సమాజ హితం – చౌడప్ప శతకం

సమాజ హితం – చౌడప్ప శతకం

Added At : Sun, 03/08/2015 – 03:26

వమన, సుమతీ పద్యాలను గురించి తెలిసిన వారికి కవి చౌడప్ప శతకంలోని పద్యాలను గురించి కొంతైన తెలిసి ఉంటుంది. చౌడప్ప పద్యాలు అంటే చాలా మంది వారివన్నీ బూతు పద్యాలేనని అనుకుంటారు. కానీ చౌడప్ప రాసిన పద్యాలు ఎక్కువగా నీతి పద్యాలే ఉన్నాయి. అయితే కొన్ని బూతు పద్యాలు లేకపోలేదు. హాస్యానికి బూతు ప్రధానమని భావించిన రోజులలో జన్మించాడు కనుక పద్యాలలో అక్కడక్కడ బూతులు, ఆశ్లిdల శృంగార కనిపిస్తుంది.తెలుగు సాహిత్య ప్రక్రియలో శాఖోపశాఖలుగా వికాసం పొందిన కావ్యప్రక్రియలలో శతకం ఒకటి. ప్రాకృత సంస్కృత ప్రక్రియలను అనుసరించి తెలుగు శతక రచన ప్రారంభమై కాలక్రమమున విశిష్ట స్థానం పొందింది. తెలుగులో 12వ శతాబ్దంలో శతకం ఆవిర్భవించింది. భారతీయ భాషల్లో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులో వలె బహుమఖ వికాసాన్ని పొంది వైశిష్ట్యం పొందలేదు. శతకాన్ని ఒక ప్రక్రియగా పేర్కొన్న సంస్కృత అలంకారికుల్లో 13వ శతాబ్దినాటి అమృతానంద యోగి మొదటివాడు. తెలుగు లాక్షిణుకుల్లో విన్నకోట పెద్దన, అనంతుడు శతక ప్రక్రియను పేర్కొన్నారు.
”శతేన శతకం ప్రోక్తమ్‌” అనే నియమం అనుసరించి శతక కర్తలు శత సంఖ్య గల శతకాలు రచించారు. సంస్కృతంలో మొదట 100 శ్లోకాలతో రాసేవారు. తర్వాత 108,116 సంఖ్యలతో రాయటం జరిగింది. కాని శతక కర్మలు అందరు ఈ సంఖ్య నియమాన్ని పాటించారు. ఒక్కో వేమన మాత్రం పాటించలేదని చెప్పవచ్చు. శతక లక్షణాలలో పద్యం చివర ఒకే మకుటం ఉండటం శతక లక్షణం. ముఖ్యంగా శతకాలు వస్తువును బట్టి భక్తిశతకం, నీతి, శృంగార, వైరాగ్యం, హాస్య, దేశభక్తి, రాజకీయ శతకాలుగా వర్గీకరించారు.
తెలుగులో వేమన సరసన పీఠం వేయదగిన ప్రజాకవి, సంఘ దురాచారాలను తూర్పూరబబట్టిన సంఘసంస్కర్త అయిన చాటుకవి కుందవరప కవి చౌడప్ప. ఈయన నియోగి బ్రాహ్మణుడు. (1580-1640) సంవత్సరం గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. చౌడప్ప కడపజిల్లా ‘కుందవరం’ గ్రామానికి కావచ్చు లేక పుల్లూరు గ్రామ నివాసి అయిన ఉండవచ్చు అని పండిత విమర్శకులు నిర్ణయించారు. ఇంకా మట్లి అనంతభూపాలుని చేతనూ, తంజా వూరు, రఘునాథరాయల చేతను మేపుపొందాడని చెప్తారు. చౌడప్ప, ఘంటన అనే ఇద్దరు కవులు మట్లి అనంత భూపాలుని ఆస్థానంలో ఉన్నట్లు ఒక చాటువు వల్ల తెలుస్తుంది. ఆ చాటువు వారిరువురును మంచివారు, విమలాత్ములు, హాస్యకళాదురంధరుల్‌, సన్నుత నీతి పారుగులు ‘జాణలు’ నైపుణ్యాలు అని వర్ణించుచున్నది. కవి చౌడప్ప రచించిన శతకంలోని పద్యాలలో 10,12 తప్ప అన్నీ కంద పద్యాలే. కంద పద్య రచనలో తిక్కన సోమయాజితో తాను సమానుడనని కవి చెప్పుకొనెను. ”నా నీతిని వినని వానిని…వానను తడియని వానిని కాననురా కుందవరపు కవి చౌడప్పా” అని తన కవితకు దక్కిన గౌరవం గురించి ప్రజల మన్నలను పొందిందిగా సగర్వంగా చెప్పుకున్నాడు. ‘హాస్యకవి జాణ’ గాన విద్యాప్రవీణుడు అనే ప్రశంసలు పొందారు.
