి. ఇదేం వింత ఆచారామో వీరు విత్తనాలు జల్లే ముందు భూదేవికి భూమి దేవర పండుగ అనేదాన్ని చేస్తారు. ఆపండుగ రోజు పందిని బలిస్తారు. దీనికి పూర్వగాధ ఏమైనా ఉందా అంటే ఉన్నట్లు చెబుతారు. మన ఇతిహాసాలలో హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టుతుండగా భూమిని రక్షించడానికి శ్రీమహావిష్ణువు వరాహ అవతారం ఎత్తిన అంశం ప్రస్తావన కొస్తుంది. ముఖ్యంగా ఈ కోయతెగల్లో పాండవులు అడుగిడిన చోటు చాలా పవిత్రమైన దిగా భావిస్తారు. పంటలకు చీడలు పడితే కొడిశ ఆకునీరు పోయే మొదళ్లలో నీరు పోయేదారిలో వేస్త్‌ ఆ పురుగులు నివారించ వచ్చన్న బలమైన నమ్మకం వారికి ఉంది. ఇది శాస్త్రీయ దృక్పధమా! అశాస్త్రీయమా అన్నది వారి ఆలోచనల్లోకి రాదు. పెద్ద వెంకటాపురం అనే గ్రామంలో బుడుగుమైసమ్మ ఉంది. ఆమెను వీరు బాగాఆరాధిస్తుంటారు.
ఈ కోయజాతి గిరిజనులపై ఎందరో పరిశోధకులు ఎన్నో అంశాలను వెలికితీసి ప్రకటించినా వారిపై ఇంకా పరిశోధనగా వించాల్సిన అంశాలు మిగిలే ఉన్నాయి. కనుక ఆ ప్రయత్నం ఇటుపై జరుగుతుందని కోరుకుందాం!చఙిిఈడొ ఖిొటసిికోయజాతి గిరిజనులు
సంస్క ృతి సంప్రదాయాలు
dŸ్శdŸా ొ dŸ్శ్ఘŸ్ష‘ిలిి

ఈ కోయజాతి గిరిజనులపై ఎందరో పరిశోధకులు ఎన్నో అంశాలను వెలికితీసి ప్రకటించినా వారిపై ఇంకా పరిశోధనగా వించాల్సిన అంశాలు మిగిలే ఉన్నాయి. కనుక ఆ ప్రయత్నం ఇటుపై జరుగుతుందని కోరుకుందాం!కోయజాతి గిరిజనులు

ఈ కోయజాతి గిరిజనులపై ఎందరో పరిశోధకులు ఎన్నో అంశాలను వెలికితీసి ప్రకటించినా వారిపై ఇంకా పరిశోధనగా వించాల్సిన అంశాలు మిగిలే ఉన్నాయి. కనుక ఆ ప్రయత్నం ఇటుపై జరుగుతుందని కోరుకుందాం!

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.