తెలుగు శతకాలలో అధిక్షేప శతకాలు అధిక ప్రాచుర్యం పొందినవి. తెలుగులో కొందరు వ్యక్తి దూషణ మరికొందరు వక్రోక్తి, వ్యాజోక్తి. సమకాలీన సాంఘీక రాజకీయ వ్యవస్థలో కలిగిన మార్పులు. అధిక్షేప శతక కర్తలలో కొందరు మితవాదులు మరి కొందరు అతివాదు వేరొక కొందరు విప్లవాదులు. చౌడప్ప శతకంలో ఆత్మసంబుద్ధి పరంగా చెప్పిన కవి తెలుగు శతకాలలో ఆద్య్తమైనది. పండితుల, పామర జనురంజకం పొంది బహుళ ప్రాచుర్యం పొందింది. హాస్య చమత్కృతి, బూతులు నీతులు ప్రధానగుణములు పది నీతులు పది బూతులు పది శృంగారాలు గలిగిన పద్యాలు సభలో జదివినవాడే యధికుడు అని చౌడప్ప శృంగారం నీతుల గురించి సభలలో చదివినవాడెె.
నీతుల కేమి యొకించుక బూతాడక దొరకు నవ్వు పుట్టదని కవి చౌడప్ప చాటినాడు. లోకజ్ఞతను, స్వానుభవం వల్ల ఈయన శతకంలో నీతులు బూతులు లోకఖ్యాతులురా అని కచ్చితంగా నొక్కి చెప్పినాడు. నీతులను బోధించుటలో కవి చౌడప్ప చమత్కారంగా తిట్లను కూడ జోడించాడు. ఇలా హాస్యానికి బూతు ప్రధానమని భావించిన రోజులలో జన్మించిన కవి చౌడప్పని పద్యాలలో బూతులు, అక్కడక్కడ ఆశ్లిdల శృంగారం కనిపించిన, వేమనలా ధర్మకోపంతోనే అతడు సంఘాన్ని తిట్టినట్లు కనిపిస్తుంది.
చౌడప్ప అక్కడక్కడ చంపక ఉత్పలమాల, మత్తేభ శార్ధూల పద్యాలను వాడినాడు. ఈయన అందరి కవులలాగే మకుట నియమం వాడాడు. కుందవరపు కవి చౌడప్పా అని కుందవరపు పావన చౌడ కవీశ్వరోత్తమా అనే మకుటం వాడినాడు. కవిత్వాన్ని మెచ్చుకొనే విధంగా ఉండాలిగానీ, హేళనగా దాన్ని నలుగుర్నీ అవమానం చేయకూడదని ఈ పద్యం ద్వారా కవి తెలుపుతాడు.
వేడుక పడివినవలెనా
దోడుకవిత్వంబునైన తులువనలువురన్‌
గోడిగము సేయువాడే
గాడిదరా కుందవరపు కవి చౌడప్పా
ఇంకా చౌడప్పా తిట్టును ఎంత సమర్థవంతంగా వాడగలడో చెప్పవచ్చు. ఎద్దులు కొడుకులు గలిగిన /కొద్దిధర్మంబు జేసికొనరు తరించేబుద్ధినెరిగి తమ పిండము/గ్రద్ధలుదిన కుందవరపు కవి చౌడప్పా అని కొడుకులు ఎద్దుల్లాంటి వారు కలిగినవారు తరించాలనే బుద్ధితోనైనా కొద్దిపాటి ధర్మం కూడా చెయ్యరు. అలాంటి వారిని వాళ్ల పిండాలు గద్దలు తినా అంటూ శపిస్తాడు కవి. వేమన, సుమతీ పద్యాలను గురించి తెలిసిన వారికి కవి చౌడప్ప శతకంలోని పద్యాలను గురించి కొంతైన తెలిసి ఉంటుంది.
చౌడప్ప పద్యాలు అంటే చాలా మంది వారివన్నీ బూతు పద్యాలేనని అనుకుంటారు. కానీ చౌడప్ప రాసిన పద్యాలు ఎక్కువగా నీతి పద్యాలే ఉన్నాయి. అయితే కొన్ని బూతు పద్యాలు లేకపోలేదు. హాస్యానికి బూతు ప్రధానమని భావించిన రోజులలో జన్మించాడు కనుక పద్యాలలో అక్కడక్కడ బూతులు, ఆశ్లిdల శృంగార కనిపిస్తుంది. చౌడప్పకు శబ్దంపై గొప్ప అధికారం కలిగి అప్రయత్న సిద్ధంగా శబ్దాలంకారాలను నేర్పుతో కూర్పుతో గ కవిగా పేరుపొందాడు కుందవరపు కవి చౌడప్ప.
ఏవి ప్రశస్తంలో తెలుపు ‘పస’ పద్యాలు కొన్ని, దేనికి రక్షణమో వివరించే పదిలము పద్యాలు కొన్ని చౌడప్ప శతకంలో కలవు. ఇంత గొప్ప ప్రజాకవి పద్యాలు కాలగర్భంలో కలిసిపోకుండా నేటి తరానికి అందించాలని తపన. ఆధునికులతో శ్రీశ్రీవంటి మహాకవులకు ఎందరినో ప్రభావితులను చేసిన అక్షరశిల్పి కుందవరపు కవి చౌడప్ప. కాని ఎందువల్లో ఈయన పద్యాలు ఎక్కువగా నేటి తరానికి అందలేదనే చెప్పాలి. ఇలాంటి కవి సంఘదురాచారాలను, సమాజానికి హితం చేకూరేలాగా ప్రభావితం చేసిన శతకం చౌడప్ప శతకం. ఇంకా నీతులు, రీతులు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.